నిత్యజీవితంలో ప్రతిఫలించని జ్ఞానం నిరర్ధకం

1, అక్టోబర్ 2009, గురువారం

ఆస్తికులు మంచివారా? నాస్తికులు మంచివారా?


ఒక మిత్రుడు నన్నడిగాడు.ఆస్తికులు మంచివారా? నాస్తికులు మంచివారా? అని.


ఈ ప్రశ్న నన్ను ఆలోచింప చేసింది.

ఆస్తికత్వం, నాస్తికత్వం అనెవి మన నమ్మకాలకు చెందిన విషయాలు. కాని మంచితనం అలా కాదు. అది నమ్మకానికి సంబంధించిన విషయం కాదు. హృదయానికి సంబంధించిన విషయం.

ప్రపంచంలొ మహాభక్తులుగా చెలామణీ అవుతున్న వారిలో పెద్ద దొంగలు, దుర్మార్గులు చాలామంది ఉన్నారు. అదేవిధంగా మంచివారూ చాలామంది ఉన్నారు.అలాగె నాస్తికులలో కూడాను. కనుక ఈ రెండూ భిన్న విషయాలు. పోల్చలెనివి.

ఒక మనిషి బాధలో ఉన్నపుడు స్పందించి ఆ బాధను తనదిగా భావించి సాయం చెయ్యటం మంచితనం. మానవత్వం. దీనికి కావలసింది స్పందించే హృదయం. అసలు, మనిషి ఆస్తికుడా నాస్తికుడా అనేది ప్రశ్నే కాదు.

మనిషి మనిషిగా ఉన్నాడా లెదా అనేదే ప్రశ్న.

ఒక మనిషి గనక పరిపూర్ణ మానవత్వంతో ఉంటె, అతను నాస్తికుడైనా సరే, దెవునికి అతడే దగ్గర అవుతాడు. అదే స్వార్ధపరుడైన ఆస్తికుడు ఎన్ని పూజలు చెసినా దెవునికి దగ్గర కాలేడు. కనుక మనిషి స్వార్ధపరుడా, లెక నిస్వార్ధపరుడా అనెదె ముఖ్యం కాని, అతడు దెవుని నమ్ముతున్నాడా లెదా అనెది ముఖ్యం కాదు.

ఈ స్వార్ధం లెకుండా మనిషి ఉండగలడా? జీవించాలంటె ఎంతో కొంత స్వార్ధం అవసరం. కాని మితిమీరిన స్వార్ధం అవసరం లెదు. తన కడుపు నిండిన తరువాత కూడా ఎదుటివాడి కడుపు కొట్టాలనుకోవటం తప్పు.

కాని తన కడుపు ఎప్పుడు నిండుతుందో, ఎంత తింటే నిండుతుందో కూడా తెలియని స్థితిలో మనిషి బతుకుతున్నాడు. కనుకనే మితిమీరిన స్వార్ధంతొ అన్నీ తనకె చెందాలనే తపనతో భ్రమతో ఎక్కడికి పొతున్నాడో తెలియని స్థితిలో సాగిపొతున్నాడు.

ఇటువంటి మనిషి దెవుని నమ్మినా నమ్మక పొయినా పెద్ద తెడా లెదు. మన రాజకీయ నాయకులు అందరూ దైవభక్తులే. కాని ఉపయోగం ఎముంది? సమాజంలొ మోసగాళ్ళు అందరూ దైవభక్తులే.ప్రయోజనం ఎముంది? ఇటువంటి భక్తిని దేవుడు మెచ్చడు. భక్తికన్నా,మన నమ్మకాల కన్నా మానవత్వం ముఖ్యం.

ఎవరి హృదయం మానవత్వంతో తొణికిసలాడుతూ ఎదుటి మనిషి బాధను తన బాధగా స్పందించగలిగే స్థాయికి చెరుకుంటుందో అట్టివాని వద్దకు భగవంతుడే స్వయంగా వెతుక్కుంటూ వస్తాడు. మానవత్వం లెని ఆస్తికత్వం వ్యర్ధం. విలువలు లెని భక్తీ వ్యర్ధమే.

'ప్రపంచంలో ఒక కుక్క ఆకలిలో ఉన్నా, దాని ఆకలి తీర్చడానికి నేను మళ్ళీ పుడతాను.' అని ఒకసారి వివేకానందస్వామి అన్నారు.

అంతటి మానవతామూర్తి గనుకనే శ్రీరామకృష్ణుని హృదయాన్ని ఆయన గెలుచుకోగలిగాడు.భగవంతుని సన్నిహిత అనుచరులలో ఒకడు కాగలిగాడు.

దురదృష్టవశాత్తూ ప్రస్తుత సమాజంలో మానవత్వం, ఆస్తికత్వం భిన్న ధ్రువాలలాగా ఉన్నాయి. దెవుని విగ్రహాలలొనే కాదు సాటి మనిషిలో, సాటి జీవులలో చూడలేని వాడు ఆస్తికుడూ కాలేడు, భక్తుడూ కాలేడు.

నీవు ఆస్తికుడివా లేక నాస్తికుడివా అన్నది అసలు ప్రశ్న కాదు.నీవు అసలు మానవుడివేనా?నీలో మానవత్వం ఉన్నదా? అనేదే అసలు ప్రశ్న.

ఇదే మాట నా మిత్రునితో చెప్పాను. మీరేమంటారు?