నిత్యజీవితంలో ప్రతిఫలించని జ్ఞానం నిరర్ధకం

30, ఏప్రిల్ 2015, గురువారం

Telugu Melodies-Satya-Ninne talachi talachi..



ఒక మంచి రాగం నాకు నచ్చితే దానికి లిరిక్స్ వ్రాసుకోవడం నా అలవాటు.ఆ క్రమంలో అసలు పాట భావాన్ని మార్చి నాకు నచ్చినట్లుగా వ్రాస్తూ ఉంటాను.

ఈ పాట కూడా అలాంటిదే.సి హెచ్ ఆత్మా పాడిన 'కేహనే కో బహుత్ కుచ్ థా' పాట రాగానికి నేను వ్రాసి పాడిన పాట ఇది.

ప్రియురాలికోసం ఎదురుచూడటం ఈ పాటలో పైపైన కనిపించే భావం.దైవాన్ని చేరుకోవడం కోసం పడే తపన అంతర్లీన భావం.ఈరోజు మధ్యాన్నం పదే పది నిముషాలలో ఈ పాట వచ్చేసింది.వెంటనే పాడటం జరిగింది.

'ఒకరోజు నిన్ను చేరుటకై--శిలనై నిలిచానే..." అనే పాదంలో, జీవితానుభవాలనూ కష్టాలనూ రాయిలా సహిస్తూ ఒకనాటికి నీ ఒడిలోకి చేరడంకోసం ఎదురుచూస్తూ జీవయాత్ర సాగిస్తున్నాననే మాటను దైవంతో చెబుతున్నట్లు భావిస్తూ వ్రాయడం జరిగింది.

మొన్న మా పల్లెటూరికి వెళ్ళినపుడు అక్కడ చెరువుగట్టుమీద మర్రిచెట్టు కింద తీసిన ఫోటో ఇది.నా చిన్నప్పుడు ఈ చెరువుగట్టుమీదే ఈ చెట్టుకిందే చాలాసేపు ఒక్కడినే కూర్చుని ఉండేవాడిని.సరిగ్గా 39 ఏళ్ళక్రితం మొదటిసారిగా నాకు ధ్యానానుభవాలు కలిగిన చోటు ఇదే.ఈ చెట్టుక్రిందే ఇలాంటి భావాలు నాకు తరచుగా అప్పట్లో కలిగేవి.

Song:--Ninne talachi talachi
Original song:--Kehne ko bahuth kuch tha by Ch.Atma.
Lyrics and Singing:--Satya Narayana Sarma

Enjoy
--------------------------------------
నిన్నే తలచి తలచి -ఈ రేయి బరువాయే-2
నీ కొరకై వేచివేచి - నా నిదురే కరువాయే
నిన్నే తలచి తలచి -ఈ రేయి బరువాయే

ఏనాటిదో ఈ హృదయమునే- నీ ముంగిట పరచానే
నీ ప్రేమకే నే బానిసనై - నీ వాకిట నిలిచానే
ఆనాటి వలపు దారులలో-- నీకై వేచానే...
నిన్నే తలచి తలచి - ఈ రేయి బరువాయే

ఉన్మాదినై నీ మోహములో - ప్రతిరేయి గడపేనే
నీ రూపమే నా ధ్యానముగా- మదిలోన తలచేనే
ఒకరోజు నిన్ను చేరుటకై-శిలనై నిలిచానే...
నిన్నే తలచి తలచి -ఈ రేయి బరువాయే

నీ కొరకై వేచివేచి - నా నిదురే కరువాయే
నిన్నే తలచి తలచి -ఈ రేయి బరువాయే...
read more " Telugu Melodies-Satya-Ninne talachi talachi.. "

29, ఏప్రిల్ 2015, బుధవారం

Hindi Melodies-Mohd.Rafi-Teri Aakhon Ke Siva..



Teri Aakhon Ke Siva Duniya me rakha kya hai..

తేరీ ఆఖోం కే శివా దునియా మే రఖా క్యా హై...

ఇది మహమ్మద్ రఫీ స్వరంలో ప్రతిధ్వనించిన ఇంకొక మధురగీతం. ఇది ఇంకొక timeless classic melody.

మజ్రూ సుల్తాన్ పురి రచనలో ఎన్నో ఆణిముత్యాల్లాంటి గీతాలున్నాయి.వాటికి మహామహులు సంగీత దర్శకత్వం వహించారు. వారిలో మదన్ మోహన్ ఒకరు.మధురమైన స్వరాలను కూర్చడంలో ఈయన సిద్ధహస్తుడు.ఈ పాట ఎంత మధురమైనదంటే ఇప్పటికీ దీనిని ఎందఱో సంగీత ప్రియులు,మెలోడీ లవర్స్ పాడుకుంటూ ఉంటారు.

ప్రియురాలి కళ్ళను వర్ణిస్తూ సాగే ఇలాంటి భావగీతాలను వ్రాయాలంటే కూడా ఎంతో భావుకత కవియొక్క మనసులో ఉండాలి.వీటిని పాడాలన్నా,విని ఆస్వాదించాలన్నా కూడా ఎంతో భావుకత ఉంటే తప్ప కుదరదు. అలాంటి మధురగీతం ఇది.

Movie:--Chirag(1969)
Lyrics:--Majrooh Sultanpuri
Music:--Madan Mohan
Singer:--Mohammad Rafi
Karaoke Singer:--Satya Narayana Sarma

Enjoy
-------------------------------------------------

Teri aankhon ke siva duniya me rakha kya hai-2
Ye uthe subaha chaley, ye jhukhe shaam dhale,
Mera jeena mera marna inhi palkonke thaley, 
Teri aankhon ke siva duniya me rakha kya hai 

Palkonke galiyon me chehre bahaaron ke hasthe hue
Hai mere khabonke kya kya nagar in mein basthey hue 
ooo...
Palkonke galiyon me chehre bahaaron ke hasthe hue 
Ye uthe subaha chaley, ye jhukhe shaam dhale, 
Mera jeena mera marna inhi palkonke thaley, 
Teri aankhon ke siva duniya me rakha kya hai 

Inme mere aanewaley zamaane ki tasveer hai 
Chahat ke kaajal se likhee hui meri taqdeer hai 
Ooo... 
Inme mere aanewaley zamaane ki tasveer hai 
Ye uthe subaha chaley, ye jhukhe shaam dhale, 
Mera jeena mera marna inhi palkonke thaley, 
Teri aankhon ke siva duniya me rakha kya hai 
Teri aankhon ke siva duniya me rakha kya hai 

Meaning:--

Apart from your lovely eyes
What else is there in this world(worth craving for)?
When they look up, the dawn rises
when they close, darkness descends
My life and death happen
on the banks of your eyelashes
Apart from your lovely eyes
What else is there in this world?
(worth craving for)

In the paths of your eyes
lie the faces of laughter
and happiness of spring
All my dream lands are here in your eyes
In the paths of your eyes
lie the faces of laughter
and happiness of spring
When they look up, the dawn rises
when they close, darkness descends
My life and death happen
on the banks of your eyelids
Apart from your lovely eyes
What else is there in this world
(worth craving for)?

In your eyes reside the image of my future
With Love's Kajal is my destiny written
In your eyes reside the image of my future
When they look up, the dawn rises
when they close, darkness descends
My life and death happen
on the banks of your eyelashes
Apart from your lovely eyes
What else is there in this world
(worth craving for)?
When they look up, the dawn rises
when they close, darkness descends
My life and death happen
on the banks of your eyelashes


Apart from your lovely eyes
What else is there in this world
(worth craving for)?
read more " Hindi Melodies-Mohd.Rafi-Teri Aakhon Ke Siva.. "

28, ఏప్రిల్ 2015, మంగళవారం

Hindi Melodies-Ch.Atma-Kehne Ko Bahuth Kuch Thaa...



                                                    
కెహనె కో బహుత్ కుచ్ థా మగర్ కెహె నహి పాయే...

చంద్రు ఆత్మా మధురస్వరంలోనుంచి ఉద్భవించిన సుమధురమైన ఘజల్ గీతం ఇది.రాగంలోనూ అర్ధంలోనూ ఇదొక అత్యద్భుతమైన గీతం.

చంద్రు ఆత్మా,ఎంతగా కే.ఎల్.సైగల్ తో మమేకం అయిపోయాడంటే,ఆయన సైగల్ కు మరో ఆత్మగా మిగిలిపోయాడు. వీరిద్దరూ చాలా తక్కువ స్థాయిలో పాడగలరు.దాదాపు ఒకటి,అర శృతిలో పాడటంకూడా వీరికి వీలవుతుంది. ఇది చాలా కష్టమైన ప్రక్రియ.

ఇది 1945-50 ప్రాంతాలనాటి ఒక మరపురాని మధురమైన ఘజల్.
వినండి.

Song:-Kehne Ko Bahut Kuch Tha..
Singer:--Ch.Atma
Karaoke Singer:--Satya Narayana Sarma

Enjoy
-------------------------------------------------
Kehne ko bahut kuch tha, magar keh nahin paaye -2
Phir socha ke khamosh rahe, reh nahin paaye
Kehne ko bahut kuch tha, magar keh nahin paaye

Samjha na mera gham koi, is baat ka gham hai
Phir bhi mere dil tujhko wafaaon ki kasam hai
Aankhon mein ho aansoon bhi, magar beh nahin paaye
Kehne ko bahut kuch tha, magar keh nahin paaye

Phoolon ke chaman, aasmaan taaron se bhara hai
Umeed ka daaman mera haaron se bhara hai
Kismat ne sitam aise kiye, seh nahin paaye

Kehne ko bahut kuch tha, magar keh nahin paaye
Phir socha ke khamosh rahe, reh nahin paaye
Kehne ko bahut kuch tha, magar keh nahin paaye

Meaning:--

There was but very little to say,
that too I could not say,,
Then I thought it is better to be silent
but, I could not remain so either...

Nobody understood my pain as it was...
(not even you)
even then,my heart remained
faithful to your love
There were tears in my eyes,
but I could not weep
There was but very little to say...
that too I could not say... 

The flowers of my garden
are filled with stars from heaven
The garland of my desires
is studded with failures
Fate has so crushed me
that it is almost unbearable
There was but very little to say..
that too I could not say...

Then I thought it is better to be silent
But I could not remain so either...
There was but very little to say..
that too I could not say...

తెలుగు స్వేచ్చానువాదం

చెప్పడానికి పెద్దగా లేదు
కానీ ఆ మాత్రం కూడా చెప్పలేకపోయాను
మౌనంగా ఉండి ఉంటే బాగుండేది
కానీ అలాకూడా ఉండలేకపోయాను

నా వేదనను ఎవరూ అర్ధం చేసుకోలేదు
(కనీసం నువ్వుకూడా)
అయినా నా హృదయం
నీ ప్రేమకు బందీగానే మిగిలిపోయింది
నా కన్నులలో నీరు నిండుగా ఉంది
కానీ అవి వర్షించలేకపోయాయి
చెప్పడానికి పెద్దగా లేదు
కానీ ఆమాత్రం కూడా చెప్పలేకపోయాను

నా పూదోట లోని పూలన్నీ
నింగి చుక్కలతో నిండాయి
నా ఆకాంక్షలన్నీ
అపజయాలతో నలిగిపోయాయి
విధి నన్ను క్రూరంగా అణచివేసింది

చెప్పడానికి పెద్దగా లేదు
కానీ ఆమాత్రం కూడా చెప్పలేకపోయాను
మౌనంగా ఉండి ఉంటే బాగుండేది
కానీ అలాకూడా ఉండలేకపోయాను

చెప్పడానికి పెద్దగా లేదు
కానీ ఆమాత్రం కూడా చెప్పలేకపోయాను...
read more " Hindi Melodies-Ch.Atma-Kehne Ko Bahuth Kuch Thaa... "

27, ఏప్రిల్ 2015, సోమవారం

Kazi Nazrul Islam జాతకం పరిశీలన-2

ఒక మనిషి జీవితంలోని దశా వివరాలను పరిశీలించడం ద్వారా గ్రహస్వభావాలనూ అవి మానవజీవితాన్ని ఎలా ప్రభావితం గావిస్తాయన్న విషయాలనూ మనం తెలుసుకోవచ్చు.నజరుల్ జీవితంలో దశలు ఎలా పనిచేశాయో గమనిద్దాం.

ఈయన విశాఖా నక్షత్రం -2 పాదంలో జన్మించాడు.విశాఖ రెండోపాదం అంటే అది వృషభ నవాంశ అవుతుంది.కనుక శుక్ర లక్షణాలైన కళలు సాహిత్యం నటన పాటలు రాగాలు ఇత్యాది ఈయన జీవితంలో ప్రముఖ పాత్ర వహిస్తాయి.అలాగే జరగడాన్ని మనం గమనించవచ్చు.నక్షత్రపాదాల ప్రభావం మనిషి జీవితాన్ని ఎలా శాసిస్తుందో అనడానికి ఇదే ఒక ప్రబలమైన ఉదాహరణ.

జననసమయంలో గురుమహర్దశ సగం అయిపోయి ఉన్నది.ఈయన గురు/శుక్ర/శుక్ర దశ జరుగుతున్న సమయంలో భూమిమీదకు వచ్చాడు.అందుకే జీవితమంతా ఆధ్యాత్మిక,సాహిత్య,కళారంగాలలో తపించాడు.జనన సమయం లో జరుగుతున్న దశలు ఈవిధంగా మనిషి జీవితాన్ని మొత్తాన్నీ శాసిస్తాయి.

ఈయన జాతకంలో గురుదశ(1907) వరకూ,శనిదశ(1926)వరకూ జరిగాయి.ఈ రెండు దశలు ఆయన జీవితానికి ఒక దిశను సమకూర్చాయి. శనిచంద్రుల కలయికవల్ల ఈ సమయంలో ఆయనకు విశాలమైన ఉదారమైన ఆధ్యాత్మిక భావాల పునాదులు పడ్డాయి.మనిషి జీవితంలోని కష్టాలను కూడా ఆయన అప్పుడే చవిచూచాడు.ఇది శనీశ్వరుని కారకత్వ ప్రభావమే. జీవితంలో కష్టాలను చూడని మనిషి ఆధ్యాత్మికంగా ఎదగడం అసాధ్యం.

1917 లో చదువు మానేసి బ్రిటిష్ సైన్యంలో చేరాడు.ఆ సమయంలో శని/శుక్ర దశ జరిగింది.చంద్ర లగ్నాత్ శనిశుక్రులిద్దరూ ఈయనకు మంచివారే.కనుక కాళిదాసు సూత్రం ప్రకారం చదువును మధ్యలో మాన్పించి సైన్యంలో చేర్పించారు.లగ్నాత్ బుధుడు పాపి.పైగా చతుర్దంలో వక్ర గురువున్నాడు.కనుక చదువు చెడిపోయింది.సైన్యంలో ఉంటూ విప్లవ కవిత్వం వ్రాస్తూ ఉంటె ఏ ప్రభుత్వం ఊరుకుంటుంది?అందుకని 1920 లో సైన్యాన్ని విడచిపెట్టి కలకత్తాకు చేరాడు.వక్రగ్రహ దశ జరిగే సమయంలో జీవితంలో అనేక మార్పులు చోటు చేసుకుంటాయన్న సూత్రం ఇక్కడ అక్షరాలా పనిచెయ్యడం గమనించవచ్చు.

18-6-1921 న ఈయన జీవితంలో ఒక ముఖ్య సంఘటన నరిగింది. ఈయనకు నర్గీస్ అనే యువతితో నిశ్చితార్ధం అయింది.కానీ ఆ రోజున పెళ్ళిపెద్దలు ఒక షరతు విధించారు.వివాహం తర్వాత తను దౌలత్ పూర్లో శాశ్వతంగా ఉండిపోవాలి.ఆ షరతు నజరుల్ కు ఇష్టం లేదు.అందుకని ఆ వివాహాన్ని తిరస్కరించి బయటకు వచ్చేశాడు.ఆ రోజున ఆయన జీవితంలో శని/రాహు/గురు దశ జరుగుతున్నది.శని రాహువులు శపిత యోగం.రాహు గురువులు చండాలయోగం.కనుకే పీటలమీద పెళ్లి ఆగిపోయింది.ఆ విధంగా ఆ పెళ్లి బ్రేక్ అయిపోయింది.

ఆ తర్వాత కొద్ది కాలానికే 1922 లో ఆయన వ్రాసిన 'బిద్రోహీ' అనే కవిత ఆయనకు చిరకాలం నిలిచి ఉండే పేరును తెచ్చి పెట్టింది.ఆ సమయంలో ఏ దశ జరిగిందో గమనిస్తే విచిత్రం కలుగుతుంది.అది శని/రాహు/శనిదశ. అలాంటి శపితదశలో అలాంటి విప్లవ తిరుగుబాటు కవిత్వమే మనిషి వ్రాయగలడు.పేరును తెచ్చేదీ అదే.అలాగే ఖచ్చితంగా జరిగింది.అయితే ఈయన వ్రాసిన కవితలన్నీ బ్రిటిష్ ప్రభుత్వం చేత నిషేధించబడ్డాయి.రాజద్రోహ నేరం క్రింద ఈయన జైల్లో కూడా పెట్టబడ్డాడు.ఇది కూడా శని/రాహువుల (శపితయోగ)ప్రభావమే.

25-4-1924 న ఈయన ప్రమీలాదేవి అనబడే బ్రహ్మసమాజ సభ్యురాలిని ప్రేమవివాహం చేసుకున్నాడు.ఆ సమయంలో తనకు శని/గురు/శనిదశ జరిగింది.శని పంచమంలో ఉండటమూ,చంద్రలగ్నాత్ మళ్ళీ పంచమాదిపతి కావడమూ,గురుచంద్రులయోగం చతుర్దంలో ఉండటమూ చూస్తే ప్రేమవివాహం కనిపిస్తూనే ఉన్నది.అదే ఆ సమయంలో జరిగింది.

పంచమంలో ఉన్న అష్టమాదిపతి శనివల్ల ఏమి జరుగుతుంది? సంతానానికి గండాలుంటాయి.వారు అల్పాయుష్కులౌతారు.అదే జరిగింది.ఈయన మొదటి కుమారుడు కృష్ణమొహమ్మద్ చిన్నప్పుడే చనిపోయాడు.రెండవ కుమారుడు బుల్బుల్ కూడా అమ్మవారు పోసి చిన్నప్పుడే చనిపోయాడు. తర్వాత సంతానం సవ్యసాచి,అనిరుద్ద్ ఇద్దరూ బ్రతికారు.వీరిలో అనిరుద్ద్ మంచి గిటారిస్ట్ గా ఎదిగాడు.కానీ ఈయన కంటే రెండేళ్ళు ముందే ఈయన కళ్ళముందే చనిపోయాడు.పంచమంలోని వక్రశని వల్ల జరిగే విలయం ఇలా ఉంటుంది మరి.

1936 లో 'విద్యాపతి' అనే సినిమాకు సంగీత దర్శకునిగా పనిచేశాడు.ఆ సమయంలో బుధ/రాహుదశ నడిచింది.తమ సహజ కారకత్వాలను బట్టి యధావిధిగా రాహు బుధులు ఈయనను సినిమా రంగంలోకి తీసుకెళ్ళారు. బుధుడు శుక్రునితో కలసి దశమంలో ఉండటం చూడవచ్చు.

1939 ప్రాంతాలలో బుధ/గురుదశలో కలకత్తా రేడియోలో పనిచేశాడు.ఆ సమయంలో అనేక సాంప్రదాయ రాగాలపైన పరిశోధన చేశాడు.గురువు యొక్క సాంప్రదాయ కారకత్వమూ ఆయనపైన గల శుక్రబుధుల దృష్టీ ఇలా పనిచేశాయి.

1939 లో బుధ/గురు/కేతుదశలో భార్యకు పక్షవాతం వచ్చింది.సప్తమం నుంచి బుధుడు,కేతువులిద్దరూ రోగాన్ని సూచిస్తారు.గురువు మంచివాడు కాదు.కనుక భార్యకు బుధకారకత్వాలలో ఒకటైన పక్షవాతం వచ్చింది.

1941 లో ఈయనే సీరియస్ రోగం బారినపడ్డాడు.మెదడు నరాలకూ, జ్ఞాపకశక్తికీ కూడా బుదుడే కారకుడు.ఆ సమయంలో బుధ/శని/శుక్రదశ జరిగింది.కర్కాటక లగ్నానికి ఈ ముగ్గురూ పాపులే.శని దీర్ఘరోగానికి సూచకుడు.శుక్రుడు బాధకుడు.బుధుడు పాపి.కనుక జీవితాంతం బాధించిన రోగం ఈ సమయంలోనే ఆయన్ను ఎటాక్ చేసింది.

30-6-1962 న శుక్ర/గురు/చంద్ర దశలో ఈయన భార్య మరణించింది. దారాకారకుడైన గురుని వక్రస్థానం కన్యనుంచి గమనిస్తే,శుక్రుడు అష్టమంలో ఉంటూ మరణాన్ని సూచిస్తున్నాడు.గురు చంద్రులిద్దరూ ద్వితీయ మారక స్థానంలో ఉన్నారు.ఇంకేం కావాలి?

1974 లో రవి/బుధదశలో చిన్నకుమారుడు అనిరుద్ద్ మరణించాడు. పంచమం నుంచి చూస్తే రవి సప్తమ మారకస్తానంలోనూ బుధుడు రోగస్థానంలో మారకుడైన శుక్రునితో కలసి ఉండటం చూడవచ్చు.

29-8-1976 న చంద్ర/చంద్ర/గురుదశలో నజరుల్ మరణించాడు.ఆ సమయంలో గజకేసరీయోగ దశ జరిగింది.కనుక ఆయన కర్మ మొత్తం ప్రక్షాళన చేసుకుని ఉత్తమమైన మరణాన్ని పొందాడని మనం చెప్పవచ్చు. ఆయన ఆత్మ ఉత్తమలోకాలకు చేరుకుని ఉంటుంది. మరుజన్మలో ఈ లౌకిక బాదరబందీలేని ఒక ఉత్తముడైన యోగిగా ఆయన జన్మించాడని మనం ఊహించవచ్చు.ఫోటోలోని ఆయన కళ్ళను గమనిస్తే అవి యోగినేత్రాలన్న విషయం మనం స్పష్టంగా చూడవచ్చు.

అదే నిజం కూడా.

(సమాప్తం)
read more " Kazi Nazrul Islam జాతకం పరిశీలన-2 "

26, ఏప్రిల్ 2015, ఆదివారం

నేపాల్ భూకంపం-రోహిణీ శకట ప్రభావమే

శనీశ్వరుడు రోహిణీ నక్షత్రదృష్టికి దగ్గరౌతున్న కొద్దీ ప్రపంచవ్యాప్తంగా విలయాలు జరగడం మొదలౌతున్నది.నిన్న నేపాల్లో జరిగిన భూకంపం దీని ప్రభావమే. రోహిణీ శకటభేదనం అనే శీర్షికలో స్టాటిస్టికల్ ఆధారాలతో సహా వివరంగా వ్రాసిన పోస్ట్ లలో ఇలాంటి ప్రకృతి విలయాలు జరుగుతాయని ముందే హెచ్చరించడం జరిగింది.

ఇప్పుడొచ్చిన ఈ భూకంపానికి కారణం మొన్న వచ్చిన సంపూర్ణ చంద్రగ్రహణం కూడా.ఆ చంద్రగ్రహణం భూతత్వరాశియైన కన్యలో సంభవించిందని ఇక్కడ గుర్తుంచుకోవాలి.అంతేగాక చంద్రగ్రహణం వచ్చిన రోజుకూడా శనివారమే. ఈ భూకంపం వచ్చింది కూడా శనివారమే.

ఏ ఏ దేశాలలో అయితే ఈ గ్రహణాలు పూర్తిగా కనిపిస్తాయో ఆయా చోట్ల భూ అయస్కాంత క్షేత్రాలలో మార్పులు రావడమూ తద్వారా ప్రకృతి భీభత్సాలు జరగడమూ మామూలే. గ్రహణాలకూ, గ్రహచారాలకూ, భూమిపైన విలయాలకూ గల ఈ సూక్ష్మ సంబంధాలను ప్రాచీనకాలంలోనే గుర్తించడం జరిగింది.

ఈ గ్రహణం మన దేశంలోని ఈశాన్యరాష్ట్రాలలో సంపూర్ణంగా కనిపించింది. ఇప్పుడు భూకంపం వచ్చిన ప్రాంతాలు కూడా కలకత్తా నుంచి నేపాల్ వరకూ ఉన్నాయి.ఈ విషయం గమనార్హం.

మొన్న శుక్రవారం నాడు సూర్యశనులు ఖచ్చితమైన షష్టాష్టక దృష్టిలోకి వచ్చి ఉన్నారు. మర్నాడే ఈ విలయం జరిగింది.

రోహిణీ శకటభేదనం జరిగే ప్రతిసారీ భారీ జననష్టం జరగడం తప్పనిసరి. ప్రస్తుత భూకంపం కూడా ముందుముందు రాబోతున్న ఇంకా భారీ విలయాలకు సూచిక మాత్రమే.

శనిగ్రహ సప్తమదృష్టి ఎంత భయంకరమైనదో వివరిస్తూ నేటికి సరిగ్గా ఆర్నెల్ల ముందు సెప్టెంబర్ -2014 లో వ్రాసిన పోస్ట్ ను ఇక్కడ చదవండి.భారత్, నేపాల్ లలో భూకంపం ఎందుకొచ్చింది అన్న విషయం క్లియర్ గా అర్ధమౌతుంది. 
read more " నేపాల్ భూకంపం-రోహిణీ శకట ప్రభావమే "

23, ఏప్రిల్ 2015, గురువారం

Kazi Nazrul Islam జాతకం-ఒక పరిశీలన

మనుషులంతా ఒక్కటే అని ఎవరన్నారో గాని అది శుద్ధ తప్పుమాట.పూర్తి అజ్ఞానంతో అనబడిన మాట.ఈ మాటను నేనెప్పుడూ నమ్మను.నేనేకాదు ఈ మాటను అనే సోషలిస్టులుగాని కమ్యూనిస్టులుగాని నాస్తికులుగాని ఇంకెవరైనాగాని వారుకూడా దీనిని నిజంగా నమ్మరు. ఏదో మాటవరసకు అంటారంతే.

అందరి రక్తమూ ఎర్రగానే ఉంటుంది అని వాదించే వారికికూడా రక్తంలో గ్రూపులున్నాయనీ,మళ్ళీ ఆ గ్రూపులలోకూడా సూక్ష్మమైన తేడాలుంటాయనీ తెలుసో లేదో నాకైతే తెలియదు.

ఆచరణయోగ్యం కాని అన్ని సిద్ధాంతాల లాగే,ఈ సమ(సామ్య)వాద సిద్ధాంతం కూడా మాటలు చెప్పి ఎదుటిమనిషిని మోసంతో దోచుకోవడానికే అంతిమంగా ఉపయోగపడింది. కోట్లకు పడగలెత్తిన కమ్యూనిస్టు నాయకులే దీనికి ఋజువులు.

ఏ ఇద్దరు మనుషులూ ఎన్నటికీ ఒక్కటి కారు, కాలేరు.శక్తి యుక్తులలో గాని, తెలివిలో గాని,నీతిలో గాని,బలంలో గాని,పాండిత్యంలో గాని,జ్ఞానంలో గాని, ఇతరములైన ఇంకే టాలెంట్స్ లో గాని ప్రతివ్యక్తీ ప్రత్యేకుడే.విభిన్నుడే.మనిషి మనిషికీ మధ్యన స్థాయీ భేదాలు తప్పకుండా ఉంటాయి.

భిన్నత్వమే ప్రకృతిధర్మం.అంతేగాని ఏకత్వం కాదు.అసమానతే ప్రకృతి నియమం.అంతేగాని సమత్వం కాదు.

ఈ ఉపోద్ఘాతమంతా ఎందుకు చెబుతున్నానంటే,మనుషుల్లో కూడా చాలా ప్రత్యేకమైన టాలెంట్స్ ఉన్నవారు కొందరుంటారు.అలాంటి వారి జీవితాలను గమనిస్తే చాలా విచిత్రంగా విభిన్నంగా ఉంటాయి.అలాంటివారిలో ఒకడే కాజీ నజరుల్ ఇస్లాం.ఈయన జాతకాన్ని ఇప్పుడు పరిశీలిద్దాం.

మనిషి టాలెంట్ కూ అతని జీవితం సుఖంగా జరగడానికీ ఏ సంబంధమూ లేదు.సామాన్యంగా అందరూ ఏమనుకుంటారంటే-మనం ఏదైనా సాధించగలం,అంతా మన చేతుల్లోనే ఉంది అనుకుంటారు.అది పిచ్చి భ్రమ మాత్రమే.మన చేతుల్లో ఏదీ లేదనే విషయం చాలా లేటుగా మనిషికి అర్ధమౌతుంది.అయితే,మనవల్ల చేతకాని పరిస్థితులు జీవితంలో ఎదురయ్యేదాకా ఈ విషయం చాలా మందికి అర్ధం కాదు.

ఈయన 24-5-1899 న పశ్చిమ బెంగాల్ లోని చురూలియా అనే గ్రామంలో పుట్టాడు.జనన సమయం తెలియదు.ఉదయం 10.20 అని కొందరు అంటున్నారు.అయితే దీనికి ఆధారాలు లేవు.

గురుశనుల వక్రీకరణ వల్ల లోకంతో చాలా కర్మబంధం ఉన్న జాతకం అని అర్ధమౌతున్నది.అంతేగాక చాలా కష్టజాతకం అన్న విషయం కూడా చూడగానే స్ఫురిస్తున్నది.

గురుచంద్రుల యోగం ఉన్నప్పటికీ గురువు వక్రత్వం వల్ల అది ఈయనకు పెద్దగా ఉపయోగపడకుండా పోతుంది.బుధశుక్రులు కలసి ఉన్నందువల్ల కవిత్వం, కళానైపుణ్యం, రచనాశక్తి, భావుకతా ఉంటాయి.శుక్రునిపైన గురుదృష్టి వల్ల ఆధ్యాత్మిక రచనా నైపుణ్యం కలుగుతుంది.రాహుకేతువుల స్థితులు రాశి నవాంశలలో తారుమారవ్వడం వల్ల ఈయన జీవితం అనేక ఆటుపోట్లకు గురౌతుంది.జీవితంలో అత్యంత వైభవాన్నీ అత్యంత దయనీయ స్థితులనూ ఈయన చవిచూస్తాడు.కుజుని నీచభంగస్థితి వల్ల అట్టడుగునుంచి తన శక్తితో జీవితంలో పైకొస్తాడని తెలుస్తున్నది.నవాంశలో రాహుచంద్రులూ గురుకేతువుల కలయిక వల్లా వారిమధ్యనున్న సమసప్తక దృష్టి వల్లా ఈయనది మంచి ఆధ్యాత్మికదృక్పథం ఉన్న జాతకమేగాక,ఒక మతానికి కట్టుబడని మనస్తత్వం అని తెలుస్తున్నది.అనేక మతాలను శ్రద్ధగా అధ్యయనం చేసే విశాలస్వభావం అనీ తెలుస్తున్నది.

ఇప్పుడు ఈయన జీవితంలోని ఘట్టాలను పరికిద్దాం.

ఈయన ఒక ముస్లిం కాజీల కుటుంబంలో జన్మించాడు.చిన్నప్పుడే మతశిక్షణ తీసుకుని మసీదులో పనిచేశాడు.ఆ సమయంలోనే సాంస్కృతిక సంఘాలతో పరిచయం పెంచుకుని నాటకం,సాహిత్యం,కవిత్వాలలో ప్రవేశం పొందాడు.కొన్నాళ్ళు బ్రిటిష్ సైన్యంలో పనిచేసి ఆ తర్వాత కలకత్తాలో జర్నలిస్ట్ గా జీవితాన్ని మొదలుపెట్టాడు.

తన రచనలద్వారా తిరుగుబాటును ప్రోత్సహించేవాడు.అందుకని బ్రిటిష్ వారు చాలాసార్లు ఈయన్ను జైల్లో పెట్టారు.'బిద్రోహీ కవి(విప్లవకవి)' అనేది ఈయన బిరుదు.బంగ్లాదేశ్ ఆవిర్భావం సమయంలో కూడా,పాకిస్తాన్ నుంచి విడిపొమ్మని,ఈయన తన రచనలతో ప్రజలని ఎంతో ప్రోత్సహించాడు.

నజరుల్ చాలా అద్భుతమైన కవి.ఈయన దాదాపు 4000 పాటలు వ్రాశాడు. అంతేకాదు వాటికి రాగాలూ సమకూర్చాడు.వీటినే నజరుల్ గీత్ అంటారు. కాళీమాతను ప్రార్ధిస్తూ కొన్నివందల గీతాలు రచించాడు.వాటిని శ్యామాకీర్తనలంటారు.బెంగాలీలో ఘజల్స్ వ్రాయడం మొదలుపెట్టింది ఈయనే.అంతేగాక కొన్ని కొత్త రాగాలనూ ఈయన సృష్టించాడు.మరుగున పడిన రాగాలను కొన్నింటిని వెలికి తీశాడు.

ముస్లింగా పుట్టినా ఈయన ఒక ఉదారవాది.కాళీమాత భక్తుడు. అన్నిమతాలూ చెప్పినది మంచే అని భావించేవాడు.మతాలు ముఖ్యంకాదు మానవత్వం ముఖ్యం అనీ, ఆ మతాలకోసం కొట్టుకుచావడం కాదు,వాటిలోని సారాన్ని అర్ధం చేసుకుని ఆచరించాలనీ లేకపోతే ప్రయోజనం లేదనీ భావించేవాడు.ఈయన శ్రీరామకృష్ణ వివేకానందులను,వారు బోధించిన వేదాంత తంత్రభావాలనూ అమితంగా ఆరాధించేవాడు.

'శ్మశానే జాగిచే శ్యామా మా(అమ్మా కాళీ! నీవు శ్మశానంలో జాగృతురాలవై ఉన్నావు...)' అంటూ భక్తితో ఈయన వ్రాసిన శ్యామాకీర్తన నేడు బెంగాల్లో హిందువులందరి నోళ్ళలోనూ నానుతూ ఉంటుంది.ఇది ఒక చిన్న ఉదాహరణ మాత్రమే.ఇలాంటి భక్తి కీర్తనలు కొన్ని వందలు ఆయన రచించాడు.

1930 ప్రాంతాలలో ఈయన తను వ్రాసిన 800 పాటలను ప్రచురించాడు. వాటిల్లో దాదాపు 600 గీతాలు సాంప్రదాయ రాగాల ఆధారంగా వ్రాయబడినవే.ఈయన వ్రాసిన పాటలలో దాదాపు రెండువేల పాటలు కనుమరుగై పోయాయి.దొరకడం లేదు.ఈయన ఎక్కువగా భైరవీ రాగంలో తన పాటలను వ్రాసేవాడు.అప్పట్లో కొన్ని సినిమాలకు సంగీతదర్శకత్వం కూడా వహించాడు.1939 లో కలకత్తా రేడియోలో ఉద్యోగం చేస్తూ,సంగీతం మీద చాలా రీసెర్చ్ చేసి ఎన్నో మంచి ప్రోగ్రాములు అందించాడు.

ఈయన జాతకంలో ఇదంతా బుధశుక్రుల కలయికవల్లా వారిమీద ఉన్న గురుచంద్రుల దృష్టి వల్లా సూచింపబడుతున్నది.

ఇకపోతే ఈయన జీవితంలోని కష్టాలను గమనిద్దాం.

ఈయన శుక్లచతుర్దశి రోజున జన్మించాడు.పౌర్ణమి దగ్గరలో జన్మించిన వారి వివాహ జీవితాలు బాగుండవని నా రీసెర్చిలో కనిపెట్టిన జ్యోతిష్యసూత్రం ఈయన జీవితంలో కూడా అక్షరాలా నిజం కావడం గమనించండి.మన జన్మతిధిని బట్టి మన జీవితంలో జరిగే సంఘటనలు చాలావరకూ తెలుస్తాయి.దీనికీ శ్రీవిద్యోపాసనకూ సంబంధం ఉన్నది.

ఈయన మొదట్లో ఒక ముస్లిం అమ్మాయిని చేసుకుందామనుకున్నాడు.కానీ అభిప్రాయ భేదాలవల్ల నిశ్చితార్ధం సమయంలోనే ఆమెతో విడిపోయాడు.ఆ తర్వాత ప్రమీలాదేవి అనే తన అభిమానిని వివాహం చేసుకున్నాడు.కానీ వీరిద్దరి జీవితాలూ చాలా విషాదంతో ముగిశాయి.

1939 లో ప్రమీలాదేవికి నడుమునుంచి క్రింది భాగమంతా పక్షవాతం వచ్చి చచ్చుబడిపోయింది.1941 లో రవీంద్రనాథ్ టాగోర్ మరణం ఈయన్ను బాగా కృంగదీసింది.ఆ తర్వాత కొద్దినెలలకే ఈయన ఆరోగ్యం కూడా బాగా దిగజారింది.మనస్సు యొక్క స్థితి అనేది శరీరంమీద ఎంత ప్రభావం చూపిస్తుందో అనడానికి ఇదే ఉదాహరణ.

క్రమేణా ఈయనకు మతిమరుపు ఎక్కువైంది.మాటమీద అదుపు తప్పింది. ప్రవర్తన విచిత్రంగా మారింది.చివరకు 1942 లో ఈయన ఒక పిచ్చాసుపత్రిలో చేర్చబడ్డాడు.జీవితం అగమ్యగోచరంగా తయారైంది.చేతిలో డబ్బు అయిపోయింది.భార్యాభర్తలిద్దరూ నిస్సహాయ స్థితిలో ఉండిపోయారు. అలా కొన్ని సంవత్సరాలు దుర్భర పేదరికంలో,అనారోగ్యంలో జీవితం గడిచింది.

చివరకు కొందరు అభిమానులూ ముఖ్యంగా 'శ్యాంప్రసాద్ ముఖర్జీ' చొరవతో ఇద్దరినీ మంచి ట్రీట్మెంట్ కోసం లండన్ కూ ఆ తర్వాత వియెన్నా కూ 1952 లో పంపారు.ఇద్దరికీ సరియైన ట్రీట్మెంట్ ఇవ్వబడలేదని అక్కడి వైద్యులు తేల్చారు.ఈరోగాలు తగ్గేవి కావనీ,మరణించేవరకూ ఇలా బాధపడుతూ ఉండటమే తప్ప వీటికి విరుగుడు లేదనీ తేలింది.1953 లో ఇద్దరూ తిరిగి ఇండియాకు తీసుకురాబడ్డారు.

ఈయనకు పిట్స్ డిసీస్ అనేది వచ్చిందని వైద్యులు తేల్చారు.ఈ రోగంలో మెదడులోని నరాల కణాలు క్రమేణా క్షీణించిపోతాయి.దీనివల్ల విపరీతమైన ప్రవర్తన రోగిలో కనిపిస్తుంది.జ్ఞాపకశక్తి క్షీణిస్తుంది.ఆలోచనలు అదుపు తప్పుతాయి.మాట స్వాధీనంలో ఉండదు.అతిబద్ధకం నుంచి అతిప్రవర్తన వరకూ అన్ని స్థితులూ వేగంగా వీరిలో మారిపోతూ ఉంటాయి.సామాన్యంగా ఈ రోగం వంశపారంపర్యంగా జీన్స్ లో వస్తూ ఉంటుంది.

1962 దాకా అలాగే అనారోగ్యంతో బాధపడి ప్రమీలాదేవి చనిపోయింది.1972 దాకా నజరుల్ ఇంటెన్సివ్ కేర్ లోనే ఉన్నాడు.అప్పట్లో ఏర్పడిన బంగ్లాదేశ్ ప్రభుత్వం ఈయన్ను జాతీయకవిగా గుర్తిస్తూ డాకాకు ఈయన్ను ఆహ్వానించింది.1974 లో ఈయన కుమారుడు కాజీ అనిరుద్ద్ తన కనుల ఎదుటే చనిపోయాడు.ఇన్ని ఎత్తుపల్లాలనూ వైరుద్ధ్యాలనూ విషాదాలనూ తన జీవితంలో చవిచూచిన కాజీ నజరుల్ ఇస్లాం 1976 లో తన 77 వ ఏట కన్నుమూశాడు.ఆయన సమాధి బంగ్లాదేశ్ లో ఉన్నది.

మొత్తం మీద 1939 నుంచీ ఈయన జీవితం మలుపు తిరిగింది.అక్కడనుంచీ కష్టాలు ఈయన్ను వెంటాడటం మొదలైంది.ఆ తర్వాత దాదాపు 36 ఏళ్ళ పాటు నానాబాధలు పడ్డాడు.శనిగురువులు వక్రించిన జాతకాలలో పెద్దవయసు దుర్భరంగా గడుస్తుందని చెప్పే నాడీజ్యోతిష్య సూత్రం ఈ జాతకంలో అక్షరాలా నిజం కావడం గమనించవచ్చు.

ఆత్మకారకుడైన శనీశ్వరుడు జ్యేష్టానక్షత్రంలో వక్రించి ఉంటూ రోహిణీ నక్షత్రంలో ఉన్న సూర్యునితో దృష్టిని కలిగి ఉండటం అనే యోగంవల్ల పెద్ద వయస్సులో ఇన్ని కష్టాలు కలిగాయి.వక్రీకరణ వల్ల చంద్రునితో కలసిన శనీశ్వరుడు కూడా అనేక కష్టాలను ప్రసాదించాడు.ఈ యోగం వల్ల ఆధ్యాత్మిక చైతన్యం కూడా మనిషికి ఇవ్వబడుతుందని గమనించాలి.జీవితంలో కష్టాలు ఎక్కువగా ఉన్నవారే ఆధ్యాత్మికం వైపు చూస్తారు.హాయిగా సుఖంగా జీవితాలు గడపేవారు ఆధ్యాత్మికం వైపు రావడం చాలా కష్టం.ఈ విచిత్రం కూడా జాతకాలలో ప్రతిబింబిస్తూ ఉంటుంది.

ఒక విచిత్ర విషయాన్ని ఇక్కడ మనం చూడవచ్చు.Normal పరిధిని దాటనిదే ఎవడూ ఏ ప్రత్యేకతనూ పొందలేడు.మిగిలిన వారికంటే కొంత abnormality లేకుంటే ఎవరిలోనూ టాలెంట్స్ అనేవి వికసించవు.కానీ ఆ abnormality కూడా కొన్ని పరిధులలోనే ఉండాలి.ఆ పరిధులు కూడా దాటినప్పుడు అదే పిచ్చిగా మారుతుంది.అయితే పిచ్చివాడికి తనకు పిచ్చి అని తెలియదు.వాడికి అది సహజంగానే తోస్తుంది.

లిమిట్స్ లో ఉన్న abnormality ని టాలెంట్ అంటున్నాం.మరీ ఎక్కువైపోయి ఆ లిమిట్స్ కూడా దాటితే దానినే పిచ్చి అంటున్నాం.

కాజీ నజరుల్ ఇస్లాం జీవితమే దీనికి ఉదాహరణ.

నజరుల్ కూ,ఇతని భార్యకూ కూడా, నయంకాని అసాధ్య రోగాలు రావడమూ అది కూడా నరాలకు సంబంధించినవే కావడమూ చాలా విచిత్రం.ఈయన ప్రజలను స్వాత్రంత్ర్యం కోసం రెచ్చగొడుతున్నాడని గమనించిన బ్రిటిష్ వారు జైల్లో పెట్టి విషప్రయోగం చేశారనీ అందుకనే అప్పటినుంచీ ఈయనకు ఈ రోగం సంక్రమించిందనీ ఒక వాదన ఉన్నది.అందులో నిజం ఉందేమో మనకు తెలియదు.ఓషోకు కూడా అమెరికన్స్ విషప్రయోగం చేశారని ఒక వాదన ఉన్నది.అది కూడా నిజమో కాదో మనకు తెలియదు.

ఒక మనిషిలో టాలెంట్స్ మనకు నచ్చనపుడు అసూయతో విషప్రయోగం చేసి అతని జీవితాన్ని దుర్భరం చెయ్యడం పాతకాలంలో ప్రత్యర్ధుల కుట్రలో భాగంగా ఉండేది.ఒక వ్యక్తి మంచి గాయకుడైతే అతన్ని ఏ విందుకో ఆహ్వానించి మెచ్చుకుని గంగసిందూరాన్ని అతని ఆహారంలో కలిపి తినిపిస్తే అతని గొంతు పాడైపోయి జీర వచ్చేసి అతను చివరకు పాడలేని పరిస్థితికి రావడం జరిగేది.ఇలాంటి పనులు పాతకాలంలో చేసేవారు.

అంతదాకా ఎందుకు? "నువ్వు బాంబే చిత్రసీమలో పాడవద్దు.ఇక్కడ అడుగు పెట్టావంటే తేడాలోస్తాయి జాగ్రత్త"- అంటూ జేసుదాస్ కు ఇవ్వబడిన వార్నింగ్ చాలదూ మనుషులలో అసూయ ఎలా పనిచేస్తుందో గ్రహించడానికి?

అదే విధంగా-మొదటి భార్య తరఫు వారు చేయించిన క్షుద్ర ప్రయోగం వల్లనే ఈయన గతీ ఈయన భార్య గతీ ఇలా అయిందని కూడా ఒక వాదన ఉన్నది.ఇదెంత నిజమో కూడా మనకు తెలియదు.

ఒకవేళ ఈ జనన సమయం కరెక్టే అనుకుంటే -- అప్పుడు ఈ లగ్నానికి ఆధిపత్య రీత్యా పాపి అయిన శనీశ్వరుడు ఆరింట రోగస్థానంలో ఉండటం ఒక అసాధ్య దీర్ఘ రోగానికి సూచనే.అలాగే వక్రరీత్యా లగ్నాధిపతి తో కలుస్తూ మనస్సుకు సూచిక అయిన చతుర్దంలో ఉంటూ దశమస్థానంలో ఉన్న మరొక ఇద్దరు పాపులైన బుధశుక్రులను చూడటం ఈయన పడిన బాధలన్నిటికీ సూచిక.బుధశుక్రులిద్దరూ లలితకళలకూ,సంగీత సాహిత్యాలకూ కారకులన్న విషయం మనకు తెలిసినదే.అందుకే ఆ బుదునికీ శనికీ సంబందించిన నరాల రోగమే ఈయనకు వచ్చింది.

లగ్నాన్ని ఆవహించి ఉన్న పంచమాధిపతి నీచకుజుడు కూడా మతి భ్రమణానికి సంబంధించిన ఒక అసాధ్య రోగాన్నే సూచిస్తున్నాడు. 

కళాకారులకు జీవిత చరమాంకంలో మెదడుకూ నరాలకూ సంబంధించిన రోగాలు రావడం మనం గమనించవచ్చు.ఉదాహరణకు ప్రఖ్యాత సంగీత దర్శకులు సాలూరి రాజేశ్వరరావు పక్షవాతంతో బాధపడ్డారు.అలాగే కేవీ మహాదేవన్ కూడా చివరలో మతిభ్రమణం(dementia) తో బాధపడ్డారు.

అయితే మహా సంగీతజ్ఞులైన త్యాగరాజు,శ్యామాశాస్త్రి,ముత్తుస్వామి దీక్షితులు మొదలైనవారికి చివరిలో ఇలాంటి మతిభ్రమణ రోగాలు,నరాల రోగాలు రాలేదు.దానికి కారణం వారికున్న భక్తి కవచం,ఉపాసనాబలం వారిని కాపాడటమే కావచ్చు.

జీవితంలో మనం ఏ అవయవాన్ని ఎక్కువగా వాడతామో దానికి చెందిన రోగమే వస్తుందనేది ఒక సామాన్య సూత్రం.అయితే ఇది ఎల్లప్పుడూ నిజం కాకపోవచ్చు.అసలు వాడని అవయవాలు కూడా క్రమేణా క్షీణించి వాటికి సంబంధించిన రోగాలు కూడా రావచ్చు.ఇదికూడా ఎల్లవేళలా నిజం కాకపోవచ్చు.ఎందుకంటే ప్రతి ప్రకృతి నియమానికీ ఒక వెసులుబాటు కూడా ఉంటుంది.

ఏదేమైనా--ఒక గొప్పకవీ,ఉదారవాదీ,భావుకుడూ,సున్నిత మనస్కుడూ, బహుముఖ ప్రజ్ఞాశాలీ అయిన ఒక మనిషి జీవితం ఇలా దుర్భర విషాదాంతం కావడం జీర్ణించుకోలేని విషయం.మనిషి ఎంతటివాడైనా చివరకు కర్మకు బద్దుడే అనడానికి ఇలాంటి జీవితాలే ఉదాహరణలు.
(సశేషం)
read more " Kazi Nazrul Islam జాతకం-ఒక పరిశీలన "

22, ఏప్రిల్ 2015, బుధవారం

మత్తెక్కిన నా హృదయం...


మత్తెక్కిన నా హృదయం
ఆనందంతో తూగుతోంది..
మఱుగుపడిన ఒక లోకపు
అవధులనే తాకుతోంది...

ఈ ఆనందానికి
ఏ హేతువూ అవసరం లేదు
ఈ ఆనందాన్ని
ఏ తీతువూ అపహరించలేదు
దీనికొకరి తోడూ అవసరం లేదు
ఒకరి నీడా అక్కర్లేదు

మత్తెక్కిన నా హృదయం
ఆనందంతో తూగుతోంది..

ఈ ఆనందం
ఈలోకానిది కాదు
ఈ లోకపు వస్తువులపై 
ఆధారపడి లేదు
దానికి ఒక కారణం లేదు
దానికి మరణమూ లేదు

మత్తెక్కిన నా హృదయం
ఆనందంతో తూగుతోంది..

నేనున్నాను 
నా చుట్టూ ప్రకృతి..
ఇంకేం కావాలి?
ఓహ్..
ఏమిటీ నిష్కారణానందం..?

మత్తెక్కిన నా హృదయం
ఆనందంతో తూగుతోంది..

నేనొక మధుపాయినని
చూచేవారనుకున్నారు
అనుకోనీ..
ఈ ఆనందం వారికర్ధం కాదు
నా మధువు రుచి వారికి తెలియదు

మత్తెక్కిన నా హృదయం
ఆనందంతో తూగుతోంది..

మత్తెక్కిన నా హృదయం...
read more " మత్తెక్కిన నా హృదయం... "

21, ఏప్రిల్ 2015, మంగళవారం

Khoya Khoya Chand - Mohd.Rafi




Youtube Link
https://youtu.be/V0rp54n0V0M

ఖొయా ఖొయా చాంద్...

One of the most melodious and beautiful songs in tune as well as in meaning.


1960 లో దేవానంద్ తన నవకేతన్ ఫిలిమ్స్ పతాకం క్రింద నిర్మించిన సినిమా 'కాలాబజార్' లో, ఎస్డీ బర్మన్ సంగీతం సమకూర్చగా, మహమ్మద్ రఫీ మధురగళంలో నుంచి ఉరికిన మరపురాని సుమధుర గీతం ఇది.

ఈ పాట ఎలా పుట్టింది అన్నదానిమీద ఒక జ్ఞాపకాన్ని ఒకనాటి వివిధభారతి ప్రోగ్రాం లో RD Burman ఆనాటి రేడియో శ్రోతలతో ఇలా పంచుకున్నాడు.

'ఒకరోజు  నాన్నగారు (SD Burman) నన్ను గీతరచయిత శైలేంద్ర వద్దకు పంపారు ఒక పాటను వ్రాయించి తెమ్మని. పంపుతూ ఒకమాట కూడా చెప్పారు-'పాట లేకుండా ఉత్త చేతులతో రావద్దు'- అని.

నేను శైలేంద్ర గారి ఇంటికి చేరేసరికి ఒక విషయం నాకు తెలిసింది.అదేమంటే ఆయన అప్పటికి ఇంకా ఆ పాటను వ్రాయనే లేదని.నాన్నగారు పాట తీసుకుని మాత్రమే వెనక్కు రమ్మన్నారని శైలెంద్రగారితో నేను చెప్పాను. అప్పుడాయన నన్ను తోడు తీసుకుని సముద్రపు ఒడ్డుకు తీసుకెళ్ళాడు. పాట వ్రాయండి అని నేను ఆయనతో చెప్పాను.ఆయన ఇలా అన్నారు.'ఎలా పడితే అలా పాట వ్రాయడం కుదరదు నాయనా.దానికి మూడ్ రావాలి'- అని. 'సరే నువ్వు అగ్గిపెట్టెతో ఏదైనా ట్యూన్ వాయించు.ప్రయత్నిస్తాను'- అన్నాడు. అలా అంటూ తలెత్తి ఆకాశంలోని చంద్రుడిని చూచాడు.

'ఖొయా ఖొయా చాంద్ ఖులా ఆస్మాన్'- అంటూ వెంటనే పాట వచ్చేసింది.ఈ పాట అలా పుట్టింది.

ఒక భావుకుడైన కవి హృదయంలో జనించిన పాటలో జీవం ఉంటుంది.అది సహజంగా ఉంటుంది.కృతకంగా ఉండదు.మన తెలుగులో ఇలాంటి పాటలను దేవులపల్లి కృష్ణశాస్త్రి, సి.నారాయణరెడ్డి మొదలైన అతి కొద్దిమంది కవిత్వంలో మాత్రమే మనం గమనించవచ్చు.అయితే దేవులపల్లిలో కొంత చాదస్తం కనిపిస్తే,సినారె లో నవీనత కనిపిస్తూ ఉంటుంది.

శైలేంద్ర వ్రాసిన పాటలన్నీ అద్భుతమైనవే.ఆయనలోని భావుకత ఆ పాటల్లో తొణికిసలాడుతూ కనిపిస్తూ ఉంటుంది.

సచిన్ దేవ్ బర్మన్ విషయం సరేసరి.మధురమైన రాగాలను కూర్చడంలో ఆయన సిద్ధహస్తుడు.ఆయన కూర్చిన మధుర రాగాలు ఎన్నో ఉన్నాయి.

రఫీ గానం సంగతి ఇక చెప్పనక్కర్లేదు.ఏ పదాన్ని సుతారంగా ఎలా పలకాలో ఆయనకు కొట్టిన పిండి.ఈ విధంగా ఒక మంచి కవీ,సంగీత దర్శకుడూ, గాయకుడూ కలసి సృష్టించిన పాట గనుకే ఈనాటికీ ఒక timeless classic song గా మిగిలిపోయింది.50 ఏళ్ళు దాటినా ఇంకా ఈ పాటను మనం పాడుకుంటూ ఆనందిస్తున్నాం.సంగీతంలోని మహత్యం అదే.

Movie:--Kaala Bazaar(1960)
Lyrics:-Shailendra
Music:--S.D.Burman
Singer:--Mohd Rafi
Karaoke Singer:--Satya Narayana Sarma

Enjoy
-----------------------------------
O ho ho ho,
khoya khoya chaand,
khula aasmaan
Aankhon mein saari raat jaayegi
Tumko bhi kaise neend aayegi
Oh oh, khoya khoya chaand

Masti bhari hawa jo chali - 2
Khil khil gayi yeh dil ki kali
Mann ki gali mein hai khalbali
Ke unko to bulaao
O ho ho, khoya khoya chaand, khula aasmaan
Aankhon mein saari raat jaayegi
Tumko bhi kaise neend aayegi
Oh oh, khoya khoya chaand 

Taare chale, nazaare chale - 2
Sang sang mere voh saare chale
Chaaron taraf ishaare chale
Kisi ke to ho jaao
Oh ho ho, khoya khoya chaand, khula aasmaan
Aankhon mein saari raat jaayegi
Tumko bhi kaise neend aayegi
Oh oh, khoya khoya chaand

Aisi hi raat, bheegi si raat - 2
Haathon mein haath hote voh saath
Keh lete unse dil ki ye baat
Ab to na satao
Oh ho ho, khoya khoya chaand, khula aasmaan
Aankhon mein saari raat jaayegi
Tumko bhi kaise neend aayegi
Oh oh, khoya khoya chaand

Hum mit chale- jinke liye-2
Bin kuch kahe voh chup chup rahe
Koi zara yeh unse kahe
Na aise aasmaao
Oh ho ho, khoya khoya chaand, khula aasmaan
Aankhon mein saari raat jaayegi
Tumko bhi kaise neend aayegi
Oh oh, khoya khoya chaand, khoya khoya chaand
Khoya khoya chaand, khoya khoya chaand

Meaning:--

Oh-The Moon is lost in ecstasy
The sky has blossomed
The whole night will be spent by 
just looking into each other's eyes
(If such is our condition)
How will you get sleep?

When the intoxicated wind blew
the heart's lotus bloomed
My mind's lane is full of desire
to call her
Oh-The Moon is lost in ecstasy
The sky has blossomed
The whole night will be spent by 
just looking into each other's eyes
(If such is our condition)
How will you get sleep?

Stars are moving,things are moving
With me they all are resonating
From all sides there are indications
to lose yourself in someone
Oh-The Moon is lost in ecstasy
The sky has blossomed
The whole night will be spent by 
just looking into each other's eyes
(If such is our condition)
How will you get sleep?

Such a night,a rainy night
If she were with me hand in hand
I will tell her
'Don't torment me anymore'...
Oh-The Moon is lost in ecstasy
The sky has blossomed
The whole night will be spent by 
just looking into each other's eyes
(If such is our condition)
How will you get sleep?

She whom I loved with my whole heart
and gave myself totally to her
She is silent and not saying anything
Can somebody tell her?
'Don't test me like this'...
Oh-The Moon is lost in ecstasy
The sky has blossomed
The whole night will be spent by 
just looking into each other's eyes
(If such is our condition)
How will you get sleep?
read more " Khoya Khoya Chand - Mohd.Rafi "