“అసమర్ధుని వద్ద ధనము, సుఖము, కీర్తి, ధర్మము ఏవీ నిలచి ఉండవు"

29, అక్టోబర్ 2009, గురువారం

శని భగవానుని కన్యా రాశి సంచార ఫలితాలు

ద్వాదశ రాసుల వారికి శని కన్యా రాశి సంచారం చేసే 9-9-2009 నుంచి దాదాపు మూడు సంవత్సరాల కాలంలో స్థూలంగా ఫలితాలు ఉంటాయి.

>>మేష రాశి వారికి: ఆరవ ఇంట సంచారంతో సర్వత్రా బాగుంటుంది. అయితే గురువు మకర రాశి లో నీచ సంచారంతో ఆయన కుంభ రాశి లోకి ప్రవేశం వరకూ బాధలు తప్పవు.

>>వృషభ రాశి వారికి: అయిదవ ఇంట సంచారంతో మానసిక ఆందోళన, సంతాన సంబంధ చికాకులు, వ్యాపారాలలో నష్టాలు, బుద్ధి మాంద్యం, అనవసర ప్రేమ వ్యవహారాలు ఉంటాయి.

>>మిథున రాశి వారికి: అర్థాష్టమ శని వల్ల కుటుంబ చిక్కులు, మానసిక బాధలు, మాతృ వర్గానికి ప్రమాదాలు, విద్యలో ఆటంకాలు,వాహన ప్రమాదాలు ఉంటాయి. అష్టమం లో నీచ గురువు వల్ల ఇవి ఎక్కువ అవుతాయి. కోర్టు చిక్కులు పితృ వర్గ గండం, నాస్తిక ధోరణులు ప్రబలుతాయి.

>>కటక రాశి వారికి: మూడవ ఇంట సంచారంతో, అన్నింటా మంచి సూచనలు, పాత మిత్రుల కలయికలు, రచనా వ్యాసంగాలు, మానసిక ధైర్యం పెరుగుదల, పదోన్నతి, దగ్గర ప్రదేశానికి బదిలీలు మొదలగు నవి జరుగుతాయి. ఏడవ ఇంట నీచ గురు సంచారంతో వివాహేతర సంబందాలపైన ఆసక్తి , భార్యకు అనారోగ్యం కలుగుతాయి.

>>సింహ రాశి వారికి: ఏలినాటి శని మూడవ భాగం ప్రభావం వల్ల కుటుంబ చిక్కులు, తగాదాలు, ధన నష్టం, నేత్ర వ్యాధులు, మాట పట్టింపులు ఉంటాయి. ఆరింట నీచ గురు సంచారం వల్ల ప్రమాదాలు, గొడవలు, అనవసర తగాదాలు, పెద్దవారితో దురుసుగా ప్రవర్తనలు, దొంగతనాలు, ఆస్తినష్టం, అంతుబట్టని రోగాలు ఉంటాయి.

>>కన్యా రాశి వారికి: ఏలినాటి శని రెండవ భాగం ప్రభావం వల్ల, ఆరోగ్య భంగం, మానసిక వ్యధ, వృత్తిలో ఆటంకాలు, చికాకులు, సోమరితనం పెరగటం ఉంటాయి. గురు ప్రభావం వల్ల తిరుగుబాటు ధోరణి, వితండ వాదాలు, అధార్మిక అనైతిక ప్రవర్తనలు దానివల్ల కష్టాలు ఉంటాయి.

>>తులా రాశి వారికి: ఏలినాటి శని మొదటి భాగం ప్రభావం వల్ల, అనవసర ఖర్చులు, ప్రమాదాలు, ఆస్పత్రి లేదా జైలుd దర్శనం, మానసిక భయం ఉంటాయి. ఇంటి లోని వారి కుట్రలవల్ల అనవసర ఖర్చులు ఎక్కువ అవుతాయి. వివాహేతర ప్రేమ వ్యవహారాలు ఉంటాయి.

>>వృశ్చిక రాశి వారికి: లాభ స్థాన సంచారం వల్ల అన్నింటా బాగుంటుంది. అయితే వీరి జ్యేష్ట సోదరులకు చెడు కాలం. వీరికి అతి ఉత్సాహం, కుట్రలు కుతన్త్రాలలో జోక్యం పనికిరాదు. లేనిచో నష్టాలు జరుగుతాయి. కనిష్ట సోదరులకు ప్రమాదాలు పొంచి వున్నాయి.

>>ధనూ రాశి వారికి: దశమ స్థాన సంచారం వల్ల వృత్తి ఉద్యోగాలలో ఆటంకాలు, చికాకులు, గౌరవ భంగం సమాజంలో చిన్న చూపు ఉంటాయి . గురు ప్రభావం వల్ల కుటుంబంలో తగాదాలు, కుట్రలు, దురుసు మాటలు, కంటి వ్యాధులు ఉంటాయి.

>>
మకర రాశి వారికి: పితృ వర్గం వారికి గండ కాలం, ధర్మ హాని కలగటం, నాస్తిక భావాలు పెరగటం, డబ్బు చేతిలో ఆడక బాధలు, రౌడీల కుట్రలకు బలి కావటం మొదలైన చిక్కులు ఉంటాయి.

>>కుంభ రాశి వారికి: అష్టమ శని వల్ల కష్ట నష్టాలు, దీర్ఘ వ్యాధులు వెంటాడటం, అన్నింటా అపజయం, ప్రమాదాలు జరగటం, భయం మొదలైన బాధలు ఉంటాయి. అనవసర ఖర్చులు అధికం.

>> మీన రాశి వారికి: భర్తకు/భార్యకు అనారోగ్యం, మిత్రులతో వైరం, అనుకోని తగాదాలు, చికాకులు, పార్ట్ నర్లతో గొడవలు, సంఘంలో నవ్వుల పాలు కావటం ఉంటాయి. జీర్ణ కోశ సమస్యలు నడుము నొప్పి మొదలైన బాధలు ఉంటాయి. అయితే కోర్టు తగాదాలు, గొడవల వల్ల లాభం ఉంటుంది. జ్యేష్ట సోదరులకు గండం ఉంటుంది.

ఇవి గోచార ఫలితాలు మాత్రమె. వ్యక్తి గత జాతక ఫలితాలతో కొన్ని మార్పులు జరగవచ్చు.
read more " శని భగవానుని కన్యా రాశి సంచార ఫలితాలు "

17, అక్టోబర్ 2009, శనివారం

జ్యోతిర్ముద్ర

దీపావళి నాడు ఇల్లు శుభ్రం చేసుకొని దీపాలు వెలిగించి పండుగ చేసుకోవటం మంచిదే.
కాని మన ఆచారాలు పండుగలు అన్నీ ఆంతరిక సత్యాలపైన ఆధారములు అన్న సంగతి మరువరాదు. ఇల్లు శుభ్రం చేసుకోవటం కంటే అంతరంగం శుభ్రం చెయ్యటం ముఖ్యం. బయట దీపాలు వెలిగించటం కంటే అంతరంగ మండలంలో జ్యోతిని వెలిగించటం ముఖ్యం. ఆంతరిక ఆధారాలు లేని బాహ్య ఆచారాలు ప్రాణం లేని శరీరం వంటివి. ఆంతరిక ఆధారాలను వదలి ఉత్తి బాహ్య కర్మలను ఆచరించటం కూడా మన ధర్మ క్షీణతకు ఒక కారణం.
క్రియా యోగం లో యోనిముద్ర లేక జ్యోతిర్ముద్ర లేక జ్యోతి ముద్ర అని ఒక ముద్ర ఉన్నది. దీనినే హట యోగంలో షన్ముఖీ ముద్ర అని కూడా అంటారు.
దీనిని అభ్యాసం చేయటం వల్ల భ్రూ మధ్యంలో జ్యోతివంటి వెలుగు కనిపిస్తుంది. తంత్రంలో దీని అసలు పేరు యోని ముద్ర. బహుశా పేరు కొంచం ఎబ్బెట్టుగా ఉందనేమో, పరమహంస యోగానంద గారు దీనిపేరు జ్యోతి ముద్ర అని మార్చారు. కాని భారత దేశంలో ఉన్న క్రియా యోగ ఆశ్రమాలలో దీనిని యోని ముద్ర అనే పిలుస్తారు. తంత్రము లో వాడే అనేక పదాలు మన " నాగరిక " సమాజానికి కొంత ఎబ్బెట్టు గా కనిపిస్తాయి. కాని ఉన్నది ఉన్నట్టుగా చూచే తంత్ర ప్రపంచంలో అటువంటి సమస్యలు ఉండవు. యోనిముద్రా త్రిఖండేశీ త్రిగుణాంబా త్రికోణగా అంటూ లలితా సహస్ర నామం దేవిని జ్యోతిస్వరూపిణిగా కీర్తించింది.
జ్యోతిముద్రను కొంత కాలం పట్టుదలగా సాధన చెయ్యటం వల్ల భ్రూ మధ్యంలో వెలుగును దర్శించవచ్చు. వెలుగు కనిపించే సమయంలో ఆలోచనలు ఆగిపోతాయి. ఒక రకమైన నిశ్చల ప్రశాంతత అనుభవంలో కొస్తుంది. విశ్రాంతిగా అనిపిస్తుంది. కొంతమందికి సమయంలో తుమ్మెదల ఝుంకారం వంటి ధ్వని వినిపిస్తుంది. నుదుటిమీద ఏదో రూపాయి బిళ్ళ వంటి ఒక వస్తువును అంటించినట్లు బరువుగా అనిపిస్తుంది.
దీనివల్ల మనిషి వ్యక్తిత్వంలో చాలా మార్పు వస్తుంది. ప్రశాంతతను ఇష్టపడే తత్త్వం పెరుగుతుంది. ప్రతి దానికీ కంగారు. చిరాకు తగ్గిపోతాయి. ఒక విధమైన నిబ్బరం కలుగుతుంది. జీవితంలోని ఎగుడు దిగుళ్ళను తేలికగా తట్టుకునే శక్తి కలుగుతుంది.

"
జ్యోతిషామపి తజ్జ్యోతిహి"(అది జ్యోతులకే జ్యోతి, వెలుగులకే వెలుగు ) అని వేదం పరమాత్మను దర్శించింది. అంగుష్ఠ మాత్రమైన జ్యోతి రూపంలో పరమాత్మ హృదయాన్తర్గతుడై ఉన్నాడని మంత్ర పుష్పం చెబుతుంది. అట్టి అన్తర్జ్యోతికి బాహ్య రూపం అయిన సూర్య భగవానుని "జ్యోతిషాణాం పతయే నమహ" అని ప్రస్తుతించింది ఆదిత్య హృదయం. ఆ పరమాత్మను జ్యోతి రూపంలో దర్శించవచ్చు అని యోగ శాస్త్రము తంత్రము చెబుతున్నాయి.
తత్ర సూర్యో భాతి చంద్ర తారకం
నేమా విద్యుతో భాతి కుతోయ మగ్నిహి,
తమేవ భాంత మనుభాతి సర్వం
తస్య భాసా సర్వమిదం విభాతి.

(అక్కడ సూర్యుడు, చంద్రుడు తారకలు ప్రకాశించవు. విద్యుత్తు కూడా ప్రకాశించదు. ఇక అగ్ని మాట చెప్పేదేమి. అది ఉండటం వల్లనే ఇతరములన్నీ తెలియబడుతున్నవి. అది వెలుగుట వల్లనే ఇతరమైన సర్వమూ వెలుగుతున్నది.)

అని కఠోపనిషత్తు మరియు భగవత్ గీత చెబుతున్నాయి.

అట్టి
అంతర్జ్యోతి దర్శనం పొందటం మనిషి ఆధ్యాత్మిక లోకంలో పురోగమిస్తున్నాడు అనటానికి ఒక సూచన. ఆధ్యాత్మిక లోక సంచారిని భౌతిక ప్రపంచ బాధలు ఎక్కువగా బాధ పెట్టలేవు.
దీపావళి నాడు యోనిముద్ర వంటి సాధనలు చేసే యోగ సాధకుల అంతర్నేత్రాలకు జ్యోతి దర్శనం కావాలని ఆశిస్తూ నా బ్లాగు చదివేవారందరికీ దీపావళి శుభాకాంక్షలు అందజేస్తున్నాను.
read more " జ్యోతిర్ముద్ర "

13, అక్టోబర్ 2009, మంగళవారం

రూలింగ్ ప్లానేట్స్

ప్రశ్న శాస్త్రంలో అనేక విధానాలున్నాయి. ముఖ్యంగా అవి భారతీయ, పాశ్చాత్య విధానాలుగా విభజన చెయ్యవచ్చు. మన పద్ధతులలో కూడా తాజిక విధానం పాశ్చాత్య పద్ధతికీ దగ్గిరగా ఉంటుంది.

ప్రశ్న లగ్నం కనుగొనే విధానాల వల్లే వీటిలో చాలావరకూ తేడాలు వస్తాయి. దీనికోసం రకరకాలైన పద్దతులుఉన్నాయి. కాళిదాసుని ఉత్తరకాలామృతం నుంచి నేటి కే.పీ సిస్టం వరకూ అన్నీ చక్కగా పని చేస్తాయి. వాటిని ఉపయోగించుకునే విధానం మనకు తెలియాలి. కొంత మంత్రోపాసనకూడా ఉండాలి. అప్పుడే జ్యోతిర్విద్య ఫలిస్తుంది. ఎందుకంటే ఇది వేదాంగములలో ఒకటి కాబట్టి దీనికి ఉపాసన తప్పకకావాల్సి ఉంటుంది.

మన గ్రంధాలు చాలావరకూ ముస్లిం దండయాత్రలో మరియు వారి విచక్షణా రహిత విధ్వంస కాండలలో నాశనంఅయ్యాయి. అందుకే సబ్జెక్ట్ లో చాలా ఖాళీలు మనకు కనిపిస్తాయి. అందువల్లే వేదిక్ జ్యోతిష్యంలో ఖచ్చితమైనఫలితాలు చెప్పాలంటే అవి జ్యోతిష్కుని స్ఫురణ శక్తి మీదా, అనుభవం మీద అతను తయారు చేసుకున్న ప్రత్యెకపద్దతుల మీదా ఆధారపడవలసి వస్తుంది.

ఈ లోపాలను పూరించటానికి ప్రొఫెసర్ కృష్ణ మూర్తి గారు తయారు చేసినదే కృష్ణ మూర్తి పధ్ధతి లేదా కే. పీ సిస్టం. దీనిలో ఆయన భారతీయ మరియు పాశ్చాత్య విధానాలలోని ఉత్తమ అంశాలను తీసుకున్నాడు. ఉదాహరణకు మనంవాడే శ్రీపతి పద్ధతిని వదలి, పాశ్చాత్యుల ప్లాసిడస్ పద్దతిని భావ స్ఫుట గణనలో ప్రామాణికం గా తీసుకున్నాడు. ఇంకాఅనేక ఇతర పద్దతులు మార్పులు చేర్పులు చేసి తనకంటూ ఒక కొత్త ఒరవడి సృష్టించాడు. ప్రస్తుతం కే పీ సిస్టం గురించి వ్రాయటం నా ఉద్దేశం కాదు కాబట్టి ఇంతకంటే వివరం అవసరం లేదు.

వీటిలో ముఖ్యంగా ఆయన కనుగొన్నది రూలింగ్ ప్లానేట్స్ అనబడే కొత్త పద్దతి. ఇది నిజానికి కొత్త పద్దతి కాదు. నాడీజ్యోతిష్యానికి ఆద్యుడు అని చెప్పబడే సత్యాచార్యుడు తన సత్య సంహిత లో వీటిని గురించి క్రీస్తు పూర్వమేప్రస్తావించాడు. దానిలో ఆయన రాశి, నవాంశ నాదులకు, కారక గ్రహం యొక్క నవాంశాదిపతికి ప్రాముఖ్యత నిచ్చాడు. కృష్ణ మూర్తి గారు ఇంకొంచం దీన్ని మార్చి రూలింగ్ ప్లానేట్స్ సిద్ధాంతాన్ని పరిపూర్ణం చేసాడు.

ప్రపంచంలో ప్రతి విషయాన్ని ఆ సమయానికి ఉన్న కొన్ని గ్రహాలు నియంత్రిస్తాయి. వీటినే రూలింగ్ ప్లానేట్స్ అంటారు.జన్మ జాతకంలో గాని ప్రశ్న జాతకంలో గాని వీటి పాత్ర అమోఘం. ఇవి ఎటువంటి ప్రశ్న కైనా ఖచ్చితమైన జవాబుఇవ్వగలవు. ఈ పద్దతి ద్వారా జన్మ జాతకం లేకుండా, కేవలం ప్రశ్న ద్వారా ఏ విషయం గురించి అయినా భూతభవిష్యత్ వర్తమానాలను మనం తెలుసుకోవచ్చు. వీటి ద్వారా జనన కాల సంస్కరణ దగ్గర నుంచి, నిత్య జీవితంలోఎదురయ్యే ఏ రకమైన సందేహానికైనా మనం జవాబు తెలుసుకోవచ్చు.

కృష్ణ మూర్తి గారు అనేక పరిశోధనల అనంతరం రూలింగ్ ప్లానేట్స్ గా వీటిని స్థిరపరిచారు. ఇవి బలంలో క్రమవరుసలో పైనించి కిందకు తగ్గుతూ ఉన్నాయి.

>లగ్న సబ్ అధిపతి
>లగ్న నక్షత్రాధిపతి
>లగ్నాధిపతి
>చంద్ర సబ్ అధిపతి
>చంద్ర నక్షత్రాధిపతి
>చంద్ర రాస్యధిపతి
>దినాధిపతి

ఖచ్చితమైన ఫలితాలకు సబ్ మరియు సబ్ సబ్ అధిపతులు చాలా ముఖ్యం. వీరు వింశోత్తరీ దశా లలో సూక్ష్మ దశాప్రాణ దశానాదుల వంటి వారు. నా పరిశోధనలో హోరాధిపతి కూడా చాలా ముఖ్యమైన గ్రహంగా వచ్చింది. కనుక ఈఎనిమిది గ్రహాలతో ఎటువంటి ప్రశ్న కైనా మనం జవాబు తెలుసుకోవచ్చు. సామాన్యంగా సబ్ సబ్ అధిపతి అవసరంరాదు. సబ్ అధిపతి వరకే సరిపోతుంది. వీటికి కృష్ణ మూర్తి సబ్ లార్డ్ టేబుల్స్ అవసరం.

ఈ రూలింగ్ ప్లానేట్స్ లో ఏవైతే మళ్ళీ మళ్ళీ కనిపిస్తాయో అవి ఆ ప్రశ్నకు ప్రతినిధులు. ఇక అడుగబడిన ప్రశ్ననిజమైనదా లేక ఎగతాళికి అడిగిందా తెలుసుకోవడం మొదలుకొని ఆ పని జరుగుతుందా లేదా ఒకవేళ జరిగితే ఎప్పుడుజరుగుతుంది మొదలైన అన్ని విషయాలు తెలుసుకోవచ్చు. అయితే వక్ర గ్రహ నక్షత్రంలో గాని సబ్ లో గాని ఉన్నగ్రహం రూలింగ్ ప్లానెట్ గా వస్తే దానిని తొలగించాలి. ఈ విధంగా కొన్ని రూల్స్ ఉన్నాయి. వాటిని అనుసరించి రూలింగ్ప్లానేట్స్ ను ముందుగా కనుగొని తరువాత అప్పటి గ్రహ స్థితిని బట్టి విశ్లేషణ చేస్తే అన్ని వివరాలు మనకు తెలుస్తాయి.

కాని ఇతర ఏ విధానం కైనా కావలసిన విశ్లేషణా నైపుణ్యం దీనిలో కూడా అవసరం. అది అనుభవం మీదా, పరిశీలనమీదా, గ్రంధ పఠనం మీదా వస్తుంది.

ఈ రూలింగ్ ప్లానేట్స్ అనేవి అద్భుతమైన జవాబులు ఇస్తాయి. కాని అడిగే ప్రశ్న వెనుక తపన, నిజంగా సమాధానంతెలుసుకోవాలని కోరిక మరియు వినయం ఉండాలి. లేకుంటే ఫలితాలు సరిగా రావు. ఇది కూడా నా అనుభవం లోఅనేక సార్లు రుజువు అయింది. ప్రొఫెసర్ కృష్ణమూర్తి గారు కూడా ఇదే చెప్పారు.

ప్రశ్న శాస్త్రానికి కృష్ణ మూర్తి గారు చేసిన గొప్ప సేవ రూలింగ్ ప్లానేట్స్ ను కనిపెట్టి ఇవ్వటమే అని ఘంటా పదంగాచెప్పవచ్చు.
read more " రూలింగ్ ప్లానేట్స్ "

10, అక్టోబర్ 2009, శనివారం

వైద్య జ్యోతిషం-నిజమైన ఒక విశ్లేషణ

మొన్న 26-9-2009 శ్రీమతి . ఆగని దగ్గుతో రాత్రి పదకొండు గంటలకు ఆస్పత్రిలో చేరింది. డాక్టర్లు బ్రాంఖైటిస్ అనిట్రీట్మెంటు మొదలు పెట్టారు. సరైన గుణం కనిపించటం లేదు. డాక్టర్లు వారి మాట వారిదే గాని మన మాట వినరు కదా.

27-9-2009 సాయంత్రం 6.50 కి ప్రశ్న కుండలి వేసి అసలు సమస్య ఎక్కడ ఉంది అని చూడటం జరిగింది.
లగ్నం మీనం-27-03
లగ్నాధిపతి - గురువు
నక్షత్రాధిపతి-బుధుడు
KP సబ్ అధిపతి- గురువు
హోరాధిపతి-గురువు

గురువు వక్రించి రాహువుతో కలసి ఉన్నాడు. బుధుడు రోగ స్థానంలో శుక్రునితో కలసి వక్ర స్థితిలో ఉన్నాడు. కనుక- అసలు సమస్య జీర్ణ కోశం లోనూ, ఇంకా చెప్పాలంటే లివర్, గాళ్ బ్లాడర్ లోనూ ఉంది అని చెప్పాను. గురువు రాహువుతో కలసిఉండటంతో సమస్య వెంటనే అర్థం కాక డాక్టర్లు కూడా మోసపోతారు. బుధుని రోగ స్థాన స్థితితో నరాల నొప్పులు ఉంటాయి.

మరి ఎప్పటికి నయం కావచ్చు? అని ఇంకో ప్రశ్న వేశాడు పృచ్చకుడు . రోగ స్థానం లో ఉన్న బుధుడు 29-9-09 కి వక్ర గతి వీడి రుజుత్వంలోకి వస్తున్నాడు. కనుక రోజుకు నయం కావచ్చు. కాని చంద్రుడు మీన రాశిలో ఇదే డిగ్రీకి 4-10-2009 నాటికివస్తున్నాడు. కనుక పూర్తిగా నయం అయ్యి ఇంటికి వచ్చే సరికి 4-10-2009 అవుతుంది అని ఊహించాను. అదే మాట చెప్పాను.

మరుసటి రోజు స్కానింగ్ తీయగా fatty liver and sluldge formation in gall bladder అని రిపోర్ట్ వచ్చింది. దగ్గుఅనేది అనుబంధ లక్షణం కాని, అసలు బాధ జీర్ణ కోశం లోనే ఉంది అని తెలిసింది. దానికి తగిన మందులు వాడగా
29-9-09 కి రిలీఫ్ వచ్చింది. డిశ్చార్జి చెయ్యమని అడుగగా నాలుగు రోజులు అబ్జర్వేశన్లో ఉంచుదాం అని చెప్పి చివరికి 4-10-09 ఉదయం ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేసారు.

ప్రశ్న జ్యోతిష్యం నిత్య జీవితంలో ఎలా ఉపయోగ పడుతుందో ఇదొక ఉదాహరణ. అద్భుతాలు మన మధ్యనే జరుగుతుంటాయి. చూచే దృష్టి మనకు ఉండాలి. అంతే.
read more " వైద్య జ్యోతిషం-నిజమైన ఒక విశ్లేషణ "

5, అక్టోబర్ 2009, సోమవారం

మరువలేని మూడు రోజులు

2-10-2009

తెల్లవారు జామున దాదాపు మూడు గంటలకు ఎందుకో మెలకువ వచ్చింది. తరువాత నిద్ర రాలేదు. ఏదో అసహనం గాఉంది. లెచి అటూ ఇటూ పచార్లు చెస్తున్నాను.ఇలా చాలా సార్లు గతంలో జరగటం తరువాత ఏదో దుర్వార్త వినటంజరిగింది. ఇలా ఆలోచిస్తున్నంతలో, కంట్రోల్ రూం నుంచి పోన్ వచ్చింది.

మంత్రాలయం స్టెషన్ అవతల ఉన్న తుంగభద్రా నది పొంగుతున్నది. వంతెన గర్డల్ల వరకూ నీళ్ళు వస్తున్నాయి. రైలుబండ్లు ఎక్కడివక్కడ ఆగి పొయాయి. మంత్రాలయం, మాధవరం,రామాపురం గ్రామాలు జలమయం అవుతున్నాయి. రాఘవెంద్ర స్వామి మటం కూడా మునిగిపొతున్నది.

చెన్నై-ముంబాయి రూటు, బెంగుళూరు-డిల్లీ రూటు ఇదే దారిలొ పోతాయి. కనుక ముఖ్యమైన రైళ్ళు అన్నీ దారిలోనే నడుస్తుంటాయి. గుంతకల్ నుంచి రాయచూరు మధ్యలొ కనీసం రెండు చొట్ల ట్రాక్ మీదుగా నీళ్ళుప్రవహిస్తున్నాయి. కింద ట్రాక్ ఉందో లెదో తెలీని స్థితి. కనుక ముందు జాగ్రత్తగా రైళ్ళు ఆపివేస్తున్నాము. వెంటనేబయలు దెరి కంట్రోలు రూం కు రావాలి. ఇదీ వచ్చిన సందేశం.

అయిదు నిమిషాల్లో తయారై కంట్రొల్ రూం కు చెరుకున్నాను. అప్పుడు మొదలైన పని 5-10-2009 ఉదయానికిపూర్తయింది. మూడు రొజులూ ఎప్పుడు తిన్నానో, ఏం తిన్నానో నాకే తెలీదు. నిద్ర పొయింది కొన్ని గంటలు మాత్రమే.

కంట్రోల్ రూంలో ఒక వంద మంది, బయట పీల్డు లో దాదాపు వెయ్యి మంది మూడు రొజులు పనిచెసి అనెక ప్రమాదాలునివారించ గలిగాం.ఎంతో మందిని కాపాడగలిగాం.

ఊళ్ళన్నీ మునిగిపోతుంటె, దాదాపు వెయ్యిమంది ప్రజలు 2-10-2009 ఉదయం అయిదు గంటలకే మంత్రాలయంస్టేషన్ కు చెరుకున్నారు. వారిని ముందుగా కాపాడాలి. రాయచూరులో రాత్రి హాల్ట్ చెసె ఒక పాసింజరు ట్రెయిన్ ను రెలీఫ్ స్పెషల్ గా మార్చి, పది కిలో మీటర్ల స్పీడులో పరవళ్ళు తొక్కుతున్న తుంగ భద్రా నది బ్రిడ్జి మీద నుంచితీసుకొచ్చి మంత్రాలయం స్టేషన్ లొ చిక్కుకున్న వెయ్యిమందిని అదే స్పీడులో నిదానంగా రాయచూరు చెర్చాము. అది మొదటిగా మెము చెసిన సాహసం.

తరువాత అన్ని పక్కల నుంచీ వస్తున్న ఎన్నో రైళ్ళను చుట్టు తిరిగుడు దారులలో పంపించెశాము. కాని రాజధాని ఎక్స్ప్రెస్, కర్నాటక ఎక్స్ ప్రెస్ మాత్రం రాయచూరు స్టేశన్ లొ చిక్కుకు పొయాయి. ముందూ ట్రాక్ లెదు, వెనుకా లెదు. కొట్టుకుపొయింది. రెండు రైళ్ళలొ కలిపి దాదాపు రెండు వెల మంది ప్రయాణీకులున్నారు.

వారిని రెండు రొజులు అదేస్టెషన్ లొ ఉంచి నీళ్ళు,ఆహారం, కోచ్ లకు ఏసీ సప్లై ఇస్తూ, వర్షాలు కొంచం తగ్గుముఖం పట్టేవరకూ ఉంచాము. ఈ లొగా హైద్రాబాద్ నుంచి రెండు ప్రత్యెక రైళ్ళను రప్పించాము. కాని అవి రాయచూరుకు దాదాపు నలభై కిలొమీటర్ల దూరంలోట్రాక్ కొట్టుకు పోయిన చొటికి వచ్చి ఆగిపొయాయి.

ముప్పై ఆరు కర్ణాటకా స్టెట్ బస్సులలొ వీరందరినీ వాగులూ వంకలూ దాటించి, నలభై కిలొ మీటర్లు ప్రయాణం చెయించి, అక్కడ యర్మరస్ అనే స్టేషన్ లో వెచి ఉన్న రైళ్ళలొ లగెజీలతో సహా ఎక్కించి వారిని షొలాపూర్ వరకూ తీసుకెళ్ళిఅక్కడకు ముంబాయి నుంచి ఇంకొక ప్రత్యెక రైలును రప్పించి, ఎవరి రైలు లొ వారిని మార్చి రెంటినీ వెటి దారులోవాటిని డిల్లీకి పంపాము. ప్రాసెస్ అంతా అవటానికి రెండున్నర రోజులు పట్టింది. అక్కడికి గండం గడిచింది.

ఇప్పుడు, అక్కడక్కడా దాదాపు నాలుగు కిలో మీటర్లు కొట్టుకు పోయిన ట్రాక్ ను తిరిగి వేసి రైళ్ళ రాకపోకల్ని తిరిగిసక్రమంగా నడిచెటట్లు చెయ్యలి. వందల మంది ఉద్యొగులు పని లో తలమునకలుగా ఉన్నారు. మా టీం కు ఇప్పటికి కొంచం ఊపిరి పీల్చుకునే వెసులుబాటు కలిగింది.

నిద్రాహారాలు లెకపొతే పొయె, మా పని మెము చక్కగా చెసామని, ఎందరినో రక్షించగలిగామని, ఆత్మ తృప్తి మాకు కలిగింది. ఈ మూడు రొజులలో ఆదొని, మంత్రాలయం, కర్నూలు జిల్లాలలో ఎన్నో అనుభవాలు, ఎన్నొ విషాద గాధలు, దృశ్యాలు కళ్ళారా చూచాము. అవన్నీ రాస్తె అదె ఒక పుస్తకం అయ్యేంత ఉంది. ఇదీ క్లుప్తంగా ఈ మూడు రొజుల చరిత్ర.
read more " మరువలేని మూడు రోజులు "

1, అక్టోబర్ 2009, గురువారం

ఆస్తికులు మంచివారా? నాస్తికులు మంచివారా?


ఒక మిత్రుడు నన్నడిగాడు.ఆస్తికులు మంచివారా? నాస్తికులు మంచివారా? అని.


ఈ ప్రశ్న నన్ను ఆలోచింప చేసింది.

ఆస్తికత్వం, నాస్తికత్వం అనెవి మన నమ్మకాలకు చెందిన విషయాలు. కాని మంచితనం అలా కాదు. అది నమ్మకానికి సంబంధించిన విషయం కాదు. హృదయానికి సంబంధించిన విషయం.

ప్రపంచంలొ మహాభక్తులుగా చెలామణీ అవుతున్న వారిలో పెద్ద దొంగలు, దుర్మార్గులు చాలామంది ఉన్నారు. అదేవిధంగా మంచివారూ చాలామంది ఉన్నారు.అలాగె నాస్తికులలో కూడాను. కనుక ఈ రెండూ భిన్న విషయాలు. పోల్చలెనివి.

ఒక మనిషి బాధలో ఉన్నపుడు స్పందించి ఆ బాధను తనదిగా భావించి సాయం చెయ్యటం మంచితనం. మానవత్వం. దీనికి కావలసింది స్పందించే హృదయం. అసలు, మనిషి ఆస్తికుడా నాస్తికుడా అనేది ప్రశ్నే కాదు.

మనిషి మనిషిగా ఉన్నాడా లెదా అనేదే ప్రశ్న.

ఒక మనిషి గనక పరిపూర్ణ మానవత్వంతో ఉంటె, అతను నాస్తికుడైనా సరే, దెవునికి అతడే దగ్గర అవుతాడు. అదే స్వార్ధపరుడైన ఆస్తికుడు ఎన్ని పూజలు చెసినా దెవునికి దగ్గర కాలేడు. కనుక మనిషి స్వార్ధపరుడా, లెక నిస్వార్ధపరుడా అనెదె ముఖ్యం కాని, అతడు దెవుని నమ్ముతున్నాడా లెదా అనెది ముఖ్యం కాదు.

ఈ స్వార్ధం లెకుండా మనిషి ఉండగలడా? జీవించాలంటె ఎంతో కొంత స్వార్ధం అవసరం. కాని మితిమీరిన స్వార్ధం అవసరం లెదు. తన కడుపు నిండిన తరువాత కూడా ఎదుటివాడి కడుపు కొట్టాలనుకోవటం తప్పు.

కాని తన కడుపు ఎప్పుడు నిండుతుందో, ఎంత తింటే నిండుతుందో కూడా తెలియని స్థితిలో మనిషి బతుకుతున్నాడు. కనుకనే మితిమీరిన స్వార్ధంతొ అన్నీ తనకె చెందాలనే తపనతో భ్రమతో ఎక్కడికి పొతున్నాడో తెలియని స్థితిలో సాగిపొతున్నాడు.

ఇటువంటి మనిషి దెవుని నమ్మినా నమ్మక పొయినా పెద్ద తెడా లెదు. మన రాజకీయ నాయకులు అందరూ దైవభక్తులే. కాని ఉపయోగం ఎముంది? సమాజంలొ మోసగాళ్ళు అందరూ దైవభక్తులే.ప్రయోజనం ఎముంది? ఇటువంటి భక్తిని దేవుడు మెచ్చడు. భక్తికన్నా,మన నమ్మకాల కన్నా మానవత్వం ముఖ్యం.

ఎవరి హృదయం మానవత్వంతో తొణికిసలాడుతూ ఎదుటి మనిషి బాధను తన బాధగా స్పందించగలిగే స్థాయికి చెరుకుంటుందో అట్టివాని వద్దకు భగవంతుడే స్వయంగా వెతుక్కుంటూ వస్తాడు. మానవత్వం లెని ఆస్తికత్వం వ్యర్ధం. విలువలు లెని భక్తీ వ్యర్ధమే.

'ప్రపంచంలో ఒక కుక్క ఆకలిలో ఉన్నా, దాని ఆకలి తీర్చడానికి నేను మళ్ళీ పుడతాను.' అని ఒకసారి వివేకానందస్వామి అన్నారు.

అంతటి మానవతామూర్తి గనుకనే శ్రీరామకృష్ణుని హృదయాన్ని ఆయన గెలుచుకోగలిగాడు.భగవంతుని సన్నిహిత అనుచరులలో ఒకడు కాగలిగాడు.

దురదృష్టవశాత్తూ ప్రస్తుత సమాజంలో మానవత్వం, ఆస్తికత్వం భిన్న ధ్రువాలలాగా ఉన్నాయి. దెవుని విగ్రహాలలొనే కాదు సాటి మనిషిలో, సాటి జీవులలో చూడలేని వాడు ఆస్తికుడూ కాలేడు, భక్తుడూ కాలేడు.

నీవు ఆస్తికుడివా లేక నాస్తికుడివా అన్నది అసలు ప్రశ్న కాదు.నీవు అసలు మానవుడివేనా?నీలో మానవత్వం ఉన్నదా? అనేదే అసలు ప్రశ్న.

ఇదే మాట నా మిత్రునితో చెప్పాను. మీరేమంటారు?
read more " ఆస్తికులు మంచివారా? నాస్తికులు మంచివారా? "