“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

30, సెప్టెంబర్ 2015, బుధవారం

Kisi Nazar Ko Tera - Bhupinder Singh-Asha
ఘజల్స్ పాడటంలో భూపేందర్ కు ఒక ప్రత్యేకస్థానం ఉన్నది.ఈయన గొంతు జలుబు గొంతులా ఉంటుందని చాలామంది అంటారు గాని, ఈయన పాటల్లో ఒక చెప్పలేని మాధుర్యం ఉంటుంది.

ఈపాటను ఆయన ఆశా భోంస్లే తో కలసి పాడాడు.చాలా చక్కని రాగం ఉన్న పాట.మనకు నచ్చిన రాగాలు ఆ పాటల్లో ఉన్నప్పుడు ఆడవారి పాటలు కూడా మనం పాడాలి.అప్పుడే మన ఒరిజినల్ వాయిస్ ఏమిటో మనకు తెలుస్తుంది.

ఒక పాటను మనం పాడేటప్పుడు మనకు తెలీకుండానే ఆ గాయకుని ఆత్మ మనల్ని ఆవహిస్తుంది.అందుకని ఎంత మనలాగే పాడినా ఆ గాయకుని పోకడలు కొన్ని మన గొంతులో మనకు తెలీకుండానే వస్తాయి.కానీ గాయనీమణుల పాటలు పాడినప్పుడు అది కుదరదు.అందుకే ఆడవారి పాటలు కూడా నేను పాడుతూ ఉంటాను.ఈ పాటలో ఆశా పాడిన చరణాలు కూడా నేనే పాడాను.

ఆశాభోంస్లే గురించి చెప్పనక్కర్లేదు.ఎటువంటి పాటనైనా ఆమె సునాయాసంగా పాడగలదు.కానీ,విషాద గీతాలకంటే చలాకీ పాటలైతే ఆమె గొంతుకు బాగా నప్పుతాయి.

Movie:--Aitbaar (1985)
Lyrics:--Hasan Kamal/Farukh Kaiser
Music:--Bappi Lahiri
Singers:--Bhupinder Singh,Asha Bhonsle
Karaoke Singer:--Satya Narayana Sarma
Enjoy
---------------------------------
Kisee nazar ko teraa, intzaar aaj bhee hain-2
kahaa ho tum keyedil - bekaraar aaj bhee hain
oo oo oo kisee nazar ko teraa, intzaar aaj bhee hain

wo waadiyaa, wo fajaayen ke hum mile the jahaan-2
meree wafaa kaa - wahipar majaar aaj bhee hain
oo oo oo kisee nazar ko teraa, intazaar aaj bhee hain

na jaane dekh ke kyoo unko - ye huaa ehasaas-2
ke mere dilpe - unhe ikhtiyaar aaj bhee hain
oo oo oo kisee nazar ko teraa, intzaar aaj bhee hain

Female:---
woh pyaar jis ke liye - humne chhod dee duniyaan-2
wafaa kee raah me - ghaayal wo pyaar aaj bhee hain
oo oo oo woh pyaar jis ke liye - humne chhod dee duniyaan

Male:--
yakeen naheen hain magar - aaj bhee yeh lagtaa hain-2
meree talaash mein - shaayad bahaar aaj bhee hain
oo oo oo kisee -- nazar ko teraa, intazaar aaj bhee hain

Female:--
na puch kit-ne mohobbat ke - zakhm khaaye hai-2
ke jinko sochke dil - sawgawar aaj bhee hai
oo oo oo woh pyaar jisske liye - humne chhod dee duniyaan
wafaa kee raah mein - ghaayal wo pyaar aaj bhee hain

Male:--
oo oo oo kisi nazar ko tera intezar aaj bhi hai-2
kaha ho tum keyedil - bekarar aaj bhi hai
oo oo oo kisi nazar ko tera intezar aaj bhi hai
read more " Kisi Nazar Ko Tera - Bhupinder Singh-Asha "

27-9-2015 పౌర్ణమి ప్రభావం

ఈ పౌర్ణమికి తోడుగా సూపర్ బ్లడ్ మూన్ వచ్చింది.దీని ఫలితాలు ఎలా ఉన్నాయో గమనిద్దాం.

>23-9-2015 న సౌదీ అరేబియాలోని మక్కాలో జరిగిన తొక్కిసలాటలో 750+ మంది చనిపోయారు.ఈ సంఖ్య వెయ్యి దాటిందని అంటున్నారు.ఇంకొక వెయ్యిమంది దాకా గాయపడ్డారు.ఇది జలప్రమాదం కాదు.కానీ, ఎక్కువమంది ఒకచోట గుమిగూడటం వల్ల జరిగింది.

>27-9-2015 న తిరుపతి లోని కపిలతీర్ధం జలపాతం పైనుంచి పడి 8 మంది యువకులు తలలు పగిలి చనిపోయారు.కపిల తీర్ధం నీరు వారి రక్తంతో కలుషితం అయింది.కొండపైన ఉన్న నీటి గుండాలలో స్నానం చెయ్యడానికి వెళ్ళిన వీరు వర్షం వల్ల ఒక్కసారి పెరిగిన నీటి ఉధృతికి కొట్టుకుపోయి జలపాతం నుంచి దాదాపు 50 అడుగుల క్రిందకు పడ్డారు.

ఈ అయిదు గుండాలలోని నీటితోనే కపిలేశ్వరునికి అభిషేకం చేస్తారు.అలాంటి పవిత్ర గుండాలలో మనుషులు దిగి వాటిలో సబ్బులతో స్నానాలు చేసి ఆ అభిషేక జలాలను అపవిత్రం చేస్తుంటే అధికారులు ఎలా ఊరుకుంటున్నారో వారికే తెలియాలి. తెలిసో తెలియకో చేసే తప్పులు వాటికి పడే శిక్షలు ఇలా ఉంటాయి.

26-9-2015 న వ్రాసిన పోస్ట్ లో జలప్రమాదాలు జరుగుతాయని వ్రాశాను. మరుసటి రోజే ఇది జరిగింది.

>సరిగ్గా 26-9-2015 న గుంటూరు జిల్లా తక్కెళ్ళపాడు దగ్గర మనుషులున్న ఒక కారు కాలువలోకి దూసుకుపోయి అందులోని 7 మంది జలసమాధి అయ్యారు.

>విచిత్రంగా, ఈ సమయంలోనే - భారీ విగ్రహాలను నీటిలో కరిగించే గణేశ నిమజ్జనం కూడా చోటు చేసుకుంది.

>విశాఖపట్నంలో ఒక స్కూలు కెళ్ళే పాప, కాలవలో పడి కొట్టుకుపోయి గల్లంతైంది.ఇది కూడా తీవ్రవర్షం వల్లనే జరిగిందని అంటున్నారు.ఆ అమ్మాయి శవం కోసం సముద్రంలో కూడా వెదికారు.

>28-9-2015 - అస్సాంలో కలహి నదిలో పడవ మునిగి 50 మంది పైగా చనిపోయారు.

> ఇంకొక విచిత్రమేమంటే - ఇదే సమయంలోనే - అంగారక గ్రహం మీద నీటి జాడలు ఉన్నట్లుగా ఖచ్చితంగా  గుర్తించామని నాసా ప్రకటించింది.

>ఈతలకోసం నదులలో దిగినవారు చాలామంది ఈ ఆరురోజుల పరిధిలో ప్రాణాలు కోల్పోయారు.వీరిలో ఇంజనీరింగ్ చదివే విద్యార్ధులు కూడా ఉన్నారు.

>29-9-2015 న గుంటూరులో మూడంతస్తుల ఒక పాత ఇల్లు అందరి కళ్ళముందే పేకమేడలా కూలిపోయి ఇద్దరు చనిపోయారు.దాదాపు ఆరుగురు గాయపడ్డారు.భారీవర్షమే దీనికి కారణం అంటున్నారు.ఎక్కువగా నానడం వల్ల ఈ పాత ఇల్లు కూలిపోయింది.ఇదీ ఒక రకమైన జలప్రమాదమే.

>>ఇదే సమయంలో - విచిత్రంగా - తెలంగాణా ప్రభుత్వంలో - నీటి పారుదల ప్రాజెక్టులు,డ్యాములు, రాష్ట్రానికి నీటి సరఫరా తదితర విషయాల గురించి ఎనిమిది గంటలపాటు సమీక్షా చర్చ జరిగింది.

ఈ విధంగా ప్రపంచంలో చాలాచోట్ల చిన్నవో పెద్దవో ఏదో ఒకరకమైన జలప్రమాదాలో, నీటి సంబంధమైన వార్తలో ఈ సమయంలో వచ్చాయి.
read more " 27-9-2015 పౌర్ణమి ప్రభావం "

28, సెప్టెంబర్ 2015, సోమవారం

Apne Hothon Par Sajana Chahta Hu - Jagjit Singh
ఎంతో గొప్పదైన మార్మికార్ధం ఉన్న గీతాన్ని వినాలనుకుంటున్నారా?

అయితే ఈ పాటను వినండి.

అప్నే హోటోం పర్ సజానా చాహతా హు...
ఆ తుజే మే గుంగునానా చాహతా హు...

అంటూ ఘజల్ కింగ్ జగ్జీత్ సింగ్ మంద్ర స్వరంలో ప్రతిధ్వనించిన ఈ మార్మిక ఘజల్ నాటికీ నేటికీ మరపురాని ఒక సుమధుర అమర గీతమే. జగ్జీత్ సింగ్ ఒక ఘజల్ ను పాడే తీరు చాలా హృద్యంగా మధురంగా ఉంటుంది.ఆయన స్టైల్ ను అనుకరించడం చాలా కష్టం.అసలు ఆయన స్వరమే ఒక బేస్ వాయిస్. దానిలో ఆయన గమకాలు పలికించే తీరు ఆయనకే ప్రత్యేకం.పాట భావాన్ని స్వరంలోకి తీసుకురావడంలో కూడా ఆయనకు ఆయనే సాటి.

This is another immortal mystic Ghazal of Jagjit Singh.

Album:-- In Search (1992)
Lyrics:--Rahat Indori (Qateel Shifai)
Singer:--Jagjith Singh
Karaoke Singer:--Satya Narayana Sarma
Enjoy
-------------------------------
Apne hothon par sajana chaahta hu-2
Aa tujhe mai gun-gunana chahta hu
Apne hothon par sajana chaahta hu

Koi aansu tere daman par girakar-2
Bund ko moti banaana chaahta hu-2
Apne hothon par sajana chaahta hu

Thak gaya mai karte-karte yaad tujhko-2
Ab tujhe mai yaad aana chaahta hu-2
Apne hothon par sajana chaahta hu

Chaa raha hai saari basti me andhera-2
Roshni ko ghar jalaana chaahta hu-2
Apne hothon par sajana chaahta hu

Aakhri hichki tere zaano pe aaye-2
Maut bhi me shayarana chaahta hu-2
Apne hothon par sajana chaahta hu...
Aa tujhe mai gun-gunana chahta hu
Apne hothon par sajana chaahta hu...
oohu hoohu oohu hoohu oohu hoohu...

Meaning:--

I want to adorn you on my lips always
I want to sing your name always
I want to adorn you on my lips always

The tears that fall from my eyes into your lap
I want to transform all of them into pearls

I am tired of remembering you always
Now I want you to remember me hereafter

Darkness is fast descending on the town
I request the Light to illuminate my home

I wish to take my last breath
in your lap
And I want even my death
to be poetic

I want to adorn you on my lips always
I want to sing your name always
I want to adorn you on my lips always

తెలుగు స్వేచ్చానువాదం
నా పెదవులపైన నిన్నెప్పుడూ ఉంచుకోవాలని
అనుకుంటున్నాను
నీ నామాన్ని ఎల్లప్పుడూ స్మరించాలని
అనుకుంటున్నాను

నీ ఒడిలో రాలే నా కన్నీటి బిందువులనన్నింటినీ
ముత్యాలుగా మార్చాలని
అనుకుంటున్నాను

నిత్యమూ నిన్ను స్మరించి స్మరించి
నేను అలసిపోయాను
ఇకమీదట నువ్వే నన్ను స్మరించాలని
అనుకుంటున్నాను

ఊరిమీద చీకటి దుప్పటి
కమ్ముకుంటోంది
నా ఇంటిని కాంతితో నింపమని
వెలుగును కోరుకుంటున్నాను

నా చివరి శ్వాసను నీ ఒడిలోనే
వదలాలనుకుంటున్నాను
నా మరణం కూడా కవితాత్మకంగానే
ఉండాలనుకుంటున్నాను

నా పెదవులపైన నిన్నెప్పుడూ ఉంచుకోవాలని
అనుకుంటున్నాను
నీ నామాన్ని ఎల్లప్పుడూ స్మరించాలని
అనుకుంటున్నాను....
read more " Apne Hothon Par Sajana Chahta Hu - Jagjit Singh "

27, సెప్టెంబర్ 2015, ఆదివారం

Jalte Hai Jiske Liye - Talat Mehmood


Youtube Link

https://youtu.be/u6GLyVSLEA4

జల్తే హై జిస్కే లియే ....తేరీ ఆఖో కే దియే
డూండ్ లాయాహూ వొహీ ...గీత్ మే తెరే లియే...
జల్తే హై జిస్కే లియే...


1950-60 దశకానికి చెందిన మధుర గాయకుడు తలత్ మెహమూద్ స్వరంలోనించి జాలువారిన సున్నిత సుమధురగీతం ఇది.1959 లో రిలీజైన 'సుజాత' అనే సినిమాలోది ఈ పాట. ఇందులో సునీల్ దత్,నూతన్ నటించారు.ఈ పాట వారిద్దరి మీద చిత్రీకరించిన 'ఫోన్' పాట.

తలత్ మెహమూద్ స్వరం సాఫ్ట్ మేల్ వాయిస్.ఈయన స్వరం ఏ.ఎం.రాజా స్వరం లాగా ఉంటుంది.ఈయన పాటలన్నీ సాఫ్ట్ మెలోడీ గీతాలే.ఈ చిత్రం 1960 లో కేన్స్ ఫెస్టివల్ కు ఎంపిక అయింది.

Movie:--Sujata (1959)
Lyrics:--Majrooh Sultanpuri
Music:--Sachin Dev Burman
Singer:--Talat Mahmood
Karaoke Singer:--Satya Narayana Sarma
Enjoy
----------------------------------------
[Jalte hai Jiske liye, teri aankho ke diye
Dhundh laayaa hun vahi, git mai tere liye
Jalte hai Jiske liye]-2

[Dard banke jo mere dil me rahaa dhal naa sakaa
Jaadu banake teri aankho me rukaa chal naa sakaa]-2
Aaj laayaa hun vohi git mai tere liye
Jalte hai Jiske liye

[Dil me rakh lenaa ise haatho se ye chhute na kahi
Git naazuk hai meraa shishe se bhi tute na kahi]-2
Gungunaugaa yahi git mai tere liye
Jalte hai Jiske liye

[Jab talak naye tere ras ke bhare hotho se mile
Yun hi aavaara phiregaa ye teri zulfo ke tale]-2
Gaaye jaaugaa yahi git mai tere liye

Jalte hai Jiske liye, teri aankho ke diye
Dhundh laayaa hun vahi, git mai tere liye
Jalte hai Jiske liye...

Meaning:--
For what,your eyes' lamps have been burning for
the same song I have searched for
and brought to you, the very same song

That which remained
as a lingering pain in my heart
and which could not go...
Like a magic it settled in your eyes
and could not move on from there...
I have brought to you today
the very same song

Keep it in your heart safely
dont let it slip away from your hands
My song is more fragile than glass
let it not be shattered...
I shall keep on humming for you
the very same song forever...

Until it meets your nectar filled lips
It will wander about like a tramp under your tresses
Meanwhile I shall keep on singing for you
this very same song

For what,your eyes' lamps have been burning for
the same song I have searched for
and brought to you, the very same song

తెలుగు స్వేచ్చానువాదం

దేనిని కోరి నీ కంటి దీపాలు
ఇన్నాళ్ళుగా వెలుగుతున్నాయో
అదే పాటను ఇప్పుడు నీకోసం వెదకి తెచ్చాను

ఇన్నాళ్ళుగా నా హృదయంలో నిండి
నన్ను వదలకుండా ఉన్న బాధ
ఒక మాయలా నీ కళ్ళలో నిండి
అక్కడనుంచి కదలనంటున్నది 
నీకోసం అదే పాటను
వెదకి మరీ తీసుకొచ్చాను

దీనిని నీ హృదయంలో జాగ్రత్తగా దాచుకో
నీ చేతులలోనుంచి దీనిని జారనివ్వకు
నా పాట గాజుబొమ్మ కంటే సున్నితమైనది
దీనిని చేజార్చుకుని పగలనివ్వకు
నేనుమాత్రం నీకోసం ఎప్పటికీ
ఇదే పాటను పాడుతూ ఉంటాను

అమృతంతో నిండిన నీ పెదవులను తాకేవరకు
ఈ నా పాట
నీ ముంగురుల చుట్టూ 
ఒక తుమ్మెదలా తిరుగుతూనే ఉంటుంది
ఇది నిన్ను వదలదు
నీ కోసం ఈపాటను ఎల్లప్పుడూ
ఆలపిస్తూనే ఉంటాను

దేనిని కోరి నీ కంటి దీపాలు
ఇన్నాళ్ళుగా వెలుగుతున్నాయో
అదే పాటను ఇప్పుడు నీకోసం వెదకి తెచ్చాను...
read more " Jalte Hai Jiske Liye - Talat Mehmood "

26, సెప్టెంబర్ 2015, శనివారం

దక్షిణామూర్తి స్తోత్రమ్ -25 (ఆడియో ప్రసంగం చివరి భాగం)దక్షిణామూర్తి స్తోత్రం ఆడియో ప్రసంగం ఇరవై ఐదవ (చివరి) భాగం ఇక్కడ వినండి.


read more " దక్షిణామూర్తి స్తోత్రమ్ -25 (ఆడియో ప్రసంగం చివరి భాగం) "

రేపే చంద్రగ్రహణం + సూపర్ మూన్

27-9-2015 ఆదివారం నాడు చంద్రగ్రహణం + సూపర్ మూన్ కలిసి రాబోతున్నాయి.దీనినే 'బ్లడ్ మూన్' అని కూడా అంటున్నారు.నాసావారి లెక్కల ప్రకారం ఈ దృశ్యం అమెరికా సంయుక్త రాష్ట్రాలు, యూరప్, ఆఫ్రికా, పశ్చిమ ఆశియా, తూర్పు ఫసిఫిక్ తీరాలలో కనిపిస్తుంది.అంటే దీని ఫలితాలు కూడా ఈ దేశాలలో ఎక్కువగా ఉండబోతున్నాయి.

భూమిచుట్టూ చంద్రుని కక్ష్య సరిగ్గా ఒక వృత్తం లాగా ఉండదు.అది దీర్ఘవృత్త కక్ష్యలాగా ఉంటుంది.కనుక చంద్రుడు ఎల్లప్పుడూ భూమికి సమానమైన దూరంలోనే ఉండడు.తన పయనంలో చంద్రుడు కొన్నిసార్లు భూమికి దూరంగా పోతాడు.కొన్నిసార్లు దగ్గరగా వస్తాడు.అలా దగ్గరగా రావడాన్నే ఖగోళ పరిభాషలో 'Perigee' అంటారు.అమావాస్య చంద్రుడు గానీ పౌర్ణమి చంద్రుడు గానీ అలా భూమికి దగ్గరగా రావడాన్నే "సూపర్ మూన్" అంటారు. సూపర్ మూన్ వచ్చినప్పుడు చంద్రుడు మామూలు కంటే చాలా పెద్దగా చాలా ప్రకాశవంతంగా కనిపిస్తాడు. ఇది గతంలో 1982 లో జరిగింది.33 ఏళ్ళ తర్వాత మళ్ళీ ఇప్పుడు జరుగుతున్నది.

ఖగోళ శాస్త్రవేత్తలు మానవ జీవితం పైన గ్రహాల ప్రభావాన్ని ఒప్పుకోరు.కానీ జ్యోతిష్య శాస్త్రవేత్తలు అది ఉన్నదని అంటారు.దానికి నిదర్శనాలు కూడా నిజంగా జరుగుతూనే ఉంటాయి.ఆ కోణంలో గమనిస్తే అవి అర్ధమౌతాయి.

అమావాస్యకూ పౌర్ణమికీ భూమిపైన విలయాలు జరగడం మామూలే.కానీ ఈ సూపర్ మూన్ సమయంలో ఇంకా ఎక్కువగా అంటే 'లార్జ్ స్కేల్' లో జరుగుతాయి.ఎందుకంటే ఈ సమయంలో చంద్రుని కిరణాలు ఎక్కువ శక్తితో భూమిని తాకుతాయి.మనుష్యులను చాలా తీవ్రంగా ప్రభావితం చేస్తాయి.

ఈసారి సూపర్ మూన్ ను 'బ్లడ్ మూన్' అంటున్నారు.దానికి నిదర్శనంగా మూడురోజుల ముందే మక్కాలో రక్తపాతం జరిగిందా లేదా మరి?

నిన్నగాక మొన్న మక్కాలో జరిగిన తొక్కిసలాటలో 750+ మంది చనిపోవడం ఖచ్చితంగా ఈ పౌర్ణమి+సూపర్ మూన్+బ్లడ్ మూన్ ఫలితమే. ఇస్లాం చంద్రగమనాన్ని అనుసరిస్తుంది కనుక చంద్రుని ప్రభావం వారిమీద చాలా ఎక్కువగా ఉంటుంది.

ఈ దుర్ఘటన పౌర్ణమికి నాలుగు రోజుల ముందే జరిగిందన్నది వాస్తవం.రోహిణీ శకట భేదన కాలంలో మనం ఉన్నామన్న విషయం గుర్తుంటే ఇంత పెద్ద ఎత్తున జననష్టం ఎందుకు జరుగుతున్నదో అర్ధం అవుతుంది.ఈ సమయంలో  ఇవన్నీ జరుగుతాయని గత ఏడాదే వ్రాశాను.

ఈ సూపర్ మూన్ వల్ల వచ్చే వారంరోజులలో ఇంకా ఎన్నో నష్టాలు మానవజీవితంలో జరుగుతాయి.ముఖ్యంగా వాహన ప్రమాదాలు, పిక్నిక్కులు విహారయాత్రలలో దుర్ఘటనలు జరుగుతాయి.జలప్రమాదాలు జరుగుతాయి.అంటే ఈతలకు వెళ్లి చనిపోవడం,పడవ ప్రమాదాలు మొదలైనవి ఉంటాయి.ముఖ్యంగా జనం ఎక్కువగా ఎక్కడైతే గుమిగూడతారో అక్కడ ఈ ప్రమాదాలు జరుగుతాయి.అందుకే ఈ వారం రోజులూ విహారయాత్రలు,సాహసకార్యాలు పనికిరావన్న సంగతి గమనించాలి.

మీనరాశి ఉత్తరానికీ,చంద్రుడు వాయవ్యానికీ, కేతువు ఈశాన్యానికీ సూచకులు గనుక భూమిపైన ఉత్తర వాయవ్యం మరియు ఉత్తర ఈశాన్యాది ప్రాంతాలలో దీని ప్రభావం ఎక్కువగా ఉంటుంది.

దీని ఫలితంగా ఈ క్రింది ప్రభావాలు మనుషులలో కనిపిస్తాయి.

>మనసు తిక్కతిక్కగా ఉండటం.
>చిన్న చిన్న విషయాలకు కూడా అతిగా ఆవేశ పడటం
>అనవసరమైన మాటలు చేష్టలవల్ల తగాదాలు గొడవలు జరగడం
>కుటుంబ సభ్యుల మధ్యన మాటలు చిలికి చిలికి గాలివానగా మారి గొడవలు పెరగడం
>ఇంట్లో స్థిమితంగా ఉండలేక ఎటన్నా బయటకు పోయి తిరుగుదామని అనిపించడం
>ఏం చెయ్యాలో తెలియని అసహనంగా చికాకుగా ఉండటం
>హటాత్తుగా తలనొప్పి, బీపీ పెరగడం మొదలైన లక్షణాలు
>హిస్టీరియా, పిచ్చి,మానసిక రోగాలు ఉన్న వారిలో అవి ఉన్నట్టుండి ఎక్కువ కావడం
>ఆటిజం పిల్లలలో విపరీత ప్రవర్తన ఎక్కువ కావడం
>పాత నొప్పులు పాత రోగాలు తిరగబెట్టడం
>గుండె జబ్బులున్న వాళ్లకు రోగం ఎక్కువై,ముఖ్యంగా అర్ధరాత్రి నుంచి తెల్లవారు ఝాము లోపల సీరియస్ కావచ్చు.

ఈ లక్షణాలు చాలామందిలో గమనించుకోవచ్చు.

అయితే ఇందులో ఒక ఆధ్యాత్మిక కోణం కూడా ఉన్నది.చంద్ర కేతు యురేనస్ ల సంయోగం మీనరాశిలో జరుగబోతున్నది.వీరి కోణదృష్టి కర్కాటకంలో ఉన్న శుక్రుని మీద ఉన్నది.కనుక మంత్ర - తంత్ర - యోగసాధకులైనవారు సాత్వికాహారం తీసుకుంటూ శని,ఆదివారాలను పూర్తిగా ఆధ్యాత్మిక సాధనలో గడిపితే వారికి చాలా మంచిమంచి అలౌకిక అనుభవాలు కలుగుతాయి.

ముఖ్యంగా నా దగ్గర దీక్ష తీసుకున్న 1 level, 2nd level సాధకులు రేపు ఆదివారం రోజున గట్టిగా సాధన చెయ్యండి.ఆశ్చర్యకర ఫలితాలు ఉంటాయో లేవో మీ స్వానుభవంలో మీరే చూడండి.
read more " రేపే చంద్రగ్రహణం + సూపర్ మూన్ "

25, సెప్టెంబర్ 2015, శుక్రవారం

దక్షిణామూర్తి స్తోత్రమ్ - 24 (ఆడియో ప్రసంగం)దక్షిణామూర్తి స్తోత్రం ఆడియో ప్రసంగం ఇరవై నాలుగవ భాగం ఇక్కడ వినండి

read more " దక్షిణామూర్తి స్తోత్రమ్ - 24 (ఆడియో ప్రసంగం) "

24, సెప్టెంబర్ 2015, గురువారం

దక్షిణామూర్తి స్తోత్రమ్ - 23 (ఆడియో ప్రసంగం)దక్షిణామూర్తి స్తోత్రం ఆడియో ప్రసంగం ఇరవై మూడవ భాగం ఇక్కడ వినండి

read more " దక్షిణామూర్తి స్తోత్రమ్ - 23 (ఆడియో ప్రసంగం) "

Niklo Na Benaqaab Jamana Kharab Hai - Pankaj Udasనికలో నా బేనకాబ్ జమానా ఖరాబ్ హై...
ఔర్ ఉస్ పే యే షబాబ్ జమానా ఖరాబ్ హై...

అంటూ పంకజ్ ఉదాస్ మధురస్వరంలో నుంచి జాలువారిన ఈ ఫాస్ట్ బీట్ రొమాంటిక్ ఘజల్ వినడానికి చాలా బాగుంటుంది.ఇది నిజానికి ఒక ఖవ్వాలీ అని నేను అనుకుంటున్నాను.పాట మొత్తం డోలక్ ఫాస్ట్ బీట్ తో సాగుతుంది.మంచి ట్యూన్ తో కట్టబడిన పాట.డాన్స్ కి చాలా బాగుంటుంది.ఏమీ తోచనప్పుడు ఈ పాటపెట్టుకుని సరదాగా ఫోక్ డాన్స్ చేస్తూ ఉంటాను.మీరూ ప్రయత్నం చెయ్యండి.

Album:-Khushboo
Lyrics:-Raashid Akbar
Singer:--Pankaj Udhas
Karaoke Singer:--Satya Narayana Sarma

Enjoy
-------------------------

Be parada nazar aayi jo kal chand biviya-2
Akbar jamin mein gairate koni se gad gaya ,
Pucha jo maine aapaka parda wo kya huva 
Kehane lagi ke akll par marado ke pad gaya,

Niklo na benaqab zamaana kharaab hai – 2
Aur usape ye shabaab jamaana kharaab hai
Niklo na benaqab zamaana kharaab hai

Sab kuchh hamein khabar hai nasihat na kijiye – 4
Kya honge hum kharaab jamaana kharaab hai – 2
Aur usape ye shabaab jamaana kharaab hai ,
Niklo na benaqab zamaana kharaab hai

Matlab chhupa huva hai yahaan har sawaal mein – 4
Do sochkar jawaab jamaana kharaab hai -2
Aur usape ye shabaab jamaana kharaab hai
Niklo na benaqab zamaana kharaab hai

Raashid tum aa gaye ho na aakhir fareb mein – 4
Kehate na the janaab zamaana kharaab hai -2
Aur usape ye shabaab zamaana kharaab hai

Niklo na benaqab zamaana kharaab hai

Meaning:--

Yesterday I saw some girls without their veils
and asked them
Where have your veils gone?
They said...
they were gone to steal the hearts of men like you...
then I said to them...

Dont come out without your veils
the world is alreday too bad
You are so beautiful
dont come out without your veils
the world is alreday too bad

I know everything
dont try to fool me with your fake answer
your beauty cannot spoil me
but the world is already spoiled
dont come out without your veils
the world is alreday too bad

In my every question the answer is hidden
think well before you answer
the world is already too bad
dont come out without your veils
the world is already too bad

Raashid, finally you have been deceived by their beauty
didn't I tell you man, they will spoil you for sure ?
hey women..dont come out without your veils
the world is already too bad
dont spoil it more and more...

తెలుగు స్వేచ్చానువాదం

పరదాలేని కొందరు సుందరాంగులను
నిన్న చూచాను
'మీ పరదాలేమై పోయాయి?' అని వారినడిగాను
'మీ మగవారి మనసులను దొంగిలించడానికి ఎటో పోయాయి'
అని కొంటెగా వారన్నారు..
అప్పుడు వారితో ఇలా అన్నాను..

ముసుగులు లేకుండా బయటకు రాకండి
లోకం ఇప్పటికే చాలా పాడై పోయి ఉన్నది
దానినింకా పాడు చెయ్యకండి
అసలే మీరు మంచి అందగత్తెలు
ముసుగులు లేకుండా బయటకు రాకండి
లోకం ఇప్పటికే చాలా పాడై పోయి ఉన్నది

నాకంతా తెలుసు
మీ కొంటె జవాబులు నాకు చెప్పద్దు
మీ అందాన్ని చూపించుకోవడం మీకు సరదా కావచ్చు
కానీ - ఇప్పుడు కొత్తగా మేం పాడైపోయేది ఏముంది?
లోకం ఇప్పటికే చాలా పాడై పోయి ఉన్నది
మీ ముసుగులు లేకుండా బయటకు రాకండి
దానినింకా పాడు చెయ్యకండి

నా ప్రశ్నలోనే జవాబుంటుంది
జాగ్రత్తగా ఆలోచించి జవాబు చెప్పండి
ఊరకే ఏదో ఒకటి చెప్పవద్దు
మీ ముసుగులు లేకుండా బయటకు రాకండి
లోకం ఇప్పటికే చాలా పాడై పోయి ఉన్నది
దానినింకా పాడు చెయ్యకండి

ఒరేయ్ రాషిద్, నీకు ముందే చెప్పాను
వీళ్ళు నిన్ను ముంచుతారని
చివరకు అదే జరిగింది చూడు
ఓ అందగత్తెలారా ! మీ ముసుగులు లేకుండా బయటకు రాకండి
లోకం ఇప్పటికే చాలా పాడై పోయి ఉన్నది
దానినింకా పాడు చెయ్యకండి
మీ ముసుగులు లేకుండా బయటకు రాకండి
మీ ముసుగులు లేకుండా బయటకు రాకండి...
read more " Niklo Na Benaqaab Jamana Kharab Hai - Pankaj Udas "

23, సెప్టెంబర్ 2015, బుధవారం

దక్షిణామూర్తి స్తోత్రమ్ -22 (ఆడియో ప్రసంగం)దక్షిణామూర్తి స్తోత్రం ఆడియో ప్రసంగం ఇరవై రెండవ భాగం ఇక్కడ వినండి

read more " దక్షిణామూర్తి స్తోత్రమ్ -22 (ఆడియో ప్రసంగం) "

22, సెప్టెంబర్ 2015, మంగళవారం

రూట్ మ్యాప్ బట్టీ పట్టొద్దు - దారిలో నడవండి

మా ఇంటి పక్కనే ఒక గుడి ఉంటుంది. 'మ్యూజియం ఆఫ్ గాడ్స్' లాగా, అక్కడ అనేకమంది దేవుళ్ళు కొలువై ఉంటారు.ఎవరికి బిజినెస్సు బాగుందో ఆ దేవుళ్ళని కొత్తగా ప్రతిష్టలు చేస్తూ ఉంటారు.ఆ దేవుళ్లలో కొంతమందికి బిజినెస్ బాగా నడుస్తూ ఉంటుంది.కొంతమంది బిజినెస్ లేక డల్ గా ఉంటారు. ఆ మధ్యన అమ్మవారిని కూడా ప్రతిష్ట చేశారు.సీజన్ బట్టి ఆయా భక్తులు వచ్చి వాళ్లకు తోచిన నానాగోల చేసి పోతుంటారు.

గత 17 ఏళ్ళుగా ఒక్కసారికూడా ఆ గుడికి నేను వెళ్ళలేదు.నేను ఆఫీసుకీ ఇతరపనుల మీదా వెళ్లి వచ్చేటప్పుడు చూస్తూ ఉంటాను.అక్కడ చాలామంది ఆడవాళ్ళు కూచుని లలితా సహస్రనామం పారాయణ చేస్తూ ఉంటారు.

మొన్నీ మధ్య ఒకరోజున ఒకామె ఫోన్ చేసింది.

'నా పేరు ఫలానా.మీరు ఫలానా నా?' అంటూ అడిగింది.

'అవును' అన్నాను.

'మీ పుస్తకం 'శ్రీవిద్యా రహస్యం' ఈ మధ్యనే చదివాను.చాలా బాగుంది.మీరు మా ఇంటికి దగ్గరలోనే ఉంటారని అందులోని అడ్రస్ బట్టి తెలిసింది.మీ ఇంటిపక్కనే ఉన్న గుడిలో నేను లలితా పారాయణకు వస్తూ ఉంటాను.' అన్నది.

'మంచిది' అన్నాను.

'మేము గత పదేళ్ళ నుంచీ లలితా పారాయణ నిత్యం చేస్తున్నాము.మీరూ ఒకసారి రావచ్చు కదా?' అడిగిందామె.

'సారీ.నాకింట్రస్ట్ లేదు' అన్నాను.

'అంటే - పారాయణ చేస్తే తప్పు లేదు కదా?' అన్నది.

'తప్పని కాదు.నాకు అవసరం లేదు.మీకు అవసరం అయితే మీరు చేసుకోండి.' అన్నాను.

'మీ పుస్తకం చదివి మీరు కూడా అమ్మవారి భక్తులని అనుకున్నాను.మీరేమో పారాయణకు రానంటున్నారే?' అన్నదామె.

'అమ్మవారి భక్తుడిని కానని ఎవరన్నారు? భక్తుడైతే ఇక గుళ్ళలో సామూహిక పారాయణాలు చెయ్యవలసిందేనా?' అడిగాను.

'మీరు చెబుతున్నది నాకర్ధం కావడం లేదు' అందామె కొంచం అయోమయంగా కొంచం కోపంగా.

'మీకు ఓపికుంటే ఫోన్లోనే చెబుతాను.లేకుంటే ఒక ఆదివారం రోజు మా ఇంటికి రండి.తీరికగా మాట్లాడుకోవచ్చు.' అన్నాను.

ఆమెకు భయం వేసినట్లుంది.

'ఒద్దులెండి.ఫోన్లోనే చెప్పండి.' అన్నది.

'సరే వినండి.మీరు జీవితాంతం లలితా పారాయణ చేసినా మీకు ఏమీ ఒరగదు.మీ పూర్వకర్మ ప్రకారం మీ జీవితం గడుస్తుంది.మంచి జరిగితే అమ్మవారి దయ అనుకుంటారు.చెడు జరిగితే అమ్మ పట్టించుకోలేదు అనుకుంటారు.అదంతా మీ భ్రమ.మీ పారాయణకీ మీ జీవితంలో జరిగేవాటికీ ఏమీ సంబంధం లేదు.

నిజానికి లలితాసహస్రం అనేది ఒక రూట్ మ్యాప్.అందులో మీరు ఏమేం చెయ్యాలో వ్రాసి ఉంటుంది.వాటిని మీరు చెయ్యాలి.అంతేగాని రూట్ మ్యాప్ బట్టీపట్టి వల్లె వేస్తుంటే మీ జన్మంతా అయిపోయినా మీరు గమ్యం చేరలేరు.అందులో చూపిన దారిలో మీరు నడవాలి.నడవకుండా ఊరకే పారాయణాలు చేస్తుంటే ఏమీ ఉపయోగం ఉండదు.

కాశీకి వెళ్ళాలంటే ఒక రూట్ ఉంటుంది.ఆ రూట్ ని మీరు గుర్తు పెట్టుకుని ఆ దారిలో నడిస్తే కాశీకి చేరవచ్చు.అంతేగాని మీ ఇంట్లో కూచుని ఆ రూట్ మ్యాప్ ని బట్టీపట్టి వల్లె వేస్తుంటే ఏం జరుగుతుంది? మీ ఇంట్లోనే మీరు ఉంటారు.కానీ మీకేదో ఒరిగిందన్న భ్రమలో ఉంటారు.కాశీని చూశామని సంబరపడుతూ ఉంటారు.కానీ మీ ఇంటికి కాశీ కొన్ని వేలమైళ్ళ దూరంలో ఉంటుంది.రూట్ మ్యాప్ వల్లె వేసినంత మాత్రాన కాశీ మీ ఇంటికి రాదు.ఇది కూడా అంతే. 

అందుకే మీరు చేస్తున్న సామూహిక పారాయణాలు అవన్నీ శుద్ధవేస్ట్ అని నేనంటాను.వేస్ట్ పనులు తెలివున్నవాళ్ళు ఎవ్వరూ చెయ్యరు కదా.అందుకే నేనూ మీ గుడికి రాను.మీ పారాయణలూ చెయ్యను.' అని చెప్పాను.

ఆమెకు బాగా కోపం వచ్చిందని ఆమె గొంతు వింటుంటే తెలుస్తున్నది.

'అంటే మేం చేస్తున్నదంతా వేస్ట్ అంటారా?' అడిగింది.

'నేనలా అనలేదు.నావరకూ వేస్ట్ అని చెప్పాను.మీ సంగతి మీ ఇష్టం.' అన్నాను.

కనీసం 'థాంక్స్' కూడా చెప్పకుండా టక్కున ఫోన్ కట్ చేసింది ఆమె.

మనుషులంతా ఇలాగే ఉంటారు.వారికి కావలసిన సమాచారం వరకూ రాబట్టుకోవడం, ఆ తరువాత కనీసం సివిక్ సెన్స్ కూడా లేకుండా ప్రవర్తిస్తారు. దానికి తోడు నిజం చెబితే కోపం ఒకటి. నేను కూడా ఆమె పిలవడంతోనే ఎగిరి గంతేసి ఆ గ్రూప్ లో చేరి, గుడికి పోతూ,పారాయణాలు చేస్తూ,ఆ భజనబృందం పాటలకు తబలా వాయిస్తూ ఉంటే నేను మంచివాణ్ణి.లేకుంటే పెడమనిషిని, దుర్మార్గుడిని.నాస్తికుణ్ణి.

ఇలాంటి గ్రూపులని నా చిన్నప్పటినుంచీ చూస్తున్నాను.వీరంతా 'ఎక్కడ వేసిన గొంగళి అక్కడే'- అనే బాపతు.వీరికి నిజంగా కావలసింది అమ్మవారు కాదు.ఆ గ్రూపులో ఉండే స్నేహాలు,గుడిలో చేరి చెప్పుకునే పోసుకోలు కబుర్లు,తామేదో గొప్ప భక్తులమనీ, అమ్మవారి అనుగ్రహానికి దగ్గరలో ఉన్నామన్న భ్రమా, వారి చీరలూ నగలూ ప్రదర్శిస్తూ నలుగురిలో చేసే 'షో' మాత్రమే వీరికి కావాల్సినవి.

నిజమైన ఆధ్యాత్మికత ఇది కాదు.

"లలితా సహస్రనామం అనేది పారాయణ గ్రంధం కాదు, ఆచరణగ్రంధం"- అని నా చిన్నప్పుడు నా గురువులలో ఒకరు నాతో అన్నారు.అదృష్టవశాత్తూ ఆ ఆచరణ ఎలా చెయ్యాలో నేర్పించే గురువులూ నాకు చిన్నప్పుడే దొరికారు. ఆ మాట అక్షరాలా నిజం.కానీ నిజం చెబితే వినేవారు ఈ కలియుగంలో ఎందరున్నారు? ప్రజలకి కావలసింది వారివారి అహాలు తృప్తిపడటమే గాని అసలు నిజం ఎవరికి కావాలి?

ఆధ్యాత్మిక ప్రపంచంలో ఎక్కువమంది ఇలాంటి భ్రమల్లో కాలం గడపవలసిందే. దేవుడి దగ్గరే ఉన్నామనుకుంటూ దేవుడికి దూరం కావలసిందే.ఈ మాయను దాటనంతవరకూ అసలైన ఆధ్యాత్మిక ప్రపంచం ఎలా ఉంటుందో వారికి అర్ధం కాదు.అలా అర్ధం కానంతవరకూ, వారు చేస్తున్నదే నిజమైన ఆధ్యాత్మికత అనే భ్రమలో వారు ఉండక తప్పదు.కొండొకచో మనలాంటి వాళ్ళని కూడా ఆ ఊబిలోకి లాగాలని చూడకా తప్పదు.

అందరూ 'కాశీ కాశీ' అంటూ అరిచేవారే గాని నిజంగా కాశీకి పోయి చూచేవారు ఎందరుంటారు? చూచినా కాశీలోనే ఉండిపోయేవారు ఎందరుంటారు? ఒకవేళ వెనక్కి వచ్చినా, కాశీని తమతో ఇంటికి తెచ్చుకునే వారు ఎందరుంటారు?

ఈ మాయను దాటినవాడికే అసలైన ఆధ్యాత్మికద్వారాలు తెరుచుకుంటాయి. అతీతలోకాలకు దారులు తెరుస్తాయి.నిజమైన దివ్యత్వం అంటే ఏమిటో బోధపరుస్తాయి.

అంతవరకూ ఈ పూజలూ పారాయణాలే సర్వస్వం అనే భ్రమలో లోకులు బ్రతకక తప్పదు.
read more " రూట్ మ్యాప్ బట్టీ పట్టొద్దు - దారిలో నడవండి "

21, సెప్టెంబర్ 2015, సోమవారం

Saranga Teri Yaad Me - MukeshYoutube link
https://youtu.be/6xwAHsX5FHg

సారంగా తేరీ యాద్ మే.. నైన్ హుయే బే చైన్...

అంటూ ముకేష్ స్వరంలోనుంచి మంద్రస్థాయిలో సుతారంగా జాలువారిన ఈ పాట సారంగా (1961) అనే చిత్రంలోనిది.

ప్రియురాలితో గడచిన తన పాత జ్ఞాపకాలను తలచుకుంటూ సాగిపోయే ఈ పాట 54 ఏళ్ళ తర్వాత ఇప్పుడు కూడా నిత్యనూతన మధురగీతమే.

Movie:--Saranga (1961)
Lyrics:--Bharath Vyas
Music:--Sardar Malik
Singer:--Mukesh
Karaoke Singer:--Satya Narayana Sarma
Enjoy
---------------------------------
Saranga teri yaad me-2
nain huye bechain ho..
Saranga teri yaad mein - nain hue bechain
Ho.. Madhur tumhaare milan binaa
Din kat te nahi ren,
ho~ Saranga teri yaad mein...

Vo ambuvaa ka jhoolnaa, vo peepal ki chaav-2
Ghunghat me jab chaand tha, mehandi lagi thi paav
(aaj ujaDke rah gayaa - 2)
Vo sapnon ka gaon ho ...
Saranga teri yaad mein nain huye bechain
ho.. madhur tumhare milan binaa
din kat se nahi ren Ho ..
Saranga teri yaad mein

Sang tumhaare do ghadii, beet gaye jo pal-2
Jal bharke mere nain me, aaj huye ojhal
(sukh leke dukh de gayee -2)
Do akhiya chanchal, ho ...
Saranga teri yaad mein nain hue bechain ho..
Madhur tumhaare milan binaa - Din katate nahi ren,
ho~ Saranga teri yaad mein...

Meaning:--

My eyes are restless
in your memories
Without having a lovely meeting with you
my days and nights refuse to pass...
O dear..in your memories...

The swinging from mango tree
the shade of the banyan tree
Did I not adorn your feet with Mehendi
when the Moon was behind the veil?
Now everything has become a mere memory
our beautiful land of dreams...
O dear...in your memories...
my eyes are restless...

Those two moments that we spent together
passed away swiftly
Through my tear filled eyes
today I see only a vaccume...
Your two restless eyes
took my happiness away
and gave me only sorrow

My eyes are restless
in your memories
Without having a lovely meeting with you
my days and nights refuse to pass...
O dear..in your memories...

తెలుగు స్వేచ్చానువాదం

నీ స్మృతులలో
నా కళ్ళు తమ శాంతిని కోల్పోయాయి
నిన్ను కలవకుండా
నా పగళ్ళూ రాత్రులూ
ముందుకు కదలనంటున్నాయి
ప్రియా ... నీ స్మృతులలో

వేపచెట్టుకు మనం ఊగిన ఉయ్యాల
మనకు ఆశ్రయం ఇచ్చిన రావిచెట్టు నీడా
చంద్రుడు మేఘాల చాటుకు తప్పుకున్నప్పుడు
నీ పాదాలకు నేను అద్దిన పారాణి
మన కలల పల్లెటూరు
అన్నీ ఇప్పుడు జ్ఞాపకాలుగా
మిగిలిపోయాయి

నీ స్మృతులలో
నా కళ్ళు తమ శాంతిని కోల్పోయాయి

నీ సమక్షంలో కాలం
ఎంత వేగంగా పరుగెత్తింది?
కన్నీటితో నిండిన నా కళ్ళకు
ప్రస్తుతం ఒక శూన్యమే గోచరిస్తోంది
నీ చంచల నేత్రాలు
నా ఆనందాన్ని నా నుంచి దూరం చేసి
నాకు దుఖాన్నే మిగిల్చాయి

నీ స్మృతులలో
నా కళ్ళు తమ శాంతిని కోల్పోయాయి
నిన్ను కలవకుండా
నా పగళ్ళూ రాత్రులూ
ముందుకు కదలనంటున్నాయి
ప్రియా ... నీ స్మృతులలో...
read more " Saranga Teri Yaad Me - Mukesh "