“అసమర్ధజాతికి ఆత్మగౌరవ అర్హత ఉండదు"

23, జనవరి 2018, మంగళవారం

జ్యోతిష్యం వాస్తు నిజమని నిరూపిస్తే 6 కోట్లు

అప్పుడప్పుడు నాకు చాలా ఈ మెయిల్స్ వస్తూ ఉంటాయి.

'ఎవరో హేతువాద సంఘం వాళ్ళు ప్రైజ్ మనీ ఎనౌన్స్ చేశారు. జ్యోతిష్యం వాస్తు నిజమని నిరూపిస్తే 6 కోట్లు ఇస్తామని అంటున్నారు. మీరు నిరూపించి ఆ డబ్బులు తీసుకోవచ్చు కదా?' అని.

నేను నవ్వుకుని ఊరుకుంటూ ఉంటాను.

మన తెలుగురాష్ట్రంలో ఈ ప్రైజ్ మనీ ఇప్పుడు వచ్చిందేమో? అర్ధశతాబ్దం క్రితమే ఇలాంటి చాలెంజ్ లు విదేశాలలో చాలా ఉన్నాయి. ఇంటర్నేషనల్ ఎతీస్ట్ సెంటర్స్ ఇలాంటి చాలెంజ్ లు ఎన్నో చేశాయి. ఇప్పటికీ ఆ చాలెంజ్ లను ఎవరూ స్వీకరించలేదు.

ఎందఱో పేరు మోసిన జ్యోతిష్కులు విదేశాలలో కూడా ఉన్నారు. వారు వెస్టర్న్ ఎస్ట్రాలజీ ని అనుసరిస్తారు. కానీ వాళ్ళు కూడా ఈ చాలెంజ్ ని స్వీకరించరు. ఎందుకంటే ఆ చాలెంజ్ చేసినవాళ్ళు పెట్టే కండిషన్స్ ఎలా ఉంటాయంటే, ఒకవేళ జ్యోతిష్కులు గెలిచినా, గెలవలేదని నిరూపించేలా అవి డిజైన్ చెయ్యబడి ఉంటాయి. మూర్ఖంగా వాదించి 'మీరు గెలవలేదు' అని వాళ్ళే నిరూపిస్తారు. కనుక అలా గెలవడం జరిగేపని కాదని వీరికి బాగా తెలుసు. అందుకే ఆ చాలెంజ్ ని నిజమైన జ్యోతిష్కులు ఎవ్వరూ స్వీకరించరు. ఇక కుహనా జ్యోతిష్కుల సంగతి చెప్పనే అక్కర్లేదు. వారెలాగూ ఓడిపోక తప్పదు. అందుకని వారూ ఈ చాలెంజ్ ని స్వీకరించరు.

మొన్నీ మధ్యనే ఒక కొలీగ్ కీ నాకూ మధ్య దీనిమీద సంభాషణ నడిచింది.

"ఆ చాలెంజ్ స్వీకరించి 6 కోట్లు కొట్టెయ్యొచ్చుగా?" అడిగాడు కొలీగ్.

'ఫస్ట్ నువ్వు వాడుతున్న పదమే తప్పు. కొట్టెయ్యడం అనే దానిమీద నాకు ఇంటరెస్ట్ లేదు. నేను దొంగను కాను ఆ పని చెయ్యడానికి." అన్నాను నవ్వుతూ.

'అదికాదు. ఏదో మాటవరసకి వాడాన్లే ఆ పదాన్ని. జ్యోతిష్యం నిజమే అని నువ్వు ప్రూవ్ చెయ్యొచ్చు కదా?' అన్నాడు.

'ఒకరికి ప్రూవ్ చెయ్యవలసిన పని నాకు లేదు. అది నిజమైన శాస్త్రమే అని నాకు తెలుసు. ఇంకొకరిని ఒప్పించాల్సిన పని నాకు లేదు. వారు ఒప్పుకుంటే నాకు ఒరిగేది కూడా లేదు' అన్నాను.

'ఎందుకు ఒరగదు? ఆరు కోట్లు అంటే మామూలు విషయం కాదుగా?' అన్నాడు.

'తేరగా వచ్చే సొమ్మంటే నాకు నమ్మకం లేదు. కష్టం లేకుండా అలా తేరగా వచ్చే సొమ్ము ఒక్క రూపాయికూడా నాకక్కర్లేదు. దానితో చాలా కర్మకూడా వస్తుంది. దాన్ని మోసే ఖర్మ నాకెందుకు? ఇప్పటికున్న కర్మ చాలు.' అన్నాను.

'పోనీ నీకు అవసరం లేకుంటే, తీసుకుని చారిటీకి ఇచ్చేయ్' అన్నాడు.

'ఎవరున్నారు మంచిగా చారిటీ చేసేవాళ్ళు? ఒక్కరిని చూపించు. అన్నీ రాజకీయాలే. అన్నీ స్వార్ధాలే. అన్నీ కుట్రలూ కుతంత్రాలే. అంత డబ్బు వాళ్లకిచ్చి ఆ కర్మను మోసే పని నాకెందుకు? నీకంత దురదగా ఉంటే నీ చేతనైనంతలో ఆ పని నువ్వే చెయ్యి' అన్నా.

'మరి ఇంత నేర్చుకుని, ఎవడికీ ఉపయోగం లేకపోతే, నీ టైం అంతా వేస్ట్ కాలేదా?' అన్నాడు తెలివిగా.

'ఇక్కడ ఎవడి టైం వేస్ట్ కావడం లేదో కాస్త చెప్పు? బిలియన్స్ సంపాదించిన వాడి టైం కూడా చివరికి వేస్టే. అది వాడికి అర్ధం కావడానికి 'టైం' పడుతుంది. అంతే. ఈ లోకంలో ప్రతివాడూ చేస్తున్నది ఒకటే పని - టైం వేస్ట్ - చెయ్యడమే. అది తప్ప ఎవరూ ఏమీ చెయ్యడం లేదు.' అన్నాను.

'కనీసం నీకైనా ఈ శాస్త్రం ఉపయోగపడుతోందా" అన్నాడు విసుగొచ్చి.

ఇక వీడితో ఇలా కాదని - 'ఉపయోగపడటం కోసం కాదు నేను దీనిని నేర్చుకుంది?' అన్నాను.

అది వాడికి అర్ధం కాలేదు.

'మరెందుకు?' అన్నాడు అయోమయంగా.

'టైం పాస్ కోసం నేర్చుకున్నాను. టైం వేస్ట్ చేస్తూ పోస్టులు వ్రాస్తున్నాను. సింపుల్ గా చెప్పాలంటే అంతే.' అన్నాను.

'అదేంటి?' అన్నాడు మళ్ళీ అయోమయంగా.

'అదంతే ! జ్యోతిష్యం ఒకరికి ప్రూవ్ చెయ్యాల్సిన సబ్జెక్ట్ కాదని తెలుసుకోవడం కోసమే దీనిని నేర్చుకున్నాను.నావరకూ నాకు బాగానే ఉపయోగపడుతోంది.' అన్నా నవ్వుతూ.

'ఓహో! చాలెంజ్ స్వీకరిస్తే ఓడిపోతానని భయంతో ఈ కబుర్లు చెబుతున్నావా?' అన్నాడు నవ్వుతూ.

'అవును. 'యుద్ధం చెయ్యనివాడు యుద్ధంలో గెలిచినట్లే' అన్నాడు లావోజు. ముందిది అర్ధం చేసుకో. ఆ తర్వాత తీరిగ్గా నాతో వాదిద్దువు గాని' అన్నా.

'ఏమో. నాకైతే కళ్ళు మూసినా తెరిచినా ఆరు కోట్లే కనిపిస్తున్నాయి' అన్నాడు శూన్యంలోకి చూస్తూ.

'సరే ఒకపని చెయ్యి. రేపట్నించీ నా దగ్గర జ్యోతిష్యశాస్త్రం నేర్చుకో. రెండు మూడేళ్ళలో ఆ చాలెంజ్ నువ్వే స్వీకరించే స్థాయికి ఎదుగుతావు. ఈ లోపల ప్రముఖ జ్యోతిష్కులు ఎవరూ ఆ పనిని చెయ్యరు గాక చెయ్యరు. అంతవరకూ నీకు గ్యారంటీ ఇస్తా.' అన్నా సీరియస్ గా.

'ఫీజు ఎంతేంటి?' అన్నాడు వాడూ నవ్వుతూ.

'వెరీ సింపుల్. నీ దగ్గర ఎక్కువ తీసుకోనులే. రోజుకు ఆరు కోట్లు. అంతే !' అన్నా నేనూ నవ్వుతూ.

'సర్లే పద ! నాకు చాలా పనుంది అవతల' అన్నాడు నీరసంగా.

' నాకూ పనుంది. వస్తా ! ఇంకో సంగతి ! జ్యోతిష్యం వాస్తు నిజాలు కావని నిరూపిస్తే నేను కూడా ఆరు కోట్లు ఇస్తానని ప్రెస్ మీట్ పెట్టబోతున్నా త్వరలో.' అన్నా.

'నీ దగ్గర ఆరు కోట్లు ఎక్కడివి?' అన్నాడు సీరియస్ గా.

'పాత జోకేలే. మళ్ళీ చెబుతున్నా. నేను లా చదివినప్పుడు కుట్టించుకున్న నల్లకోటు ఒకటుంది. రైల్వే టీసీలు వేసుకునే కోట్లు అయిదు దానికి కలిపి ఆరు కోట్లు చేస్తా. అవి ప్రైజుగా ఇస్తా.' అన్నా నవ్వుతూ.

'ఇది ప్రూవ్ చెయ్యడం చాలా తేలిక. నువ్వు ఓడిపోతావ్' అన్నాడు.

'అదీ జరిగే పని కాదు. ఎందుకంటే వాళ్ళు ఎన్నెన్ని చెప్పినా నేను కన్విన్స్ కాను కదా ! కన్విన్స్ కాకూడదు అని ముందే డిసైడ్ అయిపోతానన్నమాట - వాళ్ళలాగానే. కనుక వాళ్ళూ ఈ చాలెంజ్ లో గెలవలేరు. ఒకవేళ గెలిచినా మనకు పోయేదేముంది పాత కోట్లు తప్ప? దరిద్రం పోతుంది.' అన్నాను నవ్వుతూ.

వాడి దారిన వాడు చక్కా పోయాడు.

కధ కంచికి మనం ఇంటికి !
read more " జ్యోతిష్యం వాస్తు నిజమని నిరూపిస్తే 6 కోట్లు "

18, జనవరి 2018, గురువారం

నిత్య జీవితంలో ప్రశ్నశాస్త్రం - మొబైల్ చార్జర్ ఏమైంది?

ఈరోజుల్లో ఏది మర్చిపోయినా అంత కంగారు రాదుగాని, మొబైలు గాని, దాని చార్జర్ గాని మర్చిపోతే మాత్రం చాలా కంగారు పుడుతుంది. ఎందుకంటే పనులన్నీ వాటితోనే జరుగుతున్నాయి గనుక.

నిన్న అర్ధరాత్రిదాకా ఒక ఫంక్షన్ లో కల్చరల్ ప్రోగ్రాం నిర్వహిస్తూ చాలా బిజీగా ఉండవలసి వచ్చింది. ఆ తర్వాత ఇంటికి వచ్చి నిద్రపోయే ముందు చూస్తే, మొబైల్ చార్జర్ కనిపించలేదు. ఈ ఫోన్ పిన్ కు అన్ని చార్జర్లూ సరిపోవు. ఆ మోడల్ ను అలా డిజైన్ చేశాడు లెనోవో గాడు. చార్జ్ చూద్దామంటే, 5% ఉంది. మనకేమో అఫీషియల్ కాల్స్ ఏ సమయంలోనైనా రావచ్చు. ఇక్కడ చార్జ్ చూస్తే తెల్లవార్లూ వచ్చేలా లేదు. ఏం చెయ్యాలి? దానిని ఉంచిన బ్యాగ్ మొత్తం వెదికినా అది కనిపించలేదని తెలిసింది. ఎక్కడ పోయిందబ్బా? అని కొంత ఆలోచన చేసి, ఆ ప్రోగ్రాం హడావిడిలో ఎక్కడో పోయి ఉంటుందిలే, సర్లే పోతే పోయిందిలే ఇంకోటి కొందాం అనుకుంటూ, ఎందుకైనా మంచిదని ఒక్కసారి ప్రశ్న చార్ట్ ని గమనించడం జరిగింది.

ప్రశ్న స్థలం -- గుంటూరు.
తేదీ -- 18-1-2018
ప్రశ్న సమయం -- రాత్రి 12.30

చూడగానే కుండలిలో కాలగ్రస్తయోగం చక్కగా కన్పిస్తోంది. ఆ పైన లగ్నానికి కాలార్గళం పట్టింది. ఒక మనిషిని విసిగించడానికి ఇవి చాలా ఎక్కువ. ఇవి చాలవన్నట్లు, లగ్నాధిపతి చతుర్దంలో తీవ్ర అస్తంగత్వంలో ఉండి మానసిక భ్రమను సూచిస్తున్నాడు. అంతేగాక, చతుర్ధం వల్ల ఆ వస్తువు ఇంట్లోనే ఉంది కానీ కన్పించడం లేదని సూచిస్తున్నాడు. మన: కారకుడైన చంద్రుడు కూడా అక్కడే ఉంటూ వస్తువు ఇంట్లోనే ఉందని, కానీ తప్పుదోవ పట్టిస్తోందనీ సూచిస్తున్నాడు. లగ్నంలో గురువుగారు ఉండి వస్తువు త్వరలోనే దొరుకుతుందని సూచిస్తున్నాడు. ద్వితీయాధిపతిగా విలువైన వస్తువులకు కారకుడు కుజుడు రాశిసంధిలో ఉంటూ వస్తువుల అనిశ్చిత పరిస్థితిని సూచిస్తున్నాడు. కానీ స్వక్షేత్ర స్థితి వల్ల, అది పోలేదని సూచిస్తున్నాడు. లగ్నం మొదటి ద్రేక్కాణంలో ఉంటూ వస్తువు ఇంటి మొదటిభాగంలోనే ఉందని సూచిస్తున్నది. దానిని ఉంచిన బ్యాగ్ హాల్లోనే ఉంచబడింది.

ఇవన్నీ గమనించిన మీదట అది ఎక్కడికీ పోలేదని, అదే బ్యాగ్ లోనే ఇంకో అరలో ఉంటుందని, సరిగ్గా వెదికితే దొరుకుతుందనీ అర్ధమై, నిద్రకు ఉపక్రమించాను.

పొద్దున్నే లేచి అదే బ్యాగ్ లో సైడ్ జిప్ పాకెట్ లో చూడగా అందులో మొబైల్ చార్జర్ చక్కగా దర్శనమిచ్చింది. నిత్యజీవితంలో ప్రశ్నశాస్త్రం ఎలా ఉపయోగపడుతుంది? అనడానికి ఇది ఇంకొక ఉదాహరణ.

అయితే, చార్ట్ ని సరియైన దృష్టితో అర్ధం చేసుకోవాలి. విషయమంతా ఈ అర్ధం చేసుకోవడంలోనే ఉంది. చార్ట్ అనేది అలా అర్ధం కావాలంటే, జ్యోతిష్య శాస్త్ర సూత్రాలు బాగా వంటబట్టి ఉండాలి, ఆ తర్వాత స్ఫురణ (ఇంట్యూషన్) ఉండాలి. వీటికి తోడుగా వందలాది చార్టులను విశ్లేషణ చేసిన అనుభవం ఉండాలి. ఈ మూడూ కలసినప్పుడు ప్రశ్నశాస్త్రం చక్కని ఫలితాలను తప్పకుండా ఇస్తుంది.
read more " నిత్య జీవితంలో ప్రశ్నశాస్త్రం - మొబైల్ చార్జర్ ఏమైంది? "

14, జనవరి 2018, ఆదివారం

త్వరలో రాబోతున్న మా పుస్తకం "మహాసౌరమ్" నుంచి కొన్నిపద్యాలు

సూర్యోపాసన మన మతంలో ఒక విశిష్టమైన అంశం. సూర్యుడు ప్రత్యక్షదైవం. అంటే ప్రతిరోజూ మనకు కళ్ళెదురుగా కనిపించే దైవం. సూర్యుని సకల దేవతాస్వరూపునిగా స్తుతించింది వేదం.

భౌతికవాదులకూ నాస్తికులకూ సూర్యుడు ఒక మండుతున్న నిప్పుల ముద్ద కావచ్చు. కానీ అదే అగ్నిగోళం ఇచ్చే వేడితోనే వాళ్ళూ బ్రతుకుతున్నారన్న స్పృహ కొంచెం ఉంటే, దానినుంచి కృతజ్ఞత పుడుతుంది. ఆ కృతజ్ఞతకు మరో పేరే భక్తి. వారు నిత్యం పొందుతున్న సహాయం పట్ల కృతజ్ఞత లేకుండా నాస్తికులూ భౌతికవాదులూ ఉంటారని నేనైతే అనుకోను. అలా ఉండేవారు అసలు 'మనుషులు' అనే పదానికే అర్హులు కారు మరి.

దేవుడు సృష్టించిన సూర్యుడిని దేవుడిగా పూజించడం ఘోరమైన తప్పని క్రైస్తవమూ ఇస్లామూ వంటి కొన్ని మతాలంటాయి. ఈ మాట విన్నప్పుడు మనకు నవ్వొస్తుంది. దేవుని కంటే దేవుని సృష్టి వేరు కాదు. సృష్టిలో దైవపు వెలుగే ప్రకాశిస్తున్నది. కనుక తేజోవంతములైన వాటిల్లో దైవపు వెలుగును దర్శించి పూజించడం తప్పు కాదు. విషయం మీకు సరిగ్గా అర్ధం కావడం లేదని మనమంటాం.

మనకు కనిపించే వెలుగులలో అతిపెద్ద వెలుగు సూర్యుడే గనుక, "జ్యోతిషామపి తజ్జ్యోతి:" అంటూ ఆయన్ను దైవంగా భావించి పూజించడం చాలా సరియైన పని. ఈ విధమైన ఉపాసనను వేదం సమ్మతించింది. వేదంలో ఉన్న అరుణం, మహాసౌరం వంటి మంత్రభాగాలే దీనికి నిదర్శనాలు. సూర్యోపాసకులకు ఇవి చిరపరిచితములే. స్తోత్రాలలో అయితే రామాయణంలో మనకు లభిస్తున్న 'ఆదిత్య హృదయం' చాలా మంచి స్తోత్రం. లక్షలాది మంది చేత ఇది నిత్యమూ పారాయణం గావింపబడుతున్న స్తోత్రమే.

పంచవటి పబ్లికేషన్స్ నుంచి అతి త్వరలో రాబోతున్న మరో పుస్తకం 'మహాసౌరమ్' నుంచి నేను వ్రాసిన కొన్ని పద్యాలను మకర సంక్రాన్తి రోజున మీకోసం ఇక్కడ ముందుగానే ఇస్తున్నాను. ఇది ఋగ్వేదం లోని మహా ప్రభావవంతములైన మంత్ర సమాహారములలో ఒకటి.

చదవండి.
--------------------------------------------
ఓమ్ !
ఉదుత్యం జాతవేదసం దేవం వహంతి కేతవ:
దృశే విశ్వాయ సూర్యమ్

తే||కాంచు మల్లదె సూర్యుని గుర్రములను
విశ్వమెల్లను జూచెడి వెలుగురేని
సర్వవేత్తను శాసకు సర్వవిభుని
ఆకసంబున నిల్పవె; యవని కొరకు

సూర్యుడు భూమిపైన జరుగుతున్న సమస్తమునూ గ్రహిస్తున్నవాడు. సర్వమునూ శాసిస్తున్నవాడు. సర్వమానవాళికీ ఆయన ప్రభువు. ఎందుకంటే ఆయన ఇచ్చే వేడిమితోనే మనుషులు జంతువులు పక్షులు చెట్లు ఇతర జీవులు బ్రతుకుతున్నాయి. ఆ సూర్యునికి ఏడు గుర్రములున్నాయి. అవే ఆయన కాంతిలోని ఏడు రంగులు. ఆ గుర్రముల రధంపైన అధిరోహించి ఆయన ఆకాశంలో కనిపిస్తున్నాడు. మానవులారా చూడండి !

తే||ఏడు గుఱ్ఱము లెక్కుచు నెంతగాను
లోకమంతయు నింపెడు లాస్యమొదవ
ప్రభుత నేలగ విశ్వపు పారమంత
శూన్యమండల వీధుల సూర్యుడేగు

ఏడు గుర్రముల రధం మీద అధిరోహించి, లోకాన్నంతా విలాసంగా దర్శిస్తూ, దానిని పరిపాలిస్తూ, శూన్యమండలంలో సూర్యుడు విహరిస్తున్నాడు. మానవులారా ! ఆ వెలుగును దర్శించండి ! 

||విశ్వమెల్ల నేలు విఖ్యాత పురుషుండు
ఏడు హయములెక్కి ఏగు దెంచు
నియమమందు నిల్పి నిఖిల లోకతతుల
కాంతిపధము నందు గానవచ్చు

విశ్వం మొత్తాన్నీ పరిపాలిస్తున్న ప్రాచీన పురుషుడు ఏడు రంగుల గుర్రములు లాగే రధంలో వచ్చుచున్నాడు. ఈ భూమిపైన సమస్తమూ ఆయన అధీనంలోనిదే. అన్నింటినీ ఆయన నియమిస్తున్నాడు. కాంతిమార్గంలో ఆయన ప్రయాణిస్తున్నాడు. చూడండి !

తే||ఏడు రంగుల గుఱ్ఱములెక్కి నీవు
చేరబోవలె నాతని సర్వ విభుని
జ్ఞానరూపిని ప్రభువును చేతనమున
యోగమార్గము నందుచు వేగమొప్ప

ఈ ఏడు గుర్రములూ మనిషిలోని సప్తచక్రములకు సూచికలు. ఈ సప్తచక్రములనూ జాగృతం చెయ్యడం ద్వారా మీరు సమస్తానికీ ప్రభువైన సూర్యుని తేజస్సును అందుకోవాలి. ఓ మానవులారా ! ఈ యోగమార్గంలో ప్రయాణించడం నేర్చుకోండి.
read more " త్వరలో రాబోతున్న మా పుస్తకం "మహాసౌరమ్" నుంచి కొన్నిపద్యాలు "

9, జనవరి 2018, మంగళవారం

నేనెవర్ని మరి?

వేదన నా తల్లి - వేడుక నా తండ్రి
బాధ నా తల్లి - భ్రమ నా తండ్రి
నేనెవర్ని మరి?


విషాదం నా తల్లి - విలాసం నా తండ్రి
విలాపం నా తల్లి - వినోదం నా తండ్రి
నేనెవర్ని మరి?

ఆచారం నా తల్లి - అనాచారం నా తండ్రి
గుట్టుదనం నా తల్లి - కట్టులేనితనం నా తండ్రి
నేనెవర్ని మరి?

అవమానం నా తల్లి - అహంకారం నా తండ్రి
ఆప్యాయత నా తల్లి - అవకాశవాదం నా తండ్రి
నేనెవర్ని మరి?

కారుణ్యం నా తల్లి - కాఠిన్యం నా తండ్రి
పాతివ్రత్యం నా తల్లి - పరగమనం నా తండ్రి
నేనెవర్ని మరి?

కళామతల్లి నా తల్లి - కళంకితుడు నా తండ్రి
ఉదారచరిత నా తల్లి - స్వార్ధపరత నా తండ్రి
నేనెవర్ని మరి?

అనురాగం నా తల్లి - అసహాయత నా తండ్రి
బాంధవ్యం నా తల్లి - భ్రష్టత్వం నా తండ్రి
నేనెవర్ని మరి?

త్యాగం నా తల్లి - భోగం నా తండ్రి
యోగం నా తల్లి - రోగం నా తండ్రి
నేనెవర్ని మరి?

ఆధ్యాత్మికం నా తల్లి - అమానుషం నా తండ్రి
ఆకాశం నా తల్లి - అగాధం నా తండ్రి
నేనెవర్ని మరి?

వాస్తవం నా తల్లి  - స్వప్నం నా తండ్రి
ఎరుక నా తల్లి - మరపు నా తండ్రి
నేనెవర్ని మరి?
read more " నేనెవర్ని మరి? "

E Jhuki Jhuki Nigahen - Mehdi Hassan


Ye Jhuki Jhuki Nigahen అంటూ మెహదీ హసన్ మధురంగా ఆలపించిన ఈ గీతం ఒక ఘజలే అయినప్పటికీ  Paalki అనే పాకిస్తానీ సినిమాలో కూడా చిత్రీకరించబడింది. ఈ సినిమా 1975 లో వచ్చింది. ఈ గీతంలో జెబా, మహమ్మద్ అలీ నటించారు.ఈ గీతంలో ఘజల్ రాగాలాపనలూ ఖవ్వాలీ దరువులూ కలగలిసి ఉంటాయి.

నా స్వరంలో కూడా ఈ మధుర ప్రేమగీతాన్ని వినండి. సరిగా అర్ధం చేసుకుంటే ఇదీ ఒక ఆధ్యాత్మిక గీతమే మరి.

Singer:-- Mehdi Hassan
Karaoke Singer:-- Satya Narayana Sarma
Enjoy
-------------------------------------------
Ye jhuki jhuki nigahein
[Ye jhuki jhuki nigahein - Inhe main salam kar lu] -2
Yahi apni subho karlu - Yahi apni shaam karlu
Ye jhuki jhuki nigaahein

Tera gam teri muhabbat - Tera dard teri hasrat
Teri ho agar izaazat - Tho me apne naam kar lu
Ye jhuki jhuki nigahein - Inhe main salam kar lu
Ye jhuki jhuki nigaahein

Tuhi meri ibtidaa hai - Tuhi meri intaha hai
Jaha tu ishara karde - Mai vahi kayam kar lu
Ye jhuki jhuki nigahein - Inhe main salam kar lu
Ye jhuki jhuki nigaahein

Teri zulf ke ye saye - Bas ab aage koun jaye
Tu kahe tho zindagi ko - Mai yahi tamaam kar lu
Ye jhuki jhuki nigahein - Inhe main salam kar lu
Yahi apni subho karlu - Yahi apni shaam karlu
Ye jhuki jhuki nigaahein

Meaning

Your lowered glances
I bow to them day and night
Your lowered glances

I know your sorrow and your love
I know your pain and your longing
If I have your permission
I will make you my own

You are my new beginning
You are my trial
Wherever you indicate
I will remain there

Ah ! the lovely shadow of  your hair
Who can go beyond that ?
If you order me now
I will conquer the entire world

Your lowered glances
I bow to them day and night
Your lowered glances

తెలుగు స్వేచ్చానువాదం

వాలిపోతున్న నీ చూపులకు
అనుక్షణం నా అభివాదం

నీ బాధా నీ ప్రేమా నాకు తెలుసు
నీ వేదనా నీ కోరికా కూడా తెలుసు
నువ్వు ఒప్పుకుంటే
నా గుండెలో నీకు చోటిస్తాను

నువ్వు నా జీవితంలో క్రొత్త మలుపువి
నువ్వు నాకొక అగ్నిపరీక్షవు కూడా
నువ్వు ఎక్కడుండమంటే
అక్కడే నేనుంటాను

నీ మనోహరమైన కురుల నీడను దాటి
ఎవరైనా సరే, అవతలకు ఎలా పోగలరు?
నువ్వు ఆజ్ఞాపిస్తే
ఈ ప్రపంచాన్నే ఏకం చేస్తాను

వాలిపోతున్న నీ చూపులకు
అనుక్షణం నా అభివాదం
read more " E Jhuki Jhuki Nigahen - Mehdi Hassan "

6, జనవరి 2018, శనివారం

Ranjish Hi Sahi - Mehdi Hassan


రంజిష్ హీ సహీ దిల్ హి దుఖానే కె లియే ఆ....

అంటూ మెహదీ హసన్ మధుర స్వరంలోనుంచి మృదు మధురంగా జాలువారిన ఈ ఘజల్ ఎన్నటికీ మరపురాని మధుర గీతాలలో ఒకటి. త్యాగరాజ కృతులలో పంచరత్న కీర్తన ఎలాంటిదో ఘజల్స్ లో ఈ పాట అలాంటిది. ఈ ఘజల్ ను తిప్పి తిప్పి ఎన్నో రకాలుగా పాడవచ్చు. రకరకాల సంగతులతో దాదాపుగా అరగంట సేపు ఇదే పాటను పాడిన వాళ్ళున్నారు.

మెహదీ హసన్ ఈ పాటను తిప్పి తిప్పి ఎన్ని రకాలుగా పాడాడో వింటే ఎంతో ఆనందం కలుగుతుంది. ఈ పాటతోనే జగ్జీత్ సింగ్ కు మొదట్లో అంత పేరొచ్చింది. ఆ తర్వాత ఎందఱో గాయకులు ఈ పాటను ఆలపించారు.ఈ పాటను "మొహబ్బత్" అనే పాకిస్తానీ సినిమాలో చిత్రీకరించారు. ఈ పాటను పాడటం అనేది ప్రతీ ఘజల్ గాయకుడికీ ఒక స్వప్నంగా ఉంటుంది. ఇది అంత పాపులర్ ఘజల్.

అహ్మద్ ఫరాజ్ ఈ పాటను ఎంతో హృద్యంగా వ్రాశాడు. దీనిలో భావం ఎంతో లోతైనది. ఎంతో సున్నితమైనది. భావానికి తోడు, ఉర్దూ పదాలలో ఉండే సహజ మాధుర్యం ఈ పాటకు ఎంతో శోభను తెచ్చింది.

నా స్వరంలో కూడా ఈ పాటను వినండి మరి.

Genre:-- Ghazal
Lyrics:-- Ahmad Faraz
Singer:-- Mehdi Hassan
Karaoke Singer:-- Satya Narayana Sarma
Enjoy
--------------------------------------
Ranjish hi sahi dil hi dukhane ke liye aa – 2
Aa phir se mujhe chod ke jane ke liye aa -2
Ranjish hi sahi dil hi dukhane ke liye aa

Ab tak dil-e-khush phaham ko hai - tujhse umeede - 2
Ye aakhiri shamme bhi bujhane ke - liye aa
Ranjish hi sahi

Ik umrse hu lajjath-E- girya se bhi – mehroom - 2
E raahath -E- ja mujhko rulane ke - liye aa
Ranjish hi sahi

Kuchto mere pindar -E-mohabbat ka bharam rakh - 3
Tu bhitho kabhi mujhko manane ke - liye aa
Ranjish hi sahi

Pahale se marasim na sahi phir bhi kabhi tho
Rasm -o- rahe duniya hi nibhane ke liye aa
Ranjish hi sahi

Maana ke mohabbat ka chupana hai mohabbat -2
Chupke se kisi roj jathane ke liye aa
Ranjish hi sahi

Jaise tumhe aate hai na aane ke bahane
Ese hi kisi roj na jane ke liye aa
Ranjish hi sahi

Kis kisko batayenge judayi ka sabab ham
Tu mujhse khafa hai tho jamane ke liye aa
Ranjish hi sahi

Meaning

Let it be anguish, yet come, to torment my heart
Do come, even if it means to leave me again
Let it be anguish

If not for our love that now belongs to the past
come at least, to satisfy the ways of the world

To how many, must I explain the reason of our separation
come, despite your displeasure, at least for the sake of the world


Till now my hopeful heart is having some expectation
come now, at least to put off the last lamps of my hope


It is too long since I have been deprived
of the satisfaction of weeping
Oh my comfortess !

come, at least to make me weep again

Respect a little
the fort of love I built for you
if not for my sake,
come at least for my love's sake


let it be anguish, yet come, at least to torment my heart
come, even if it means to leave me again...

తెలుగు స్వేచ్చానువాదం

నువ్వు బాధనే తీసుకురావచ్చు
కానీ నా హృదయాన్ని బాధించడానికైనా సరే
తిరిగి నా వద్దకు రా

మళ్ళీ నన్ను వదలి వెళ్ళడం కోసమైనా సరే
తిరిగి ఒకసారి నా వద్దకు రా
ఒకప్పటి మన ప్రేమకోసం కాకపోయినా
కనీసం లోకం కోసమైనా తిరిగి రా

మనం ఎందుకు విడిపోయామో
ఎంతమందికి నేను సంజాయిషీ ఇచ్చుకోను?
నీకు నామీద అయిష్టం ఉన్నప్పటికీ
లోకం కోసమైనా కనీసం తిరిగి రా

నువ్వు తిరిగి వస్తావని నాలో ఒక ఆశ
చిరుదీపంలా మెరుస్తోంది
కనీసం ఆ దీపాన్ని ఆర్పడానికైనా సరే
ఒకసారి తిరిగి రా

ఒక యుగం నుంచీ
ఏడుపు ఇచ్చే ఆనందానికి నేను దూరమయ్యాను
ఓ ప్రేయసీ ! కనీసం నన్ను ఏడిపించడానికైనా సరే
ఒకసారి తిరిగి రా

నన్ను కాకపోయినా
నీ కోసం నేను నిర్మించుకున్న
ఈ ప్రేమసౌధాన్నైనా కనీసం గౌరవించు
దానికోసమైనా తిరిగి రా...
read more " Ranjish Hi Sahi - Mehdi Hassan "

2, జనవరి 2018, మంగళవారం

హిందూ దేవాలయాలు ఎందుకు ధ్వంసం చెయ్యబడ్డాయి?

మొన్నొకాయన నాతో మాట్లాడుతూ ఈ పోస్టును వ్రాయడానికి నాంది పలికాడు.

'అమెరికాలో ఎక్కడ బడితే అక్కడ హిందూ దేవాలయాలు వెలుస్తున్నాయి. చూచారా ఇదెంత మంచి శుభ పరిణామమో?' అన్నాడు.

'ఆ విషయం నీకెలా తెలుసు?' అడిగాను.

'ఈ మధ్యనే అమెరికాలో ఆర్నెల్లు ఉండి వచ్చాను. అప్పుడు చూచాను. ప్రతి స్టేట్ లోనూ మన గుళ్ళున్నాయి. అంతేకాదు. ఒక్కో ఊరిలోనైతే అయిదారు దేవాలయాలున్నాయి. ఇంకా కడుతున్నారు.' అని ఆనందంతో ఉప్పొంగిపోయాడు.

'సరే మంచి విషయమేలే గాని, ఇది శుభ పరిణామం ఎలా అవుతుందో కాస్త చెప్పు వింటాను' అన్నాను.

'అదేంటి? మన సంస్కృతి అమెరికాలో కూడా విస్తరిస్తోంది. ఇది మంచిదేగా?' అన్నాడు.

'అవును. అదే సమయంలో మన సంస్కృతి మన దగ్గర మాయమౌతోంది. వాళ్ళ సంస్కృతి ఇక్కడ విస్తరిస్తోంది. దీనికేమంటావు?' అడిగాను.

'నిజమే. కాకపోతే కొంతలో కొంత మంచిదేగా?' అన్నాడు.

నేను నవ్వేసి ఊరుకున్నాను.

'అసలూ, నవాబుల కాలంలో మన గుళ్ళు ఎన్ని నాశనం అయ్యాయో లెక్కేలేదు. అవన్నీ ఉంటె ఇప్పుడు ఇంకెంత బాగుండేదో? అందుకే నాకు ముస్లిమ్స్ అంటే పరమమంట !' అన్నాడు కోపంగా.

'ఇప్పటి ముస్లిమ్స్ కాదుగా అప్పుడు మీ గుళ్ళు ధ్వంసం చేసింది? వాళ్ళంతా చనిపోయారు. ఇప్పుడున్న వీళ్ళమీద ఎందుకు నీకు కోపం?' అన్నాను నవ్వుతూ.

'అవుననుకోండి. కానీ వీళ్ళ తాతముత్తాతలేగా ఆ పనులు చేసింది?' అన్నాడు ఇంకా బుసలు కొడుతూ.

'ఓహో అదా ! అలా అయితే మీ తాతముత్తాతలు చేసిన పనులకు నీకూ శిక్ష పడాలిగా మరి?' అన్నాను.

'మా వాళ్ళేం గుళ్ళూ గోపురాలూ నాశనం చెయ్యలేదే?' అన్నాడు వాదనలోకి దిగుతూ.

'సరిగ్గా అవే పనులు చేసి ఉండకపోవచ్చు. కానీ అంటరానివాళ్ళు అంటూ సాటి మనుషులను దూరం పెట్టడాలూ, పల్లెల్లో పెత్తనం చెలాయించడాలూ, భూములన్నీ మీ చేతుల్లోనే ఉంచుకోడాలూ, రెలిజియస్ గా ఎన్నో బయటకురాని నేరాలూ దౌర్జన్యాలూ చెయ్యడాలూ - ఇవన్నీ చేశారు కదా మీ పెద్దలు? మరి వాటికి నీకూ శిక్ష పడాలిగా ఇప్పుడు. ఒప్పుకుంటావా?' అన్నాను సూటిగా.

'ఆ ! అదీ ఇదీ ఒకటే ఇలా అవుతుంది? మీరు చెప్పినట్లుగా మావాళ్ళు చేసిన నేరాలకు దౌర్జన్యాలకు సాక్ష్యాలు లేవు. కానీ దేవాలయాలు ధ్వంసం చెయ్యబడి మన కళ్ళ ఎదురుగా కనిపిస్తూనే ఉన్నాయి కదా? దీనికేమంటారు?' అన్నాడు తెలివిగా.

'ఇప్పుడు కరెక్ట్ గా సబ్జెక్ట్ లోకి వస్తున్నవురా బిడ్డా' - అని మనస్సులో అనుకుని - 'అలా ధ్వంసం చెయ్యబడిన గుళ్ళూ గోపురాలే మీ నేరాలకు నిదర్శనాలు' అన్నాను.

అతనికి అర్ధం కాలేదు.

'ఏంటి మీరు చెబుతున్నది?' అన్నాడు అయోమయంగా.

'శివుని ఆజ్ఞ లేకుండా చీమైనా కుట్టదు' అని ఒప్పుకుంటావా? అడిగాను.

'అవును. నిజమే.' అన్నాడు తప్పదన్నట్టు.

'మరి ముస్లిమ్స్ మీ దేవాలయాలను ధ్వంసం చెయ్యడం వెనుక కూడా శివుని ఆజ్ఞ ఉండే ఉంటుంది' అన్నా నవ్వుతూ.

'అదేంటి? శివుడు తన గుడిని తనే ధ్వంసం చేయించుకుంటాడా?' అన్నాడు ఎగతాళిగా.

'తప్పకపోతే మరేం చేస్తాడు?' అన్నా.

'అదేంటి? కొంచం అర్ధమయ్యేట్లు చెప్పండి' అన్నాడు అయోమయంగా.

'నీ దృష్టిలో నీ గుడి గొప్ప కావచ్చు. కానీ విశ్వమంతా వ్యాపించి ఉన్న శక్తికి, ఆ విశ్వంలోని ఒక భూమి ఎంత? ఆ భూమిమీద ఉన్న అనేక దేశాలలో నీ దేశం ఎంత? ఆ దేశంలో మారుమూలన ఉన్న ఒక గుడి ఎంత? శివుడికి నువ్వు కట్టించిన గుడి తప్ప ఇంకేదీ లేదా ఈ ప్రపంచంలో ఉంటానికి? అయినా, విశ్వవ్యాప్తశక్తి అయిన విశ్వనాధుడికి నువ్వు గుడి కట్టించగలవా? ఆలోచించి చెప్పు.' అన్నాను.

'మీరిలా మాట్లాడితే నేనేమీ చెప్పలేను.' అన్నాడు ఇంకేమీ అనలేక.

'చెప్పకు. నిన్ను చెప్పమని నేను అడగలేదు. నువ్వడిగితేనే నేను చెబుతున్నాను. నువ్వేమీ చెప్పద్దు. నాకూ వినాలని లేదు.' అన్నాను.

కాసేపు మౌనంగా ఉన్నాడు గాని, లోపల ఏదో పురుగు తొలుస్తోంది.

చివరకు మెల్లిగా - 'సరే మీరే చెప్పండి. మన గుళ్ళు ఎందుకు ధ్వంసం అయ్యాయో?' అన్నాడు.

'అలా  రా దారికి' అనుకుని చెప్పడం మొదలు పెట్టాను.

'ఏ గుడైనా మొదట్లో బాగానే ఉంటుంది. మంచి ఉద్దేశ్యంతోనే దాన్ని కడతారు. కాలక్రమేణా దానిలో లేనిపోని రాజకీయాలు చోటుచేసుకోవడం మొదలు పెడతాయి. అధికార దాహాలు, అక్రమాలు, నేరాలు, దౌర్జన్యాలు మొదలౌతాయి. లోపల్లోపల ఎన్నో లుకలుకలు సాగుతాయి కాని రెలిజియస్ ముసుగులో అవన్నీ బయటకు రాకుండా ఉండిపోతాయి. మతానికి రాజుల సహకారం తోడైతే ఇక అక్కడ జరిగే అక్రమాలు అన్నీఇన్నీ కావు. సామాన్యులను పురుగుల్లా చూడటమూ, తమకు తాము దైవాంశ సంభూతులలాగా భావించుకొని అడ్డమైన నేరాలు అక్రమాలు దౌర్జన్యాలు చెయ్యడమూ మొదలౌతాయి. ఆ అరాచకానికి అడ్డూఆపూ ఉండకుండా పోతుంది. ఈ క్రమంలో ఎంతోమంది ఆ ఇనుప చక్రాలక్రింద పడి నలిగిపోతారు. అప్పుడేం జరుగుతుంది? ' అన్నాను.

'ఏం జరుగుతుందో మీరే చెప్పండి' అన్నాడు.

'ఆ గుడిలోని దేవుడు కూడా భరించలేనంత మత దురహంకారం అక్కడివారిలో పెరుగుతుంది. అప్పుడు ఆ దేవుడే, బయట నుంచి కొంతమందిని సృష్టించి, వాళ్ళ చేత తన గుడిని తానే ఎటాక్ చేయించుకుని, దాన్ని కూలగొట్టిస్తాడు. మీ గుళ్ళలో జరిగింది కూడా అదే. ఇది అసలైన వాస్తవం.' అన్నాను.

' మీ లాజిక్ నాకు సమ్మతంగా లేదు.' అన్నాడు.

'అది నీ ఖర్మ. దానికి నేనేం చేసేది? పోనీ ఒక విషయం చెప్పు. వందల వేల సంవత్సరాల నుంచీ మంత్రాలతో, నియమాలతో, పూజలూ, పునస్కారాలూ క్రమం తప్పకుండా జరుగుతున్న ఒక గుడిలో శక్తి ఉంటుందా ఉండదా?' అడిగాను.

'తప్పకుండా ఉంటుంది' అన్నాడు.

'మరి అంతటి శక్తి ఉన్న ఆలయాలను, బయటనుంచి ఎవడో వచ్చి ఎలా ధ్వంసం చెయ్యగలడు? అంటే దీనిలో రెండే మార్గాలున్నాయి. ఒకటి - మీ గుళ్ళలో శక్తి తగ్గిపోయన్నా ఉండాలి. రెండు - వాటిని కూల్చేసిన ముస్లిమ్స్ లో మీకంటే ఎక్కువ భక్తీ శక్తీ ఉండి ఉండాలి. అంతేనా కాదా?' అడిగాను సీరియస్ గా.

జవాబు చెప్పలేక నీళ్ళు నములుతూ - 'ఆచారమూ పాడూ లేని వాళ్ళలో శక్తి ఉందంటే నేను నమ్మలేను. మాలోనే శక్తి తగ్గిపోయి ఉంటుంది.' అన్నాడు అయిష్టంగా.

'నేను చెప్పేదీ అదే. మీ గుళ్ళలో శక్తి తగ్గినప్పుడే ఇలాంటివి జరిగాయి. ఆ శక్తి ఎలా తగ్గిందంటావు? ఆలోచించు. నేను చెప్పినవే కారణాలు. మీలో దురహంకారం పెరిగిపోయింది, అక్రమాలు పెరిగాయి, రెలిజియస్ ముసుగులో నేరాలు చెయ్యడం మొదలైంది. సాటి మనుషుల మీద దౌర్జన్యాలు మొదలుపెట్టారు. ఆ అక్రమాలను దేవుడు కూడా భరించలేనంత స్థాయికి అవి చేరాయి. ఎంతోమంది ఉసురును మీరు పోసుకున్నారు. అందుకే ఒక మాలిక్ కాఫరో, ఒక అలాఉద్దీన్ ఖిల్జీనో, ఒక మహమ్మద్ గజనీనో, ఒక ఔరంగజేబో పుట్టుకొచ్చారు. వరుసగా మీ గుళ్ళమీద పడి వాటిని ధ్వంసం చేశారు. ఇంతకంటే ఇంకే కారణమూ లేదు. అనవసరంగా ముస్లిమ్స్ మీద ద్వేషం పెంచుకోకు. వాళ్ళలో మంచివాళ్ళు చాలామంది ఉన్నారు.' అని చెప్పాను.

'ఇదంతా మీ ఊహ కావచ్చుగా' అన్నాడు మళ్ళీ మొదటికొస్తూ.

'కావచ్చు. కానీ ఇంతకంటే లాజికల్ గా వేరే ఏదైనా ఉంటే చెప్పు. నేను వింటాను.' అన్నాను.

చాలాసేపు ఆలోచించాడు కానీ ఏమీ తట్టలేదు లాగుంది. ఏమీ మాట్లాడలేదు.

చివరకు నేనే ఇలా చెప్పాను.

'వివేకానందస్వామి జీవితంలో ఒక సంఘటన జరిగింది. కాశ్మీర్ లోని క్షీర్ భవాని ఆలయంలో జగన్మాత స్వరం ఆయనకు వినిపించింది. సాక్షాత్తూ అమ్మవారే ఆయనతో మాట్లాడింది. తన ఇష్టప్రకారమే తన ఆలయం ధ్వంసం కాబడిందనీ, అలా పాడుబడిన ఆలయంలో ఉండటమే తనకిష్టమనీ ఆ స్వరం చెప్పింది.' అన్నాను.

'అది ఆయన భ్రమ అయ్యి ఉండవచ్చు కదా?' అన్నాడు.

'ఆయన శిష్యుడు శరచ్చంద్ర చక్రవర్తి కూడా ఇదే సందేహాన్ని ఆయనదగ్గరే వెలిబుచ్చాడు. దానికి స్వామి చెప్పిన సమాధానం చదువు. 'స్వామి శిష్య సంవాదము' అనే తెలుగు పుస్తకంలో ఉంటుంది. ఇంగ్లీషులో అయితే Talks with Swami Vivekananda అని ఉంటుంది చూడు.

సామాన్యంగా భ్రమ అనేది మనకిష్టమైన రీతిలో ఉంటుంది గానీ మనకు నచ్చని రీతిలో ఉండదు. కనుక అది భ్రమ కాదు. పోనీ నువ్వన్నట్లే అది భ్రమ అనుకుందాం కాసేపు. అంటే - మహనీయులైన సిద్ధపురుషులతో సహా ప్రపంచంలో అందరిదీనేమో భ్రమనా?  నీదొక్కడిదీనేమో సరైన దృష్టీనా? నువ్వనుకున్నట్లుగా నీకు ఆన్సర్ వస్తే అది నిజమా? లేకపోతే భ్రమనా? ఇదేనా నీ తెలివి?' అన్నాను సీరియస్ గా.

ఏమో? నువ్వెన్ని చెప్పినా దీన్ని నేను అంగీకరించలేక పోతున్నాను' అన్నాడు చివరికి.

'దానినే మూర్ఖత్వం అంటారు మరి' అన్నాను నవ్వుతూ.

'అయితే ఇంతకీ నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావ్? అన్నాడు నసుగుతూ.

'ఏం లేదు. అమెరికాలో గుళ్ళు కట్టినంత మాత్రాన అదేదో గొప్ప విజయం అనుకోకండి. మన సంస్కృతి ఏదో గొప్పగా విస్తరిస్తోంది అని భ్రమా పడకండి. సంస్కృతి గుళ్ళలో ఉండదు. మనలో ఉంటుంది. మీలో అది లేకపోతే మీరు కట్టిన గుడి ఎక్కువ కాలం ఉండదు. కూలిపోతుంది. ఆ కూలిపోవడం ఏ రకంగానైనా కావచ్చు. అదే కూలిపోవచ్చు లేదా బయటనుంచి ఎవడైనా వచ్చి కూలగొట్టవచ్చు.

ఒక పండు లోపలనుంచి కుళ్ళడం ఎప్పుడైతే మొదలౌతుందో, బయటనుంచి అనేక పురుగులు దాన్ని ఎటాక్ చెయ్యడానికి వస్తాయి. అలాగే ఇదీ జరుగుతుంది. ముందు మీలో కుళ్ళు ఏర్పడింది. అప్పుడు బయటనుంచి ముస్లిమ్స్ వచ్చి మిమ్మల్ని చావగొట్టారు. మీలో నీతీ, నిజాయితీ, ఐకమత్యమూ ఉంటే బయటవాళ్ళు ఎవరూ మిమ్మల్ని ఏమీ చెయ్యలేకపోదురు. లోపం మీలో ఉంది. వాళ్ళలో లేదు. తప్పులన్నీ మీ దగ్గరుంచుకుని బయటవాళ్ళను అనడం దేనికి?

ఎక్కడైనా సరే, ఒక పవర్ సెంటర్ ఎప్పుడైతే ఏర్పడిందో అక్కడ నానా అక్రమాలూ మొదలౌతాయి. గుడి కూడా ఒక పవర్ సెంటరే. పైగా అదొక రెలిజియస్ పవర్ సెంటర్. అక్కడ జరిగే అన్యాయాలకు అంతూ పొంతూ ఉండదు. ప్రస్తుతం మన తిరుమలనే చూడు. అక్కడున్నంత అవినీతి ఎక్కడా ఉండదని ప్రతివాడికీ తెలుసు. అక్కడ అందరూ భక్తులే. అందరూ దొంగలే. సాక్షాత్తూ శ్రీమహావిష్ణువే అక్కడ ఉన్నాడని నమ్ముతూ, మళ్ళీ చెయ్యకూడని అడ్డమైన పనులన్నీ చేస్తూనే ఉంటారు. దీనినేమనాలి?

కనుక దేవాలయ వ్యవస్థ మాటున అహాలూ, అక్రమాలూ, దౌర్జన్యాలూ, అవినీతీ పెరగకుండా చూచుకోవడం ముఖ్యం. అంతేగాని ఎన్ని గుళ్ళు ఏ దేశంలో కట్టామన్నది ముఖ్యం కాదు. ఎన్ని కార్యక్రమాలు అక్కడ జరుగుతున్నాయన్నదీ ముఖ్యం కాదు. మన గుళ్ళు దేవుడికి అక్కర్లేదని గ్రహించు. విశ్వమే ఆయన దేవాలయం. మీరు మళ్ళీ ఒక రాతి గుడిని కట్టక్కరలేదు. అక్కడ అడ్డమైన అక్రమాలూ చెయ్యనక్కర్లేదు.

నువ్వు చేప్పే దేవాలయ కమిటీలలో ఏం జరుగుతుందో నాకు బాగా తెలుసు. వాటిల్లో ఒకరంటే ఒకరికి పడదు. అనేక ఈగో ప్రాబ్లంస్ ఉంటాయి. ఇంటర్నల్ గొడవలు ఉంటాయి. బయటకు మాత్రం గుడి అనే ముసుగులో అన్నీ కప్పేసి మహా పవిత్రులలాగా ఫోజు కొడుతూ ఉంటారు. ఎవడికి దొరికినది వాడు మెక్కుతూ ఉంటారు. ఇక ఆ గుడిలో దైవత్వం ఎక్కడేడుస్తుంది? వాళ్ళలో వాళ్లకు రాజకీయాలు లేని ఒక కమిటీని నాకు చూపించు. చూపలేవు.

నా దృష్టిలో ఇదేమీ పెద్ద గొప్ప 'ఎచీవ్ మెంట్' కాదు. ఇలాంటి గుళ్ళు కట్టడం వల్ల నా దృష్టిలో ఎలాంటి ఉపయోగమూ లేదు. కనుక అమెరికాలో మన సంస్కృతి, గుళ్ళు కట్టడం ద్వారా విస్తరిస్తోందని నువ్వు చంకలు చరుచుకోవలసి అవసరం లేదు. ఒకవేళ చరుచుకుంటే చరుచుకో. ఇది నీ ఇష్టం. కానీ అదొక భ్రమ మాత్రమే' అని ముగించాను.

అతను చాలా విసుగ్గా ముఖం పెట్టుకుని అక్కణ్ణించి నిష్క్రమించాడు.

యధావిధిగా - నేను చెప్పినది అతనికే మాత్రమూ నచ్చలేదని మళ్ళీ చెప్పనక్కర్లేదు కదూ !
read more " హిందూ దేవాలయాలు ఎందుకు ధ్వంసం చెయ్యబడ్డాయి? "

1, జనవరి 2018, సోమవారం

Usne Jab Meri Taraf Pyar Se - Mehdi Hassan


Usne Jab Meri Taraf Pyar Se

అంటూ మెహదీ హసన్ తన గంధర్వ స్వరంలో ఆలపించిన ఈ రొమాంటిక్ ఘజల్ చాలా మధురమైన గీతం. ఎందుకంటే దీని భావం చాలా లోతైనది, రాగం చాలా మధురమైనదీ కాబట్టి. ఇది ప్రపంచవ్యాప్తంగా లక్షలాదిమంది పిచ్చి ప్రేమికులను కదిలించిన గీతం. పిచ్చి అని ఎందుకన్నానంటే వాళ్ళు భ్రమలో ఉండి దానినే నిజం అనుకుంటూ ఉంటారు గాబట్టి. 'ప్రేమ' అనే పదానికి ఈలోకంలో అర్ధం లేకపోయినా దానినే ప్రేమ అనుకుంటూ ఉంటారు గాబట్టి.

నా స్వరంలో కూడా ఈ అమరగీతాన్ని వినండి మరి.

Genre:-- Non Filmi Ghazal
Lyrics:-- Khurshid Hallori
Singer:-- Mehdi Hassan
Karaoke Singer:-- Satya Narayana Sarma
Enjoy
-------------------------------------

Usne jab meri - taraf pyar se dekha - hoga - 2
Mere baray me - bade hor se socha hoga
Usne jab meri taraf...

Subho ko jisne - sajayi hai - hasi hoton par - 2
Raat bhar usko - kisi gham ne - sataya hoga - 2
Usne jab meri taraf...

Karke wada bhi - agar aap nahin ayenge – 2
Naam badnaam - zamane mein - wafa ka hoga – 2
Usne jab meri taraf...

Haske hum baat jo - kar lete hain - unse Kursheed - 2
Hal apna  - wo samajh lete hain - acha hoga – 2

Usne jab meri - taraf pyar se dekha - hoga – 2
Mere baaray me - bade hor se socha hoga
Usne jab meri - taraf pyar se dekha - hoga
Usne jab meri taraf…

Meaning

She must be looking at me with love
She must have thought about me a lot
She must be....

At dawn, I see a smile adorning her beautiful lips
Some strange pain must have haunted her
throughout last night

After promising, if she does not turn up
The word 'promise' itself
will get a bad name in the world
  
O Khursheed ! I talk to her with a smile on my face
But, if she can see the pain of my soul inside
What a good thing it could be !!

She must be looking at me with love
She must have thought about me a lot
She must be....

తెలుగు స్వేచ్చానువాదం

తన నావైపు ప్రేమగా చూస్తున్నది నిజమే కావచ్చు
తను నా గురించి ఎంతో ఆలోచించి ఉంటుందన్నదీ
నిజమే కావచ్చు
తను నావైపు...

పొద్దు పొద్దున్నే తన పెదవుల మీద చిరునవ్వును చూచాను
రాత్రంతా తననేదో విచిత్రమైన బాధ వెంటాడిందేమో?
అందుకేనా తనలా నవ్వుతోంది?

మాటిచ్చి చెప్పిన చోటకు తను రాకపోతే
వాగ్దానం అనే పదమే
లోకంలో విలువను పోగొట్టుకుంటుంది

ఓ ఖుర్షీద్ !
నేను తనతో నవ్వుతూనే మాట్లాడుతున్నాను
కానీ నా మనసులోని బాధను తను చూడగలిగితే
ఎంత బాగుంటుంది !!

తన నావైపు ప్రేమగా చూస్తున్నది నిజమే కావచ్చు
తను నా గురించి ఎంతో ఆలోచించి ఉంటుందన్నదీ
నిజమే కావచ్చు
తను నావైపు...
read more " Usne Jab Meri Taraf Pyar Se - Mehdi Hassan "