Love the country you live in OR Live in the country you love

14, సెప్టెంబర్ 2015, సోమవారం

13-9-2015 అమావాస్య ప్రభావం

అమావాస్యకూ పౌర్ణమికీ భూమిపైనా మానవ జీవితాలలోనూ జరిగే ప్రమాదాలూ ఘోరసంఘటనల గురించి నేను అయిదేళ్ళ నుంచీ వ్రాస్తూ వస్తున్నాను.ఈ అయిదేళ్ళలో ఆయా సమయాలలో ఎన్నెన్ని ఘోరాలు జరిగాయో లెక్కే లేదు.

కనుక -- చంద్రుని స్థితికీ మనిషి జీవితానికీ ఖచ్చితమైన సంబంధం ఉన్నదన్నమాట ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ప్రత్యక్ష సత్యం.

ఇప్పుడు క్రొత్తగా ఈ శీర్షిక ప్రారంభించడానికి కారణం - స్టాటిస్టికల్ స్టడీ కోసం.

ప్రతీ అమావాస్యకూ పౌర్ణమికీ జరుగుతున్న ప్రకృతి విలయాలను రికార్డ్ చేసి పెడితే ఒక అయిదేళ్ళ తర్వాత అది ఒక అద్భుతమైన డేటా బేస్ అవుతుంది.దానినుంచి ఒక 'తీరు' (pattern) ను మనం అర్ధం చేసుకోవచ్చు.

జ్యోతిశ్శాస్త్రంలో నేను ఇలాంటి రీసెర్చినే గత 20 ఏళ్ళుగా వ్యక్తిగత జీవితాలలో చేశాను.ఎన్నో జ్యోతిష్య సూత్రాలను కనుక్కున్నాను.ఆ రీసెర్చ్ ఫలితంగా, ఒక జాతకచక్రం నుంచి ఆ వ్యక్తి జీవితాన్ని - ఒక పుస్తకం చదివినంత తేలికగా నేనిప్పుడు చదవగలను.భవిష్యత్తును చూడగలను.నేనేకాదు.నన్ను అనుసరిస్తున్న నా శిష్యులు కూడా ఆ విద్యలో నిష్ణాతులు అవుతున్నారు. నా రీసెర్చి వారికి ఉపయోగపడుతున్నది.

ఇప్పుడు దేశజ్యోతిష్యం (mundane astrology) వైపు కొద్దిగా రీసెర్చి చేద్దాం. 

అదే ఈ శీర్షిక వెనుక ఉన్న ఉద్దేశ్యం.

Now let us start.

13-9-2015 అమావాస్య షాడో లో ఏం జరిగాయి?
హిమాచల్ ప్రదేశ్ లో టాయ్ ట్రెయిన్ పట్టాలు తప్పి ఇద్దరు విదేశీ టూరిస్టులు చనిపోయారు.8 మంది గాయపడ్డారు.

సికింద్రాబాద్-ముంబై దురంతో ఎక్స్ ప్రెస్ గుల్బర్గా దగ్గర పట్టాలు తప్పి ఇక్కడ కూడా ఇద్దరు చనిపోయారు.8 మంది గాయపడ్డారు.

మక్కాలో క్రేన్ కూలిపోయి 100 మంది పైగా చనిపోయారు.

నైజీరియాలో ఒక ఇస్లామిక్ స్కూల్ బిల్డింగ్ కూలిపోయి 4 గురు విద్యార్ధులు చనిపోయారు.14 మంది గాయపడ్డారు.

మధ్యప్రదేశ్ లోని పెట్లావాడ్ లో పేలుడు వల్ల ఒక ఇల్లు కూలిపోయి 105 మంది చనిపోయారు.150 మంది గాయపడ్డారు.