“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

30, ఏప్రిల్ 2018, సోమవారం

Ye Hawa Ye Raat Ye Chandni - Talat Mehamood


Ye hawa ye raat ye chandni అంటూ తలత్ మెహమూద్ సుతారంగా ఆలపించిన ఈ గీతం 1952 లో వచ్చిన Sangdil అనే చిత్రం లోనిది. ఈ పాట 66 ఏళ్ళ నాటిది. ఇది కూడా ఆపాత మధురగీతమే. ఈ గీతాన్ని నా స్వరంలో కూడా వినండి మరి.

Movie:-- Sangdil (1952)
Lyrics:-- Rajendra Krishan 
Music:--Sajjad
Singer:-- Talat Mehamood
Karaoke Singer:-- Satya Narayana Sarma
Enjoy
-------------------------------------------------------
Ye hawa ye raat ye chandni – teri ik adaa pe nisar hai – 2
Mujhe kyunaho teri aarzu – Teri justju me bahaar hai
Ye hawa ye raat ye chandni

Tujhe kya khabar – Hai o bekhabar
[Tujhe kya khabar Hai o bekhabar - Teri ik nazar me hai kya asar] – 2
Jo ghajab me aayetho kehr hai – Joho meherba tho karaar hai
Mujhe kyunaho teri aarzu – Teri justju me bahaar hai
Ye hawa ye raat ye chandni

Teri baat baat hai dilnashee
[Teri baat baat hai dilnashee – Koi tujhse badh kenahi hasee]-2
Hai kali kalimejo mastiya – Teri aankh ka ye khumar hai
Mujhe kyunaho teri aarzu – Teri justju me bahaar hai
Ye hawa ye raat ye chandni - teri ik adaa pe nisar hai

Meaning

This wind, this night and this Moon
are adding more beauty to your beauty
Why should I not desire you?
The spring season itself is searching for you

What do you know? my innocent darling
How much effect your mere glance carries?
It is like a sharp arrow
but very kind and affable

Your every word is so lovely
Where is a beauty greater than you?
The intoxication present in all flowers
is but the love-wine of your eyes

Why should I not desire you?
The spring season itself is searching for you
This wind, this night and this Moon
are adding more beauty to your beauty

తెలుగు స్వేచ్చానువాదం

ఈ గాలి, ఈ రేయి, ఈ వెన్నెల
నీ అందాన్ని ఇంకా పెంచుతున్నాయి
నేనెందుకు నిన్ను కోరుకోకూడదు?
వసంతమే నీకోసం వెదుకుతోంది !

ఓ పిచ్చి అమాయకురాలా !
నీ చూపులో ఎంత ప్రభావం ఉందో నీకేం తెలుసు?
అది ఒక పదునైన కత్తి లాంటిది
కానీ సున్నితమైన ప్రేమతో నిండినది

నీ ప్రతి మాటా ఎంతో మధురమైనది
అది నా హృదయాన్ని కొల్లగొడుతోంది
నీకంటే అందగత్తె ఎవరున్నారు?
ప్రతి పువ్వులోనూ ఉన్న మత్తు
నీ కన్నులలో ఉన్న ప్రేమమధువేగా?

ఈ గాలి, ఈ రేయి, ఈ వెన్నెల
నీ అందాన్ని ఇంకా పెంచుతున్నాయి
నేనెందుకు నిన్ను కోరుకోకూడదు?
వసంతమే నీకోసం వెదుకుతోంది !
read more " Ye Hawa Ye Raat Ye Chandni - Talat Mehamood "

29, ఏప్రిల్ 2018, ఆదివారం

ఆశారాం బాపూ జాతకం

నా బ్లాగును గత పదేళ్ళ నుంచీ కరెక్ట్ గా ఫాలో అవుతుంటే మీకొక నైపుణ్యం ఇప్పటికి వచ్చేసి ఉంటుంది. అదేంటంటే - ఒక జాతకాన్ని మీరంతట మీరే చెప్పగలుగుతారు. ఒకరు పుట్టిన సమయం లేకున్నా సరే, జస్ట్ జననతేదీ ఉంటే చాలు, అతని జాతకాన్ని చాలావరకూ చదవవచ్చు అనేది మీరీ పాటికి నా పోస్టులను బట్టి గ్రహించే ఉంటారు. ఒకరి జననతేదీ మనకు తెలిస్తే చాలు అతని కేరెక్టర్ ఎలాంటిదో అతి తేలికగా తెలుసుకోవచ్చు.

ప్రస్తుతం ఇస్తున్నది ఆశారాం బాపూ జాతకం. ఈయన 17-4-1941 న పాకిస్తాన్లో పుట్టాడు. ఇతని జాతకంలోని గ్రహయోగాలను బట్టి ఇతను నిజంగా రేపులు చేసి ఉంటాడా లేదా నేను చెప్పనక్కరలేదు. మీరే చెప్పండి మరి !!



ఈ జాతకాన్ని అర్ధమయ్యేలా చేసే గ్రహయోగాలు ఇవీ !

లగ్నాన్ని లెక్కలోకి తీసుకోకండి. ఎందుకంటే జననసమయం తెలియదు గనుక.

సూర్యుడు, కుజుల ఉచ్చస్థితి.
బుధుడు నీచస్థితి.
నీచబుధునితో కలసి గురువును సూచిస్తున్న కేతువు.
నీచశనితో కలసి ఉన్న శుక్రుడు.
పూర్తిగా అస్తంగతుడైన శుక్రుడు.
అక్కడే ఉన్న గురువు.
చంద్రుని నుంచి పంచమంలో రవి, బలహీనశుక్ర, నీచశని, గురువులు.

లోతైన విశ్లేషణలోకి పోకుండా పైపైన గ్రహాల  స్థితులు మాత్రం ఇచ్చాను. అర్ధం చేసుకుంటే ఇవి చాలు ! 

మరి అర్ధమైందా విషయం ?
read more " ఆశారాం బాపూ జాతకం "

28, ఏప్రిల్ 2018, శనివారం

Bechain Nazar Betaab Jigar - Talat Mehmood


Bechain nazar Betaab jigar 
Ye dil hai kisika deewana hai deewana

అంటూ తలత్ మెహమూద్ శ్రావ్యంగా ఆలపించిన ఈ క్లాసిక్ మధురగీతం 1955 లో వచ్చిన Yasmin అనే చిత్రంలోనిది. 63 ఏళ్ళు గడచినా ఇది ఇప్పటికీ మరపురాని ఆపాత మధురగీతమే. కారణం ! సంగీతాన్ని సమకూర్చింది మధుర సంగీత దర్శకుడు C. Ramachandra కనుక ! గీతరచయిత నిసార్ అఖ్తర్ ఎంతో చక్కని భావాన్ని ఈ పాటలోకి తేగలిగాడు.

నా స్వరంలో కూడా ఈ మధురగీతాన్ని వినండి మరి !

Movie:-- Yasmin (1955)
Lyrics:-- Ja Nisar Akhtar
Music:-- C. Ramachandra
Singer:-- Talat Mehmood
Karaoke Singer:-- Satya Narayana Sarma
Enjoy
-------------------------------------
Bechain nazar betaab jigar - 2
Ye dilhai kisika deewana hai deewana
Kab shaam ho aurvo shamma jale
Kab udkar pahunche parvaana hai parvaana

Hai dilka chaman khilneke liye
Ayega koyi milne ke liye
Phoolo se kaho taaron se kaho-2
Chupke se sajade veeranaa hai veerana

Jab raat zara shabnam se dhule
Lehraayi huyi vo zulf khule
Nazaron se nazar ek bhed kahe-2
Dil dilse kahe ek afsaana hai afsaana

Rangeen fizaa chaaye tho zara
Vaade pe koyi aaye tho zara
Ay joshe wafa dil cheez hai kya-2
Ham jaan bhi dede nazraana hai nazraana

Bechain nazar betaab jigar
Ye dilhai kisika deewana hai deewana

Meaning

With restless looks and impatient love
This heart is obviously mad after someone 
When evening descends and lamps are lit
Then come the moths to jump into the fire

To open the flower of my heart
Some one will certainly come to meet me
Tell the flowers and the stars
to just decorate my loneliness with them

When the night is washed with dewdrops
When her lovely hair flows in the air
When eyes convey secrets to eyes
Heart will tell a love story to her heart

When lovely cool air blows
When someone comes with promises
This loyalty in love ! What a thing it is !
To that I will offer my life as a gift

With restless looks and impatient love
This heart is obviously mad after someone 
When evening descends and lamps are lit
Then come the moths to jump into the fire

తెలుగు స్వేచ్చానువాదం

అశాంతితో కూడిన చూపులు - స్థిమితం లేని మనస్సు
ఈ హృదయం ఎవరికోసమో పిచ్చిదై పోయింది
చీకటి పడి దీపాలు వెలిగినప్పుడు
వాటిలో దూకడానికి మిడతలు రాకుండా ఎలా ఉంటాయి?

నా హృదయసుమాన్ని వికసింపజెయ్యడానికి
తను తప్పకుండా వస్తుంది
పువ్వులకూ నక్షత్రాలకూ చెప్పు
ఈ విరహపు ఏకాంతాన్ని అలంకరించమని

మంచు బిందువులతో రాత్రి కడుగబడినప్పుడు
తన శిరోజాలు గాలికి అలలలా రేగినప్పుడు
కన్నులు కన్నులతో రహస్యాలు చెప్పినపుడు
నా హృదయం తన హృదయానికి
ఒక ప్రేమగాధను మౌనంగా వెల్లడిస్తుంది

చల్లని గాలి వీచే సమయంలో
ప్రేమ వాగ్దానాలతో తను వస్తుంది
ప్రేమలో తన నిజాయితీ ఎంత గొప్పది !
దానికోసం నా ప్రాణాన్నే బహుమతిగా ఇస్తాను

అశాంతితో కూడిన చూపులు - స్థిమితం లేని మనస్సు
ఈ హృదయం ఎవరికోసమో పిచ్చిదై పోయింది
చీకటి పడి దీపాలు వెలిగినప్పుడు
వాటిలో దూకడానికి మిడతలు రాకుండా ఎలా ఉంటాయి?
read more " Bechain Nazar Betaab Jigar - Talat Mehmood "

27, ఏప్రిల్ 2018, శుక్రవారం

బ్రహ్మజ్ఞానులకు రేప్ తప్పు కాదా? ఇదేం వక్రభాష్యం?

బ్రహ్మజ్ఞాని అయినవాడు రేప్ చేసినా తప్పు లేదని వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు ఆశారాం బాపూ అన్నట్లు అతని కారు డ్రైవరూ, బాడీ గార్డూ మొదలైన డ్యూటీలు చేసిన ఒకతను కోర్టులో వాజ్మూలం ఇచ్చాడు. ఈ మొత్తం గోలలో నిజానిజాలేమిటో మనకు తెలియదు గాని, కోర్టు ఆశారాం బాపూను దోషిగా నిర్దారించినందువల్ల అది నిజమేనని భావిస్తూ కొన్ని మాటలు చెప్పదలచుకున్నాను.

ఈ మాటతో నేనూ ఏకీభవిస్తున్నాను. నిజమే ! బ్రహ్మజ్ఞాని అయినవాడు రేప్ చేసినా వాడికి ఏమీ పాపం అంటదు. అది తప్పు కాదు. భగవద్గీత కూడా ఇదే భావాన్ని 'చంపినా అతడు చంపనివాడే' అంటూ ఇంకో రకంగా చెప్పింది.

కానీ విషయం ఈ ఒక్క స్టేట్మెంట్ తో ఆగిపోదు. ఇది సగం మాత్రమె. ఇందులో ఇంకో సగం స్టేట్మెంట్ బాకీ ఉంది.

అదేంటంటే, నిజంగా బ్రహ్మజ్ఞాని అయినవాడు, తనకు ఉరిశిక్ష పడినప్పుడు కూడా, తనను ఉరికంబం ఎక్కిస్తున్నపుడు కూడా, మెడకు ఉరి బిగిస్తున్నపుడు కూడా, చివరకు ఉరి తీస్తున్నపుడు కూడా మనస్సులో ఏ విధమైన చలనమూ లేకుండా అదే ప్రశాంతతతో అదే నిర్లిప్తతతో అదే నిబ్బరంతో ఉండగలిగితే - అప్పుడు మాత్రమె ఈ స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుంది. తను ఇంకొకరిని చంపుతున్నపుడు మాత్రమె కాదు, తనను ఇంకొకరు చంపుతున్నపుడు కూడా అదే చిరునవ్వుతో అదే సమదృష్టితో అదే స్థిరచిత్తంతో ఉంటె, అదీ బ్రహ్మజ్ఞానం. అంతేకాని ఊరకే నాలుగు శ్లోకాలు బట్టీ పట్టి, టీవీల్లో ఉపన్యాసాలు ఇచ్చినంత మాత్రాన బ్రహ్మజ్ఞానం రాదు - రాబోదు.

రమణ మహర్షికి కేన్సర్ వచ్చింది. రామకృష్ణునికి కేన్సర్ వచ్చింది. వాళ్ళేమీ చలించలేదు. సుఖంలో ఎలా ఉన్నారో బాధలో కూడా అలాగే చెదరకుండా ఉన్నారు.

రమణ మహర్షి చేతికి వచ్చిన కేన్సర్ పుండు ఒకరోజున పగిలి దానినుంచి భయంకరంగా రక్తం కారుతున్నది. దానిని చూచిన భక్తులు భరించలేక ' భగవాన్ ! ఏంటిది? ఇలా రక్తం కారుతోంది? మీరీ బాధను ఎలా భరిస్తున్నారు?' అని ఏడుస్తూ అడిగితే దానికి మహర్షి  నవ్వుతూ - 'దానికేమి? నా దగ్గరికి మీరెలా వచ్చారో అదీ అలాగే వచ్చింది. ఉండనివ్వండి. చూడండి! చేతికి మాణిక్యాలూ కెంపులతో హారం పెట్టుకున్నట్లు ఎంత సుందరంగా ఎర్రగా ఉందో?' అన్నారట ! ఆ అడిగినవారికి బంగారం మీదా కెంపుల మీదా మోజు ఉండి ఉంటుంది. అందుకే మహర్షి అలా చమత్కరించారు.

శ్రీరామకృష్ణులకు గొంతు కేన్సర్ వచ్చింది. ఆహారం తినలేకపొతున్నారు. ద్రవపదార్ధాలు కూడా మ్రింగలేకున్నారు. ఆహారం స్వీకరించి నెలరోజులైంది. చిక్కి ఎముకలగూడుగా మారిపోయారు. ఆ బాధ చూచి భరించలేక ఏడుస్తున్న భక్తులతో - "ఎందుకు ఏడుస్తున్నారు? ఈ ఒక్క నోటితో తినకపోతే ఏమైంది? మీ అందరి నోళ్ళతో తింటున్నాను కదా?' అని నవ్వుతూ అన్నారాయన!

అసలేమిటా స్థితి!! మనబోటి మానవమాత్రుల ఊహకైనా అందుతుందా ఆ స్థితి?

తన గుడారంలోకి చెప్పకుండా వచ్చాడని సదాశివబ్రహ్మేంద్ర సరస్వతీ స్వామి చేతిని నరికేశాడు ముస్లిం సేనాపతి. స్వామికి దేహస్ప్రుహ లేదు. నరికింది తనను కాదు అన్నట్లు నిర్లిప్తంగా చూచి రక్తం కారుతున్న సగం చేతితో అలా నడుచుకుంటూ శిబిరంలో నుంచి బయటకు వెళ్ళిపోయాడు ఆయన !

వారు నిజమైన బ్రహ్మజ్ఞానులు !!

అంతేగాని ఏసీ ఆశ్రమాలలో ఉంటూ, రాజభోగాలు అనుభవిస్తూ, మాయ మాటలు చెబుతూ జనాన్ని మోసం చేస్తున్న నేటి దొంగగురువులు ఆ మాటకు ఏమాత్రం తగరు.

ఆశారాం బాపూ ఈ మాట అన్నది నిజమే అయితే, మరి కోర్టులో జడ్జి తీర్పు వెలువరిస్తున్నపుడు కన్నీటి పర్యంతమైపోయి, 'ఏదో ఒకటి చెయ్యండి. నన్ను బయటపడేయ్యండి ' అంటూ లాయర్లను ప్రాధేయపడవలసిన అవసరం లేదు. అక్కడే అతని డొల్లతనం బయట పడుతున్నది.

బ్రహ్మజ్ఞాని అయినంత మాత్రాన అనైతిక ప్రవర్తన ఉండదు. నిజమైన బ్రహ్మజ్ఞాని నీతిగా ఉంటాడు. చెప్పినదే చేస్తాడు. చేసేదే చెబుతాడు. మాయమాటలూ, నాటకాలూ అతని వద్ద ఉండవు.

శ్రీ రామకృష్ణులన్న మాట ఒకటి నాకు ఈ సందర్భంలో గుర్తుకు వస్తున్నది.

'సంగీతంలో ప్రజ్ఞ ఉన్నవాడు అపస్వరం పలకడు. నాట్యంలో ప్రజ్ఞ ఉన్నవాడు తప్పటడుగు వెయ్యడు' అన్నారాయన.

ఎంత గొప్ప మాట !

ఆదిశంకరుల జీవితంలోనూ, త్రిలింగస్వామి జీవితంలోనూ జరిగిన ఒక సంఘటన ఉన్నది. వారు ఒకరోజున సారాయి త్రాగారని శిష్యులు కూడా సారాయి త్రాగడం మొదలు పెట్టారట. ఒకరోజున మరుగుతున్న సీసం తీసుకుని సారాయిని త్రాగినట్లే వారు త్రాగారట. అది చూచి శిష్యులు బిత్తరపోయి, ఆ పని చెయ్యలేక, బుద్ధి తెచ్చుకున్నారని ఒక కధ చెబుతారు.

బ్రహ్మజ్ఞానం అనేది సారాయి త్రాగినప్పుడు మాత్రమె కాదు, కరిగిన సీసాన్ని త్రాగినప్పుడు కూడా కనిపించాలి. అలాగే రేప్ చేసినప్పుడు మాత్రమె కాదు, తనకు ఉరి పడినప్పుడు కూడా అది కనిపించాలి. అప్పుడు ఒప్పుకోవచ్చు అది నిజమైన బ్రహ్మజ్ఞానమే అని.

సత్యమేమంటే - బ్రహ్మజ్ఞాని అయినవాడికి రేప్ చెయ్యాలన్న ఆలోచన అసలు రాదు. రేప్ సంగతి అలా ఉంచితే, ఒక అమ్మాయి ఇష్టపడి తనవద్దకు వచ్చినా అతనా పని చెయ్యడు గాక చెయ్యడు. ఎందుకని?

బ్రహ్మజ్ఞానికి ద్వంద్వం ఉండదు. తను తప్ప వేరొకటి అతనికి ఈ సృష్టిలో ఎక్కడా కనపడదు. ఎటు చూచినా తాను తప్ప వేరేది కనపడని వాడు ఇక అంత చండాలంగా ఎలా ప్రవర్తించగలడు? అది జరిగే పని కాదు.

శ్లో|| నా విరతో దుశ్చరితా నాశాంతో నా సమాహిత:
నాశాంత మానసో వాపి ప్రజ్ఞానేనైవ మాప్నుయాత్ ||

అంటుంది యజుర్వేదాన్తర్గతమైన కఠోపనిషత్తు. ఏమిటి దీనర్ధం?

"ప్రపంచ భోగాలంటే విరక్తి లేనివాడు, చెడు ప్రవర్తన కలిగినవాడు, శాంతి లేనివాడు, నిశ్చలమైన మనస్సు లేనివాడు - ఇలాంటి వాడు ఎన్నటికీ జ్ఞానాన్ని పొందలేడు". అని వేదమే చెబుతున్నది.

నేను వ్రాసిన 'శ్రీవిద్యారహస్యం' అనే పుస్తకంలో 'మాయ గురువులు- మాయను దాటించే గురువులు' అనే అధ్యాయంలో ఇదే పాయింట్ ఎన్నోచోట్ల వ్రాశాను. నేటి గురువులలో చాలామంది మాయగురువులే అని నొక్కి మరీ చెప్పాను. ఈ విషయం ప్రతిరోజూ రుజువౌతూనే ఉన్నది.

ఆశారాం బాపూకు ఇండియాలోనే 200 ఆశ్రమాలున్నాయట. వాటిని నమ్మి ఆయా ఊర్లలో ఎన్ని వేలమంది ఇతనికి మూర్ఖభక్తులుగా ఉన్నారో ఇప్పుడు వారి గతి ఏమిటో ఆ దేవునికే ఎరుక !!

కలియుగంలో మాయశిష్యులు ఎక్కువ అందుకే మాయ గురువులూ ఎక్కువే. 'మహిమలు చేసే దొంగ బాబాలనూ, మాయమాటలు చక్కగా చెప్పే దొంగ గురువులనూ నమ్మితే అధోగతే, నమ్మకండి!' అని నేను దాదాపు పదేళ్ళనుంచీ చెబుతున్నాను. ఇది సత్యం అని ప్రతిరోజూ రుజువౌతున్నది.

రేప్ అనేది ఎవడు చేసినా తప్పే ! అందులోనూ ప్రపంచానికి ఆదర్శంగా ఉండాల్సిన గురువులు చేస్తే అది మామూలు తప్పు కాదు ! క్షమించరానంత ఘోరమైన తప్పు !!

ప్రపంచం మాయ అని వేదాంతం అంటుంది. నేటి ఆధ్యాత్మిక ప్రపంచం కూడా అంతకంటే పెద్దమాయ అని అనుభవం చెబుతున్నది. సత్యాన్వేషి అయినవాడు ఇలాంటి దొంగ స్వాముల, దొంగ గురువుల మాయలో పడరాదు. పడితే వాడి పని అధోగతే అన్నది అసలైన సత్యం !!

ఊరకే మాటలు చెప్పినంత మాత్రాన బ్రహ్మజ్ఞానం వస్తుందా పిచ్చి కాకపోతే?
read more " బ్రహ్మజ్ఞానులకు రేప్ తప్పు కాదా? ఇదేం వక్రభాష్యం? "

26, ఏప్రిల్ 2018, గురువారం

ఆశారాం బాపూ - రజనీష్ - ధనూరాశిలో శనికుజులు


ఆశారాం బాపూ
మొన్న 22 తేదీన ఒక పోస్ట్ వ్రాస్తూ ధనూరాశి సహజ నవమ స్థానంగా ధార్మిక సంస్థలకు. దేవాలయాలకు, గురువులకు సూచిక కాబట్టి అందులో శనికుజుల సంచారం వల్ల ఈ రంగాలకు దెబ్బలు తగులుతాయని వ్రాశాను. ఇది వ్రాసి మూడు రోజులు కూడా గడవక ముందే, వివాదాస్పద గురువు ఆశారాం బాపూ కు రేప్ కేసులో యావజ్జీవ జైలుశిక్ష విధిస్తూ తీర్పు వచ్చింది. ఇది స్పష్టంగా శనికుజయోగం ఇచ్చిన తీర్పే.

రజనీష్
ఆశారాం బాపూ యొక్క వివాదాస్పద చరిత్రలోకి నేను పోదలచుకోలేదు. అది నాకనవసరం. గురువులపైన శనికుజుల ప్రభావం ఎలా ఉంటుందనేది మాత్రమే నేనిక్కడ మాట్లాడదలచుకున్నాను.

శనీశ్వరుడు రాశిచక్రాన్ని చుట్టి రావడానికి 30 ఏళ్ళు పడుతుందనేది అందరికీ తెలిసినదే. శని కుజులు సరిగ్గా 30 ఏళ్ళ క్రితం ధనూరాశిలో ఇదే పరిస్థితిలో ఉన్నారు. సమాజం మీదా మనుషులమీదా గ్రహప్రభావం అనేది నిజమే అయితే, అప్పుడు కూడా ఇలాంటి సంఘటనలు జరిగి ఉండాలి. అవేమిటో గమనిస్తే మనుషులపైన గ్రహప్రభావం ఎంత స్పష్టంగా ఉంటుందో అర్ధమౌతుంది. ప్రపంచం చేత ఎంతో గౌరవించబడే సోకాల్డ్ మహనీయులు కూడా గ్రహశక్తుల ముందు కీలుబోమ్మలేనన్నది స్పష్టం. 

30 ఏళ్ళ క్రితం మార్చ్ - 1988
శనికుజులు ధనూరాశిలో
సరిగ్గా 30 ఏళ్ళ క్రితం 13-2-1988 నుంచి 28-3-1988 వరకూ శని కుజులు ధనూరాశిలో సంచరించారు. విచిత్రం !! ఇదే సమయంలో వివాదాస్పద గురువు ఓషో రజనీష్ జీవితంలో చివరి దశ జరిగింది. ఆయన 1990 జనవరిలొ చనిపోయాడు. విచిత్రంగా అప్పుడు కూడా ధనూరాశిలో శని కుజుల సంయోగం జరిగింది.

నిజానికి 30 ఏళ్ళ క్రితం ఇదే సమయంలో  పూనా ఓషో ఆశ్రమం అనేక లుకలుకలలో చిక్కుకుని ఉన్నది. అమెరికాలో ఆశ్రమం పెడదామని వెళ్ళిన ఆయన చావు తప్పి కన్ను లొట్టపోయినట్లు అయి, అమెరికా ప్రభుత్వం చేత వెనక్కు పంపబడ్డాడు. 1985 లొ వెనక్కు వచ్చిన ఆయన అప్పటినుంచీ పూనా ఆశ్రమంలోనే ఉంటూ వచ్చాడు. కానీ 1988 ఇదే సమయంలో పూనా ఆశ్రమంలో అనేక రాజకీయాలు, శిష్యుల మధ్యన గొడవలు, అధికారం కోసం కుట్రలు జరిగాయి. రజనీష్ ఆరోగ్యం అప్పటికే బాగా క్షీణించింది. ఇంక కొద్ది నెలలలో ఆయన చనిపోతాడని తెలుసుకున్న శిష్యులు వేల కోట్ల రూపాయల ఆయన ఆస్తులకోసం ప్రయత్నాలు ప్రారంభించారు. ఈ క్రమంలో వారి మధ్యన ఎన్నో గొడవలు జరిగాయి. ఒక స్టేజిలో రజనీష్ ను పోలీసులు అరెస్ట్ చెయ్యబోయారు కూడా. ఇలాంటి గొడవలన్నీ సరిగ్గా 30 ఏళ్ళ క్రితం పూనాలో జరిగాయి. ఇవి కూడా స్పష్టంగా ధనూరాశిలో శనికుజుల ప్రభావమే.

అంతేకాదు. ఇంకా కొన్ని పోలికలున్నాయి. రజనీష్ ఆశ్రమంలో, ఇష్టపడిన వారి మధ్యన ఫ్రీ సెక్స్ అనేది సర్వసాధారణంగా జరుగుతూ ఉండేది. అంతేకాదు అక్కడ స్మగ్లింగ్, డ్రగ్స్ వంటి నేరాలు కూడా జరుగుతూ ఉండేవి. ప్రస్తుతం ఆశారాం బాపూ ఆశ్రమంలో జరిగినవి కూడా సెక్స్ నేరాలే. పూనా ఆశ్రమంలో రజనీష్ సన్నిహితులు ఇన్నర్ సర్కిల్ వారికి కూడా ఈ నేరాలతో సంబంధాలున్నాయి. ప్రస్తుతం కూడా ఆశారాం బాపూ కుమారుడు నారాయణ సాయి కూడా ఇంకో రేప్ కేసులో దోషిగా ఉన్నాడు. ఇంతకు ముందు కూడా ఇతని మీద ఇలాంటి ఆరోపణలున్నాయి. ఇంకా మిగిలిన కోణాలు దర్యాప్తులో బయటపడొచ్చు.

రజనీష్ ఆశ్రమం కూడా ఇండియాకు పశ్చిమ తీరంలోనే ఉంది. ఆశారాం బాపూ కూడా గుజరాత్ వాడే. పశ్చిమతీర రాష్ట్రాలలోనే ఆయనకు మంచి అనుచరగణం ఉన్నది. ఈ కోణం కూడా గమనించదగ్గదే. రజనీష్, ఆశారాం ఇద్దరూ కూడా గడ్డాలు పెంచుకుని దాదాపు ఒకలాగే కనిపిస్తారు. ఈ కోణాన్ని కూడా గమనించాలి.

జనవరి 1990 రజనీష్ మరణ సమయంలో
శని కుజులు ధనూరాశిలో
కనుక గ్రహప్రభావం అనేది, అది జరిగిన ప్రతిసారీ దాదాపుగా ఒకే రకమైన ఫలితాలు ఇస్తూ ఉంటుంది అనేది స్పష్టం. కాకపోతే మారిన పరిస్థితుల దృష్టా వ్యక్తులు మారవచ్చు, ప్రాంతాలు మారవచ్చు, సంఘటనలు మారవచ్చు. కానీ ట్రెండ్ అనేది మాత్రం ఒకలాగే ఉంటుంది. హ్యూమన్ డ్రామా చాలా విచిత్రంగా అవే సన్నివేశాలతో రకరకాల చోట్ల రకరకాలుగా జరుగుతూ ఉంటుంది.

ఇదంతా చూస్తున్న తర్వాత, మనుషుల మీద గ్రహప్రభావం ఏమాత్రమూ ఉండదని తెలివైనవాళ్ళు ఎవరైనా ఎలా అనగలరు?
read more " ఆశారాం బాపూ - రజనీష్ - ధనూరాశిలో శనికుజులు "

23, ఏప్రిల్ 2018, సోమవారం

Dil diya dard liya - Mohammad Rafi


Dilruba maine tere pyar me kya kya na kiya అంటూ మహమ్మద్ రఫీ సుతారంగా ఆలపించిన ఈ మధురగీతం 1966 లో వచ్చిన Dil diya dard liya అనే చిత్రంలోనిది. సంగీత దర్శకుడు నౌషాద్ ఎలాంటి మధుర స్వరాలను తన పాటలకు సమకూరుస్తాడో సంగీతాభిమానులకు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. నౌషాద్ స్వరపరచిన అనేక మధురగీతాలలో ఇదీ ఒకటి.

నా స్వరంలో కూడా ఈ మధురగీతాన్ని వినండి మరి !

Movie:-- Dil Diya Dard Liya (1966)
Lyrics:--Shakil Badayuni
Music:--Naushad
Singer:--Mohammad Rafi
Karaoke Singer:-- Satya Narayana Sarma
Enjoy
-----------------------------------------
Dilruba maine tere pyar me kya kya na kiya
Dil diya dard liya -2
Kabhi phoolon me gujaari Kabhi kaaton me jiya
Dil diya dard liya -2

Zindagi aaz bhi hai – Bekhudi aaj bhi hai
Pyar kehte hai jise – Vo khushi aaj bhi hai
Maine din raat - mohabbat ka teri - jaam piya
Dil diya dard liya -2
Dilruba maine tere pyar me kya kya na kiya
Dil diya dard liya -2

Kya kahu tere liye – Maine aasu bhi piye
Kabhi khamosh rahaa – Kabhi shikve bhi kiye
Karliya chaak kare - baakabhi daaman ko siya
Dil diya dard liya -2
Dilruba maine tere pyar me kya kya na kiya
Dil diya dard liya -2

Pyar ki jaan hai tu – Dilka armaan hai tu
Koun duniya se dare – Jab nige baan hai tu
Apni kashtee - ko sahare pe tere - chod diya
Dil diya dard liya -2
Dilruba maine tere pyar me kya kya na kiya
Dil diya dard liya -2
Kabhi phoolon me gujari – Kabhi kaaton me jiya
Dil diya dard liya -2

Meaning

Oh the thief of my heart !
What things did I not do in your love?
I gave you my heart
and got back nothing but pain
Among the flowers I lived
and also among the thorns
I gave you my heart
and got back nothing but pain

Even today there is life
even today there is intoxication
What people call 'love'
that bliss is there as well
Day and night, I did nothing
but drank the wine of your love

What can I say? For your sake
I even drank my own tears
Sometimes I remained silent
sometimes I complained on you
I tore away my dress and stitched it again
(I became mad in your love)

You are the soul of Love
You are my heart's desire
Who is afraid of the world?
When you are my protector
I have left my boat under your steering

Oh the thief of my heart !
What things did I not do in your love?
I gave you my heart
and got back nothing but pain
Among the flowers I lived
and also among the thorns
I gave you my heart
and got back nothing but pain

తెలుగు స్వేచ్చానువాదం

ఓ ప్రేయసీ ! నువ్వు నా హృదయాన్ని నా నుండి కాజేశావు
నీ ప్రేమలో నేనేం చేశానో ఏమయ్యానో నీకెలా చెప్పను?
నీకు నా హృదయాన్ని ఇచ్చాను
ప్రతిఫలంగా వేదననే పొందాను

కొన్ని సార్లు పూదోటలలో విహరించాను
కొన్ని సార్లు ముళ్ళతో కలసి బ్రతికాను
ప్రతిసారీ నీకు నా హృదయాన్ని ఇచ్చాను
ప్రతిఫలంగా వేదననే పొందాను

నేటికీ నేను జీవించే ఉన్నాను
నేటికీ నాలో ప్రేమమైకం ఉంది
లోకం దేన్నయితే ప్రేమోన్మాదం అంటుందో
అదికూడా నాలో ఉంది
పగలూ రాత్రీ అదేపనిగా నీ ప్రేమమధువును త్రాగడం తప్ప
నేనింకే పనీ చెయ్యడం లేదు

నీకెలా చెప్పను?
నీకోసం నా కన్నీటిని నేనే త్రాగాను (ఎంతో విలపించాను)
కొన్నిసార్లు ఆలోచనలలో మునిగి మౌనంగా ఉన్నాను
కొన్నిసార్లు నీపైన దేవుడికి ఫిర్యాదు చేశాను
కొన్నిసార్లు నా దుస్తులను నేనే చింపుకుని మళ్ళీ కుట్టుకున్నాను
(పిచ్చివాడినయ్యాను)

ప్రేమ అనేదాని ఆత్మవు నీవే
నా హృదయంలో నిండి ఉన్న కోరికవూ నీవే
నువ్వే నన్ను రక్షిస్తూ ఉన్నపుడు
నాకు లోకమంటే భయం ఏముంటుంది?
నా నావను నీ ఇష్టం వచ్చినట్లు నడుపు
దానిని నీ చేతులలో ఉంచాను

ఓ ప్రేయసీ ! నువ్వు నా హృదయాన్ని నా నుండి కాజేశావు
నీ ప్రేమలో నేనేం చేశానో ఏమయ్యానో నీకెలా చెప్పను?
నీకు నా హృదయాన్ని ఇచ్చాను
ప్రతిఫలంగా వేదననే పొందాను
read more " Dil diya dard liya - Mohammad Rafi "

22, ఏప్రిల్ 2018, ఆదివారం

Mai Dil Hoon Ik Arman Bhara - Talat Mehmood


Rajendra Krishan and Talat Mehamood
Mai dil hoo ik arman bhara - Tu aake mujhe pehchan zara

అంటూ తలత్ మహమూద్ సుతారంగా ఆలపించిన ఈ గీతం 1952 లో వచ్చిన Anhonee అనే చిత్రంలోనిది. ఈ పాట వయసు ఇప్పుడు 66 ఏళ్ళు. అయినా ఈనాటికీ ఇది మరపురాని మధురగీతమే. మంచి సాహిత్యం మంచి సంగీతం కాలాన్ని అధిగమించి ఎలా నిలబడి ఉంటాయో ఇలాంటి పాటలు నిరూపిస్తాయి. పాతతరం సంగీత దర్శకులలో రోషన్ లాల్ చాలా మధురమైన రాగాలను సమకూర్చాడు. ఈయన పాటలన్నీ సుమధుర గీతాలే.

నా స్వరంలో కూడా ఈ మధురగీతాన్ని వినండి మరి.

Movie:-- Anhonee (1952)
Lyrics:-- Rajendra Krishan
Music:--Roshan Lal
Singer:-- Talat Mehmood
Karaoke Singer:-- Satya Narayana Sarma
Enjoy
--------------------------------------------
Mai dil hoo ik armaan bhara
tu aake mujhe pehchan zara
Mai dil hoo ik armaan bhara

Ik sagar hoo thehra thehra aaa – 2
Tu aake mujhe pehchan zara
Mai dil hoo ik armaan bhara

Khud maine husn ke haathon me
shoki ka chalaktha jaam diya
Galon ko gulabon ka rutwa
Kaliyon ko labon ka nam diya – naam diya
Aakhon ko diya saagar gehraa aaaa – 2
Tu aake mujhe pehchan zara
Mai dil hoo ik armaan bhara

Ye sach hai teri mehfil me -2
Mere afsane kuch bhi nahee
Par dil kee doulat ke aaage $$$$
Duniya ke khazane kuchbhi nahee
Yoo mujhse nigahon ko na chura aaa- 2
Tu aake mujhe pehchan zara
Mai dil hoo ik armaan bhara

Meaning

I am a heart filled with desire
Come and understand who I am
I am a heart filled with desire

I am an ocean which is still and profound
Come and feel what is my depth
I am a heart filled with desire
Come and understand who I am

I did put into the hands of beauty
a goblet brimming with honor
I conferred into her cheeks the honor of roses
and the honor of buds to her lips
I called her eyes, deep blue seas
Come and understand who I am

It is true that in your musical party
my role is insignificant
But compared to the wealth of heart
all the worldly riches are just nothing
Do not turn away your eyes from me
Come and understand who I am
I am a heart filled with desire
Come and understand who I am

తెలుగు స్వేచానువాదం

నేనొక ప్రేమావేశంతో నిండిన హృదయాన్ని
వచ్చి నేనెవరినో గ్రహించు
నేనొక నిశ్చల సముద్రాన్ని
వచ్చి నా లోతెంతో గ్రహించు
నేనొక ప్రేమావేశంతో నిండిన హృదయాన్ని

సౌందర్యం అనే వనిత చేతులలో
గౌరవం అనే మధుపాత్రను నేనే ఉంచాను
తన బుగ్గలకు గులాబీలను ఇచ్చాను
తన పెదవులకు మొగ్గల సౌకుమార్యాన్ని పొదిగాను
తన కన్నులలో నీలాల సముద్రాలను ఉంచాను
వచ్చి నేనెవరినో గ్రహించు

నీ గాన సమూహంలో
నాకేమీ చెప్పుకోదగ్గ పాత్ర లేదని తెలుసు
అయినా ఒక మాట విను
హృదయపు సంపదతో పోలిస్తే
ధనసంపద చాలా అల్పమైనది
నీ కన్నులను నానుంచి త్రిప్పుకోకు
వచ్చి నేనెవరినో గ్రహించు

నేనొక ప్రేమావేశంతో నిండిన హృదయాన్ని
వచ్చి నేనెవరినో గ్రహించు
read more " Mai Dil Hoon Ik Arman Bhara - Talat Mehmood "

గత నెలరోజులుగా యాక్సిడెంట్లు - 2

మానవ జీవితం ఎంత సంక్లిష్టంగా ఉంటుందో గ్రహచలనం కూడా అంతే సంక్లిష్టంగా ఉంటుంది. ఈ రెంటికీ సంబంధాలను గమనిస్తూ అర్ధం చేసుకుంటూ ఉంటే చాలా అద్భుతమైన విశ్వలీల మనకు అర్ధమౌతుంది.

ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలలో సినీ పరిశ్రమలోనూ రాజకీయప్రపంచంలోనూ దుమారం పుట్టిస్తున్న 'కాస్టింగ్ కోచ్' వివాదంలో అసలు విషయం మరుగునపడిపోయి, ఎవరు ఎవర్ని దూషించారు? అలా ఎందుకు అనాలి? అనే విషయం తెరమీదకు తేబడింది. ఈ వివాదం దారిమళ్ళిన తుఫాన్ లాగా ఎటెటో పోతున్నది. రకరకాల శక్తులు రంగప్రవేశం చేసి దీనిని ఇష్టంవచ్చినట్లు మార్చేస్తున్నాయి. ఈ సందర్భంగా గ్రహప్రభావాన్నిమరొక్కసారి గమనిద్దాం.

20-4-2018 న శుక్రుడు వృషభరాశిలోకి ప్రవేశించినప్పటికి రెండు రోజుల ముందే శనీశ్వరుడు వక్ర స్థితిలోకి వచ్చేశాడు. అంటే నాడీ జ్యోతిష్య సూత్రాల ప్రకారం ఆయన ప్రస్తుతం వృశ్చిక రాశిలోకి వచ్చినట్లు లెక్క. కనుక మళ్ళీ శని శుక్రులమధ్యన సమసప్తక స్థితి ఏర్పడింది. ఇది మంచి సూచన కాదు. పైగా శత్రుక్షేత్రం అయిన వృశ్చికంలో శనీశ్వరుడు శాంతిగా ఏమీ ఉండలేడు. కనుక ఈ సమాజంలో జరుగుతున్న లైంగిక నేరాలు ఆరోపణలు తగ్గకపోగా ఇంకా పెరుగుతాయని చెప్పాలి. పైగా, ఇంతకు ముందులేని కుట్రలు కుతంత్రాలు ఈ మొత్తం వ్యవహారంలో చోటుచేసుకుంటాయి.

అధికార సూచకుడైన సూర్యుడు ఉచ్చస్తితిలో ఉన్నందువల్ల ఉన్నతాధికారులకు రాజకీయ నాయకులకు కూడా ఈ విషయంలో పాత్ర ఉందని స్పష్టంగా తెలుస్తుంది. దీనికి వత్తాసుగా బుద్ధి కారకుడైన బుధుడు నీచస్థితిలో ఉండటం వల్ల, ఈ పరస్పర ఆరోపణలు చేసుకునేవారికి బుద్ది అనేది లోపిస్తుంది. వక్రబుద్ధితో రకరకాలైన నీచారోపణలు చేసుకోవడం ఇందుకే జరుగుతున్నది. ఇదంతా బుధుడు తన నీచస్థితిలోనుంచి బయటపడి రాశి మారేటంతవరకూ అంటే, ఇంకొక రెండు వారాలు కొనసాగుతుంది.

ఇకపోతే ధనూరాశిలో శనికుజుల కలయిక వల్ల దేవాలయాలకూ, ధార్మిక సంస్థలకూ గురువులకూ ప్రమాదాల ముప్పు పొంచి ఉందని తేలికగా అర్ధమౌతున్నది. ఎందుకంటే, ధనుస్సు సహజ నవమస్థానంగా దేవాలయాలకూ ధార్మిక సంస్థలకూ గురువులకూ సూచిక. నిన్న రాత్రి ఈ పోస్ట్ ప్రతిని తయారు చేస్తున్న సమయంలోనే అమెరికాలోని మిషిగన్ రాష్ట్రంలో ఉన్న పరాశక్తి ఆలయంలో హోమం జరుగుతున్నపుడు అగ్నిప్రమాదం జరిగి దేవాలయాన్ని నాలుగురోజులపాటు మూసివేస్తున్నట్లుగా ప్రకటించారు. త్వరలో మన దేశంలో కూడా ఇలాంటి వార్తలు వినబోతున్నాం.

10-5-2018 న బుధుడు మేషరాశిలోకి మారేవరకూ మన రాష్ట్రంలోని సినిమా/ రాజకీయ రంగంలో ఈ కుట్రలు ఆరోపణలు తప్పవు. అలాగే 15-5-2018 న సూర్యుడు వృషభ రాశికి, శుక్రుడు మిధునరాశికి మారేవరకూ ప్రమాదాలు, సెక్స్ నేరాలు, ఆరోపణలు ఉంటూనే ఉంటాయి. యూ ట్యూబ్, ఫేస్ బుక్, ట్విటర్ లలో ఈ వినోదం కొనసాగుతూనే ఉంటుంది.  గమనించండి.
read more " గత నెలరోజులుగా యాక్సిడెంట్లు - 2 "

21, ఏప్రిల్ 2018, శనివారం

Ye Jo Mohabbat Hai - Kishore Kumar


Ye jo mohabbat hai అంటూ కిశోర్ కుమార్ ఆలపించిన ఈ మధురగీతం 1970 లొ వచ్చిన Kati Patang అనే చిత్రం లోనిది. ఇది ఒక నిష్టుర ప్రేమగీతం. ఈ పాటలో రాజేష్ ఖన్నా నటించాడు. ఈ ఆపాత మధురగీతాన్ని కూడా నా స్వరంలో వినండి మరి.

Movie:-- Kati Patang (1970)
Lyrics:-- Anand Bakshi
Music-- RD Burman
Singer:-- Kishore Kumar
Karaoke Singe:-- Satya Narayana Sarma
Enjoy
----------------------------------------
Ye jo mohabbat hai – ye unka hai kaam
Mehboob kajo Bas lethe huye naam
Mar jaaye mit jaaye ho jaaye badnaam
Rehne do chodo bhi janedo yaar
Ham na karenge pyaar

[Tute agar sagar naya sagar koyi lele
Mere khuda dilse koyi kisike na khela]-2
Dil toot jaye tho kyaho anjaam
Ye jo mohabbat hai – ye unka hai kaam
Mehboob kajo Bas lethe huye naam
Mar jaaye mit jaaye ho jaaye badnaam
Rehne do chodo bhi janedo yaar
Ham na karenge pyaar
Rehne do chodo bhi janedo yaar
Ham na karenge pyaar

[Aankhe kisi sena ulajh jaye mai darta hu
Yaron hasinon ki gali se me gujartha hu]-2
Bas door hi se karke salaam
Ye jo mohabbat hai – ye unka hai kaam
Mehboob kajo Bas lethe huye naam
Mar jaaye mit jaaye ho jaaye badnaam
Rehne do chodo bhi janedo yaar
Ham na karenge pyaar
Rehne do chodo bhi janedo yaar
Ham na karenge pyaar

Meaning

This is what is called love
this is how it works
who thinks of his lover always
he will die, he will disappear and he will get a bad name
Ok friends ! Let it be ! never mind
I will never fall in love again

If a wine glass breaks, we can take a new one
Oh my God ! let no one play with a heart !
If the heart breaks, then nobody knows what will happen

I am afraid that my eyes get hooked to some girl's eyes
Friends ! I confess ! I do pass through the lanes of beautiful girls
I just greet them from a safe distance
and leave those lanes, thats all
I will never go further

This is what is called love
this is how it works
who thinks of his lover always
he will die, he will disappear and he will get a bad name
Ok friends ! Let it be ! never mind
I will never fall in love again

తెలుగు స్వేచ్చానువాదం

ప్రేమంటే ఇదే
ప్రేమ ఇలాగే పనిచేస్తుంది
తన ప్రేయసి పేరును ఎవడు కలవరిస్తాడో
ఎవడైతే ఆమెను ఎప్పుడూ తలచుకుంటూ ఉంటాడో
వాడు అలాగే ఆరిపోతాడు, చనిపోతాడు
నలుగురిలో చెడ్డపేరు తెచ్చుకుంటాడు
ఓ స్నేహితులారా పోనివ్వండి నన్నిలా ఒదిలెయ్యండి
నేనిక ఎప్పుడూ ప్రేమలో పడనుగాక పడను

ఒక మధుపాత్ర పగిలిపోతే ఇంకొక దాన్ని తీసుకోవచ్చు
కానీ హృదయమే పగిలిపోతే? ఏమౌతుందో ఎలా చెప్పడం?
అందుకే ఎవ్వరూ హృదయాలతో ఆటలు ఆడకండి

నా చూపులు ఏ సుందరి చూపులతో కలుస్తాయో అని నాకు తగని భయం
నిజమే ! నా తప్పు ఒప్పుకుంటున్నాను
నేను అందగత్తెల వీధులలో తిరుగుతూ ఉంటాను
కానీ దూరంనుంచే వాళ్లకు ఒక నమస్కారం పెట్టి బయటపడతాను
వాళ్ళ దగ్గరగా మాత్రం ఎప్పుడూ పోను

ప్రేమంటే ఇదే
ప్రేమ ఇలాగే పనిచేస్తుంది
తన ప్రేయసి పేరును ఎవడు కలవరిస్తాడో
ఎవడైతే ఆమెను ఎప్పుడూ తలచుకుంటూ ఉంటాడో
వాడు అలాగే ఆరిపోతాడు, చనిపోతాడు
నలుగురిలో చెడ్డపేరు తెచ్చుకుంటాడు
ఓ స్నేహితులారా పోనివ్వండి నన్నిలా ఒదిలెయ్యండి
నేనిక ఎప్పుడూ ప్రేమలో పడనుగాక పడను
read more " Ye Jo Mohabbat Hai - Kishore Kumar "