'చెత్త లోకం ! చెత్త మనుషులు ! '

30, మార్చి 2017, గురువారం

GST Bill and 60 year cycle of Jupiter and Saturn

(Research article by D.Vamsi Krishna and Satya Narayana Sarma)

భారతీయ జ్యోతిష్యశాస్త్రంలో సంవత్సర గణనం 60 అంకెతో ముడిపడి ఉన్నది. అరవై సంవత్సరాలకూ పేర్లున్నాయి.పాతకాలంలో మన విద్యార్ధులు వీటిని కంఠతా పట్టేవారు. పేర్లు ఊరకే ఉబుసుపోక పెట్టిన పేర్లు కావు. వాటికి అర్ధాలున్నాయి. అర్దాల ప్రకారమే ఆయా సంవత్సరాలలో కొన్ని కొన్ని సంఘటనలు జరుగుతాయి. ఇది వాస్తవమే. అంతేగాక కొంతకాలం తర్వాత మళ్ళీమళ్ళీ వచ్చే కొన్ని గ్రహపరిస్తితుల ప్రకారమే మనిషి జీవితంలో సంఘటనలు జరుగుతాయి.


వ్యక్తిగత జీవితంలోనే గాక దేశంలో జరిగే స్థూల సంఘటనలకూ శనిగురువుల సంచారానికీ ఖచ్చితమైన సంబంధం ఉన్నది. సంబంధాన్ని ఋజువు చేసేదే పరిశోధనా వ్యాసం.లోకవ్యవహారం కోసం మనం పశ్చిమదేశాల కేలండర్ ను వాడుతున్నప్పటికీ, మన నిత్యజీవితంలో దిశానిర్దేశం కోసం మన పంచాంగాన్నే వాడుతూ ఉంటాం.ఇది అందరికీ తెలిసిన విషయమే.

కోణంలో, ఉగాది పరిస్థితులనూ 60 ఏళ్ళ క్రితం మన దేశంలో జరిగిన పరిస్థితులనూ ఒక్క సారి పోల్చి చూద్దాం. జ్యోతిష్యశాస్త్రం ఎంత నిజమో అప్పుడైనా అర్ధం చేసుకుందాం.

మన జ్యోతిష్యశాస్త్రంలో "గురువు - శని" రెండూ అతి పెద్ద గ్రహాలు. మనిషి జీవితం వీటి పరిధిలోనే నడిచి గడిచి ముగుస్తూ ఉంటుంది. 60 ఏళ్ళలో గురువు అయిదుసార్లు శని రెండుసార్లు ఖగోళాన్నీ రాశిచక్రాన్నీ చుట్టి వస్తారు. అందుకే 60 ఏళ్ళు గడిచాక షష్టిపూర్తి అనే వేడుక చేసుకునే సాంప్రదాయం మనకు వచ్చింది.

ఇప్పుడు 60 ఏళ్ళ క్రితం మన దేశంలో ఏం జరిగిందో చూద్దాం.

హేమలంబ సంవత్సరం 1957-58 ఉగాది గ్రహస్థితులు

31 March 1957  4:33 PM
వక్ర గురువు - కన్య
వక్ర శని - వృశ్చికం
సూర్య చంద్ర బుధ శుక్రులు - మీనం
కుజుడు - వృషభం
రాహువు -  తుల
కేతువు - మేషం

సంవత్సరంలో, మన పార్లమెంట్ కొన్ని ముఖ్యమైన ఆర్ధికచట్టాలను చేసింది. చట్టాలు నిన్నా మొన్నటి దాకా మన జీవితాలను శాసిస్తూనే ఉన్నాయి.

Wealth Tax Act 1957  
అనేది 01 April 1957  ప్రవేశపెట్టబడి 2016 వరకూ అమలులో ఉన్నది. 60 ఏళ్ల తర్వాత ఇది  2016 - 2017 నాటి కేంద్రబడ్జెట్ లో తీసివెయ్యబడింది.

Mines and Minerals (Development and Regulation) Act 1957
అనేది 28 Dec 1957 ప్రవేశ పెట్టబడింది. దీనికి రెండు ముఖ్యమైన సవరణలు సరిగ్గా 60 ఏళ్ళ తర్వాత 2015 & 16 లో చెయ్యబడ్డాయి.

1957 July - Sep 1957
లలో రామ్నాడ్ అల్లర్లు జరిగాయి.

Copyright Act of 1957
ప్రవేశ పెట్టబడింది.

కాశ్మీర్ ను తన స్వాధీనంలోకి తెచ్చుకుంటూ భారత పార్లమెంట్ శాసనం చేసింది.

ఇప్పుడు 2017 సంవత్సరపు ఉగాది నాటి గ్రహ సంచారాన్ని గమనిద్దాం.

వక్ర గురువు - కన్య
శని - ధనుస్సులో ( ప్రస్తుతం అతిచారం వల్ల కొంచం ముందుకు వెళ్ళాడు)
సూర్య చంద్ర వక్ర శుక్రులు - మీనం
కుజ బుధులు - మేషంలో
రాహువు సింహంలో 
కేతువు కుంభంలో

రాహు కేతువులు తప్ప మిగతా గ్రహాలు దాదాపుగా 60 ఏళ్ళ నాటి స్థితిలోనే ఉండటం గమనించవచ్చు.

ఈరోజున భారత పార్లమెంట్ ఇంకొక ఆర్ధిక బిల్లైన GST bill-2017 ను ప్రవేశపెట్టింది.ఇది మన ఆర్ధిక సంస్కరణలలో ఒక మైలురాయని చెప్పవచ్చు.జ్యోతిష్యశాస్త్రంలో ధనానికి గురువూ, ఖనిజాలకు శనీ కారకులని గుర్తుంటే ఈ చట్టాలు ఆయా సమయాలలోనే ఎందుకు చెయ్యబడ్డాయో తెలుస్తుంది. 


ఈ పరిశీలనవల్ల ఏమి అర్ధమౌతున్నది?

టైం సైకిల్స్ అనేవి ఉన్నాయనీ, గ్రహాల పరిభ్రమణం వల్ల మనిషి జీవితంలోని సంఘటనలు ఖచ్చితంగా జరుగుతాయనీ అర్ధం చేసుకోడానికి ఉదాహరణ చాలనుకుంటాను. అయితే - వ్యక్తిగతంగా ఒక్కొక్క మనిషి జీవితంలోనే కాకుండా, సామూహికంగా ఒక సమాజాన్నో ఒక దేశాన్నో ప్రభావితం చేసే సంఘటనలు కూడా గ్రహ ప్రభావాన్ని బట్టే జరుగుతాయి. విషయాన్నే ఇక్కడ మేం చెప్పదలుచుకున్నాం.

ఇదంతా చూచిన తర్వాత కూడా మన ప్రాచీన మహర్షుల మేధాసంపత్తికి చేతులు మోడ్చకుండా భారతీయుడైనా ఉండగలడా? ఇటువంటి మహత్తరమైన సైన్స్ ను మనకు అందించినందుకు వారికి జేజేలు అర్పించకుండా ఉండటం మనకు మనమే ద్రోహం చేసుకోవడం కాదూ?

ఏమంటారు?
read more " GST Bill and 60 year cycle of Jupiter and Saturn "

28, మార్చి 2017, మంగళవారం

ఎక్కడికి పోతున్నావీ చీకట్లో ? ఓ నేస్తం !!

ఎక్కడికి పోతున్నావీ చీకట్లో ? ఓ నేస్తం !
ఎందుకింత బాధ నీ గుండెల్లో? ఓ నేస్తం !!

దేనికోసం నీ యుగాల అన్వేషణ?
దేనికోసం  ఈ ఎడతెగని పరిశ్రమ?

నువ్వు వెదికే హృదయం
ఈలోకంలో ఉందంటావా?
నువ్వాశించే ప్రణయం
నీకసలు లభిస్తుందంటావా?

ఎక్కడికి పోతున్నావీ చీకట్లో ? ఓ నేస్తం !
ఎందుకింత బాధ నీ గుండెల్లో? ఓ నేస్తం !!

చీకటి నిండిన ఈ లోకంలో
ఆకలి దప్పుల పెనుమైకంలో
నువ్వు కోరే వెలుగు నీకు దొరికేనా?
నీ పయనం ఒక మలుపు తిరిగేనా?

ఎక్కడికి పోతున్నావీ చీకట్లో ? ఓ నేస్తం !
ఎందుకింత బాధ నీ గుండెల్లో? ఓ నేస్తం !!

పంకంతో నిండిన సరస్సులో
పద్మం కోసం వెదుకుతున్నావా?
స్వార్ధంతో కుళ్ళిన లోకంలో
ప్రేమకోసం తపిస్తున్నావా?

ఎక్కడికి పోతున్నావీ చీకట్లో ? ఓ నేస్తం !
ఎందుకింత బాధ నీ గుండెల్లో? ఓ నేస్తం !!

పెనుచీకటిలో దారి తెలీకున్నా
ధృవనక్షత్రం పైనే దృష్టి నిలిపి
అరికాళ్లను ముళ్ళు కోసేస్తున్నా
చిరునవ్వును పెదవులపై నిలిపి

ఎక్కడికి పోతున్నావీ చీకట్లో ? ఓ నేస్తం !
ఎందుకింత బాధ నీ గుండెల్లో? ఓ నేస్తం !!

నిరాశకే ఆశను నేర్పిస్తూ
విధాతకే వణుకును పుట్టిస్తూ
నీ రాతనే నువ్వు మార్చి వ్రాసుకుంటూ
వడపోతగా జ్ఞాపకాలను పేర్చుకుంటూ

ఎక్కడికి పోతున్నావీ చీకట్లో ? ఓ నేస్తం !
ఎందుకింత బాధ నీ గుండెల్లో? ఓ నేస్తం !!

ఉందో లేదో తెలియని
గమ్యాన్ని వెదుక్కుంటూ
ఎదురౌతుందో లేదో తెలియని
నేస్తాన్ని తలచుకుంటూ

ఎక్కడికి పోతున్నావీ చీకట్లో ? ఓ నేస్తం !
ఎందుకింత బాధ నీ గుండెల్లో? ఓ నేస్తం !!

కృంగుబాట్లకు చెదరకుండా
వెన్నుపోట్లకు వెరవకుండా
అలుపునెరుగని బాటసారివై
మొక్కవోవని ప్రేమఝరివై

ఎక్కడికి పోతున్నావీ చీకట్లో ? ఓ నేస్తం !
ఎందుకింత బాధ నీ గుండెల్లో? ఓ నేస్తం !!
read more " ఎక్కడికి పోతున్నావీ చీకట్లో ? ఓ నేస్తం !! "

27, మార్చి 2017, సోమవారం

రెండవ అమెరికా యాత్ర - ఇంటెన్సివ్ సాధన కోసం

అమెరికా వెళ్ళొచ్చి ఏడాది అవుతున్నది.అందుకని వచ్చే ఆదివారం రాత్రి మళ్ళీ అమెరికాకు ప్రయాణం అవుతున్నాము. ఈ సారి మూడునెలలు అక్కడ మకాం. మళ్ళీ జూలైలో ఇండియాకు తిరిగి వస్తాము.

'అమ్మో మూడునెలలా?ఒక్క పదిహేను రోజులకే మాకు ఏమీ తోచక బోరుకొట్టి చచ్చాం అక్కడ. మీకు టైం పాస్ ఎలా?' అడిగాడు ఒకాయన.

'టైం ఎందుకు పాస్ అవదు? నువ్వు ఊరకే కూచున్నా టైం పాస్ అవుతూనే ఉంటుంది.కూచునే విద్య నీకు తెలియాలి.' అన్నా నవ్వుతూ.

'అదికాదు.అక్కడ ఏమీ తోచదు. బయటకు వెళ్ళలేము. విసుగు పుడుతుంది.' అన్నాడు. 

'బయటకు ఎందుకు పోవాలి అసలు?' అడిగాను నవ్వుతూ.

వింతగా చూచాడు.

'నీకు పదిహేను రోజులకే బోరు కొట్టింది.నాకు మూణ్నెల్లు చాలదు. అదే మీకూ నాకూ తేడా' చెప్పాను నవ్వుతూ.

'అదేంటి? బాగా ఊళ్లు తిరుగుతారా? అప్పుడైతే బోరు ఉండదు. లాస్ వెగాస్ చూడండి బాగుంటుంది. ' అన్నాడాయన.

'లాసూ వద్దు ఏ గ్యాసూ వద్దు. ఏముందక్కడ సోది, భ్రష్టు పట్టడం తప్ప? ఎక్కడికీ తిరగను. కనీసం టీవీ కూడా చూడను.కానీ నాకేం బోరు కొట్టదు.' అన్నాను.

'ఎలా సాధ్యం?' అడిగాడు.

'నాతో వచ్చి ఉండు ఎలా సాధ్యమో తెలుస్తుంది. కాకుంటే నాతో జీవితం ఒక్కరోజుకే నీకు తట్టుకోలేని బోరు కొట్టేస్తుంది. పారిపోతావ్! ' అన్నాను నవ్వుతూ.

'ఏమి చేస్తారు మూడు నెలలు?' అన్నాడు.

'ఏమీ చెయ్యను. నాలో నేనుంటాను. ఇక బోరెక్కడుంటుంది?' అడిగాను.

'ఆ మాత్రం దానికి అమెరికా పోవడం ఎందుకు? ఇక్కడే మీ ఇంట్లోనే కూచోవచ్చుగా?' అడిగాడు చనువుగా.

'కూచోవచ్చు. కానీ ఇక్కడే ఉంటానంటే మూడునెలల పాటు నాకెవరూ లీవ్ ఇవ్వరు. అదే అమెరికాకైతే పెట్టుకోవచ్చు. ఇస్తారు కూడా. అందుకే లీవు పెట్టి అమెరికాకు పోతున్నా' అన్నాను.

'లాస్ట్ టైం బాగా ఊళ్లు తిరిగారా?' అడిగాడు.

'తిరగవలసినవి తిరిగాను. చూడవలసినవి చూచాను. అయినా నేను నీలా తిరుగుబోతును కాను.' అన్నా నవ్వుతూ.

'సరే. పనుంది వస్తా' అంటూ దణ్ణం పెట్టి వెళ్ళిపోయాడు.

చాలామంది ఇంతే. ఎక్కడెక్కడో తిరగాలని ఏవేవో చూడాలనీ అనుకుంటూ భ్రమల్లో బ్రతుకుతూ ఉంటారు. ఎంత తిరిగినా ఎన్ని చూచినా ఏముంది? ఎక్కడా ఏమీ లేదు. ఉన్నదంతా మనలోనే ఉంది.ఈ సత్యం బాగా అర్ధమైతే, ఇలాంటి పిచ్చి ఆలోచనలు ఉండవు. పోయిన సారీ ఇదే చెప్పాను. ఇప్పుడూ ఇదే చెబుతున్నాను.

మనిషి చెయ్యవలసిన పని అంతా నిజానికి లోలోపల ఉన్నది. దానిని సక్రమంగా చేస్తే చాలు.అప్పుడు బోరూ ఉండదు.ఏమీ ఉండదు.

ఈసారి అమెరికాలో గడపబోయే మూణ్ణెల్లలో నాకు చాలా పనులున్నాయి.

శ్రీవిద్యా రహస్యం ఇంగ్లీష్ బుక్ రిలీజ్ చెయ్యాలి. తారాస్తోత్రం ఈ-బుక్ రిలీజ్ చెయ్యాలి.లలితాసహస్రనామ భాష్యం తెలుగు+ఇంగ్లీషు పుస్తకాలు విడుదల చెయ్యాలి. ఇవి గాక 300 live charts Astro analysis పుస్తకం రెడీ చెయ్యాలి.ఇవి గాక ఇంకా కొన్ని పుస్తకాలు వ్రాయాలి.

పరాశక్తి ఆలయంలోనూ, కొన్ని స్పిరిట్యువల్ రిట్రీట్స్ లోనూ మళ్ళీ ఉపన్యాసాలు ఇవ్వాలి. పరాశక్తి ఆలయంలో అమ్మవారి సమక్షంలో కూచుని నా సాధనలు చేసుకోవాలి.

వీలు చిక్కితే గాంగెస్ ఆశ్రమం, చికాగో, టెక్సాస్, సెడోనాలను దర్శించాలి. అక్కడ శిష్యులతో స్పిరిట్యువల్ రిట్రీట్స్ చెయ్యాలి. గాంగెస్ లో మా ఆశ్రమం లాండ్ పనులు చూడాలి.

ఇవిగాక,నా రోజువారీ మంత్రధ్యాన సాధనా,మార్షల్ ఆర్ట్స్ అభ్యాసమూ, యోగాభ్యాసమూ,పాటలూ,జ్యోతిష్యపరిశ్రమా, నాతో నివసించే శిష్యులతో సంభాషణలూ, హోమియోపతీ ,అక్కల్టూ మొదలైనవన్నీ యధావిధిగా సాగుతూనే ఉంటాయి.ఈసారి ట్రిప్ లో క్లాసులు పెట్టి ఇవన్నీ నా శిష్యులకు నేర్పించబోతున్నాను. నా శిష్యులను ఈ విద్యలలో నా అంతవారిని చెయ్యడం నా లక్ష్యాలలో ఒకటి.

పోయినసారి మొదటి లెవల్ దీక్ష తీసుకున్న నా అమెరికా శిష్యులకు ఈ సారి రెండవ లెవల్ దీక్ష ఇవ్వబోతున్నాను.

అన్నింటినీ మించి, నేను ఎప్పటినుంచో వాయిదా వేసుకుంటూ వస్తున్న కొన్ని రహస్య తంత్రసాధనలను ఈసారి పూర్తి చెయ్యాలి. దానికి పూర్తి ఏకాంతవాసమూ కొన్ని ప్రత్యేక పరిస్థితులూ అవసరం అవుతాయి.ఈసారి మూడునెలలలో పైన చెప్పిన పనులన్నీ చేసుకుంటూ నా తంత్రసాధనలను తీవ్రస్థాయిలో చెయ్యబోతున్నాను.ఇవన్నీ చెబితే ఎవడికి అర్ధమౌతుంది? అందుకనే ఇవన్నీ చెప్పకుండా, మూడునెలలు ఏమాత్రం చాలదని సింపుల్ గా మా కొలీగ్ కి చెప్పాను.

పైగా - మనల్ని నిజంగా అభిమానించే వాళ్ళు ఎక్కడుంటే అదే మన ప్రపంచం అవుతుంది.నాకలాంటి వాళ్ళు అమెరికాలో చాలామంది ఉన్నారు.

ఒకే ఒక్క ముక్కలో చెప్పాలంటే, తపస్సు కోసం అమెరికాకు వెళుతున్నాను.నన్ను ప్రేమించే నా మనుషులకోసం అక్కడకు వెళుతున్నాను.బార్లూ క్యాసినోలూ చూడటం కోసం కాదు.అవి ఇక్కడా ఉన్నాయి. వాటి కోసమే అయితే అంత దూరం పోవలసిన పని లేనేలేదు.

పిచ్చిజనం, పిచ్చిప్రపంచం! ఎలా చెబితే వీళ్లకు అర్ధమౌతుందో?
read more " రెండవ అమెరికా యాత్ర - ఇంటెన్సివ్ సాధన కోసం "

26, మార్చి 2017, ఆదివారం

Bohu Door Theke E Kothaa - Kishore Kumar


బెంగాలీ పాటలు పాడి చాలా నెలలైంది. అందుకే ఈ పాట.

Bohu Door Theke E Kothaa Dite Laam Upohaar...

అంటూ కిషోర్ కుమార్ తన ఉచ్ఛ స్వరంలో ఆలపించిన ఈ మధురగీతం 1990 లో రిలీజైన Hirak Jayanti అనే బెంగాలీ సినిమాలోది. ఈ పాటకు గౌతమ్ బోస్ సంగీతాన్ని అందించగా, పులక్ బందోపాధ్యాయ సాహిత్యాన్ని అందించారు.

కిషోర్ బెంగాలీ వాడే గనుక ఈ పాటను సునాయాసంగా పాడేశాడు. నా స్వరంలో కూడా ఈ పాటను వినండి మరి.

Movie:--Hirak Jayanti (1990)
Lyrics:--Phulak Bandopaadhyay
Music:--Gowtam Bose
Singer:--Kishore Kumar
Karaoke Singer:--Satya Narayana Sarma
Enjoy
-----------------------------
Bohu door theke E kotha Dite laam Upohar

Bohu door theke E kotha Dite laam Upohar-2
Tooomee Je amaar - Ogo tumeee je amaar
Ahaa aaaha haaa

[Amar duchOkhe jaalo - tumi de nuthon alo]-2
Ye dike saakaay ami dekhi taay - tomake yi shudh bare baar
Bohu door theke E kotha Dite laam Upohar
Tooomee Je amaar - Ogo tumeee je amaar
Oho ho ho hoho

Amar maatir bhumee - shorg kore cho tumi -2
Bhore gyaalo mon - bhorlo jigon - chaayina thO kichu aaar
Bohu door theke E kotha Dite laam Upohar
Tooomee Je amaar - Ogo tumeee je amaar
Oho o ho hoho
Ehe aa ha aahaaa
Oho ho Ehe E E….

Meaning

After a long time, this word of yours, gave me lot of joy
You are mine...listen Oh dear....you are mine

To my two eyes, you are the new light
Where ever I look, you alone are seen
in every direction

My land of mud
you have turned into heaven
My mind is filled with joy
I wont ask you anything more
This joy is enough

After a long time, this word of yours, gave me lot of joy
You are mine...listen Oh dear....you are mine.....

తెలుగు స్వేచ్చానువాదం

చాలా కాలం తర్వాత నీ మాట
ఎంతో ఆనందాన్నిచ్చింది
నువ్వు నాదానివి....విను ప్రియతమా
నువ్వు నా దానివి

నా రెండు కన్నులకు
నువ్వే క్రొత్త వెలుగువు
నేనెటు చూచినా నువ్వే కనిపిస్తున్నావు

ఈ మట్టి భూమిని నువ్వు స్వర్గంగా మార్చావు
నా మనస్సును సంతోషంతో నింపావు
ఈ సంతోషం నాకు చాలు
ఇంకేమీ నీనుంచి ఆశించను

చాలా కాలం తర్వాత నీ మాట
ఎంతో ఆనందాన్నిచ్చింది
నువ్వు నాదానివి....విను ప్రియతమా
నువ్వు నా దానివి.....
read more " Bohu Door Theke E Kothaa - Kishore Kumar "

Nammoora Mandara Hoove - SP.Balasubramanyam


నమ్మూర మందార హూవే..
అంటూ బాలసుబ్రమణ్యం మధురంగా ఆలపించిన ఈ గీతం 1981 లో వచ్చిన "ఆలమనే" అనే కన్నడ సినిమాలోది. ఆ టైంలో బాలూగారు పాడిన పాటలు చాలావరకూ వినడానికి బాగుండేవి. వాటిల్లో ఇదీ ఒకటి.

దీనిని అక్కడక్కడా కొంచం మార్చి పాడాను. నా స్వరంలో కూడా ఈ పాటను వినండి మరి.

Movie:--Alemane (1981)
Lyrics:--Dodda Range Gowda
Music:--Aswath - Vaidyanathan
Singer:--S.P.Balasubramanyam
Karaoke Singer:--Satya Narayana Sarma
Enjoy
---------------------------------------------
[నమ్మూర మందార హూవే
నన్నొలుమే బాందళదా చెలువే
బళిబందు బాళన్ను బెళగు
నన్న బరిదాద మనదల్లి మినుగూ]-2
నమ్మూర మందార హూవే

[కణ్ణల్లె కరెదు హొంగనస తెరెదు
సంగాతి సంప్రీతి సెళెదే
అనురాగ హొళెదు అనుబంధ బెళెదు
సమ్మోహ సంబంధ మిడిదే]-2
మూదిదా ప్రేమదా సొగసాద కారంజి బిరిదే - సొగసాద కారంజి బిరిదే
నమ్మూర మందార హూవే
నన్నొలుమే బాందళదా చెలువే
బళిబందు బాళన్ను బెళగు
నన్న బరిదాద మనదల్లి మినుగూ
నమ్మూర మందార హూవే

ఒడలాళ మొరెదు ఒడనాట మెరెదు
ఒడనాడి బాంధవ్య కండే
రుతుమాన మీరి హొసగాన తోరి
హితవాద మాధుర్య మిందే
తీరదా మోహదా ఇనిదాద ఆనంద తందే - ఇనిదాద ఆనంద తందే
[నమ్మూర మందార హూవే
నన్నొలుమే బాందళదా చెలువే
బళిబందు బాళన్ను బెళగు
నన్న బరిదాద మనదల్లి మినుగూ]-2
నమ్మూర మందార హూవే - 2
read more " Nammoora Mandara Hoove - SP.Balasubramanyam "

25, మార్చి 2017, శనివారం

Trouble in Uttar Pradesh in 2018-20 ?? - A research

(Astro research by Vamsi Krishna & Satya Narayana Sarma)

జ్యోతిష్య శాస్త్రంలో ఒక నియమం ఉన్నది. అదేమంటే, ఎప్పుడైతే శని, గురు, కేతువుల మధ్యన సంబంధం ఏర్పడుతుందో అప్పుడు దేశంలో గొడవలు, కొట్లాటలు, మతకలహాలు జరిగాయి. ఈ సంబంధం అనేది స్క్వేర్, ట్రైన్, కన్జక్షన్, అపోజిషన్ మొదలైన దృష్టుల పరంగానూ,లేదా ఇతర నాడీ జ్యోతిష్య సూత్రాల పరంగానూ కావచ్చు.

గతంలో గోద్రా అల్లర్లు జరిగినప్పుడు గానీ, ఇంకా ముందు అయోధ్య రామమందిరం గొడవ జరిగినప్పుడు గానీ ఈ గ్రహయోగాలు ఖచ్చితంగా కనిపించాయి.

ఇప్పుడు మళ్ళీ 2018-2020 మధ్యలో ఇవే కేతు-శని-గురు గ్రహాల మధ్యన ఇవే యోగాలు కనిపిస్తున్నాయి. కనుక మళ్ళీ ఏవో గొడవలు జరుగుతాయని ముందుగానే ఊహించగలుగుతున్నాము.

ఇప్పటికే మళ్ళీ రామజన్మభూమి వ్యవహారం తెరమీదకు వచ్చింది. ఇరుపక్షాలనూ కోర్టు బయట విషయాన్ని సామరస్య పూర్వకంగా పరిష్కరించుకొమ్మని సుప్రీం కోర్ట్ తేల్చి చెప్పింది. ఇది చాలదన్నట్లు ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి ఆదిత్యనాద్ జాతకంలో త్వరంలో కేతుమహాదశ మొదలు కాబోతున్నది.

ఈ విషయంపైన ఏదైనా చెప్పేముందు, గతంలో ఏం జరిగిందో ఒక్కసారి గమనిద్దాం.

అయోధ్య మత కలహాలు

---------------------------

06 Dec 1992


ఆ సమయంలో కేతు శనులిద్దరూ దక్షిణ దిక్కులోనే భూతత్వ రాశులలోనే ఉన్నారు.ఈ యోగం ఏర్పడిన ప్రతిసారీ మతకలహాలు జరిగాయని చరిత్ర చెబుతున్నది. గురువు కన్యలో దక్షిణ దిక్కులో ఉంటూ ఈ యోగాన్ని సపోర్ట్ చెయ్యడం వల్ల మతపరమైన గొడవలు మరణాలు జరిగాయి.గోధ్రా అల్లర్లు
--------------
27 Feb 2002


 

ఆ సమయంలో శని భూతత్వరాశిలో ఉన్నాడు.వక్ర గురువు మిధునం నుంచి ధనుస్సులో ఉన్న కేతువును వీక్షిస్తున్నాడు. గురువు వృషభంలోకి వచ్చి శనితో కలుస్తున్నాడు.ఇందువల్ల అల్లర్లలో అనేకమంది చనిపోవడం జరిగింది. కేతువు గురువుగారి ఇంట్లో ఉంటూ మతపరమైన అల్లర్లను సూచిస్తున్నాడు.

ఈ గొడవలు 27 Feb 2002 న మొదలై May 2002 లో వక్ర గురువు మళ్ళీ డైరెక్ట్ అయ్యేవరకూ జరిగాయి.

గతంలో జరిగిన ఈ గ్రహయోగాలను బట్టి మళ్ళీ అతి దగ్గరలో ఇవే యోగాలు ఉండటాన్ని బట్టి, మళ్ళీ ఉత్తరప్రదేశ్ లో హింసాకాండ ఖచ్చితంగా జరుగుతుందని మేము ఊహిస్తున్నాము.ఏయే సమయాలలో ఇది జరుగవచ్చో స్థూలంగా ఇక్కడ చెప్పబడుతున్నది. ఆయా సంఘటనలు జరుగబోయే కొద్ది ముందుగా మళ్ళీ స్పష్టంగా చెప్పబడుతుంది.

>>March-2018
>>March-2019
>>November 2019-April 2020.

యోగి ఆదిత్యనాద్ ఈ అల్లర్లను చాలా జాగ్రత్తగా డీల్ చెయ్యవలసి ఉంటుంది.ముందునుంచే ఎంతో ప్లానింగ్ దీనికి అవసరం అవుతుంది. తస్మాత్ జాగ్రత్త !!
read more " Trouble in Uttar Pradesh in 2018-20 ?? - A research "