“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

23, ఆగస్టు 2009, ఆదివారం

వినాయక చవితి శుభాకాంక్షలు.

వినాయక చవితి సందర్భం గా నా బ్లాగు చదివే వారందరికీశుభాకాంక్షలు.

విఘ్నేశుడు ఓంకార స్వరూపుడు. ఆయన ఆకారం కూడాఓంకార రూపమే. ఓమిత్యేకాక్షరం బ్రహ్మా అని వేదంచెబుతుంది. దీని
ర్థం: ఓం అనబడే ఏకాక్షరమే బ్రహ్మము. ఈశ్వరునికి గల పేరు ఏదైనా ఉంది అంటే అది ఓం అనుఏకాక్షరమే. కనుక దీనిని శబ్ద బ్రహ్మము అంటారు. గాఢధ్యానములో నాదాన్ని మనం వినగలుగుతాము. ఇది జనసమ్మర్దం ఉన్న ప్రాంతాలలో వినిపించదు. కొండ కోనల్లో, ప్రశాంత ప్రక్రుతి మధ్యలో, జన సంచారం లేని చోట్ల, లేదాహిమాలయ పర్వతాలలో వేల అడుగుల ఎత్తులో ఉన్నప్రదేశాలలో తెల్లవారు జామున నాదాన్ని సాధకులువినవచ్చు.

తస్య వాచకః ప్రణవః- అని పతంజలి మహర్షి కూడాపరబ్రహ్మము యొక్క వాచకం ప్రణవం అని తన యోగ సూత్రములలో చెబుతాడు. మాండూ
క్యోపనిషత్తు ప్రణవస్వరూపాన్ని అత్యంత వివరంగా వర్ణించింది. అన్ని శబ్దములకు ప్రధమం గా పుట్టిన శబ్దం ఓంకారం. కనుక అన్ని మంత్రములకు ముందు ఓంకారం ఉంటుంది. గణపతి ఓంకార స్వరూపుడు కనుక అన్ని పూజలలో ప్రథమంగా గణపతి పూజ ఉంటుంది.

యోగ మార్గములో కూడా మొదటిది అయిన మూలాధార చక్రమునకు అధిపతి గణపతి. దీన్ని ఆధార చక్రం అని కూడాఅంటారు. సర్వ ప్రపంచానికి ఓంకారమే ఆధారము. అలాగే అన్ని క్రతువులకూ, ఉపాసనలకూ, సాధనలకూ గణపతిఆధారం. గణపతి మంత్ర మూర్తి. అలాగే ప్రణవం కూడా సర్వ మంత్ర మయం. గణపతి బ్రహ్మచర్య మూర్తి. కనుక అన్ని యోగ సాధనలకూ బ్రహ్మచర్యం అతి ముఖ్యం.


ప్రణవ నాదాన్నే అనాహత నాదం అంటారు. అనగా ఆహతము కానిది, కొట్టబడనిది. శబ్దాలన్నీ ఒక వస్తువు ఇంకొకవస్తువుతో తగిలితే వస్తాయి. కాని ప్రణవ నాదం స్వతఃసిద్ధము. కనుక అనాహతము. శబ్దమును అనాహత ధ్వనిఅని కూడా అంటారు. ఇది పరమాత్ముని నాభి స్థానం నుంచి నిరంతరమూ వస్తున్న ధ్వని గా యోగులు చెబుతారు. లోతైన ధ్యానములో మునిగి ఉన్నపుడు ఈ నాదాన్ని తనలో తానె వినవచ్చు. శ్రీ రామకృష్ణులు దీనిని "టాం......" అనే దీర్ఘ ధ్వనిగా ఉంటుంది అని చెప్పారు. గుడిలో గంట మొగించినపుడు ఒక్క సారి కొట్టి వదిలితే ఆ ధ్వని "టాం....." అని దీర్ఘ ధ్వనిగా వినిపిస్తూ చివరికి
శూన్యంలో కలుస్తుంది. ఈ ధ్వని ఓంకార నాదానికి చాలా దగ్గరగా ఉండే ధ్వని. అందుకే గుడిలో ఘంటా నాదం చెయ్యాలి. కాని కొందరు అందే పనిగా సైకిలు బెల్లు కొట్టినట్లు గంట కొడతారు. అది చాలా తప్పు.

Milky way అనేది పాలసముద్రం. గెలాక్సీ ని ఆవరించి ఉన్న, అంటే దీనిపైన శయనించి ఉన్న శక్తి ఆదిశేషువు అనేసహస్ర ఫణ
ములు కల మహా సర్పము. సర్పము శక్తికి మార్మిక సూచన అని యోగులకు తెలుసు. అనగా పాలపుంతను ఒకటిగా పట్టి ఉంచుతున్న ఆకర్షణ శక్తియే ఆదిశేషుడు. మహా సర్పము పైన శయనించి ఉన్న ఈశ్వర శక్తి విష్ణువు. అనగా విశ్వములో గల గురుత్వాకర్షణ శక్తికి మూలమైన శక్తి- విష్ణువు. గణపతిని కూడా శుక్లాంబర ధరంవిష్ణుం అని పూజిస్తాము. శక్తి యొక్క మూలం అనగా గెలాక్సీ యొక్క కేంద్రం అయిన గెలాక్టిక్ సెంటర్ అనేది విష్ణునాభి. ఇక్కడనే మూలా నక్షత్ర మండలం ధనూ రాశిలో ఉంటుంది. ఇది పాలపుంత కు మూలం కనుక దీనిని మూలానక్షత్రం అన్నారు.

మూలా నక్షత్ర మండలం కేంద్రంగా చేసుకొని ఓంకార నాదం Milky way అంతటా నిరంతరమూ ప్రవహిస్తూఉంటుంది. బహుశా ఇది ఇప్పటివరకూ అర్థం కాని ఏదో ఒక రకమైన కాస్మిక్ రేడియేషన్ కావచ్చు. దీన్ని పాశ్చాత్యులు Music of the spheres అనీ logos అనీ అన్నారు. అస్త్రోనమీ కూడా మన పాలపుంతకు కేంద్ర స్థానం మూలా నక్షత్ర మండలం ప్రాంతంలోనే ఉంది అని చెబుతున్నది. వేదంలో వేల సంవత్సరాల క్రితంచెప్పిన విషయాలు ఇప్పటి సైన్సు మళ్ళీ నిజాలుగా వప్పుకుంటున్నది. కాకపోతే వేదం విష్ణు నాభి అంటే సైన్సు గలక్టిక్
సెంటర్ అంటున్నది. భాష తేడా- కాని భావం ఒకటే.

విధంగా నిరంతరం విశ్వంలో తనంత తానుగా ప్రతిధ్వనిస్తున్న ఓంకార స్వరూపమే గణపతి స్వరూపం. ఇదే నాదం మనలో నాడిగా ఉన్నది, హృదయ స్పందన గా ఉన్నది. ప్రాణ స్పందన గా ఉన్నది. ప్రాణ రూపమైన ఓంకారం మనలోఉన్నంత వరకూ మనం జీవిస్తాం. అది ఆగిన మరుక్షణం మరణిస్తాము. విధంగా గణపతి సమస్త జీవులకు ఆధారంగా ఉన్నాడు. జీవులన్నీ గణములు అయితే ఆయన గణములకు పతి లేక గణపతి.

అట్టి ఓంకార రూపుడైన గణపతిని ఆరాధన చేసే నవరాత్రులకు మొదలు ఈరోజు. మంత్ర సాధన చేసే వారు రోజునుంచి నియమంగా తొమ్మిది రోజులు మంత్ర పునశ్చరణ చేయటం వల్ల మంచి ఫలితాలు కనిపిస్తాయి. సాధకమిత్రులు ప్రయత్నించండి.

మరొక్కసారి వినాయక చవితి శుభాకాంక్షలు.