'None can reach Heaven, who had not passed through hell' - Sri Aurobindo in 'Savitri'

30, ఆగస్టు 2009, ఆదివారం

శ్రీ కూర్మం-ఒక జ్యోతిష విచిత్రం

మొన్న 19 తేదీన పనిమీద విశాఖ పట్నం వెళ్ళటం జరిగింది. ఆరోజున సాయంత్రం వరకు పోయిన పని ముగించుకొని, చీకటి పడే వేళకు సింహాచల నరసింహ స్వామి దర్శనం చేసుకొని వద్దామని అందరం బయలుదేరాం. మా బృందంలోనేను,మిత్రులు సీనియర్ ఆఫీసర్ కృష్ణ శాస్త్రిగారు, వారి సతీమణి, ఇంకా ఇద్దరు సహచరులు ఉన్నాము. ఆలయంఖాళీగా ఉంది. బహుశా అమావాస్య ప్రభావం ఏమో అనుకున్నాను. ఆలయ E.O ఎదురొచ్చి సరాసరి గర్భ గుడిలోకితీసుకెళ్ళాడు. ఆలయంలో మేము తప్ప ఇంకొక నలుగురు భక్తులు ఉన్నారు అంతే. చక్కని దర్శనం జరిగింది.

దర్శనం అయిన తర్వాత గుడి ఆవరణలో ఉన్న కప్పు స్థంభాన్ని కౌగలించుకొని మనసులో కోరిక కోరుకుంటే అదితీరుతుంది అని ఒకచోట వ్రాశి ఉంది. కోరిక తీరితే మళ్ళీ వచ్చి కప్పం చెల్లించాలి కాబట్టి అది కప్పు స్తంభం అయిందిట. స్థంభం కింద సంతాన గోపాల యంత్రం ప్రతిష్ట చేయబడి ఉంది అని వ్రాశారు. సాధారణంగా సంతానం లేని దంపతులుఅక్కడకు వచ్చి అలా కోరుకుంటే వారికి సంతానం కలుగుతుంది అని పూజారులు చెప్పారు. ఎవరికైనా జరిగిందా అనినేను అడిగితే బోలెడన్ని కేసుల్లో అడ్రసులతో సహా నిదర్శనాలు ఉన్నాయి అని చెప్పారు.

నేను దర్శనం ముగించుకొని అదే రాత్రి బయలుదేరి వెనక్కు వచ్చేసాను. మరుసటి రోజున కృష్ణ శాస్త్రి గారు ఉదయాన్నేలేచి కుటుంబంతో కలిసి అరసవిల్లి సూర్య దేవాలయం చూద్దామని అక్కడికి వెళ్ళారుట. అక్కడ దర్శనం ముగించుకొనిబయలుదేరబోతుంటే డ్రైవరు-అక్కడికి దగ్గరలోనే శ్రీ కూర్మం ఉంది. అదికూడా చూడండి సార్ అని చెప్పగా సరే అని శ్రీకూర్మ క్షేత్రానికి వెళ్లి వచ్చారు. అంతవరకూ బాగానే ఉంది. ఇక్కడే ఒక విశేషం జరిగింది.

శ్రీ కూర్మం లో పూజారి పూజ చేసిన తరువాత- అయ్యా మీ దంపతులలో ఒక్కరికైనా శని దశ గానీ ఏలినాటి శని గానీజరుగుతూ ఉంటుంది. లేకుంటే మీరు ఇక్కడికి రాలేరు. అరసవిల్లి వచ్చిన వారిలో ఎవరికైనా రెంటిలో ఒక్కటిజరుగుతున్నా శ్రీ కూర్మనాధునిచేత ఆకర్శింప బడి ఇక్కడికి వస్తారు. వింత నేను చాలా సార్లు గమనించాను. చూచుకోండి అని చెప్పాడుట. శాస్త్రి గారు నాకు ఫోన్ చేసి చెప్పగా నేను వెంటనే ఆయన జాతకం చూచాను. నిజంగానేశాస్త్రి గారి జాతకంలో శని దశ చివరికి వచ్చింది. కొన్నాళ్ళలో అయిపోబోతున్నది. వారి శ్రీమతి గారికి ఏలినాటి శనిజరుగుతున్నది. నేను విషయం చెబితే కృష్ణ శాస్త్రి గారు ఆశ్చర్య పడ్డారు. నాకూ ఆశ్చర్యం కలిగింది. నేనుఅక్కడివరకూ వెళ్లి కూడా వెనక్కు వచ్చాను. కాని వారికి శని దశ జరుగుతూ ఉండటంతో అనుకోకుండా వెళ్లి దర్శనంచేసుకొని వచ్చారు. ఇలాంటి విచిత్రాలు చాలా ఉంటాయి. వీటి వెనుక ఉన్న సంబంధాలు మనకు అర్థం కావు.

శ్రీ కూర్మం క్షేత్రం లో విశేషాలు:
>దశావతారాలలో అన్నింటిలో దుష్ట శిక్షణ జరిగింది. కాని ఒక్క కూర్మావతారంలో అది లేదు. ఒక మంచి పనికిసహాయం మాత్రం చెయ్యటానికి అవతారం వచ్చింది.
>శని బాధలు పోగొట్టటంలో శ్రీ కూర్మ నాథుడు చాలా మహత్యాలు చూపిస్తాడు. ఎందుకనగా ఆయన శని గ్రహానికిఅధిష్టాన దేవత అని పూజారులు చెప్పారు.
>భారత దేశం మొత్తం మీద కూర్మావతారానికి ఉన్నా ఏకైక ఆలయం శ్రీ కూర్మం. ఇది మన రాష్ట్రంలోని శ్రీకాకుళంజిల్లాలోని ప్రాచీన దేవాలయం.
>ఇక్కడ ఉన్న కొలనులో పిండ ప్రదానాలు చేస్తే పిండాలు వెంటనే గడ్డలు కట్టి రాళ్ళు గా మారి కొలను అడుగుకుచేరుకోవటం కళ్ళారా చూడవచ్చు. బహుశా నీటిలో Calcium లేదా Flourine లు ఎక్కువగా ఉండటం వల్లరసాయనిక చర్యల వల్ల ఇలా జరుగుతుందో ఏమిటో మరి. ఎవరైనా పరిశోధన చేసి చూస్తె గాని తెలియదు.
>ఇక్కడ దేవాలయానికి ముందు వెనుక కూడా ధ్వజ స్థంబాలు ఉన్నాయి. కారణం ఏమనగా, శ్రీ కూర్మ నాథుడు దేవాలయం వెనుక వైపు చూస్తూ ఉంటాడు కనుక అటు కూడా ఒక ధ్వజ స్తంభం ఉన్నది అని చెప్పారు.
>ఇక్కడి విగ్రహం మనిషి చేసినది కాదు. స్వతహాగా తాబేలు ఆకారంలో ఏర్పడిన ఫాస్సిల్. ఇది అతి మహిమాన్వితమైన సాలగ్రామం గా చెబుతారు. మధ్వ సాంప్రదాయ వైష్ణవులు ఇక్కడ పూజాదికాలు చేస్తుంటారు.
>ఇంకా నాగరికత సోకి పాడు చెయ్యని వాతావరణం మధ్యలో ప్రశాంతంగా ఉన్న దేవాలయం.

దగ్గరిలో ఉన్నవారు వీలైతే వెళ్లి దర్శించుకోవలసిన మంచి పురాతనమైన పుణ్య క్షేత్రం ఇది.
read more " శ్రీ కూర్మం-ఒక జ్యోతిష విచిత్రం "

29, ఆగస్టు 2009, శనివారం

ఓషో ఉత్తరాలు-13

నమస్తే,
నీ ఉత్తరాలన్నీ సరైన సమయానికే చేరుతున్నాయి. కాని నేను పనుల్లో ఉండటంతో వాటికి జవాబు ఇవ్వలేకపోయాను. ప్రస్తుతం చాలా రోజులు బయట ఊళ్లలో తిరుగుతున్నాను. ఇప్పుడే జైపూర్, బుర్హాన్పూర్, హోషంగాబాద్, ఛందో మొదలైన ఊళ్లలో ప్రసంగాల యాత్ర ముగించుకొని వచ్చాను.

మనుష్యులు ఆధ్యాత్మిక జీవితం కోసం ఎంత దాహం తో ఉన్నారో? ఇది చూచిన తర్వాత, మానవుడు మతం లో ఆసక్తి కోల్పోయాడు అని కొందరు అనే మాట వింటే నాకు ఆశ్చర్యం కలుగుతుంది. అదేన్నటికీ జరుగదు. మతంలో ఆసక్తి పోవటం అంటే, జీవితం లో ఆసక్తి పోవటమే, ఆనందం లో ఆసక్తి పోవటమే, పరమ గమ్యంలో ఆసక్తి పోవటమే.

మనిషి చైతన్యం స్వతహాగా భగవంతుని వైపే తిరిగి ఉంటుంది. దానికి భగవంతుని అందుకుంటేనే ఆనందం కలుగుతుంది. సత్యమైన-చైతన్యమయమైన -ఆనంద స్వరూపమైన స్థితిని అందుకుంటేనే దానికి తృప్తి కలుగుతుంది. మనిషిలో ఆధ్యాత్మిక జీవనాన్నిచ్చే విత్తనం లోలోపల స్వతహాగా ఉంది. అందుకే బయట మతాలు వస్తాయి, పోతాయి. కాని ఆధ్యాత్మిక తృష్ణ మనిషిలో చావదు.

నీ ఆంతరిక పురోగతిలో నీవు ఓర్పుగా వేచియున్నానని వ్రాశావు. సంతోషం కలిగింది. ఆధ్యాత్మిక జీవితంలో ఓర్పు చాలా ప్రధాన మైనది. విత్తనం విత్తిన తరువాత ఎంత కాలం వేచి యుండాలో చూడు!!మొదట్లో మన శ్రమంతా వృధా అని అనిపిస్తుంది. ఎక్కడా ఏమీ చలనం కనిపించదు. అలా కొంతకాలం తరువాత ఒకరోజు నీ ఎదురుచూపులకు అంతం వస్తుంది. విత్తనం పగిలి, నేలను చీల్చుకుని మొక్కగా బయటకు వస్తుంది. కనుక గుర్తుంచుకో! బయటకు ఏమీ చలనం లేనట్లు కనిపించినా, విత్తనం భూమి పొరల్లో ప్రయత్నం చేస్తూనే ఉంది.

సత్యాన్వేషి పరిస్థితి కూడా ఇలాటిదే. ఏమీ జరగనట్లు బయటకు కనిపించినా, నిజానికి లోలోపల ఎంతో జరుగుతుంది. సత్యమేమిటంటే- ప్రాణ శక్తి యొక్క ఎదుగుదల బయటకు కనిపించదు, తెలియదు. అంతిమ ఫలితం మాత్రమె బయటకు కనిపిస్తుంది, చేసిన ప్రయత్నం కనిపించదు.ఫలితాలను గురించి మర్చిపో, ఊరకే నీ దారిలో ముందుకు సాగిపో. ఫలితాలు వాటంత అవే వస్తాయి.

ఏదో ఒకరోజు నీకు ఆశ్చర్యం కలుగుతుంది. ఏం జరిగింది? ఇంతకూ ముందు నేనేమిటి? ఇప్పుడింత మార్పు ఎలా వచ్చింది? అని నీవే ఆశ్చర్యపోతావు. కలిగే ఫలితాలతో పోల్చుకుంటే చేసిన ప్రయత్నం లెక్కలోకి రాదు.

నేను ఆనందం లో ఉన్నాను. నీవు భగవంతునికి చేరువ కావాలని కోరుతున్నాను.

అందరికీ నా ప్రేమాశీస్సులు.
read more " ఓషో ఉత్తరాలు-13 "

28, ఆగస్టు 2009, శుక్రవారం

జ్యోతిష రహస్యాలు- తత్వ సిద్ధాంతం


పంచతత్వ సిద్ధాంతం అనేది నాడీజ్యోతిషంలో అత్యంత ముఖ్యమైన సిద్ధాంతములలో ఒకటి.

సాధారణ జ్యోతిష్యవిద్యలో కూడా తత్వవిభజన,తత్వనిర్ణయం,చేస్తేనే లోతైన ఫలితములు చెప్పటానికి వీలవుతుంది.మామూలుగా చేసే గ్రహ/రాశి/భావ విశ్లేషణకు,పంచతత్వ సిద్ధాంతమును తొడు చేసుకుంటే మరిన్ని వివరాలు తేటతెల్లంగా తెలిసే అవకాశం ఉంది.

ఆరోహతత్త్వంలో జన్మించినవారు వయసు పెరిగే కొద్దీ అభివృద్ది సాధిస్తారు. అదే అవరోహతత్త్వంలో జన్మించినవారైతే కాలం గడిచేకొద్దీ భావ కారకత్వాలలో తిరోగమనం కలుగుతుంది. 

భూతత్త్వంలో జన్మించిన వారు లౌకికమైన ఆశలు, ఆశయాలు బలంగా ఉన్న వారౌతారు.వారి జీవితంలో భౌతికమైన విషయాలకు ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది.

జలతత్త్వంలో జన్మించిన వారు, మృదు స్వభావులు, తేలికగా ఏ పరిస్థితిలో నైనా ఇమిడి పోయేవారు అవుతారు.

అగ్నితత్త్వంలో జన్మించిన వారు తీక్ష్ణ స్వభావులు, కోపధారులు,స్థిమితం లేని వారు అవుతారు.

వాయుతత్వంలో జన్మించిన వారు చలనశీలురు, ప్రయాణాలు ఇష్టపడేవారు, ముఖ్యవ్యక్తులు అవుతారు.

ఆకాశతత్త్వంలో జన్మించినవారు ఆలోచనాపరులు,తత్వవేత్తలు,లోతైన మనుషులు,తేలికగా అంతు చిక్కనివారు అవుతారు. 

తత్వ అంతర్ తత్వములను బట్టి ఈ ఐదింటిలో రకరకాల కలయికలు కలుగుతాయి.వాటిని బట్టి మళ్ళీ జాతకులస్వభావాలు, జీవిత సంఘటనలు మారిపోతాయి.

ఇవే ఇతర జాతక విషయాలతో కలిపి చూస్తె, చాలా ఆశ్చర్యకరమైన విషయాలు కనిపిస్తాయి.ఉదాహరణకు అగ్నితత్వంలో పుట్టిన వ్యక్తి సింహ/మేష రాశి లేదా లగ్నం అయి ఉండి, ఆ జాతకంలో కుజుడు లేక రవి బలంగా ఉంటే, ఆవ్యక్తి సంఘంలో ఒక ప్రముఖ అధికారి, రాజకీయ నాయకుడు లేక ఉన్నత పదవిలో ఉండే వ్యక్తి అవుతాడు. కాని ఆయా దశలు జీవితంలో సరి అయిన సమయంలో రావాలి.

అలాగే ఇతర తత్వములు,గ్రహముల పరస్పర యోగస్తితులతో రకరకాల మనస్తత్వాలు,జీవితాలు, దశలు, సంఘటనలు పుట్టుకొస్తాయి.

అదే విధంగా, జల తత్వంలోపుట్టిన వారు అగ్నితత్వ రాశులలో/లగ్నాలలో జన్మించి- ఆ జాతకాలలో చంద్రుడు/శుక్రుడు బలహీనులుగా ఉంటే--వీరు బలహీన మనస్కులు, మానసిక రోగాలు,ఇతర రోగాలతో బాధలు పడేవారు,జీవితంలో అభివృద్ది సాధించలేనివారు అవుతారు.

ఈ విధంగా తత్వముల/ గ్రహముల/రాశుల కలయికలతో (యోగములతో) జీవితాన్ని స్థూలంగా అంచనా వేసే విధానం తత్వసిద్ధాంతం ద్వారా మనకు లభిస్తుంది. జ్యోతిర్విద్యలో పరిశోధనకు తత్వసిద్ధాంతంలో బోలెడంత అవకాశం ఉంది.
read more " జ్యోతిష రహస్యాలు- తత్వ సిద్ధాంతం "

27, ఆగస్టు 2009, గురువారం

ఒక విషాద కథ


మాకు తెలిసిన ఒక అమ్మాయికి 2003 లో పెళ్ళయింది. అప్పటికి అమ్మాయికి 18 ఏళ్ళు ఉంటాయి. జాతకం చూడమని నన్ను అడిగితే చూచాను. తనది ధనుర్లగ్నం. కుటుంబ స్థానంలో గురువు నీచలో ఉన్నాడు. సప్తమం, మాంగల్య స్థానం కూడా దెబ్బ తిన్నాయి. సప్తమాధిపతి బుధుడు అష్టమంలో ఉన్నాడు. కనుక అప్పుడే పెళ్లి వద్దనీ, ముందు గురు, బుధ గ్రహాల దోష పరిహారం చేసుకొని, 24 ఏళ్ళు దాటిన తరువాత పెళ్లి చేసుకుంటే బాగుంటుంది అని చెప్పాను.

కాని ఆ అమ్మాయి వినలేదు. మంచి సంబంధం వచ్చింది కాబట్టి చేసుకుంటానని మొండి పట్టు పట్టి మరీ పెళ్లి చేసుకుంది. ఇంతకంటే మంచి సంబంధాలు తెస్తామని ఒక పెళ్ళిళ్ళ పేరయ్య కూడా మొత్తుకున్నాడు. ఎంతమంది చెప్పినా వినలేదు. తర్వాత కొన్నేళ్ళు అంతా బాగానే ఉంది. వివాహ జీవితం బాగానే సంతోషంగా సాగుతున్నది. ఇల్లు కొనుక్కున్నారు. సామాన్లు సమకూర్చుకుంటున్నారు. నేను చెప్పినది అంతా తప్పని వాళ్ళలో వాళ్లు అనుకున్నారు. కొన్నాళ్ళు కనిపించేది. తరువాత కనిపించటం మానేసింది. కానీ వార్తలు తెలుస్తుందేవి.

కొన్నేళ్ళు బాగానే ఉన్న మొగుడు మెల్లగా చెడు సావాసాలు మరిగి, తాగుడు తందనాలు అలవాటు పడ్డాడు. క్రిమినల్ కేసులో ఇరుక్కొని బయట పడ్డాడు. సంసారంలో కష్టాలు మొదలయ్యాయి. ఆర్ధిక ఇబ్బందులు మొదలయ్యాయి. ఇలా రెండు మూడేళ్లు గడిచింది. నిన్న షాకింగ్ న్యూస్ వచ్చింది. తాగుడు కు అలవాటు పడి, ఈ అమ్మాయిని కొట్టటం చేస్తుంటే, తను, తన అత్తగారు కలిసి ఎదురు తిరిగి గడ్డి పెట్టారు. గొడవ జరిగింది. ఆ కోపంలో కిరసనాయిలు మీద పోసుకొని అంటించుకున్నాడు. భగ్గున మంటలు రేగితే, వీళ్ళకు తెలీక చెరో బక్కేట్టూ నీళ్లు పోశారు. 80 % కాలిన గాయాలతో బొబ్బలతో రెండు మూడు ఆస్పత్రులు తిరిగి ఎవరూ చేర్చుకోక పోతే, చివరికి గుంటూరు జెనరల్ ఆస్పత్రిలో పది రోజుల క్రిందట చనిపోయాడు.

ఇప్పుడు ఈ అమ్మాయికి 24 ఏళ్ళు. ఇద్దరు ఆడ పిల్లలు. చదువు లేదు. ఇంకా అత్తగారు మంచిది కాబట్టి తనతోనే ఉండమని చెప్పింది. భవిష్యత్తు అంధకారం. సరిగ్గా ఇప్పుడు మళ్ళీ మకరంలో గురువు నీచ స్థితిలో సంచారం చేస్తున్నాడు. ఇప్పుడే ఈ సంఘటన జరగటం ఏమిటి? ఒకవేళ గ్రహ దోషం పరిహారం చేసుకొని, ఈ ఆరేళ్ళూ ఆగి గురువు రెండవ ఆవృత్తి అయిన తర్వాత పెళ్లి చేసుకొని ఉంటే ఇలా జరిగేది కాదా? అప్పుడు వివాహ జీవితం బాగుండేదేమో? 


ఇవన్నీ జవాబు లేని ప్రశ్నలు. కర్మ బలీయంగా ఉన్నపుడు మంచి చెప్పినా వినాలని బుద్ధి పుట్టదు.తర్వాత బాధపడతారు.ఏం చేస్తాం?బుద్ధి కర్మానుసారిణి అన్న సామెత ఊరకే రాలేదు కదా.
read more " ఒక విషాద కథ "

24, ఆగస్టు 2009, సోమవారం

హైదరాబాదా? పాకిస్తానా?

హైదరాబాదులో గణేష్ చతుర్థి ఉత్సవాలకు వేదికలు నిర్మించకుండా ముస్లిములు చాలా చోట్ల అడ్డుకుంటున్నారు. ఇదివాస్తవం. మన దేశంలో మన పండుగలు చేసుకోనివ్వకుండా, ముస్లిం సోదరులు అంటూ రాజకీయ కుష్టు రోగులుభుజాలేక్కించుకునే వీళ్ళు అడ్డుకోవటం చూస్తుంటే మన దేశం ఎటు పోతున్నదో అర్థం కావటం లేదు.

అసలు ముస్లిములను దేశంలో ఉండనిచ్చి గాందీ నెహ్రూలు ఘోర తప్పిదం చేసారు. మత ప్రాతిపదికన ఇంకోదేశంగా పాకిస్తాన్ ఏర్పడ్డపుడు అందర్నీ అక్కడికి తోలక, ఉండాలనుకుంటే ఇక్కడే ఉండవచ్చు- అని చెప్పి చారిత్రికతప్పిదం చేసారు. దాని ఫలితం ఇప్పుడు మనం అనుభవిస్తున్నాము. ఒక జమ్మూ కాశ్మీర్, ఒక లక్నో, ఒక ఆలీగర్, ఒక హైదరాబాద్, ఒక బెంగుళూర్, ఒక సేలం, ఒక పాలఘాట్, ఒక మెంగులూర్, ఒక త్రివేండ్రం ఇలా చాప కింద నీరులాపాకిస్తాన్ తొత్తులు పాకిపోతూ మన సమాజానికి ప్రమాదకరంగా పరినమిస్తున్నాయంటే అది గాందీ నెహ్రూ చలవే.

ముస్లిములు దేశంలో ఉన్నా దేశం ప్రశాంతం గా ఉండదు. ఉండలేదు. మొదట్లో అయ్యా మీ దేశంలో కొంతనీడనిస్తే చాలు అనే వీరు- బలపడే కొద్దీ నీడ నిచ్చిన దేశపు సంస్కృతినీ ఆచారాలనూ ఎటాక్ చేసి ఇస్లామీకరణచెయ్యాలని చూస్తారు. విషయం చరిత్ర ఎన్నో సార్లు నిరూపించింది. కారణం ఏమిటంటే వారికి దేశాభిమానం ఉండదు. మతాభిమానమే ఉంటుంది. విషయం డా|| అంబేద్కర్ కూడా తన రచనలలో ప్రస్తావించాడు. మతం కోసం వారికినీడనిస్తున్న దేశానికి ద్రోహం చెయ్యటానికి వారు వెనుకాడరు. ప్రస్తుతం సంక్షోభంలో ఉన్నదేశాలను వేటిని చూచినా విషయం తేటతెల్లం గా రుజువు అవుతుంది. నిన్నటి గణేష్ ఉత్సవాల్లో వేదికలు నిర్మించుకోవటానికి హిందూకార్యకర్తలు రాళ్ళ దెబ్బలు తిని ఆస్పత్రి పాలు కావలసి వచ్చిందంటే-- రాజకీయ కుష్టు రోగులు మైనారిటీ ఓట్ల కోసందేశాన్ని ఎంతగా అధోగతికి తీసుకేలుతున్నారో తెలుస్తున్నది.

మన దేశాన్ని అధోగతి పాలు చేస్తున్న ఇంకో శక్తి- టీ వీ చానళ్ళు. వార్తను టీవీ చానలూ చూపలేదు. చూపే ధైర్యంకూడా వాటికి లేదు. ఎంతసేపూ పనికి మాలిన సోది ప్రోగ్రాములతో ఊదరగొడుతూ చూపిందే చూపుతూ మాస్హిప్నటైజ్ చేస్తూ-- విదేశీ వస్తువులను కొనిపిస్తూ, విదేశీ సంస్కృతిని పెంపు చేస్తూ, మన వేష భాషలను, ఆచారాలనూమనకు తెలీకుండా నిర్మూలిస్తున్న ఇంకొక దుష్ట శక్తి -- టీ వీ . యువత నాడు క్రమ శిక్షణ లేకుండా తయారౌతూ, పెద్దా చిన్నా గౌరవం లేకుండా ప్రవర్తిస్తూ, నోరు తెరిస్తే అసభ్య భాష, వెకిలి మాటలు మాట్లాడుతూ ఉందంటే అది చాలావరకూ టీ వీ ప్రభావమే.

మన దేశంలో నిర్మాణాత్మక పాత్ర పోషించ వలసిన మీడియా ఘోరంగా విఫలం అయింది అనటానికి ఎన్నోనిదర్శనాలున్నాయి. అది కూడా స్వార్థ పర శక్తుల చేతుల్లో కీలుబొమ్మ అవటం వల్లనే- దేశ నిర్మాణంలో భాగస్వామికావటానికి బదులు- దేశ నాశనంలో కీలక పాత్ర పోషిస్తున్నది. నిజాలను దాచి పెట్టి అబద్దాలను ప్రచారం చేసేమీడియాను ఏమని పిలవాలో మిత్రులే సూచించండి.

మన పండుగలు మనం చేసుకోలేని పరిస్తితులు అప్పుడే దాపురిస్తున్నాయి. ఇంకొంత కాలం పోతే మన కట్టూ బొట్టూఅంతా వారిష్టప్రకారం మార్చుకోవాల్సిన దుర్గతి పడుతుందేమో. మన సమాజం ఇప్పటికైనా కళ్లు తెరిచి ఐకమత్యాన్నినేర్చుకోకపోతే మన దేశం కొన్నేళ్ళకు మరో పాకిస్తాన్ అవటం ఖాయం.
read more " హైదరాబాదా? పాకిస్తానా? "

23, ఆగస్టు 2009, ఆదివారం

వినాయక చవితి శుభాకాంక్షలు.

వినాయక చవితి సందర్భం గా నా బ్లాగు చదివే వారందరికీశుభాకాంక్షలు.

విఘ్నేశుడు ఓంకార స్వరూపుడు. ఆయన ఆకారం కూడాఓంకార రూపమే. ఓమిత్యేకాక్షరం బ్రహ్మా అని వేదంచెబుతుంది. దీని
ర్థం: ఓం అనబడే ఏకాక్షరమే బ్రహ్మము. ఈశ్వరునికి గల పేరు ఏదైనా ఉంది అంటే అది ఓం అనుఏకాక్షరమే. కనుక దీనిని శబ్ద బ్రహ్మము అంటారు. గాఢధ్యానములో నాదాన్ని మనం వినగలుగుతాము. ఇది జనసమ్మర్దం ఉన్న ప్రాంతాలలో వినిపించదు. కొండ కోనల్లో, ప్రశాంత ప్రక్రుతి మధ్యలో, జన సంచారం లేని చోట్ల, లేదాహిమాలయ పర్వతాలలో వేల అడుగుల ఎత్తులో ఉన్నప్రదేశాలలో తెల్లవారు జామున నాదాన్ని సాధకులువినవచ్చు.

తస్య వాచకః ప్రణవః- అని పతంజలి మహర్షి కూడాపరబ్రహ్మము యొక్క వాచకం ప్రణవం అని తన యోగ సూత్రములలో చెబుతాడు. మాండూ
క్యోపనిషత్తు ప్రణవస్వరూపాన్ని అత్యంత వివరంగా వర్ణించింది. అన్ని శబ్దములకు ప్రధమం గా పుట్టిన శబ్దం ఓంకారం. కనుక అన్ని మంత్రములకు ముందు ఓంకారం ఉంటుంది. గణపతి ఓంకార స్వరూపుడు కనుక అన్ని పూజలలో ప్రథమంగా గణపతి పూజ ఉంటుంది.

యోగ మార్గములో కూడా మొదటిది అయిన మూలాధార చక్రమునకు అధిపతి గణపతి. దీన్ని ఆధార చక్రం అని కూడాఅంటారు. సర్వ ప్రపంచానికి ఓంకారమే ఆధారము. అలాగే అన్ని క్రతువులకూ, ఉపాసనలకూ, సాధనలకూ గణపతిఆధారం. గణపతి మంత్ర మూర్తి. అలాగే ప్రణవం కూడా సర్వ మంత్ర మయం. గణపతి బ్రహ్మచర్య మూర్తి. కనుక అన్ని యోగ సాధనలకూ బ్రహ్మచర్యం అతి ముఖ్యం.


ప్రణవ నాదాన్నే అనాహత నాదం అంటారు. అనగా ఆహతము కానిది, కొట్టబడనిది. శబ్దాలన్నీ ఒక వస్తువు ఇంకొకవస్తువుతో తగిలితే వస్తాయి. కాని ప్రణవ నాదం స్వతఃసిద్ధము. కనుక అనాహతము. శబ్దమును అనాహత ధ్వనిఅని కూడా అంటారు. ఇది పరమాత్ముని నాభి స్థానం నుంచి నిరంతరమూ వస్తున్న ధ్వని గా యోగులు చెబుతారు. లోతైన ధ్యానములో మునిగి ఉన్నపుడు ఈ నాదాన్ని తనలో తానె వినవచ్చు. శ్రీ రామకృష్ణులు దీనిని "టాం......" అనే దీర్ఘ ధ్వనిగా ఉంటుంది అని చెప్పారు. గుడిలో గంట మొగించినపుడు ఒక్క సారి కొట్టి వదిలితే ఆ ధ్వని "టాం....." అని దీర్ఘ ధ్వనిగా వినిపిస్తూ చివరికి
శూన్యంలో కలుస్తుంది. ఈ ధ్వని ఓంకార నాదానికి చాలా దగ్గరగా ఉండే ధ్వని. అందుకే గుడిలో ఘంటా నాదం చెయ్యాలి. కాని కొందరు అందే పనిగా సైకిలు బెల్లు కొట్టినట్లు గంట కొడతారు. అది చాలా తప్పు.

Milky way అనేది పాలసముద్రం. గెలాక్సీ ని ఆవరించి ఉన్న, అంటే దీనిపైన శయనించి ఉన్న శక్తి ఆదిశేషువు అనేసహస్ర ఫణ
ములు కల మహా సర్పము. సర్పము శక్తికి మార్మిక సూచన అని యోగులకు తెలుసు. అనగా పాలపుంతను ఒకటిగా పట్టి ఉంచుతున్న ఆకర్షణ శక్తియే ఆదిశేషుడు. మహా సర్పము పైన శయనించి ఉన్న ఈశ్వర శక్తి విష్ణువు. అనగా విశ్వములో గల గురుత్వాకర్షణ శక్తికి మూలమైన శక్తి- విష్ణువు. గణపతిని కూడా శుక్లాంబర ధరంవిష్ణుం అని పూజిస్తాము. శక్తి యొక్క మూలం అనగా గెలాక్సీ యొక్క కేంద్రం అయిన గెలాక్టిక్ సెంటర్ అనేది విష్ణునాభి. ఇక్కడనే మూలా నక్షత్ర మండలం ధనూ రాశిలో ఉంటుంది. ఇది పాలపుంత కు మూలం కనుక దీనిని మూలానక్షత్రం అన్నారు.

మూలా నక్షత్ర మండలం కేంద్రంగా చేసుకొని ఓంకార నాదం Milky way అంతటా నిరంతరమూ ప్రవహిస్తూఉంటుంది. బహుశా ఇది ఇప్పటివరకూ అర్థం కాని ఏదో ఒక రకమైన కాస్మిక్ రేడియేషన్ కావచ్చు. దీన్ని పాశ్చాత్యులు Music of the spheres అనీ logos అనీ అన్నారు. అస్త్రోనమీ కూడా మన పాలపుంతకు కేంద్ర స్థానం మూలా నక్షత్ర మండలం ప్రాంతంలోనే ఉంది అని చెబుతున్నది. వేదంలో వేల సంవత్సరాల క్రితంచెప్పిన విషయాలు ఇప్పటి సైన్సు మళ్ళీ నిజాలుగా వప్పుకుంటున్నది. కాకపోతే వేదం విష్ణు నాభి అంటే సైన్సు గలక్టిక్
సెంటర్ అంటున్నది. భాష తేడా- కాని భావం ఒకటే.

విధంగా నిరంతరం విశ్వంలో తనంత తానుగా ప్రతిధ్వనిస్తున్న ఓంకార స్వరూపమే గణపతి స్వరూపం. ఇదే నాదం మనలో నాడిగా ఉన్నది, హృదయ స్పందన గా ఉన్నది. ప్రాణ స్పందన గా ఉన్నది. ప్రాణ రూపమైన ఓంకారం మనలోఉన్నంత వరకూ మనం జీవిస్తాం. అది ఆగిన మరుక్షణం మరణిస్తాము. విధంగా గణపతి సమస్త జీవులకు ఆధారంగా ఉన్నాడు. జీవులన్నీ గణములు అయితే ఆయన గణములకు పతి లేక గణపతి.

అట్టి ఓంకార రూపుడైన గణపతిని ఆరాధన చేసే నవరాత్రులకు మొదలు ఈరోజు. మంత్ర సాధన చేసే వారు రోజునుంచి నియమంగా తొమ్మిది రోజులు మంత్ర పునశ్చరణ చేయటం వల్ల మంచి ఫలితాలు కనిపిస్తాయి. సాధకమిత్రులు ప్రయత్నించండి.

మరొక్కసారి వినాయక చవితి శుభాకాంక్షలు.
read more " వినాయక చవితి శుభాకాంక్షలు. "

21, ఆగస్టు 2009, శుక్రవారం

గీతా శ్లోకానికి యోగపరమైన వివరణ

క్రిందటి భాగంలో ఈ శ్లోకానికి వేదాంత పరమైన అర్థం తెలుసుకున్నాం. ఇప్పుడు ఈ శ్లోకానికి యోగపరమైన అర్థం తెలుసుకుందాం.

శ్లోకం||బుద్ధి యుక్తో జహాతీహ/ఉభే సుకృత దుష్క్రుతౌ/
తస్మాద్ యోగయా యుజ్యస్వ/యోగః కర్మసు కౌశలం||

సుకృత దుష్క్రుతములనగా మంచి చెడు కర్మలు అని మనకు తెలుసు. కాని యోగ పరంగా చూస్తె ఈ మంచి చెడు కర్మలు వేరు. మామూలుగా మనం అనుకునే కర్మలు కావు. యోగపరంగా కర్మ అనగా శరీరంలో ప్రాణ సంచారం. యోగపరమైన అర్థం చెప్పేటపుడు సామాన్యార్థం వర్తించదు.

ఇడా పింగళా సుషుమ్నా నాడులు యోగమున సుప్రసిద్ధములు. కుండలినీ యోగములో, స్వర శాస్త్రములో వీటి వినియోగం ఉంటుంది. ఇడా నాడి చంద్ర నాడి, అనగా చల్లని ప్రభావం కలిగినట్టిది. ఇడా నాడినుంచి ప్రాణ సంచారం జరిగే టపుడు జరిగేది సౌమ్య కర్మ. దీనికే మంచి కర్మ అనిపేరు .

పింగలా నాడి సూర్య నాడి, అనగా ఉష్ణ తత్త్వం కలిగినట్టిది. పింగలా నాడినుంచి ప్రాణ సంచారం జరిగేటపుడు మనుష్యులు చేసేది క్రూర కర్మ. దీనికే చెడుకర్మ అని ఇంకొక పేరు. మనుష్యులకు ఎప్పుడూ ప్రాణ సంచారం ఈ రెండు నాడులలో ఏదో ఒక నాడి గుండా ప్రధానం గా జరుగుతుంది. కనుక వారు మంచిచెడూ కర్మలు చేస్తూ కర్మ బద్ధులై ఉంటారు.

కాని రెండింటియందు సమంగా ప్రాణసంచారం జరిగే సమయాలు కొన్ని ఉంటాయి. అప్పుడు సుషుమ్నా నాడిమేలుకొంటుంది. అటువంటి సమయంలో మానవుడు చేసే కర్మలు దగ్ద కర్మలుఅంటారు. అనగా అవి ఫలితాన్ని ఇవ్వవు. ఈ సుషుమ్నా సంచారం జరిగే సమయం ఒక్క ధ్యానానికి మాత్రమె అనుకూలం గా ఉంటుంది.

అటువంటిసమయంలో ధ్యానానికి కూర్చుంటే మనస్సు తేలికగా ఏకాగ్రమై భ్రూ మధ్యంలోకుదురుకుంటుంది. ఈ భ్రూ మద్యం బుద్ధి స్థానం. కనుక మనస్సు బుద్ధి స్థానమైన త్రికుటిలో ఏకాగ్రం అయినపుడు, మంచి చెడు కర్మలకు ప్రతిరూపాలైన ఇడా పింగలానాడుల ప్రవాహం అధిగమించబడి, సుషుమ్నలో ప్రాణ సంచారం కుదురుగాజరుగుతుంది.

ఇది గాక సూక్ష్మ సుషుమ్నా ప్రవాహం అని ఇంకొకటి కూడా ఉంది. అప్పుడు దాదాపు శ్వాస ఆగిపోతుంది. సుషుమ్నా నాడి మేలుకోనటమే మంచీ చెడు కర్మలను దాటి పోవుట. ఇదే ప్రాణాయామంలో కుశల కర్మ అన బడుతుంది. ఇట్టి స్థితిలో ఉన్నంత వరకు కర్మాతీత స్థితిలో మనిషి ఉండగలుగుతాడు. భగవంతుడు ఇట్టి కుశల కర్మను చెయ్యమని మానవునికి ఉద్బోధ చేస్తున్నాడు.

ఈస్థితిలో మనస్సు అత్యంత ప్రశాంతం అవుతుంది, నాడి మందగిస్తుంది, గుండెకొట్టుకునే వేగం చాలా వరకు తగ్గుతుంది. శరీర స్పృహ చాలా తక్కువగా, అంటే ఒకభావనా మాత్రంగా ఉంటుంది. మానసిక ఆలోచనలు పూర్తిగా ఆగిపోతాయి. ప్రాణసంచారం శరీరం నుంచి తిరోహితమై వీణా దండం అనబడే వెన్నెముకలోని సుషుమ్నా నాడిలో మాత్రమె జరుగుతూ ఉంటుంది. ఇది అకర్మ స్థితి.

అంటేమనస్సులోని ఆలోచనలే గాక, శరీరం లోని ప్రాణ వ్యవస్థ కూడా విశ్రాంత స్థితిలోకివస్తుంది. ఇట్టి స్థితిలో పది నిమిషాలు ఉండగలిగితే ఎనిమిది గంటలు గాఢ నిద్రపోయినంత విశ్రాంతి అనుభవంలోకి వస్తుంది. తరువాత నిద్ర రమ్మన్నా రాదు. కాని అలసట ఉండదు. ఈ కోణంలో కుశల కర్మ అనగా ఇడా పింగలా నాడుల నుంచి ప్రాణసంచారం తిరోహితం చేసి దానిని సుషుమ్నాన్తర్గతం చేసి భ్రూ మధ్య స్థితిలోనిలకడగా ఉంచగలిగే సామర్ధ్యం.

ఇట్టి కుశల కర్మ చెయ్య గలగటమే యోగం. దీనివల్ల యోగి మంచి చెడులను అధిగమించి ఆత్మ స్థితిలో కుదురుగా ఉండగలుగుతాడు. అట్టి వాడు పుణ్య పాపాలకు అతీతుడు అవుతాడు. ఎందుకంటే ఆత్మ పాప పుణ్యాలకు అతీతమైనది. కనుక ఆత్మ స్థితిలో ఉన్నవాడుకూడా కర్మాతీతుడు అవుతాడు. శుద్ధ బుద్ధి మరియు శుద్ధ ఆత్మ ఒక్కటే అని శ్రీ రామక్రుష్ణులంటారు.

మనస్సులో ఆలోచనలు ఆగిపోయి, శరీరంలో ప్రాణ సంచారం నామ మాత్రం గా ఉన్నపుడు, శుద్ధ బుద్ధి మేలుకొంటుంది. అనగా బుద్ధి స్థాయి అనుభవంలోకి వస్తుంది. ఆ శుద్ధ మైన బుద్ధిలో ఆత్మ జ్యోతి ప్రకాశం దర్శనం ఇస్తుంది. ఇది కర్మాతీతం కనుక ఇట్టి స్థితిలో నిలకడగా ఉన్నటువంటి యోగి ఆత్మానుభావంలో మునిగి కర్మాతీత స్థితిలో ఉండగలుగుతాడు.

కనుక యోగ పరంగా చూచినపుడు,
జహాతీహ ఉభే సుకృత దుష్క్రుతౌ= ఇక్కడనే ఇడా పింగలా నాడులను అధిగమించి,
బుద్ధియుక్తో= బుద్ధి స్థానమగు భ్రూ మధ్యమున స్థితుడవై,
తస్మాద్ యోగయా యుజ్యస్వ= ఈ విధమగు యోగమును చెయ్యి,
యోగః కర్మసు కౌశలం= ఇదే కుశల కర్మ, ఇదే యోగం.
అనే నిగూఢమైన అర్థం ఈ శ్లోకంలో ఉంది.

ఈ స్థితిలో హృదయంలో ఉన్న కామములు అన్నీ శమిస్తాయి. రాగ ద్వేషాలనే బంధాలు విడిపోతాయి. కనుక కర్మాతీత స్థితిని మానవుడు అందుకొంటాడు. శరీరం ప్రాణం పూర్తిగా విశ్రాంత స్థితిలో ఉన్నవానికి కర్మ ఎక్కడిది? ఇంద్రియ తాదాత్మ్యత లేనివాడికి కర్మ ఫలం ఎలా అంటుతుంది?

||యదా సర్వే ప్రముచ్యన్తె కామా యస్య హృది స్థితాః||
అథ మర్త్యో అమృతో భవతి యెతావద్యనుశాసనమ్|| (కఠోపనిషత్ )

||యదా సర్వే ప్రభిద్యన్తె హృదయస్యేహ గ్రంధయః||
అథ మర్త్యో అమృతో భవతి యెతావద్యనుశాసనమ్||
(కఠోపనిషత్ )

read more " గీతా శ్లోకానికి యోగపరమైన వివరణ "

20, ఆగస్టు 2009, గురువారం

యోగః కర్మసు కౌశలం

శ్రీ మద్ భగవత్ గీతలో రెండవ అధ్యాయంలో 50 శ్లోకం ఇది. యోగాన్ని అనేకమంది ఆచార్యులు అనేక విధాలుగా నిర్వచనం ఇచ్చినారు. కాని సాక్షాత్తు భగవంతుని ముఖతా వచ్చిన మాట కావటంతో దీనికి అర్థ గాంభీర్యత, నిర్వచనా స్పష్టత హెచ్చు.

||బుద్ధి యుక్తో జహాతీహ/ఉభే సుకృత దుష్క్రుతౌ/తస్మాద్ యోగయా యుజ్యస్వ/యోగః కర్మసు కౌశలం||

అర్థం: బుద్ధి యుక్తుడైనవాడు ఇక్కడనే మంచి చెడు కర్మలను జయిస్తున్నాడు. కనుక నీవు యోగాన్ని అభ్యసించు. కర్మలయందు కౌశలమే యోగం.

యోగానికి భగవంతుడే చెప్పిన చక్కనైన నిర్వచనం ఇది. చూడటానికి స్వల్పమైనదైనా లోతైనట్టి అర్థం కలిగినట్టిది.

మనిషిని అతడు చేసిన కర్మలు బందిస్తున్నాయి. అవి మంచివైనా చెడ్డవైనా ఆయా ఫలితాలకు అతడు బద్దుడే. ఒక కర్మ చేసిన తర్వాత ఫలితం నాకు వద్దు అంటే పోదు. ఈ విధంగా మంచి చెడు కర్మలు, పాప పుణ్యాలకు కారణాలౌతూ వాటికి తగిన ఫలితాన్ని అతని చేత అనుభవింప చేస్తూ తద్వారా మళ్ళీ తదను గుణములైన కర్మలను అతనిచే చేయిస్తూ మళ్ళీ మళ్ళీ జన్మ పరంపరలకు కారణాలు అవుతున్నవి. ఈ కర్మ పరంపరనుంచి విడిపడే మార్గమే యోగం.

కర్మల యందు కౌశలమే యోగం అని భగవానుని ఉవాచ. అంటే ఏ పనినైనా కుశలంగా చక్కగా చేస్తే అది యోగం అవుతుందా? ఉదాహరణకు దొంగతనం కూడా ఒక కర్మయే, దానిని చక్కగా చేస్తే అది యోగం అవుతుందా? అనేది ప్రశ్న. ఇక్కడ భగవంతుడు- మంచి పనిని చక్కగా చేస్తే అది యోగం అవుతుంది అని చెప్పలేదు. కర్మను కుశలంగా చేస్తే అది యోగం అవుతుంది అన్నాడు. బుద్ధి మంతుడైన వాడు కర్మను దాటిపోతాడు అని కూడా ఆయన చెప్పాడు. కనుక ఇక్కడ చక్కగా అర్థం చేసుకోవాలి.

మనిషి బ్రతికినంత వరకూ కర్మను చెయ్యక తప్పదు. కర్మను చెయ్యకుండా ఈ ప్రపంచంలో ఎవ్వరూ ఉండలేరు. కర్మ తిరిగి ఫలితాన్ని ఇవ్వక తప్పదు. కనుక ఈ చక్రం నుంచి విముక్తి ఎలా? తాదాత్మ్యత నుండి విడివడటమే దీనికి మార్గం. ఇంద్రియములు తమతమ విషయముల యందు ప్రవర్తిల్లుతూ ఉండగా, ఇదంతయూ ప్రక్రుతి లీల అన్న విషయాన్ని అనుభవం ద్వారా చక్కగా తెలిసికొని, వాటి వ్యాపారములలో చిక్కక, తనను ఈ లీలకు భిన్నుడైన, నిత్యుడైన సాక్షిగా తెలిసికోవటమే దీనికి మార్గం.

ఈ రహస్యమును అనుభవము ద్వారా తెలిసికొన్న వాడే, కర్మ బంధములో చిక్కకుండా ఉండగలదు. బుద్ధి పరంగా అర్థం చేసుకుంటే చాలదు. అనుభవం లో కి అది రావాలి. అనుక్షణం ఈ స్పృహలో ఉంటూ సమస్త ఇంద్రియ వ్యాపారమును తనకంటే భిన్నమైనదిగా చూస్తూ ఉండగలిగితే ఇది సాధ్యం అవుతుంది. అట్టివాడే కుశల కర్మ చెయ్య గలడు.

ఇక్కడ కుశల కర్మ అంటే పనిని చక్కగా చెయ్యటం అని మాత్రమె అర్థం కాదు. కుశాలమైన కర్మ అంటే తిరిగి ప్రతికర్మను సృష్టి చెయ్యనిది అని అర్థం. ప్రతి కర్మా తిరిగి ఇంకొక కర్మకు కారణం అవుతుంది. కాని కుశలం గా చెయ్యబడిన కర్మ తిరిగి ఇంకొక కర్మకు కారణం కాదు. ఆ కర్మ అంతటితో అంతరిస్తుంది. ఇదెలా జరుగుతుంది?

కర్మ కొనసాగింప బడటానికి కారణం దాని వెనుక ఉన్న సంగం- ద్వేషం. ఈ రెండు ఒకే నాణానికి బొమ్మ బొరుసూ వంటివి. ఆత్మకు అన్యమైన ఏ వస్తువుతోనైనా ఈ రెండు రకాలైన బంధాలు కలిగి ఉండవచ్చు. ఒకటి ప్రేమతో ఉండే బంధం దీన్ని రాగం అంటుంది వేదాంతము. రెండవది ద్వేషంతో ఉండే బంధం. మనం ఒక వస్తువును గాని మనిషిని గాని ప్రేమించినా ద్వేశించినా ఎల్లప్పుడూ దాని గురించే ఆలోచిస్తాము. అంటే పాజిటివ్ గానో నెగటివ్ గానో ఆ వ్యక్తి to గాని వస్తువుతో గాని సంబంధం కలిగి ఉంటాము. ఈ రాగ ద్వేషములే, కర్మ ఫలితంతో కర్తకు సంబంధాన్ని కలుగ జేసే తాళ్ళు.

ఎవరైతే ఈ రాగ ద్వేషాలు లేక ఉండగలడో , అతడు కర్మ చేసినా దానికి కట్టు పడడు. మరి ఈ రాగ ద్వేషాదులు ప్రపంచాన్ని మొత్తాన్ని నడుపుతున్నాయే? వీటి చిక్కులో పడకుండా ఉండటం ఎలా? అంటే దీనికి ఉపాయం యోగమే. బుద్ధి యుక్తుడవై ఈ రహస్యాన్ని తెలుసుకో. ఇంద్రియములకు బాహ్య విషయములయందు గల ఆకర్షణ చేత వాటియందు ప్రవర్తిల్లుతూ ఉన్నాయి. ఇది ప్రక్రుతి లీల అన్న విషయాన్ని తన శరీరంలో జరుగుతున్నా క్రీడగా ఎవడైతే ధ్యాన సాధనలో గమనించి, అర్థం చేసుకొని, తనను ఈ ఆటకు సాక్షియైన చిత్ స్వరూపునిగా అనుభవ పూర్వకంగా తెలుసుకొన గలడో అతడు కర్మ బంధాలకు చిక్కు బడదు. కారణం అతన్ని బంధించే రాగ ద్వేషాల వల్ల అతని ఇంద్రియ వ్యాపారాలు జరుగవు. ప్రకృతి నిమిత్తం గా జరుగుతుంటాయి. తానూ సాక్షీ మాత్రునిగా ఈ ఆటను గమనించాలి.

ఎప్పుడైతే ఇట్టి స్థితిలో ఉండగలుగుతాడో, అప్పుడు రాగ ద్వేషాలు అనబడే తాళ్ళు అతన్ని బంధించలేవు. కనుక కర్మ ఫలం అతనికి అంటదు. కనుక మంచి చేసినా, చెడు చేసినా ఆయా కర్మలకు అతడు అతీతుడు అవుతాడు. శ్రీ కృష్ణ భగవానుడు ఇట్టి స్థితిలో ఉండే లీలా నాటకంగా తన జీవితాన్ని గడిపాడు. కనుక ఆయనకు ఏ కర్మ ఫలమూ అంటలేదు. అంతే గాదు, జనక మహారాజు, జడ భరతుడు, అస్తావక్రుడు మొదలైన జ్ఞానులు ఇట్టి స్థితిలో ఉండే కర్మాతీతులైనారు.

ఇట్టి స్థితిలో ఉంది చేసిన కర్మ తిరిగి ఇంకొక కర్మను సృష్టి చెయ్యలేదు. ఎందుకంటే దానికి మరొక అడుగు ముందుకు వేశే చోదక శక్తులైన రాగ ద్వేషాలు ఉండవు. కనుక ఇట్టి కర్మ కుశల కర్మ అనిపించుకుంటుంది. ఇట్టి స్థితిలో ఉండి చేసిన కర్మయే యోగం అనిపించుకుంటుంది. ఇట్టి కర్మ వల్లనే మనిషి పుణ్య పాపములను దాటి పోగలడు.

కనుక బుద్ధి మంతుడైన వాడు ఇట్టి కుశల కర్మను ఆచరించి కర్మాతీతుడు కావాలని భగవానుడు గీతలో లోకానికి అమృత బోధ చేశాడు. తద్వారా జీవన్ముక్త స్థితిని అందుకొని జననమరణాలకు అతీతుడు, ముక్త పురుషుడు కావచ్చు. కాని ఇది చెప్పినంత తేలికా అంటే కానే కాదు. తెలికైతే, కోటిలో ఒకడు మాత్రమె దీనిని పొందగలడు అని మళ్ళీ తానె ఎందుకు చెబుతాడు? ఆధ్యాత్మిక సాధన ఏదైనా చాలా కష్టం తో కూడుకున్నదే. ఇది తనతో తానె చేసే పోరాటం. ఇందులో బయట శత్రువులు ఎవ్వరూ ఉండరు. తన మనసే తనకు శత్రువు, తన మనసే తనకు మిత్రుడు.

బుద్ధి ప్రస్తావన ఎందుకు వచ్చింది? బుద్ధి మనస్సుకు పై మెట్టు. కనుక మనస్సును దాటి, అనగా మనో వ్యాపారములను గమనిస్తూ, బుద్ధి స్థాయిలో స్థితుడై ఉండగలిగితే, ఈ యోగం సాధ్యం అవుతుంది అని అన్యాపదేశం గా చెప్ప బడింది.

ఈ శ్లోకానికి ఇంకా నిగూఢములైన యోగార్ధాలు ఉన్నాయి. ఇప్పుడు వ్రాసింది అందరికీ తెలిసిన అర్థం మాత్రమె. యోగులకు మాత్రమె తెలిసిన నిగూఢ అర్థాలు మరోసారి ముచ్చటించుకుందాం.
read more " యోగః కర్మసు కౌశలం "

17, ఆగస్టు 2009, సోమవారం

మానవ జీవితం పైన గ్రహాల ప్రభావం


మనిషి ఆకారాన్ని బట్టి, మాట్లాడే తీరును బట్టి, ప్రవర్తించే తీరుని బట్టి ఏ గ్రహం ఆ సమయంలో అతనిపైన పనిచేస్తోందో తెలుసుకోవచ్చు. అలాగే జాతకంలోని బలీయమైన గ్రహాన్ని కూడా వెంటనే తెలుసుకోవచ్చు. తరువాత జాతకాన్ని పరిశీలిస్తే ఇది నిజం కావటం జరుగుతుంది. దీని ద్వారా కొన్ని ఆశ్చర్య పరిచే విషయాలు తెలుస్తాయి.

గ్రహాల ప్రభావాలు స్థూలం గా ఇక్కడ ఇస్తున్నాను. ఇవన్నీ జ్యోతిష గ్రందాలనుంచి సేకరించబడినవి, మరియు నా అనుభవంలో అనేకసార్లు నిజాలుగా రుజువు అయినవి.

> సూర్యుడు-అధికారం చెలాయించటం, ఉన్నతులమని భావించటం మాత్రమె కాక అలాగే ప్రవర్తించటం, నాయకత్వ లక్షణాలు, పదిమందిలో తేలికగా గుర్తింపు ఉంటే వారు సూర్యుని ప్రభావం లో వారు.
>పూర్ణ చంద్రుడు- మృదు స్వభావం, జాలిపడే తత్త్వం, సహాయ పడే తత్వం, మానవ సంబంధాలు.
>క్షీణ చంద్రుడు-ఏదీ తేల్చుకోలేని ఊగిసలాట ధోరణి, బలహీన మనస్తత్వం, పిచ్చి ధోరణి, విపరీత ఆలోచనలు.
>బుధుడు-తెలివి తేటలు, బహుముఖ ప్రజ్న,హాస్య చతురత, కలుపుగోలు తనం.
>కుజుడు-ధైర్యం, దురుసుతనం, కయ్యానికి కాలుదువ్వటం,సాహసం, మొండి పట్టుదల.
>గురువు- ధార్మిక మనస్తత్వం, మంచితనం, సహాయపడే గుణం, అడ్డదారులు తొక్కని మనస్తత్వం, ముక్కుసూటితనం.
>శుక్రుడు-అందం, విలాసాలు, జల్సాలు, కళా కౌశలం , ఖరీదైన జీవితం .
>శని- కాయకష్టం చెయ్యటం, సోమరితనం, అశుభ్రం గా ఉండటం, పిరికితనం, చొరవ లేకపోవటం.
>రాహు- మోసం, ఇతరుల సొమ్ము ఆశించటం, కుట్రలు, దౌర్జన్యాలు, సంప్రదాయాన్ని ప్రశ్నించటం, ఎదురు తిరగటం, వృధాగా తిప్పట, కాళ్ళరిగేలా తిరిగే ఉద్యోగాలు, అతి వాగుడు, గమ్యం లేని జీవితాలు గడపటం .
>కేతు-చాప కింద నీరులాంటి మనస్తత్వం, పిరికి ఆధ్యాత్మికత, మెట్ట వేదాంతము, ప్రమాదకర కుట్రలు చెయ్యటం, లేక ముచ్చు లాంటి ప్రవర్తన.

ఇక రెండు మూడు గ్రహాల కలయికలో ఆయా గుణాల సమ్మిలిత ప్రభావం మనిషి మీద ఉంటుంది. ఆయా గ్రహాల దశలు జరిగేటప్పుడు పైన చెప్పిన లక్షణాలు ఎక్కువగా కనిపించటం, ఆలోచనలు అలాంటివే కలగటం, ప్రవర్తనలు కూడా అలాగే ఉండటం చూడవచ్చు.

కొందరు మనుషులను చూస్తె వారిలో కొన్ని గ్రహాల మూర్తీభావం కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. ఇంకొందరి ప్రవర్తన చూస్తె వారికి ఏ దశ జరుగుతున్నదో అంచనా వెయ్యవచ్చు. అంతే కాదు కొన్నికొన్ని శరీరభాగాల తీరును బట్టి కొన్ని గ్రహాల ప్రభావం చాలావరకూ అంచనా వెయ్యవచ్చు.

ఉదాహరణకు ఎత్తుపళ్ళు ఉన్నవారికి రాహువు రెండవభావంలో ఉండటం చాలా జాతకాల్లో చూచాను.అంతేకాక పిల్లికళ్లు ఉన్నవారిమీద రాహు/కేతువుల ప్రభావం ఉండటం వారి మాటలలో చేతలలో గమనించవచ్చు. అలాగే ఒక కాలు కుంటివారికి ఎక్కువగా శనిగ్రహప్రభావం ఉండటం గమనించాను.అలాగే బట్టతల ఉన్నవారి మీద శని రాహుగ్రహాల ప్రభావం అమితంగా ఉండటం చూడవచ్చు. 

పొట్టిగా బొద్దుగా ఉన్నవారిమీద బుధ గ్రహప్రభావం ఉంటుంది.అవకాశ వాదులు అతిగా వాగే వారిమీద బుధ రాహుగ్రహాల ప్రభావం ఉంటుంది. అలాగే మొండిపిల్లలు,క్రమశిక్షణ లేని పిల్లల మీద రాహు,కుజుల ప్రభావం ఉంటుంది.ఇవన్నీ గ్రంధాలలో సూటిగా చెప్ప బడకపోయినా,అన్యాపదేశంగా చెప్పబడ్డాయి.నా పరిశీలనలో ఇవన్నీ నిజాలు కావటం గమనించాను.

తెల్లగా అందంగా ఉన్నవారు ఎక్కువగా వృషభ,తులాలగ్నాలలో పుట్టటం గమనించవచ్చు.అలాగే కురూపుల మీద కేతు ప్రభావం ఉండటం చూడవచ్చు. వయసుకంటే ఎక్కువ ముసలివారిగా కనిపించేవారి మీద శని ప్రభావం, సాంప్రదాయ మతవాదులు,వేషభాషలలో ఆచారపరుల మీద గురుప్రభావం జాతకంలో కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది.దురుసుగా ప్రవర్తించేవారు,రౌడీలు ఇటువంటి జాతకాలలో కుజ/రాహువుల పాత్ర కనిపిస్తుంది.నాటక,సినీ రంగాల వారిమీద శుక్ర/రాహు ప్రభావం ఉంటుంది.

ఆయా వ్యక్తుల మీద ఆయాగ్రహాల ప్రభావం,జాతకంలో ప్రముఖ గ్రహ పరంగానూ(అది లగ్నం అధిపతిగా కావచ్చు,లేదా ఆత్మ కారకునిగా కావచ్చు, లేదా బలీయమైన గ్రహంగా కావచ్చు) లేదా అప్పుడు నడుస్తున్న దశ/అంతర్దశల పరంగానూ ఉంటుంది.

ఈ విధంగా పరిశీలన జరిపెకొద్దీ, అనుభవం పెరిగే కొద్దీ, మనిషిని చూట్టంతోనే, అతని జాతకంలో ముఖ్యవిషయాలు మనసుకు స్పురించటం మొదలౌతుంది. అలాగే అతనికి అప్పుడు జరుగుతున్న దశ చూచాయగా తెలియటం జరుగుతుంది.ఇలా నాకు చాలా సార్లు జరిగింది.త్వరలో మీకు ఫలానా సంఘటన జరుగుతుంది అని మనసుకు తోచటం,అవి చెప్పటం,అవే సంఘటనలు జరగటం కూడా చాలాసార్లు జరిగింది.

అయితే జాగ్రత్తగా ఉండమని మనం చెప్పినప్పటికీ వారు వాటిని తప్పించుకోలేక పోవటం ఎక్కువసార్లు జరిగింది. దీనికి కారణం నూటికి తొంభై పాళ్ళు ఆయా వ్యక్తుల నిర్లక్ష్యధోరణి మాత్రమె కారణం అవుతుంది. కర్మ బలీయంగా ఉన్నపుడు, మనల్ని పరిహారాలు చెయ్యనివ్వదు.అంతేకాక ఆ వ్యక్తి మీద రకరకాలుగా పనిచేసి ఆ కర్మను అనుభవించేటట్టు చేస్తుంది. ఏలాగంటే, నిర్లక్ష్యధోరణి,అహంకారం, లేదా వీడికేమి తెలుసులే అనే తిరస్కార ధోరణి,జరిగేది జరుగక మానదు అనే నిరాశాపూరిత ధోరణి,పరిహారాలు మొదలు పెట్టి మధ్యలో వదిలెయ్యటం ఇలా రకరకాలుగా మనిషి మీద పనిచేసి మొత్తానికి రేమేడీలు చెయ్యలేకపోవటం,ఆ కర్మను అనుభవించటం చేయిస్తుంది.అంతేకాక మాట తీరు, ప్రవర్తనను బట్టి వారి జాతకంలో ఉన్న దోషాలు మనస్సుకు స్పురించటం కూడా జరుగుతుంది.

ఇదెలా జరుగుతుంది? అంటే నాకు తెలిసి ఒక కారణం కనిపిస్తోంది. అనుభవజ్ఞుడైన డాక్టరుకు రోగిని చూడటంతోనే ఒక ఊహ వస్తుంది. ఇతనికి రక్తహీనత ఉంది, లేదా బీపీ ఉండవచ్చు,లేదా గుండెజబ్బు ఉండవచ్చు ఇత్యాదిగా ప్రాధమికంగా ఎలాగైతే ఒక అవగాహన కలిగి తరువాత ప్రశ్నల ద్వారా పరీక్షల ద్వారా ఆ ఊహను నిజమా కాదా నిర్థారించుకుంటారో, అలాగే జ్యోతిర్విజ్ఞానంలో కూడా జరుగుతుంది.

ఏళ్ళతరబడి మనకు ఈ విధమైన విశ్లేషణ అలవాటు అయినప్పుడు, మన అన్తఃచ్చేతనలో మనకు తెలీకుండానే కొన్నిరకాల ఆలోచనా విధానాలు (thought patterns)తయారై ఉంటాయి. అవి అలవాటు మీద, కొన్నికొన్ని పరిస్థితులలో వాటంతట అవే ఉత్తెజితాలై మనకు కొంత సమాచారాన్ని అందిస్తాయి.దాన్నే మనం స్ఫురణ అని అనుకుంటాము.అంటే సమాచారం మనకు తెలీకుండానే ఒక రూపాన్ని సంతరించుకొని మనకు స్పురించటం జరుగుతుంది. ఆయా ఆలోచనల మధ్యన సంక్లిష్ట సమీకరణాలు మనకు తెలీని అన్తఃచ్చేతనలో జరిగి ఫలితం మాత్రం పైకి ఉబికి ఉపరితలానికి వస్తుంది. ఇదెలా ఉంటుందంటే కంప్యూటరు క్లిష్టమైన లెక్కలను లోపల్లోపల చేసి ఫలితాన్ని మాత్రం తెరమీద చూపినట్లు ఉంటుంది.

కొంతమందిని చూచి మీది ఫలానాలగ్నం లేదా ఫలానా నక్షత్రం అవునా అని అడిగితే వారు ఆశ్చర్యపోయి నిజమే మీకెలా తెలుసు అని అనటం నాకు చాలా సార్లు జరిగింది. కొన్ని సార్లు ఫెయిల్ కూడా అయ్యాను.కాని చాలాసార్లు సరిగ్గా జరిగినపుడు తప్పకుండా వీటికి ఏవో లింకులు ఉన్నాయి, ఇది మనకు అర్థం కాక పోయినా ఒక గొప్ప శాస్త్రమే అని అనిపించక మానదు.

దీనివల్ల ఇంకొక లాభం కూడా ఉంది. ఈ విధమైన పరిశీలన అలవాటైతే, మనిషికి బోరు అనేది ఉండదు. దానికి తోడూ లోతైన పరిశీలనాశక్తి అలవాటు అవుతుంది.మనుషుల మధ్యన ఉండికూడా, మౌనంగా ఉంటూ, ఏ పుస్తకాలు, టీవీలు,సెల్ ఫోన్లు లేకుండానే బోరు అనేది లేకుండా ఉండటం అలవాటు అవుతుంది.

ఇంకొంచెం అనుభవం మీద, అతి దగ్గిరలో జరుగబోయే విషయాలు స్పురించటం చాలాసార్లు జరిగింది. ఫలానా వ్యక్తి మీద ఫలానా గ్రహం ప్రభావం ఉంది అని తెలిసినపుడు, త్వరలో ఆ గ్రహానికి గోచారరీత్యా పట్టబోతున్న అవస్త మనకు తెలుసు గనుక ఈవ్యక్తికి కూడా అదే అవస్త పడుతుంది అని అనిపించటం అలాగే జరగటం చాలాసార్లు జరిగింది.

ఉదాహరణకు గురుగ్రహ ప్రభావంలో ఉన్న వ్యక్తికి గురువు నీచలో ఉన్నపుడు, నీచజీవితం గడపటం,మంచికి పొతే చెడు ఎదురు కావటం, అనుకున్న పనులు జరుగకపోవటం ఊహించి చెప్పాను.ప్రస్తుతం అవే జరుగుతూ ఆ వ్యక్తిని నన్నూ కూడా ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. దీన్నే కొంచెం పొడిగించి, గ్రహంయొక్క,అతిచార,స్తంభన,వక్ర,అస్తన్గత,గ్రహయుద్ధ, ఉచ్చ,నీచ స్థితులను గమనిస్తూ పోతే ఆ వ్యక్తి జీవితంలో ఆశ్చర్యకరమైన ఫలితాలు కనిపించాయి. ఈ గ్రహస్థితులకు వ్యక్తుల జీవితంలో జరిగే సంఘటనలకు ఖచ్చితమైన సంబంధం కనిపించింది.

ఇదే రీజనింగును ఇంకొంచం పొడిగించి, కొన్నికొన్నిసార్లు ఫలానా రోజు నీకు ఈ సంఘటనా జరుగవచ్చు అని చెప్పటం అదే జరగటం కూడా జరిగింది. కొన్ని సార్లు ఫెయిల్ అవటం కూడా అయింది. కాని ఫెయిల్ అయినపుడు ఎందుకు ఇలా జరిగింది అని ఆలోచిస్తే కొన్ని కొత్త విషయాలు అర్థం అయ్యాయి. ఆ గ్రహానికి గల ఒక కారకత్వానికి సంబంధించిన సంఘటన జరుగవచ్చు అని మనం అనుకుంటే ఇంకో కారకత్వానికి సంబంధించిన సంఘటన జరిగింది. కాని ఆ గ్రహ కారకత్వాన్ని దాటి ఇంకో గ్రహ కారకత్వానికి సంబంధించిన సంఘటన మాత్రం జరుగలేదు. అంటే చాలావరకూ విశ్లేషణ సరిగ్గా ఉన్నప్పటికీ సూక్ష్మ స్థాయిలలో ఇంకా పరిపూర్ణత రాలేదు అని అర్థం అయింది. 

ఉదాహరణకు ఒక వ్యక్తి కుజ గ్రహ పరిధిలో ఉన్నపుడు, గోచారరీత్యా శనిగ్రహ ప్రభావం కుజుని మీద పడుతుంది అనుకున్న రోజున లేదా ఆ పీరియడ్ లో ప్రమాదం జరుగవచ్చు అని చెప్పాం అనుకుందాం.ఆ సమయంలో ప్రమాదం జరుగకుండా,ఎవరితోనో గొడవ జరగటం,తద్వారా దెబ్బలు తగలటం,రక్త దర్శనం కలగటం జరుగుతుంది.ప్రమాదంలో కూడా రక్తదర్శనం జరుగవచ్చు, లేదా గొడవలో కూడా జరుగవచ్చు, లేదా పొరపాటున ఏ వేలో కోసుకొని కూడా జరుగవచ్చు.వీటిలోని సూక్ష్మభేదాలు పట్టుకోవటం,అంచనా వెయ్యటం కష్టం.రక్తం కళ్ళచూడటం జరుగుతుంది అనిచెబితే అది సరిగానే జరుగుతుంది.

కాని ఏ కారణం వల్ల, ఏ పరిస్థితుల్లో అది జరుగుతుందో కూడా సరిగ్గా ఊహిస్తేనే దానికి పరిపూర్ణత వచ్చినట్లు. ఇటువంటి పరిపూర్ణతకు దారితీసే గ్రహస్థితుల పైన కొన్ని లీడ్స్ ఆధారంగా ఇంకా రీసెర్చి చేస్తున్నాను. జ్యోతిషమిత్రులకు ఆసక్తిని కలిగిస్తాయని ఈ విషయాలు వ్రాయటం జరిగింది.
read more " మానవ జీవితం పైన గ్రహాల ప్రభావం "