నిత్యజీవితంలో ప్రతిఫలించని జ్ఞానం నిరర్ధకం

23, జూన్ 2017, శుక్రవారం

రెండవ అమెరికా యాత్ర -60 (టెక్సాస్ ట్రిప్ -మెక్ ఆలెన్ నేచర్స్ సెంటర్ సందర్శన)

మెక్ ఆలెన్ లో ఒక నేచర్స్ సెంటర్ ఉన్నది. అది చాలా అరుదైన పక్షులకు జంతువులకు నిలయం. అందులో నేచర్స్ ట్రైల్స్ ఉన్నాయి. కార్లో వెళ్ళవచ్చు లేదా నడుచుకుంటూ వెళ్ళే దారులు కూడా ఉన్నాయి. ఒకరోజున దానిని సందర్శించాం. అది ఉదయం నుంచి సాయంత్రం వరకే ఉంటుంది. కానీ మేము వెళ్ళినరోజు ఆదివారం సాయంత్రం కావడంతో స్టాఫ్ అందరూ వెళ్ళిపోయారు. ఆయినా మేము వెనుకంజ వెయ్యకుండా లోపలి వెళ్లి అడవిలో అంతా తిరిగి వచ్చాం.

దాని హిస్టరీ చదివితే చాలా భయంకరమైన నిజాలు తెలిశాయి. అది ఒకప్పుడు రెడ్ ఇండియన్ తెగలు నివసించిన ప్రాంతం. ఒకసారి జరిగిన యుద్ధంలో ఒక తెగ ఇంకొక తెగను పూర్తిగా తుడిచి పెట్టేసింది. ఆలోపల ఒక టవర్ ఉన్నది. ఆ టవర్ దగ్గర ఒక శ్మశానమూ సమాధులూ ఉన్నాయి. మొత్తం మీద ఆ ప్రాంతంలో అంత మంచి వైబ్స్ కనపడలేదు. వాతావరణం ఏదో భీతావహంగా ఉన్నది. హర్రర్ సినిమా తియ్యడానికి అనువైన ప్రాంతం అనిపించింది.

మేము అడవిలో నుంచి వెనక్కు వచ్చేటప్పుడు, ఒక కాలువ వడ్డున ఇద్దరు బార్డర్ సెక్యూరిటీ గార్డ్స్ కనిపించారు. అది మెక్సికో బార్డర్ కావడంతో వాళ్ళు పహారా కాస్తూ ఉంటారు. మా ఐడీ కార్డులు, పాస్ పోర్టులు చూపించమని వాళ్ళు అడుగుతారేమోనని అనుకున్నాం. కానీ మమ్మల్ని వాళ్ళేమీ ప్రశ్నించలేదు.

ఈ సెంటర్ వెబ్ సైట్ ఇక్కడ దర్శించండి.


నేచర్స్ సెంటర్ ఫోటోలు ఇక్కడ చూడవచ్చు.