“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

27, మార్చి 2015, శుక్రవారం

Kannada Melodies-PB Srinivas-Naa Vaaduva Nudiye...
నా వాడువ నుడియే కన్నడ నుడీ...
నా విరువా తాణవె గంధదగుడి...
అందద గుడి...చందద గుడీ....

నేను పాడిన ఇంకొక కన్నడ కరావోకే మధురగీతాన్ని మీకు ఈ పోస్ట్ లో అందిస్తున్నాను.

డా|| రాజ్ కుమార్ నటించిన "గంధదగుడి" సినిమాలోనిది ఈ పాట.

ఇది ఎన్నటికీ మరపురాని ఇంకొక సుమధుర గీతం.

పీ.బీ.శ్రీనివాస్ గారి మధురగళంలో నుంచి ఉరికిన పవర్ ఫుల్ పాట ఇది. దీనిని ఆయన ఎంత శక్తితో పాడాడో విని ఫీలయితే తెలుస్తుంది.రాజన్ నాగేంద్ర అందించిన సుమధుర రాగం,పీ.బీ.ఎస్ గాత్రానికి వన్నె తెచ్చింది.రాజన్ నాగేంద్ర అందించిన స్వరాలన్నీ సుమధుర స్వరాలే. తెలుగులో కూడా వీరు అందించిన రాగాలు ఇప్పటికీ హాంటింగ్ ట్యూన్సే.

Movie:--Gandhada Gudi(1973)
Lyrics:--Udaya Shankar
Music:--Rajan Nagendra
Singer:--P.B.Srinivas
Karaoke Singer:--Satya Narayana Sarma

Enjoy
-------------------------------------------
నా వాడువ నుడియే కన్నడ నుడీ-చిన్నద నుడీ-సిరి గన్నడ నుడీ
నావిరువా తాణవె గంధద గుడి –అందద గుడీ – చందద గుడీ
నా వాడువ నుడియే కన్నడ నుడీ- నావిరువా తాణవె గంధద గుడి- అందద గుడీ -గంధద గుడీ-చందద గుడీ-శ్రీ గంధద గుడి
అహహా అహహా అహహా
అహహా అహహా అహహా

హసురిన బణసిరిగే ఒళిదు – సౌందర్య సరస్వతి ధరగిళేదు
ఆహహా ఒహోహో
ఆ.. ఆ.. హో....ఓ
హరియువ నదియళి ఈజాడి--హు బనదళి నళియుత ఓళాడి
చెలువిన బలెయా బీసిదళు--ఈ గంధద గుడియలి నిలెసిదళు
ఇదు యార తపసిన ఫలవో -- ఈ కంగళు మాడిద పుణ్యవో
ఒహోహో aa. ఆ. ఆ..
నా వాడువ నుడియే కన్నడ నుడీ- నావిరువా తాణవె గంధద గుడి- అందద గుడీ -గంధద గుడీ-చందద గుడీ-శ్రీ గంధద గుడి
అహహా అహహా అహహా
అహహా అహహా అహహా

చిమ్ముత ఓడివె జింకెగళు -- కునిదాడుత నలిదివె నవిళుగళూ
అహ హహ హా...
ముగిలను చుంబిసు వాసెయలి - తూగాడుత నింతా మరగళలి
హాడుదిరే బాణాడిగళు – ఎదె యల్లి సంతస దాహోనలు
ఇదు వన్య మృగగళ లోకవో -- ఈ భూమిగె ఇలిదా నాకవో
అహహా ఓ.. ఓ..
నా వాడువ నుడియే కన్నడ నుడీ-చిన్నద నుడీ-సిరి గన్నడ నుడీ
నావిరువా తాణవె గంధదగుడి –అందద గుడీ – చందద గుడీ
నా వాడువ నుడియే కన్నడ నుడీ- నావిరువా తాణవె గంధద గుడి- అందద గుడీ -గంధద గుడీ-చందద గుడీ-శ్రీ గంధద గుడి
అహహా...అహహా..
ఒహోహో...ఒహోహో...ఓహో...హో
read more " Kannada Melodies-PB Srinivas-Naa Vaaduva Nudiye... "

26, మార్చి 2015, గురువారం

అతిసాహసం-అందం పైన మక్కువ-గ్రహాలు మానవ మనస్సుపై ఎలా పనిచేస్తాయి?

సూక్ష్మ జ్యోతిష్య ఫలితాలు నిజమే అని ప్రతిరోజూ రుజువులు వస్తున్నాయి.ఈ పదిహేను రోజులూ ప్రత్యేకమైనవి గనుకనే-నూతన సంవత్సర ఫలితాలు కూడా వ్రాయకుండా-ఇవి వ్రాశాను.

మచ్చుకి రెండు సంఘటనలు చూద్దాం.సరిగ్గా మొన్న రెండు సంఘటనలు జరిగాయి.

1.అతి సాహసం-80 ఏళ్ళ వయసులో

మా ఇన్స్పెక్టర్ ఒకాయన తండ్రికి 80 ఏళ్ళు.మొదట్నించీ పొలం పనులు చేసిన ఒళ్ళు కావడం ఏమో,మనిషి ఇప్పటికీ గట్టిగానే ఉంటాడు.కానీ సరిగ్గా మొన్న మధ్యాహ్నం పూట-ఏదో పూనినట్టు-మోటార్ సైకిల్ తీసుకుని డ్రైవింగ్ చేసుకుంటూ బయల్దేరాడు.ఒక్కడివే మోటార్ సైకిల్ ఒద్దని ఇంట్లోవాళ్ళు ఎంత చెప్పినా వినలేదు.స్పీడుగా పోతుంటే,ఆపుకోలేక క్రిందపడి,యాక్సిడెంట్ అయింది.తుంటి ఎముక, తొడ ఎముకలు మూడు చోట్ల విరిగిపోయాయి.ఈ యాక్సిడెంట్ ఒంగోలులో జరిగింది.

ఆయన్ను హుటాహుటిన గుంటూరుకు తెచ్చి ఆపరేషన్ చేసి,ఇంకా వెన్నెముకకు సంబంధించిన పరీక్షలు ఏవో చెయ్యాలంటే విజయవాడకు తీసుకెళ్ళి ఆ పరీక్షలు కానిచ్చి,అక్కడనుంచి మళ్ళీ ఒంగోలుకు చేర్చారు.ఆపరేషన్ సక్సెస్ అయింది.కానీ కనీసం మూడునెలలు మంచం మీద ఉండాలి.

మనం ఎన్నోసార్లు ఒక పని చేసి ఉంటాం.ఇంకోసారి కూడా చేస్తే ఏమీ కాదులే అని అనుకుంటాం.కానీ అప్పుడే జరగాల్సినది జరుగుతుంది.ఆ విధంగా-ఆ సమయంలో -ఆ పని చెయ్యమని- గ్రహాలు మనిషిని తీవ్రంగా ప్రేరేపిస్తాయి.

అందుకే పాతకాలంలో అనేవారు- "ఎంతమంది చెప్పినా వినకుండా -ఏదో గ్రహం పూనినట్లు చేశాడు-ఇలా జరిగింది."--అని.

పెద్ద వయసులో సాహసాలు పనికిరావు- అందులోనూ గ్రహస్థితులు బాలేనప్పుడు అస్సలు పనికిరావు- అనేది ఈ సంఘటన నేర్పే గుణపాఠం.

2.అందం మీద అతి శ్రద్ధ-ప్రాణం తీసిన 6 కేజీలు

మా దగ్గర పనిచేసే ఒక గార్డుగారి అమ్మాయి మంచి తెలివైనది.మెరిట్లో MBBS సీటు తెచ్చుకుంది.కోర్స్ అయిపోయింది.PG ఎంట్రెన్స్ వ్రాసింది. అందులో కూడా స్టేట్ ర్యాంక్-3 వచ్చింది.ప్రస్తుతం PG లో చేరాలి.ఈలోపల అందం మీద శ్రద్ధ ఎక్కువైంది.తను ఉండవలసిన బరువు కంటే ఒక్క 6 కేజీలు మాత్రం ఎక్కువ ఉన్నదట.ఆ 6 కేజీలు మాత్రం ఎందుకుండాలి? అన్న బాధతో ఒక జిమ్ లో చేరింది.యూనివర్సిటీ క్లాసులు మొదలయ్యే లోపు ఈ 6 కేజీలు ఎలాగైనా తగ్గాలన్న పట్టుతో జిమ్ తీవ్రంగా చేస్తున్నది.

సరిగ్గా మొన్న సాయంత్రం - గుంటూరులో జిమ్ లో ట్రెడ్ మిల్ మీద పరిగెత్తుతూ పరిగెత్తుతూ హటాత్తుగా కుప్పకూలిపోయింది.ఆసుపత్రికి తీసుకెళ్ళేలోపు చనిపోయింది.

ఆమె వయసు 22 ఏళ్ళు.

ఇప్పుడేం చేస్తే, ఆ తల్లిదండ్రుల గుండెకోత తీరుతుంది? వారి శేషజీవితం అంతా కుమిలిపోతూ శాపగ్రస్తులలాగా జీవచ్చవాల లాగా బ్రతకాల్సిందేగా?

ఆ మధ్య ఒక మోడల్ - జీరోసైజు కోసం తిండి మానేసి,ఉపవాసాలుండి,ఎక్సర్ సైజులు చేసి,చివరకు ర్యాంప్ మీదే కుప్పకూలిపోయి చనిపోయిందని వార్తల్లో చదివాం.ఇప్పుడు 6 కేజీల కోసం ప్రాణం పోగొట్టుకున్న మెడికో మన కళ్ళ ఎదురుగా ఉన్నది.

6 కేజీల బరువుకోసం ప్రాణం మీదకు తెచ్చుకోవడం ఏం తెలివైన పని?

ఈ మధ్యన అమ్మాయిలకు అందంమీద అనవసరమైన అతిశ్రద్ధ ఎక్కువౌతున్నది.దానికోసం తిండి మానుకొని అతిగా వ్యాయామాలు చేస్తున్నారు.ఇది చాలా పొరపాటు.ఎవరి అందం వారికుంటుంది.ఒకరిని చూచి ఇంకొకరు వాత పెట్టుకోవడం మహా తెలివితక్కువపని.

భగవంతుడు ఇచ్చిన ఆరోగ్యాన్ని జంక్ ఫుడ్ తిని చెడగొట్టుకుంటారు. సరియైన రోజువారీ వ్యాయామం లేకుండా పిచ్చి పిచ్చిగా ఒళ్ళు పెంచేస్తారు.ఆ తర్వాత TV లో యాడ్స్ చూచో,లేకపోతే స్నేహితులు చెప్పిన సలహాలు వినో--తీవ్రమైన వ్యాయామాలు మొదలు పెడతారు.తెలిసీ తెలియకుండా చేస్తే అవి ప్రాణం మీదకు తెస్తాయన్న విషయం గ్రహించలేరు.

వీటికి తోడు పనికిమాలిన సినిమా కబుర్లు తోడౌతాయి.

'ఫలానా సినిమా కోసం ఫలానా హీరో ఒక్క నెలలో 20 కేజీలు బరువు పెరిగాడట.మళ్ళీ ఒక్క నెలలో 30 కేజీలు తగ్గిపోయాడట.' అని స్నేహితులు కలసి చెప్పుకుంటూ ఉంటారు.

ఇంతలో పేపర్లో వస్తుంది.ఫలానా సినిమా కోసం జీరో సైజుకు మారిపోయిన హీరోయిన్ అంటూ ఆమె ఫుల్ పేజీ ముప్పాతిక నగ్నచిత్రాన్ని ఆ పేపర్ వేస్తుంది.అది చూచి మన కాలేజీ అమ్మాయిలకు వెర్రి పుట్టుకొస్తుంది.మనం కూడా ఆ హీరోయిన్లా బక్కపలచగా తయారుకావాలి.పొట్ట అనేది వెన్నుకు అంటుకుపోవాలి.అదికూడా ఒక్కనెలలోనే-కాలేజీలు తెరిచేలోపే- జరిగిపోవాలి. తనే కాలేజీ బ్యూటీ అనిపించుకోవాలి.

ఇంకేముంది? తిండి మానేసి జిమ్ ల మీద పడతారు.అదృష్టం బాగుంటే చివరకు ఆస్పత్రిలో తేలతారు.లేకపోతే మార్చురీలో తేలతారు.

జిమ్ లో చేరి వ్యాయామాలు చెయ్యనక్కరలేదు.జంక్ ఫుడ్ తినకుండా,టీవీ ముందూ,కంప్యూటర్ ముందూ కూచునే సమయాన్ని తగ్గించి,రాత్రులు ఎక్కువ మేలుకోకుండా ఉండి,రోజువారీ పనులను ఒళ్ళొంచి చెయ్యడం నేర్చుకుంటే,ఏ ప్రత్యెక వ్యాయామాలూ అవసరం లేదు.మహా కావాలంటే రోజూ ఒక ఇరవై నిముషాలు సింపుల్ యోగా చేస్తే చాలు.

ప్రతి వ్యాయామానికి ఒక ప్రత్యేకమైన డైట్ తీసుకోవాలి.ఒక అనుభవజ్ఞుడైన శిక్షకుని సలహా తీసుకోవాలి.తమంతట తాము నిర్ణయించుకుని తిండి మానేసి ఇష్టం వచ్చిన వ్యాయామాలు అతిగా చేస్తే ఇలాగే అవుతుంది.వ్యాయామాలు ఎవరికీ వారు నిర్ణయించుకుని అతిగా చెయ్యరాదు.చేస్తే ఇలాగే మంచికి బదులు చెడు జరుగుతుంది.

ప్రతి శరీరానికీ ఒక ప్రత్యేకమైన భాష ఉంటుంది.ఆ భాషను అర్ధం చేసుకుని దానికి తగిన వ్యాయామాలు మాత్రమే చెయ్యాలి.అంతేగాని ఎవరో ఏదో చేస్తున్నారని మనమూ అదే చెయ్యబోతే అది మనకు సరిపడక వికటించి ఇలాగే జరుగుతుంది.

మన ఒళ్ళు మనకు చెబుతూనే ఉంటుంది.నువ్వు లిమిట్స్ దాటుతున్నావు.జాగ్రత్త అని.దాని మాట వినడం ముందుగా నేర్చుకోవాలి.అప్పుడు అంతా బాగుంటుంది.

మా అబ్బాయి స్నేహితుడొకడు నాలుగేళ్ల క్రితం ఇలాగే- తన అభిమాన హీరోను చూచి- తనూ 6 ప్యాక్ పెంచాలనుకుని- రైస్ పూర్తిగా మానేసి- ఫ్రూట్ జ్యూసులు మాత్రమె త్రాగుతూ వ్యాయామాలు తీవ్రంగా చేశాడు.ఒకరోజున జిమ్ లో కళ్ళు తిరిగి పడిపోతే,ఆస్పత్రిలో చేర్చారు.కోలుకోడానికి ఆర్నెల్లు పట్టింది.సిక్స్ ప్యాక్ సంగతేమో గాని సిక్స్ మంత్స్ ఆస్పత్రి బెడ్లో ఉండవలసి వచ్చింది.అప్పటి దుష్ప్రభావాలు ఇప్పటికీ ఆ అబ్బాయి ఒంట్లోనుంచి పూర్తిగా పోలేదు.కొన్ని ఇర్రివర్సిబుల్ మార్పులు వస్తే ఇంక అవి తగ్గడం కష్టం.

సరే మీరు చెప్పేది అంతా బానే ఉంది -- గ్రహాలకూ ఆ సంఘటనలకూ సంబంధం ఏమిటి? అని అనుమానం రావచ్చు.

ఉంది.

గ్రహాలు మనిషి మనస్సుమీద పనిచేస్తాయి.లేనిపోని ఆలోచనలు పుట్టిస్తాయి. పిచ్చిపిచ్చి పనులు చెయ్యమని ప్రేరేపిస్తాయి.ఆ క్రమంలో ప్రమాదాలు ఎదురౌతాయి.ఇదంతా మనిషి పూర్వకర్మానుసారమే జరుగుతుంది.ఇలా అందరికీ ప్రేరేపణ కలగదు.గ్రహస్థితులు బాగాలేనప్పుడు- ఎవరెవరి పూర్వకర్మ బాగులేదో - వారికి మాత్రమె ఇలాంటి పెడబుద్ధులు పుడతాయి. అందరికీ పుట్టవు.

ఇదంతా ఒక సీక్రెట్ సైన్స్.

అందుకే మనవాళ్ళు పాతకాలంలో ఒక మాట అనేవారు.

'పోగాలం వచ్చినపుడు పిదప బుద్ధులు పుడతాయి' అని.

అది అక్షరాలా నిజం. అది ఎంతో అనుభవం మీద చెప్పబడిన మాట.

ఆ ముసలాయన కూడా ఎంతమంది చెప్పినా వినకుండా ఆ రోజున మోటార్ సైకిల్ తీసుకుని బయలుదేరాడు.అలా జరిగింది."మూర్ఖత్వం" అనే దారిగుండా గ్రహాలు ఇక్కడ పనిచేశాయి.

ఆ అమ్మాయికి కూడా ఇప్పటివరకూ అందంమీద అంత శ్రద్ధలేదు.అందం మీద చిన్నప్పటినుంచీ అంత శ్రద్ధ ఉంటె ర్యాంకర్ ఎలా అవుతుంది? కానీ ఇప్పుడు ఆయుస్సు అయిపోవస్తున్నది.యముడు పిలుస్తున్నాడు.కనుక ఇప్పుడు హటాత్తుగా అందంమీద అతిశ్రద్ధ పుట్టుకొచ్చింది.అదే ప్రాణం మీదకు తెచ్చింది."అతి" అనే దారిగుండా గ్రహాలు ఇక్కడ పనిచేశాయి.

జీవితంలో జరిగే విచిత్రాలు ఇలాగే ఉంటాయి.మనిషి మీద గ్రహప్రభావాలు ఇలాగే సూక్ష్మంగా ఉంటాయి.వాటిలోని తారతమ్యాలను గ్రహించాలంటే యోగశక్తీ సూక్ష్మదృష్టీ  ఉండాలి.

గ్రహస్థితులు బాగాలేనప్పుడు సాహసాలు చెయ్యకూడదు.ఆ సమయాలలో అనేక జాగ్రత్తలు పాటించాలి.ఈ సూత్రం మళ్ళీమళ్ళీ అనేకసార్లు ఎందరి జీవితాలలోనో రుజువౌతూనే ఉన్నది.

నాకు మొన్న వచ్చిన యాస్ట్రల్ సూచన నిజమే అని ఈ సంఘటనలూ ఇంకా రోజూ జరుగుతున్న ఎన్నో సంఘటనలూ రుజువు చేస్తున్నాయి.
read more " అతిసాహసం-అందం పైన మక్కువ-గ్రహాలు మానవ మనస్సుపై ఎలా పనిచేస్తాయి? "

25, మార్చి 2015, బుధవారం

Hindi Melodies-Mohd.Rafi-Main gaoo tum so jaao...
మై గావూ తుమ్ సోజావో సుఖ్ సప్నోమే ఖో జావో...

నా అభిమాన గాయకుడు మహమ్మద్ రఫీ మధురగళంలో నుంచి జాలువారిన మరొక ఆణిముత్యం ఈపాట.ఇది 'బ్రహ్మచారి' అనే సినిమాలోనిది.ఈ సినిమా 1968 లో వచ్చింది.ఈ సినిమాలో హీరోగా నా అభిమాన నటులలో ఒకరైన షమ్మీ కపూర్ నటించాడు.

ఈ సినిమానే తర్వాత తెలుగులో 'దేవుడు మామయ్య' గా 1981 లో తీశారు.కానీ అంతకుముందే ఈపాట రాగాన్ని 1970 లో వచ్చిన 'చిట్టిచెల్లెలు' సినిమాలో 'అందాల పసిపాపా అన్నయ్యకు కనుపాపా' అనే పాటలో వాడుకున్నారు.

అలాగే - 'ఏ దివిలో విరిసిన పారిజాతమో' అనే పాట కూడా ఇదే రాగమే.

మధురమైన గీతాలకు పెట్టింది పేరుగా 1960-1970 దశాబ్దాన్ని చెప్పుకోవచ్చు.హిందీ చిత్రగీతాల తీరుకూడా ప్రతి పదేళ్ళకూ క్రమంగా మారిపోతూ వచ్చింది.కానీ ఏ దశాబ్దానికి ఉండే మెలోడీ ఆ దశాబ్దంలో ఉన్నది.ఆ క్రమంలో అత్యంత మధురమైన సాహిత్యమూ,సంగీతమూ కూడా ఈ పదేళ్ళలోనే విపరీతంగా వచ్చింది.అలాంటి పాటల్లో ఇదొకటి.

ఇలాంటి సాహిత్యం వ్రాసే కవులు ఇప్పుడు కనుమరుగయ్యారు.ఇప్పుడంతా పరమచెత్త సాహిత్యం ఎక్కడ చూచినా కనిపిస్తున్నది.అందుకే కొంచం ఉన్నత భావాలున్నవారు ఇప్పుడు సినిమాలు చూడటం పూర్తిగా మానుకున్నారు.ఉదాత్తమైన లిరిక్స్ ఇప్పుడు తెలుగు సినిమాలలో భూతద్దం వేసి వెదికినా ఎక్కడా కనపడటం లేదు.

నా అభిమాని ఒకామె -"ఎప్పుడూ హిందీ పాటలే పాడతారు.తెలుగులో మంచి పాటలు లేవా?' అని అడిగింది.

ఎక్కడున్నాయో చూపించమని అడిగాను.ఎక్కడ చూచినా అసభ్యమైన సాహిత్యంతో కూడిన చెత్తపాటలూ కాపీ రాగాలూ తప్ప,ఒరిజినల్ మంచి పాటలు తెలుగులో ఎక్కడున్నాయి?

పాత తెలుగుపాటల్లో కూడా అక్కడక్కడా మాత్రమె మంచి సాహిత్యమూ మంచి సంగీతమూ కలసిన పాటలున్నాయి. హిందీలో అలాకాదు. ఆణిముత్యాల లాంటి పాటలు ఎన్నో ఉన్నాయి.అందుకే నేను తెలుగు పాటలకంటే హిందీ పాటలనే ఇష్టపడతాను.

Movie:--Brahmachari(1968)
Lyrics:--Shailendra
Music:--Shankar Jaikishan
Singer:--Mohammad Rafi
Karaoke Singer:-- Satya Narayana Sarma

Enjoy
---------------------------------------------
La ra laa la lara lalla laallaa
La ra laa la lara lalla laallaa

Main Gaaun Tum So Jaao-2
Sukh Sapanon Men Kho Jaao
Main Gaaun Tum So Jaao-2
Sukh Sapanon Men Kho Jaao
Main Gaaun Tum So Jaao-2

Maanaa Aaj Ki Raat Hai Lambi
Maanaa Din Thaa Bhaaree
Par Jag Badlaa Badlegi
Ek Din Taqadeer Hamaaree
Us Din Ke Khvaab Sajaao
Main Gaauun Tum So Jaao
Sukh Sapanon Men Kho Jaao
Main Gaauun Tum So Jaao-2

Kal Tum Jab Aankhen Khologe
Jab Hogaa Ujiyaaraa
Khushiyon Kaa Sandeshaa Lekar
Aaegaa Samay Har Taraa
Mat Aas Ke Deep Bujhaao, 
Main Gaaon Tum So Jaao
Sukh Sapnon Mein Kho Jaao
Main Gaaon Tum So Jaao
Main gaaon tum....so javo naaa...

Jee Kartaa Hai Jeete Ji
Main Yoohee Gaataa Jaaun
Gardish Men Thake Haathon Kaa
Maathaa Sahalaataa Jaaon
Phir Ik Din Tum Doharaao-2 
Sukh Sapanon me kho javo
Main Gaaon Tum So Jaao
Main Gaaon Tum So Jaao


Meaning:--

I will sing for you
and you go to sleep now
Immerse yourself in happy dreams
I will sing for you
and you go to sleep now

Let this night be long
and the day very heavy
But the world keeps changing
our fate too will change one day
Dream of that day always...

I will sing for you
and you go to sleep now
Immerse and lose yourself in happy dreams
I will sing for you
and you go to sleep now

Tomorrow morning
When you open your eyes
there will be light
Bringing the message of happiness
Morning will come to greet  you
So never put off the flame of hope

I will sing for you
and you go to sleep now
Immerse and lose yourself in happy dreams
I will sing for you
and you go to sleep now

We will live this life only once
So may I ever sing like this for the rest of my life
wiping out unhappiness from the brows
of many people who are feeling low
One day,like me
you also do the same thing

Now,I will sing for you
and you go to sleep
Immerse and lose yourself in happy dreams
I will sing for you
you to go sleep now...
read more " Hindi Melodies-Mohd.Rafi-Main gaoo tum so jaao... "

24, మార్చి 2015, మంగళవారం

సూక్ష్మ జ్యోతిష్యం

సూక్ష్మజ్యోతిష్యం అనేది ఒకటుందన్న విషయాన్ని చాలా పాత పోస్ట్ లలో, అంటే దాదాపు మూడేళ్ళ క్రితం వ్రాసిన పోస్ట్ లలో ప్రస్తావించి ఉన్నాను.ఆ తర్వాత నన్ను అనుసరించే అతి దగ్గరివారితో తప్ప ఈ విషయాన్ని ఎవరితోనూ చర్చించలేదు.

జగన్మాత కృపవల్ల, ఈ సూక్ష్మజ్యోతిష్య రహస్యాలు అనేకం నాకు వాటంతటవే స్ఫురిస్తూ ఉంటాయి.వీటిని ఆమధ్య అప్పుడప్పుడూ వ్రాస్తూ ఉండేవాడిని. తర్వాత కొంతకాలం పాటు ఈ విషయాలు వ్రాయడం ఆపాను.

నా బీరువాకు అనేక సొరుగులున్నాయి.వాటిలో అనేక విషయాలు ఒకేసారి నడుస్తూ ఉంటాయి.ఒక్కొక్కసారి ఒక్కొక్క సొరుగులో విషయాలను గురించి వ్రాస్తూ ఉంటాను.ఇప్పుడు జ్యోతిష్యపు సొరుగును తెరిచి కొన్ని విషయాలను చూద్దాం.

మొన్న మధ్యాహ్నం నాకొక అలౌకికమైన సూచన వచ్చింది.దాని ప్రకారం గమనించగా కొన్ని ముఖ్యమైన విషయాలు తెలిశాయి.మొన్న మధ్యాహ్నం నుంచి మనుషుల జీవితాలలో- పదిహేనురోజుల పాటు- జరగబోయే మార్పులు ఎలా ఉంటాయో దానివల్ల నాకర్ధమైంది.

వాటిని ఈ క్రింద వ్రాస్తున్నాను.

లగ్నం/రాశిని బట్టి ఈ ఫలితాలు ఖచ్చితంగా జరుగుతాయి.గమనించండి.

మేషరాశి
కొత్త ఆలోచనలు కలుగుతాయి.రచనలు గావిస్తారు.ప్రేమ వ్యవహారాలు, కొత్త స్నేహాలు మొదలౌతాయి.కానీ అవి అనుకున్న ఫలితాన్ని ఇవ్వవు.

వృషభరాశి
ఇంట్లో ఊహించని గొడవలు మొదలౌతాయి.చికాకు ఎక్కువౌతుంది. మనశ్శాంతి లోపిస్తుంది.వాహన ప్రమాదాలు ఎదురౌతాయి.

మిధునరాశి
కాసేపు ధైర్యం కాసేపు పిరికితనం కలిగే పరిస్థితులు ఎదురౌతాయి.సోదర సోదరీలకు కష్టాలు ఎదురౌతాయి.మాట తేలికగా అపార్ధం చేసుకోబడుతుంది.

కర్కాటకరాశి
ఇంట్లో పరిస్థితులు చికాకులు కలిగిస్తాయి.మాట తీరు వల్ల గొడవలు జరుగుతాయి.ధననష్టం ఉంటుంది.

సింహరాశి
హటాత్ అనారోగ్య సూచన ఉన్నది.మానసిక క్రుంగుబాటు ఉంటుంది.ధైర్యం తగ్గుతుంది.పరిస్థితులు ఎదురు తిరుగుతాయి.

కన్యారాశి
నష్టాలు ఎదురౌతాయి.అనుకోని హటాత్ ప్రయాణాలు గావిస్తారు.రోగాలకు ఖర్చు పెరుగుతుంది.ఆస్పత్రులు సందర్శిస్తారు.

తులారాశి
ఇరుగు పొరుగువారికి,బంధువులకు,స్నేహితులకు,నౌకర్లకు కష్టకాలం. చెడువార్తలు వింటారు.డబ్బు నష్టపోతారు.

వృశ్చికరాశి
అనుకున్న పనులు జరగవు.మందగమనంతో నడుస్తాయి.వృత్తి ఉద్యోగాలలో చికాకులు ఉంటాయి.ఇంట్లో కూడా వాతావరణం అశాంతిమయం అవుతుంది.

ధనూరాశి
పెద్దలు తీవ్ర అనారోగ్యం పాలు అవుతారు.కొందరికి పెద్దలు గతిస్తారు. జీవితంలో అనైతిక ధోరణులు పెరుగుతాయి.

మకరరాశి
డబ్బు ఖర్చు అనుకోకుండా పెరుగుతుంది.హటాత్తుగా డబ్బు ఖర్చైపోతుంది. నష్టాలు చవిచూస్తారు.ఆరోగ్య భంగం ఉంటుంది.

కుంభరాశి
జీవిత భాగస్వామికి చెడుకాలం.సమాజంలో నీలాపనిందలు ఎదుర్కోవలసి వస్తుంది.వ్యాపారంలో నష్టం వస్తుంది.

మీనరాశి
అనుకోని శత్రువుల నుంచి తాకిడి పెరుగుతుంది.మొండి బాకీలు వసూలౌతాయి.మొండి పనులు అనుకోకుండా అయిపోతాయి.విచక్షణ పెరుగుతుంది.దీర్ఘరోగాలు అదుపులోకి వస్తాయి.జీవితంలో ఆశ పెరుగుతుంది.

రెండు రోజులనుంచీ (సరిగ్గా చెప్పాలంటే మొన్న మధ్యాహ్నంనుంచీ) ఈ మార్పులు అనేకమంది జీవితాలలో మొదలయ్యాయి.నిన్నటినుంచీ స్పష్టంగా ఎక్కువయ్యాయి.గమనించండి.
read more " సూక్ష్మ జ్యోతిష్యం "

స్వామీజీ మిమ్మల్ని రమ్మన్నారు

నిన్నొక ప్రముఖ స్వామీజీ శిష్యుని నుంచి ఫోనొచ్చింది.

ఆయనెవరో చెప్పడం భావ్యంకాదు గనుకా,చెప్పి ఇంకా కొత్త గొడవలకు శ్రీకారం చుట్టడం నా ఉద్దేశ్యం కాదుగనుకా, ఆయన పేరును ఇక్కడ చెప్పడం లేదు.

విషయం మాత్రం చెప్పదలుచుకున్నాను.

'నా పేరు ఫలానా.నేను ఫలానా స్వామీజీ దగ్గర ఉంటాను.' అన్నాడు.

'మంచిది చెప్పండి.ఎందుకు ఫోన్ చేశారు?' అడిగాను.

'మీ 'శ్రీవిద్యారహస్యం' పుస్తకాన్ని మా స్వామీజీ చదివారు.మీతో మాట్లాడాలని అనుకుంటున్నారు' అన్నాడు.

'మంచిదే.అలాగే మాట్లాడవచ్చు.వారు పక్కనే ఉన్నారా?' అడిగాను.

'ఇక్కడ లేరు.లోపల ఉన్నారు.ఫోన్లో మాట్లాడటం సభ్యత కాదు.మీరు ఇక్కడకు వస్తే స్వామివారు మాట్లాడతారట' అన్నాడు.

'ఎవరికి సభ్యత కాదు?' అడిగాను.

'స్వామివారితో అలా ఫోన్లో మాట్లాడటం సభ్యత కాదు కదా?' అన్నాడు.

'మీరు నాతో ఫోన్లో మాట్లాడటం సభ్యత అయినప్పుడు, నేను ఆయనతో ఫోన్లో మాట్లాడితే సభ్యత కాకుండా ఎలా పోతుంది?' అడిగాను.

అవతల వైపు నుంచి కాసేపు నిశ్శబ్దం.

నేనూ మౌనం వహించాను.

కాసేపాగి అటువైపునుంచి 'హలో' అన్నాడు.

'చెప్పండి.వింటూనే ఉన్నాను' అన్నాను.

'మీరు మా ఆశ్రమానికి ఒకసారి రండి.స్వామివారు మీతో చెప్పమన్నారు.' అన్నాడు.

'ఎందుకు?' అడిగాను.

'మీతో మాట్లాడాలట'

'ఏ విషయం మీద మాట్లాడాలి?' అడిగాను.

'మీ పుస్తకం గురించి మాట్లాడతారట' అన్నాడు.

'అంటే వారికేమైనా సందేహాలున్నవా ఈ విషయంలో?' అడిగాను.

అతనికి కోపం వచ్చినట్లుంది.

'వారికి సందేహాలున్నాయో,లేక మీ సందేహాలే మా స్వామి తీరుస్తారో మీరే వచ్చి చూడండి' అన్నాడు.

'పిలిచి కయ్యం పెట్టుకోవడం అంటే ఇదేనేమో? మనకందరూ ఇలాంటి కేసులే తగులుతారు.ఇదేం ఖర్మరా దేవుడా?'- అనుకుంటూ-'మీ స్వామీజీనే ఇక్కడకు రమ్మనండి.నేను రాను.నాకేమీ అంత తీరని సందేహాలు లేవు.మీ స్వామీజీకి ఉంటే నా దగ్గరకు వచ్చి నివృత్తి చేసుకోవచ్చు.'- అన్నాను.

'మీరు ఒక గొప్ప అవకాశం చేజార్చుకుంటున్నారు.మీకు సన్మానం చేద్దామని మా ఉద్దేశ్యం' అన్నాడు.

నాకు విషయం అర్ధమైంది.

సన్మానం అనగానే ఎగురుకుంటూ అక్కడకు వెళతానని ఆయన ఉద్దేశ్యం.

'నాకు సన్మానాలు అవసరం లేదు.సన్మానాలు చేయించుకునేటంత గొప్పపని నేనేమీ చెయ్యలేదు.మనుషుల దృష్టిలో గొప్ప కావాల్సిన పనిలేదు.దైవం దృష్టిలో శభాష్ అనిపించుకుంటే చాలు.

ఒకవేళ మీకు సన్మానాలు చెయ్యాలని అంతగా ఉంటే, ఎదురు డబ్బులిచ్చి చేయించుకునే వారు చాలామంది ఉన్నారు.వారిని కాంటాక్ట్ చెయ్యండి.' అని చెప్పాను.

సమాధానం లేకుండా ఫోన్ కట్ అయిపొయింది.

కాషాయవస్త్రాలు కట్టుకున్నంత మాత్రానో,అజ్ఞానపు జనం కొంతమంది చుట్టూ చేరి భజన చేస్తున్నంత మాత్రానో,ఎవరికి వారే 'పరమహంస పరివ్రాజకాచార్య' అంటూ బిరుదులు తగిలించుకున్నంత మాత్రానో- ఎవరూ 'స్వామీజీలు' కాలేరు.

సాధనాపరమైన అనుభవజ్ఞానం లేనివారిని-కాషాయవస్త్రాలు ధరించినంత మాత్రాన- నేను స్వాములుగా గుర్తించను.

ఆధ్యాత్మిక ప్రపంచంలో ప్రస్తుతం పెద్ద మాయ నడుస్తున్నది.చిన్నచిన్న హస్తలాఘవ క్రియలు (magic tricks) రెండు నేర్చుకోవడం,ఆశ్రమాలు పెట్టడం,రాజకీయ నాయకులతో సంబంధాలు పెట్టుకోవడం,హవాలా కార్యక్రమాలు మొదలుపెట్టడం,ఆ విషయాలు బయటపడకుండా 'సమాజ సేవ'అంటూ కొన్ని కంటితుడుపు సేవాకార్యక్రమాలు చెయ్యడం,దానికి మళ్ళీ పెద్ద ప్రచారం చేసుకోవడం-ఇలాంటి అనైతిక సుడిగుండాలు సమాజంలో నేడు చాలా కనిపిస్తున్నాయి.

ఆశ్రమాలు కూడా రకరకాల 'మార్కెటింగ్' లు మొదలు పెడుతున్నాయి. సమాజంలో కొన్ని రంగాలలో ప్రముఖవ్యక్తులను వారి ఆశ్రమాలకు ఆస్థాన సిద్ధాంతులుగా,ఆస్థాన పూజారులుగా,ఆస్థాన పండితులుగా నియమించు కోవడం,తద్వారా ఇద్దరూ లాభపడటం,వెరసి ఇద్దరూ కలసి భక్తులను వెర్రివాళ్ళను చెయ్యడం -- ఇదంతా ఒక పెద్ద ప్రహసనం.

ఇలాంటి ప్రహసనాలు నేడు లోకంలో చాలా నడుస్తున్నాయి.అసలు ఆస్థానాలూ సంస్థానాలూ ఎప్పుడో రద్దై పోయాయి.ఇంకా వీటి గోలేమిటి?

నాకు తెలిసిన ఒక వ్యక్తి ఉన్నాడు.

ఏడాదికి రెండుసార్లో మూడుసార్లో  అతను ఒక పెద్ద ఫంక్షన్ చేస్తాడు.అందులో చాలామందికి శాలువాలు కప్పి,దండలేసి,బిరుదులు ప్రదానం చేస్తాడు. దానికోసం మూడునెలల ముందునుంచే దేశంమీద పడి విరాళాలు సేకరించడం మొదలుపెడతాడు.ఆ డబ్బులో చాలాభాగం తనే నొక్కేస్తాడని అందరూ చెవులు కొరుక్కుంటూ ఉంటారు.అతనికేమీ ఉద్యోగం సద్యోగం లేదు. ఏడాదికి ఇలాంటి సన్మాన కార్యక్రమాలు రెండో మూడో చేస్తాడు.మిగతా టైములో హాయిగా బ్రతికేస్తూ ఉంటాడు.

పోనీ- అతనంటే కళారంగంలో ఈ కార్యక్రమం చేస్తూ ఉంటాడు.ఇప్పుడు స్వామీజీలూ ఆశ్రమాలూ కూడా ఇదే వరసలో నడుస్తున్నారన్నమాట.అంటే సన్మానవైరస్ ఇప్పుడు ఆశ్రమాలకూ స్వామీజీలకూ కూడా సోకిందన్న మాట.పిలిచి సన్మానాలు చేసే స్థాయికి స్వామీజీలు దిగజారారంటే వారి ఆధ్యాత్మికస్థాయి ఎంతటిదో తేలికగా ఊహించవచ్చు.సమాజంలో పేరు ప్రతిష్టలే మనిషికి ముఖ్యం అయినప్పుడు ఇంక ఆధ్యాత్మికత ఎక్కడుంటుంది నా ముఖం కాకపోతే?

ఈ గోలలో పడి అసలైన ఆధ్యాత్మికత అనేది ఏమూలకు మాయమై పోతున్నదో ఆ దేవునికే తెలియాలి.

హతవిధీ !!

ప్రస్తుత సమాజంలో అన్నీ కల్తీ అయినట్లే,ఆధ్యాత్మికత కూడా కల్తీగా మారిపోవడం,అదికూడా ఒక బడా వ్యాపారంగా మారిపోవడం కలియుగ మాయలలో ఒక మాయేమో?
read more " స్వామీజీ మిమ్మల్ని రమ్మన్నారు "

22, మార్చి 2015, ఆదివారం

Hindi Melodies-Mohd Rafi-Dil ka bhanwar kare pukar..
దిల్ క భవర్ కరే పుకార్ ప్యార్ కా రాగ్ సునో...

ప్యార్ కా రాగ్ సునో రే... 
ఊ.. ఊ.. ఊ...

దేవానంద్ నిర్మించి నటించిన 'తేరే ఘర్ కె సామ్నే' చిత్రం 1963 లో రిలీజైంది.ఈ సినిమాలో మహమ్మద్ రఫీ గళంలో నుంచి జాలువారిన మధుర గీతాలలో ఇదొక సుమధురగీతం.ఈ పాటలో దేవానంద్ నూతన్ నటించారు.దీనిని తీసిన విధానం కూడా ఎంతో హృద్యంగా ఉంటుంది.అసలీ పాటని కుతుబ్ మినార్ లో తీద్దామని దేవానంద్ ఊహించాడు.కానీ ఆ ఇరుకు మెట్లమీద షూటింగ్ కష్టమని స్టూడియోలో కుతుబ్ మినార్ సెట్ వేసి ఈ పాటని చిత్రీకరించారు.అయినా సరే పాట ఎంతో సహజంగా వచ్చింది.మనకు తెలియకపోతే అది కుతుబ్ మినార్ అనే అనుకుంటాము.

ఈ పాట పాడుతుంటే 'ప్లేటో' చెప్పిన సూక్తి ఒకటి గుర్తొచ్చింది.


Every heart sings a song, incomplete

until another heart whispers back.
Those who wish to sing always find a song.
At the touch of a lover, everyone becomes a poet.
--Plato

ప్రతి హృదయం ఒక అసంపూర్ణ గీతాన్ని ఆలపిస్తుంది...
ఇంకొక హృదయం తన గుసగుసలతో బదులిచ్చేదాకా.
ప్రతి గాయకుడూ ఒక పాటను కనుగొంటాడు
ప్రేమ తనను తాకినప్పుడు ప్రతిమనిషీ ఒక కవిగా మారిపోతాడు
--ప్లేటో

పాటలో కవి 'తూ మేరె సాకి యారే' అంటూ ఒక పదాన్ని వాడాడు.ఉమర్ ఖయ్యాం పక్కన అతనికి మధుపాత్రలో మధువు పొయ్యడానికి ఒక నెచ్చెలి ఉంటుంది.ఆమె పేరు సాకీ.ఉత్త మధువు త్రాగితే ఖయ్యాంకు మత్తు రాదు.సాకీ చేతితో పోసినప్పుడే మధువుకు కమ్మదనం వస్తుంది.అప్పుడు ఆ మధువు మత్తు ఎన్నో రెట్లు పెరుగుతుంది.

ఆమె కళ్ళలోకి చూస్తూ ఆ మధువును త్రాగితే కలిగే మత్తు అనిర్వచనీయంగా ఉంటుంది.ఆ మత్తులో మునిగి ఉండటమే నిజమైన ఆధ్యాత్మికత.

అదే సమాధి స్థితి.

"నీ సమక్షంలో నాకు అంత మత్తు కలుగుతున్నది" అనే భావాన్ని ప్రతిబింబింప చేస్తూ కవి పదాన్ని వాడాడు.అద్భుతమైన ప్రేమభావాన్ని ఎంత చక్కగా హస్రత్ జైపురి వ్రాశాడో అంతే మధురంగా పాడి తన గానంతో పాటకు జీవం పోశాడు అమరగాయకుడు మహమ్మద్ రఫీ.

Movie:--Tere ghar ke saamne
Lyrics:--Hasrat Jaipuri
Music:--S.D.Burman
Singer:--Mohammad Rafi
Karaoke singer:--Satya Narayana Sarma
Youtube:-https://youtu.be/lA4FL1n6A6MEnjoy
--------------------

Dil Ka Bhanvar Kare Pukaar
Pyaar Ka Raag Suno,Pyaar Ka Raag Suno Re-2

Phool Tum Gulaab Ka
Kya Javaab Aapaka
Jo Ada hai Vo Bahaar Hai
Aaj Dil Ki Bekali, Aa Gai Zubaan Par
Baat Ye Hai Tumse Pyaar Hai
Dil Tumhi Ko Diya hai
Pyaar Ka Raag Suno Re
Dil Ka Bhanvar................

Chaahe Tum Mitaana, 
Par Na Tum Giraana
Aansu Ki Tarah Nigaah Se
Pyaar Ki Ujaayi
Ishq Ki Geharayi
Poochh Lo Hamaari Aah Se
Aasmaa Chu Liya Re
Pyaar Ka Raag Suno Re
Dil Ka Bhanvar...................

Is Haseen utaar Pe
Ham Na Baithe Haar Ke
Saaya Ban Ke Saath Ham Chale
Aaj Mere Sang Tu
Goonje Dil Ki Aarzoo
Tujhse Meri Aankhe Jab Mile
Jaane Kya Kar Diya Re
Pyaar Ka Raag Suno re 
Dil Ka Bhanvar............

Aap Ka Ye Aachal, 
Pyaar Ka Ye Baadal
Phir Hamen Zamee Pe Le Chala
Ab To Haath Thaam Lo, 
Ik Nazar Ka Jaam Do
Is Naye Safar Ka Vaastaa
Tum Mere Saaqiya Re
Pyaar Kaa Raag Suno Re, Uu Uu Uu..
Dil Ka Bhanvar............

[oo—oo—oo—oo]-4

Meaning:--

My heart's bumblebee is calling you
Listen to the melody of love
Listen to the melody of love
uu-uu-uu

You are a precious rose flower
You have none to compare with
Whatever is your style
that itself is the spring season
My heart's restlessness
has become eloquent today
The simple fact is this
I am in love with you
And I gave my heart to you
Listen to the melody of love
uu-uu-uu

If you wish
Just wipe me out
But dont drop me out
like the tears from your eyes
The zenith of my love
the intensity of my love
You can ask my sigh
(if you want to know)
It has touched the sky above
(such is the intensity of my love)

My heart's bumblebee is calling you
Listen to the melody of love
Listen to the melody of love
uu-uu-uu

On this beautiful descending steps
I wont give up and just sit like that
I will follow you like a shadow
You are with me today
My heart is echoing with desire
When my eyes met with yours
What a magic you have done !!
Listen to the melody of love

My heart's bumblebee is calling you
Listen to the melody of love
Listen to the melody of love
uu-uu-uu

This saree wrap of yours
this cloud of love
makes me descend to Earth again
Atleast, hold my hand now
Give me a look of intoxication
for the sake of this new journey
You are my Saqi, you see
Listen to the melody of love

My heart's bumblebee is calling you
Listen to the melody of love
Listen to the melody of love

uu-uu-uu...
read more " Hindi Melodies-Mohd Rafi-Dil ka bhanwar kare pukar.. "