“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

30, సెప్టెంబర్ 2015, బుధవారం

27-9-2015 పౌర్ణమి ప్రభావం

ఈ పౌర్ణమికి తోడుగా సూపర్ బ్లడ్ మూన్ వచ్చింది.దీని ఫలితాలు ఎలా ఉన్నాయో గమనిద్దాం.

>23-9-2015 న సౌదీ అరేబియాలోని మక్కాలో జరిగిన తొక్కిసలాటలో 750+ మంది చనిపోయారు.ఈ సంఖ్య వెయ్యి దాటిందని అంటున్నారు.ఇంకొక వెయ్యిమంది దాకా గాయపడ్డారు.ఇది జలప్రమాదం కాదు.కానీ, ఎక్కువమంది ఒకచోట గుమిగూడటం వల్ల జరిగింది.

>27-9-2015 న తిరుపతి లోని కపిలతీర్ధం జలపాతం పైనుంచి పడి 8 మంది యువకులు తలలు పగిలి చనిపోయారు.కపిల తీర్ధం నీరు వారి రక్తంతో కలుషితం అయింది.కొండపైన ఉన్న నీటి గుండాలలో స్నానం చెయ్యడానికి వెళ్ళిన వీరు వర్షం వల్ల ఒక్కసారి పెరిగిన నీటి ఉధృతికి కొట్టుకుపోయి జలపాతం నుంచి దాదాపు 50 అడుగుల క్రిందకు పడ్డారు.

ఈ అయిదు గుండాలలోని నీటితోనే కపిలేశ్వరునికి అభిషేకం చేస్తారు.అలాంటి పవిత్ర గుండాలలో మనుషులు దిగి వాటిలో సబ్బులతో స్నానాలు చేసి ఆ అభిషేక జలాలను అపవిత్రం చేస్తుంటే అధికారులు ఎలా ఊరుకుంటున్నారో వారికే తెలియాలి. తెలిసో తెలియకో చేసే తప్పులు వాటికి పడే శిక్షలు ఇలా ఉంటాయి.

26-9-2015 న వ్రాసిన పోస్ట్ లో జలప్రమాదాలు జరుగుతాయని వ్రాశాను. మరుసటి రోజే ఇది జరిగింది.

>సరిగ్గా 26-9-2015 న గుంటూరు జిల్లా తక్కెళ్ళపాడు దగ్గర మనుషులున్న ఒక కారు కాలువలోకి దూసుకుపోయి అందులోని 7 మంది జలసమాధి అయ్యారు.

>విచిత్రంగా, ఈ సమయంలోనే - భారీ విగ్రహాలను నీటిలో కరిగించే గణేశ నిమజ్జనం కూడా చోటు చేసుకుంది.

>విశాఖపట్నంలో ఒక స్కూలు కెళ్ళే పాప, కాలవలో పడి కొట్టుకుపోయి గల్లంతైంది.ఇది కూడా తీవ్రవర్షం వల్లనే జరిగిందని అంటున్నారు.ఆ అమ్మాయి శవం కోసం సముద్రంలో కూడా వెదికారు.

>28-9-2015 - అస్సాంలో కలహి నదిలో పడవ మునిగి 50 మంది పైగా చనిపోయారు.

> ఇంకొక విచిత్రమేమంటే - ఇదే సమయంలోనే - అంగారక గ్రహం మీద నీటి జాడలు ఉన్నట్లుగా ఖచ్చితంగా  గుర్తించామని నాసా ప్రకటించింది.

>ఈతలకోసం నదులలో దిగినవారు చాలామంది ఈ ఆరురోజుల పరిధిలో ప్రాణాలు కోల్పోయారు.వీరిలో ఇంజనీరింగ్ చదివే విద్యార్ధులు కూడా ఉన్నారు.

>29-9-2015 న గుంటూరులో మూడంతస్తుల ఒక పాత ఇల్లు అందరి కళ్ళముందే పేకమేడలా కూలిపోయి ఇద్దరు చనిపోయారు.దాదాపు ఆరుగురు గాయపడ్డారు.భారీవర్షమే దీనికి కారణం అంటున్నారు.ఎక్కువగా నానడం వల్ల ఈ పాత ఇల్లు కూలిపోయింది.ఇదీ ఒక రకమైన జలప్రమాదమే.

>>ఇదే సమయంలో - విచిత్రంగా - తెలంగాణా ప్రభుత్వంలో - నీటి పారుదల ప్రాజెక్టులు,డ్యాములు, రాష్ట్రానికి నీటి సరఫరా తదితర విషయాల గురించి ఎనిమిది గంటలపాటు సమీక్షా చర్చ జరిగింది.

ఈ విధంగా ప్రపంచంలో చాలాచోట్ల చిన్నవో పెద్దవో ఏదో ఒకరకమైన జలప్రమాదాలో, నీటి సంబంధమైన వార్తలో ఈ సమయంలో వచ్చాయి.