Love the country you live in OR Live in the country you love

25, జూన్ 2017, ఆదివారం

రెండవ అమెరికా యాత్ర -64 (ఆబర్న్ హిల్స్ లైబ్రరీ)

ఎక్కడకెళ్ళినా ముందు మంచి లైబ్రరీ ఎక్కడుందో వెతుక్కోవడం మన అలవాటు. చిన్నప్పటినుంచీ నాకు స్నేహితులు తక్కువ. మంచి పుస్తకాలే నా స్నేహితులు. ఎందుకంటే ఉన్నతమైన కంపెనీ మనకు ఎల్లప్పుడూ దొరకకపోవచ్చు. ఈ సమస్యను మంచి పుస్తకాలు చదవడం ద్వారా మనం అధిగమించవచ్చు. ఉదాహరణకు మనకు ఎల్లప్పుడూ వివేకానంద స్వామితో ఉండటం వీలుకాకపోవచ్చు. కానీ ఆయన చెప్పిన మాటలున్న పుస్తకాలను చదవడం ద్వారా ఆయన సమక్షంలో మనం ఉన్న ఫీలింగ్ మనకు కలుగుతుంది. మంచి పుస్తకాలు మనకు చేసే మేలు అదే.

అదీగాక, మనకు ఎంత తెలిసినా కూడా, నాకు ఇంత తెలుసు అనుకోకుండా, నిరంతర విద్యార్ధిగా ఉండటం చాలా మంచి పద్ధతి.

శ్రీ రామకృష్ణులు చెప్పిన ఒక మాటను నేనెప్పుడూ గుర్తుంచుకుంటాను. తరచుగా ఆయనిలా అనేవారు. 'As long as I live, so long do I learn'. ఆయనే ఆ మాట అన్నప్పుడు ఇంక మనమెంత? కనుక నిరంతరం నేర్చుకోవడమే నాకిష్టం.

ఇక్కడున్న ఆబర్న్ హిల్స్ లైబ్రరీలో కూచుని నేను చదివిన పుస్తకాలు ఇక్కడ చూడవచ్చు.