“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

31, జులై 2018, మంగళవారం

Mai Tho Tum Sang - Lata Mangeshkar


Mai tho Tum Sang Nain Milake Har Gayi Sajna...

అంటూ లతా మంగేష్కర్ మధురంగా ఆలపించిన ఈ గీతం 1962 లో వచ్చిన Man Mouji అనే చిత్రంలోనిది. మరపురాని ఆపాత మధుర గీతాలలో ఇదీ ఒకటి.

మధుర సంగీత దర్శకుడు మదన్ మోహన్ ఈ పాటకు ఎంతో హృద్యమైన రాగాన్ని సమకూర్చాడు. మనవాళ్ళు ఈ పాటలో ఉన్న ఇంటర్ లూడ్స్ నీ, రాగాన్నీ చక్కగా కాపీ కొట్టి 1965 లో వచ్చిన 'పాండవ వనవాసం' చిత్రంలో 'హిమగిరి సొగసులు మురిపించును మనసులు' అనే పాటలో వాడారు. పాత తెలుగు చిత్రాలలో పాటలు చాలావరకూ హిందీ ట్యూన్స్ కి కాపీలే. తెలుగు సినిమాలలో ఒక్క సాలూరి రాజేశ్వరరావు తప్ప మిగతా అందరూ హిందీ పాటల ట్యూన్స్ ని కాపీ కొట్టినవాళ్ళే.

నా స్వరంలో కూడా ఈ గీతాన్ని వినండి మరి.

Movie:--Man Mouji (1962)
Lyrics:--Rajendra Krishan
Music:--Madan Mohan
Singer:--Lata Mangeshkar
Karaoke Singer:--Satya Narayana Sarma
Enjoy
----------------------------------
[Mai tho tum sang nain milake
har gayi sajna - Har gayi sajna] – 2

Kyu jhoote se preet lagayi – 2
Kyu chaliye ko meet banaya
Kyu aandhi me deep jalaya
Mai tho tum sang nain milake
har gayi sajna - Har gayi sajna

Sapne me jo baag lagaya
Nind khuli tho veerane the
Ham bhi kitne deewane the
Mai tho tum sang nain milake
har gayi sajna - Har gayi sajna

Na milti ye bairan akhiya – 2
Chain na jaata dilbhi na rota
Kaash kisise pyar na hota
[Mai tho tum sang nain milake
har gayi sajna - Har gayi sajna]-2


Meaning

I totally lost myself
after making eye contact with you
and falling in love with you
Oh my beloved

Why did I love you, the falsehood, at all?
why did I make friendship with the transient?
why did I lit a lamp in the darkness?

The garden I imagined in my dream
when I woke up, turned into a desert
what a mad fellow I am?

Alas ! Had our eyes not met
My mental peace would not have been lost
My heart would not weep like this
If only I had not fallen in love with you

I totally lost myself
after making eye contact with you
after falling in love with you
Oh my beloved

తెలుగు స్వేచ్చానువాదం

నీ కన్నులలో కన్నులు కలిపి
నిన్ను ప్రేమించి
ఇలా పూర్తిగా ఓడిపోయాను
ఓ ప్రియతమా !

ఒక అబద్ధాన్ని నేనెందుకు ప్రేమించాను?
ఒక అనిత్యంతో నేనెందుకు స్నేహం చేశాను?
చీకటిలో దీపాన్ని నేనెందుకు వెలిగించాను?

నా స్వప్నంలో నేను చూచిన తోట
నిద్ర లేచేసరికి ఎడారిగా మారిపోయింది
ఎంత పిచ్చిదానిని నేను

అసలు మన కన్నులు కలిసి ఉండకపోతే
నా మనశ్శాంతి పోయేదే కాదు
నా హృదయం ఇలా రోదించేదే కాదు
నిన్ను ప్రేమించకపోతే ఎంతో బాగుండేది

నీ కన్నులలో కన్నులు కలిపి
నిన్ను ప్రేమించి
ఇలా పూర్తిగా ఓడిపోయాను
ఓ ప్రియతమా !...
read more " Mai Tho Tum Sang - Lata Mangeshkar "

30, జులై 2018, సోమవారం

మీ వ్రాతలు వాళ్ళవిగా చెప్పుకుంటున్నారు

నా పోస్టులను ఇష్టపడే ఒకరినుంచి నిన్నొక మెసేజ్ వచ్చింది.

'ఫలానా "టెలిగ్రాం గ్రూపు" లో చేరండి. ఇందులో మంత్ర, తంత్ర, జ్యోతిష, ఆధ్యాత్మిక, భారతీయ సంస్కృతి వగైరా విషయాల మీద చర్చలుంటాయి. మీకు స్వాగతం' అని అందులో ఉంది.

నేను మర్యాదగా, "నాకు చేరాలని లేదు. సారీ !" అని జవాబిచ్చాను.

'ఈ గ్రూపులో ఒకాయన మీ వ్రాతలను తనవిగా పోస్టు చేసుకుంటున్నాడు. గ్రూపులో అతనికి చాలా appreciation వస్తోంది.' అని రిప్లై వచ్చింది.

నాకు జాలేసింది.

'అది అతని ఖర్మ. చేసుకోనివ్వండి. నేను పాడిన పాటల్ని కూడా తనవిగా చెప్పుకోమనండి ఇంకా బాగుంటుంది. ఇంతకీ అతని పేరేంటి?' అడిగాను.

'గ్రూపులో ఉన్నవాళ్ళ పేర్లు మాకు కనిపించవు. అతని పేరు LK అని మాత్రం వస్తుంది' అని మెసేజ్ వచ్చింది.

'ఈ విషయాలు సాధన చేసి అనుభవంలో తెలుసుకోవలసినవిగాని చర్చలలో పొద్దు పుచ్చేవి కావు. కాబట్టి మీ గ్రూపులో చేరే ఉద్దేశ్యం నాకు లేదు. సారీ. నన్ను ఆహ్వానించినందుకు థాంక్స్' అని మెసేజ్ ఇచ్చాను.

సో కాల్డ్ సూడో ఆధ్యాత్మిక లోకంలో ఒక విచిత్రం ఉంది. 'నాకింత తెలుసు' అని ప్రదర్శించుకుని ఎదుటివారి నుంచి "ఆహా ఓహో" అని పొగడ్తలు వస్తే ఉబ్బిపోతూ అదే ఏదో పెద్ద ఘనతగా చాలామంది భావించుకుంటూ ఉంటారు. ఇలాంటివారిని చూస్తె నాకు నవ్వూ జాలీ రెండూ వస్తూ ఉంటాయి.

ఆధ్యాత్మికత అనేది విజ్ఞాన ప్రదర్శనలో లేదు. అది సాధనలోనూ అనుభవంలోనూ ఉంటుంది. అందులోనూ, ఈ విధంగా ఇతరులనుంచి వచ్చే మెప్పులు, పొగడ్తలు, లోలోపల ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ తో నిండిపోయి ఉన్నవారికి పనిచేస్తాయి గాని ఇంకెందుకూ కొరగావు.

చర్చలతో ఆధ్యాత్మికత రాదు. అది సాధనతో వస్తుంది. వేరేవాళ్ళ బ్యాంక్ ఎకౌంట్ ను తనదిగా చెప్పుకున్నంత మాత్రాన ఆ ఎకౌంట్లో ఉన్న డబ్బు తనదెలా అవుతుంది?

ఇలాంటి వారిని చూచి జాలిపడటం తప్ప ఇంకేం చెయ్యగలం?
read more " మీ వ్రాతలు వాళ్ళవిగా చెప్పుకుంటున్నారు "

29, జులై 2018, ఆదివారం

Ye Dil Mujhe Bata De - Geeta Dutt


Ye Dil Mujhe Bata De - Tu Kispe Aagaya Hai

అంటూ గీతా దత్ మధురంగా ఆలపించిన ఈ గీతం 1956 లో వచ్చిన Bhai Bhai అనే చిత్రం లోనిది. ఇది ఆపాత మధుర గీతాలలో ఒకటి. సంగీత దర్శకుడు మదన్ మోహన్ ఈ పాటకు అప్పట్లోనే మంచి హుషారైన రాగాన్ని సమకూర్చాడు. 

మన కాపీగాళ్ళు దేనినీ వదలరు కదా? ఈ రాగాన్ని యధాతధంగా తెలుగులోకి దించేసి ' ఇంగ్లీషు లోన మేరేజీ హిందీలో అర్ధమూ షాదీ, ఏ భాషలో ఏమన్ననూ మన తెలుగులోన పెళ్లి' అంటూ ఒక పరమచెత్త హాస్య గీతాన్ని రేలంగి గిరిజల మీద చిత్రీకరించారు.

నా స్వరంలో కూడా ఈ గీతాన్ని వినండి మరి !

Movie:-- Bhai Bhai (1956)
Lyrics:--Rajendra Krishan
Music:--Madan Mohan
Singer:--Geeta Dutt
Karaoke Singer:--Satya Narayana Sarma
Enjoy
-------------------------------------------------
Ye dil mujhe batade tu kispe aagaya hai
Wo kaun haijo aakar khabope chagaya hai – 2

[Masti bhara tarana kyu raat garahi hai
Aakhome neend aakar kyu dur jarahi hai] – 2
Dilme koyi sitamgar armaan jagaya hai
Wo kaun haijo aakar khabope chagaya hai
Ye dil mujhe batade tu kispe aagaya hai
Wo kaun haijo aakar khabope chagaya hai

Betab horaha hai ye dil machal machal ke
Shayad ye raat bite karwat badal badal ke
Lalla laa lalla laa lalla laa lalla laa
Betab horaha hai ye dil machal machal ke
Shayad ye raat bite karwat badal badal ke
Ye dil zara samal jaa shayadvo aagaya hai
Wo kaun haijo aakar khabope chagaya hai
Ye dil mujhe batade tu kispe aagaya hai
Wo kaun haijo aakar khabope chagaya hai

[Bhigi huyi hawaye mausam bhihai gulabi
Kya chand kya sitare har cheej hai sharabi]-2
Dhirese ek nagma Koyi suna gaya hai
Wo kaun haijo aakar khabope chagaya hai
Ye dil mujhe batade tu kispe aagaya hai
Wo kaun haijo aakar khabope chagaya hai

Meaning

Oh my heart ! Tell me for whom you are falling
Who is coming and stealthily occupying my dreams?

Why this night is singing these intoxicating tunes?
Why sleep is coming into my eyes
and again going away
Some villain has aroused passion in me
Oh my heart ! Tell me for whom you are falling
Who is coming and stealthily occupying my dreams?

My heart is quivering with restlessness
This night is passing with tossing and turning
Oh my heart ! You just keep quiet
He is coming
Oh my heart ! Tell me for whom you are falling
Who is coming and stealthily occupying my dreams?

The winds are damp with rain
and the season is full of rose flowers
What a lovely Moon and stars !
Everything is reeling with intoxication
Some one is slowly singing a melody
Oh my heart ! Tell me for whom you are falling
Who is coming and stealthily occupying my dreams?

తెలుగు స్వేచ్చానువాదం

ఓ మనసా చెప్పు ! నువ్వెవరిని ప్రేమిస్తున్నావు?
ఎవరు వచ్చి నీలో తిష్ట వేసుకుని కూచున్నారు?

ఈ రాత్రి ఎందుకింత మధురమైన రాగాలను ఆలపిస్తోంది?
ఎందుకిలా నా కళ్ళలోకి నిద్ర వచ్చి మాయమౌతోంది?
ఎవరో ఆకతాయి నాలో ఈ కోరికలు రగిలించాడు

నా హృదయం ఉద్విగ్నతతో వణుకుతోంది
రాత్రంతా అటూ ఇటూ దొర్లడమే సరిపోతోంది
ఓ మనసా ! నువ్వు శాంతించు తన అలికిడి అవుతోంది

ఈ వానగాలి చాలా గమ్మత్తుగా ఉంది
ప్రకృతి అంతా గులాబీల సువాసనతో మత్తుగా ఉంది
ఎంత మనోహరమైన చంద్రుడూ, చుక్కలూ?
వాతావరణమంతా మత్తుతో తూగుతోంది
ఈ రాత్రి ఎవరో ఒక కమ్మని రాగాన్ని ఆలపిస్తున్నారు

ఓ మనసా చెప్పు ! నువ్వెవరిని ప్రేమిస్తున్నావు?
ఎవరు వచ్చి నీలో తిష్ట వేసుకుని కూచున్నారు?
read more " Ye Dil Mujhe Bata De - Geeta Dutt "

28, జులై 2018, శనివారం

Na Jane Kyoo Hota Hai - Lata Mangeshkar


Lata Mangeshkar and Salil Chowdhury
Na Jane Kyoo Hota Hai Ye Zindagi Ke Saath...

అంటూ లతా మంగేష్కర్ మధురంగా ఆలపించిన ఈ గీతం 1976 లో వచ్చిన Choti Si Baat అనే చిత్రంలోనిది. ఈ పాటకు తనదైన మధుర సంగీతాన్ని సలీల్ చౌధురీ అందించారు. ఇది ఒక రకమైన పాథోస్ గీతమే. 

జీవితంలో ఒక విచిత్రం ప్రతివారికీ జరుగుతుంది. అదేంటంటే - మనుషులు మన ఎదురుగా ఉన్నప్పుడు వాళ్ళ విలువ మనకు తెలీదు. వాళ్ళు కనుమరుగైనప్పుడు మాత్రమే వాళ్ళ విలువ తెలుస్తుంది. అప్పుడు గతించినవన్నీ తలచుకొని బాధపడుతూ ఉంటాం. ఇది మానవ సహజం, అందరికీ ఇది జరుగుతుంది. అందుకే ఈ పాట కూడా అందరినీ కదిలిస్తుంది.

నా స్వరంలో కూడా ఈ గీతాన్ని వినండి మరి !

Movie:--Choti Si Baat (1976)
Lyrics:--Yogesh
Music:--Salil Chowdhury
Singer:--Lata Mangeshkar
Karaoke Singer:--Satya Narayana Sarma
Enjoy
-------------------------------- 
Na jane kyoo -- hota hai ye zindagi ke saath
Achanak ye man -- Kisike jane ke baad
Kare phir uski yaad Choti choti si baat
Na jane kyoo

Wo anjan pal
Dhal gaye kal – aaj vo
Rang badal badal – Manko machal machal
Rahena chalna jane kyo - Wo anjan pal
Tere bina mere nainome
Tutere haire sapnoke mehal
Na jane kyoo -- hota hai ye zindagi ke saath
Achanak ye man -- Kisike jane ke baad
Kare phir uski yaad Choti choti si baat
Na jane kyoo

Wahi hai dagar
wahi hai safar - Hai nahee
Saath mere magar - Ab mera hamsafar
Idhar udhar dunde nazar – Wahi hai dagar
Kaha gaye shame madbhari
Womere merewo dingaye kidhar
Na jane kyoo -- hota hai ye zindagi ke saath
Achanak ye man -- Kisike jane ke baad
Kare phir uski yaad Choti choti si baat
Na jane kyoo

Meaning


I wonder why....
this happens in life always
this mind remembers little things
of a person after he is gone
I wonder why...

Those unknown moments
that happened earlier
are again flashing in my mind, why so?
Without you, all my golden dream are just shattered
I wonder why this happens in life

The road is same, the journey is same
my eyes are searching for my companion
I wonder why...
Where did my lovely evenings go?
Where did my happy days go?

I wonder why
this happens always in life
this mind remembers small things
of a person after he is gone
I wonder why...
read more " Na Jane Kyoo Hota Hai - Lata Mangeshkar "

27, జులై 2018, శుక్రవారం

"విజ్ఞాన భైరవ తంత్రము" - Telugu E Book నేడు విడుదలైంది

ఈరోజు గురుపూర్ణిమ.

సమస్త జగత్తులకూ పరమగురువగు పరమేశ్వరుని స్మరిస్తూ ఈ రోజున మా "పంచవటి స్పిరిట్యువల్ ఫౌండేషన్" నుంచి ఆరవ E-Book గా "విజ్ఞాన భైరవతంత్రము" ను విడుదల చేస్తున్నాము. తంత్రాచారములలో ఇది కౌలాచారమునకు చెందినది. ఆగమములలో భైరవాగమమునకు చెందినది. దీనియందు, పరమేశ్వరుడు పార్వతీదేవికి ఉపదేశించినట్లుగా చెప్పబడిన నూట పన్నెండు ధారణా విధానములు ఇవ్వబడినవి. తాంత్రిక ధ్యానాభ్యాసులకు ఇదొక భగవద్గీత వంటిది.

దీనిలోని అన్ని సాధనలను శ్రీరామకృష్ణులు తమ సాధనా కాలమున కొద్ది రోజులలో సాధించగలిగినారు. మనబోటి సామాన్యులకు వీటిలోని ఒక సాధనకు ఒక జన్మ పడుతుంది.

దాదాపు తొమ్మిదేళ్ళ క్రితం నేను బ్లాగు వ్రాయడం ప్రారంభించిన కొత్తల్లో 'విజ్ఞాన భైరవతంత్రం' మీద వరుసగా పోస్టులు వ్రాద్దామని అనుకున్నాను. అది నాకు చాలా ఇష్టమైన పుస్తకం, ఎందుకంటే, చిన్నప్పటి నుంచీ నేను చేసిన సాధనలు దానిలో చాలా ఉన్నాయి. కానీ అవసరం ఉన్నా లేకపోయినా ప్రతిదీ అందరికీ చెప్పడం ఎందుకు? అన్న ఉద్దేశ్యంతో ఆ ప్రయత్నాన్ని విరమించాను. అది "పంచవటి స్పిరిట్యువల్ ఫౌండేషన్" నుంచి పుస్తకంగా విడుదలయ్యే ముహూర్తం ఇప్పటికి వచ్చింది.

దీనికి అనేక వ్యాఖ్యానములు ఎప్పటినుంచో ఉత్తర భారతదేశమున ఉన్నవి. నవీన కాలపు వివాదాస్పద గురువులలో ఓషో రజనీష్ దీనిపైన ఉపన్యాసాలిచ్చాడు. బైటకు చెప్పినా చెప్పకున్నా మోడరన్ గురువులందరూ చాలావరకూ దీనినే అనుసరిస్తున్నారు. ఈ గురువులందరూ వారి వారి అనుభవములను బట్టి జ్ఞానమును బట్టి దీనిని వ్యాఖ్యానించారు. నేను కూడా నా అనుభవములను ఆధారము చేసికొని దీనికి వ్యాఖ్యానమును వ్రాశాను.

ఇదొక ప్రాక్టికల్ గైడ్ బుక్. కానీ దీనిలోని ధారణల లోతుపాతులు అనుభవం ఉన్న గురువు దగ్గర వ్యక్తిగతంగా నేర్చుకున్నప్పుడే అర్ధమౌతాయి. నా శిష్యులలో అర్హులైనవారికి, నమ్మకంగా నన్ను అనుసరించేవారికి ఈ ధారణల లోతుపాతులను ప్రాక్టికల్ గా నేర్పించడం, అసలైన తంత్రసాధన అంటే ఏమిటో వారికి రుచి చూపించడం జరుగుతుంది.

అతి తక్కువకాలంలో (మూడు వారాలలో) ఈ పుస్తకాన్ని వ్రాయడంలో ఎంతో సహకరించిన నా అమెరికా శిష్యులకు కృతజ్ఞతలు ఆశీస్సులు తెలియజేస్తున్నాను.

ఈ E-Book కావలసిన వారు google play books నుంచి డౌన్లోడ్ చేసుకొనవచ్చును.
read more " "విజ్ఞాన భైరవ తంత్రము" - Telugu E Book నేడు విడుదలైంది "

25, జులై 2018, బుధవారం

Mujhe Peene Ka Shouk Nahi - Shabbir Kumar, Alka Yagnik


Mujhe Peene Ka Shouk Nahi
Peeta Hu Gham Bhulane Ko

అంటూ షబ్బీర్ కుమార్, ఆల్కా యాజ్ఞిక్ మధురంగా ఆలపించిన ఈ యుగళగీతం 1983 లో వచ్చిన Coolie అనే చిత్రంలోనిది. ఈ పాటను రఫీ పాడాడని చాలామంది అనుకుంటారు గాని రఫీ 1980 లోనే గతించాడు. షబ్బీర్ కుమార్ స్వరం చాలావరకూ రఫీ స్వరంలాగా ఉంటుంది.

రఫీ అంత్యక్రియలలో పాల్గొంటున్నపుడు ఆ గోతిలో షబ్బీర్ చేతి గడియారం పడిపోయిందట. తన తర్వాత తన పరంపరను కొనసాగించమని అదొక దైవసూచనగా షబ్బీర్ స్వీకరించాడు. ఆ తర్వాత అతను దాదాపు 1500 పాటలు పాడాడు. కానీ తర్వాత రోజులలో అతను ప్లే బ్యాక్ సింగింగ్ నుంచి విరమించుకుని స్టేజి షోలకు అంకితమయ్యాడు. బహుశా సినిమా లోకపు కుళ్ళు రాజకీయాలే దీనికి కారణం కావచ్చు.

చిన్నప్పటి స్నేహం చాలా మధురంగా ఉంటుంది. ఎందుకంటే అది చాలా అమాయకమైనది. అందులో స్నేహం తప్ప ఇంకేమీ ఉండదు. అలాంటి చిన్ననాటి స్నేహితులిద్దరూ పెద్దయ్యాక కూడా ఒకర్ని ఒకరు మర్చిపోలేక, ఆ బాధలో త్రాగి, ఒకరిని ఒకరు వెదుక్కుంటూ పాడుకునే పాట ఇది. చాలా మధురమైన భావం !

కొన్ని పాటలు చూస్తే బాగుండవు. వింటేనే బాగుంటాయి. ఈ పాట కూడా అలాంటిదే. మీకు ధైర్యం ఉంటే చూడండి !

ఆ తర్వాత నా స్వరంలో కూడా ఈ మధుర గీతాన్ని వినండి మరి !

Movie:--Coolie (1983)
Lyrics:--Anand Bakshi
Music:--Laxmikant Pyarelal
Singers:--Shabbir Kumar, Alka Yagnik
Karaoke Singer:--Satya Narayana Sarma
Enjoy
------------------------------
Mujhe peene ka shouk nahi – Peeta hu gham bhulane ko – 2
Teri yaade mitane ko -2
Peeta hu gham bhulane ko

Mujhe peene ka shouk nahi – Peeti hu gham bhulane ko – 2
Teri yaade mitane ko -2
Peeti hu gham bhulane ko
Mujhe peene ka shouk nahi – Peeta hu gham bhulane ko

Lakho me hazaaro me – Ek tuna nazar aayi- 2
Tera Koi khat aaya – Na koi khabar aayi
Kya tune bhula dala -2
Ap--ne is diwane ko
Mujhe peene ka shouk nahi – Peeti hu gham bhulane ko

Koi vo kitabe dil – Jis dilka hai ye kissaa-2
Is hisso he paas mere - tere baat hai ek hissa
Mai pura karu kaise - Is dil ke fasane ko
Mujhe peene ka shouk nahi – Peeta hu gham bhulane ko

Mil jate agar ab ham – Aag lag jaati paani me – 2
Bachpan se vahi dosti - hojati javani me
Chahat me badal dete
Chahat me badal dete - Hum is dostani ko
Mujhe peene ka shouk nahi – Peeti hu gham bhulane ko
Mujhe peene ka shouk nahi – Peeta hu gham bhulane ko

Meaning

I am not fond of drinking, I just drink to forget my sadness
I just drink to forget your memories

Among thousand and millions of people
You are not found anywhere
There is no trace or news of you
What? Did you really forget this mad fellow?

My heart was the chapter of a book
and that book was lost
A part of it is with me, another part is with you
How should I complete the story of my heart?

If we meet now, then fire will be created in water
The sweet friendship that we had in our childhood
will become alive again
Then we will convert that friendship
into a passionate love

I am not fond of drinking, I just drink to forget my sadness
I just drink to forget your memories

తెలుగు స్వేచ్చానువాదం

త్రాగడం అంటే నాకేమీ ఇష్టం లేదు
కానీ ఈ బాధను మర్చిపోవడం కోసం త్రాగుతున్నాను
నీ జ్ఞాపకాలను మర్చిపోవడం కోసం త్రాగుతున్నాను

వేలాది లక్షలాది మందిలో నిన్ను వెదుకుతున్నాను
కానీ నీ జాడా లేదు జవాబూ లేదు
ఈ పిచ్చివాడిని నిజంగా మర్చిపోయావా నువ్వు?

నా హృదయమనేది ఒక పుస్తకంలో ఒక అధ్యాయం
ఆ పుస్తకం ఇప్పుడెక్కడో పోయింది
సగం నా దగ్గరుంది సగం నీ దగ్గరుంది
ఈ కధను నేనెలా పూర్తి చేసేది?

ఇప్పుడు మనం కలుసుకుంటే
నీళ్ళలో అగ్ని చెలరేగుతుంది
చిన్నప్పటి మన స్నేహం మళ్ళీ చిగురిస్తుంది
ఆ స్నేహాన్ని ఇప్పుడు మనం
ఒక మధుర ప్రేమగా మార్చుకుందాం

త్రాగడం అంటే నాకేమీ ఇష్టం లేదు
కానీ ఈ బాధను మర్చిపోవడం కోసం త్రాగుతున్నాను
నీ జ్ఞాపకాలను మర్చిపోవడం కోసం త్రాగుతున్నాను
read more " Mujhe Peene Ka Shouk Nahi - Shabbir Kumar, Alka Yagnik "

24, జులై 2018, మంగళవారం

27-7- 2018 పౌర్ణమి + చంద్ర గ్రహణం ప్రభావాలు

27-7-2018 న పౌర్ణమి + చంద్ర గ్రహణం వస్తున్నాయి. దీని ప్రభావం చాలా ఎక్కువగా మనుషుల మీద ఉండబోతున్నది. నిజానికి నిన్నటి నుంచే దీని ప్రభావం మనుషుల మీద మొదలైంది. మీరు గమనించుకుంటే ఈ క్రింది ప్రభావాలు మీలోనూ మీ చుట్టూ ఉన్నవారిలోనూ కన్పిస్తాయి.

1. నిన్నా ఇవాళా, మనుషులు తేలికగా చిరాకు పడుతూ ఉంటారు. ముఖ్యంగా ఫేస్ బుక్, వాట్స్ అప్ లాంటి యాప్స్ ఎప్పుడూ వాడే వాళ్ళు, ప్రెండ్స్ తో చాటింగ్ చేసేవాళ్ళ మీద ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. గమనించండి.

2. చెప్పుడు మాటలు వినడం, ఒకళ్ళను ఒకళ్ళు అపార్ధం చేసుకోవడం, అనవసరంగా ఇతరుల మీద చిరాకు పడటం, మనస్సులు చెడిపోవడం, డిప్రెషన్ కు గురికావడం, ఏడవడం జరుగుతుంది. ముఖ్యంగా ఇది ఆడవాళ్ళలో కనిపిస్తుంది. మొగవాళ్ళు కోపతాపాలకు, ఉక్రోషాలకు, పగలకు గురౌతారు.

3. ఈ చంద్ర గ్రహణ ప్రభావం ముఖ్యంగా మకర, కుంభ రాశుల మీద ఉంటుంది. ఈ రాశులలో చంద్రుడు గాని, సూర్యుడు గాని, లగ్నంగాని ఉన్న జాతకుల మీద ఈ ప్రభావాలు ఎక్కువగా ఉంటాయి. టీవీ జ్యోతిష్కులు, పత్రికా జ్యోతిష్కులు చెప్పే మాటలు నమ్మి, ఇది మకర రాశి వారికేగాని, కుంభరాశి మీద ఏమీ ఉండదని అనుకోకండి. వారి మీద కూడా ప్రభావం ఉంటుంది. ఎందుకంటే, సాయన సిద్ధాంత రీత్యా గ్రహణం కుంభ రాశిలో ఏర్పడుతోంది. అనుభవంలో సాయన, నిరయన సిద్ధాంతాలు రెండూ పని చేస్తాయి. తేదీల పరంగా జనవరి 14 నుంచి మార్చి 15 లోపు పుట్టినవారి మీద ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. 

4. ఈ ప్రభావం వల్ల, ఉన్నత స్థానాలలో ఉన్న వ్యక్తులకు ప్రాణగండం ఉన్నది. అది రాజకీయ నాయకులు కావచ్చు, అధికారులు కావచ్చు. వారికి పూర్తి మెడికల్ కేర్ అవసరం.

5. ఈ రోజునుంచీ జూలై 31 వరకూ కోపతాపాలను, అనవసర ఆవేశాలను తగ్గించుకుని కంట్రోల్ లో ఉంటె మంచిది. స్పీడ్ డ్రైవింగులు, ఈతలు, ప్రమాదకర స్థలాలకు విహార యాత్రలు, దూరప్రయాణాలు మొదలైన సాహసాలకు దూరంగా ఉండాలి.

6. తేలికగా మనస్సు బేలన్స్ తప్పే వారికీ, హిస్టీరికల్ గా ప్రవర్తించే వారికీ, ముఖ్యంగా ఆడవారి మీద ఈ ప్రభావాలు ఎక్కువగా ఉంటాయి. ఈ సమయంలో వాళ్ళు తేలికగా అన్ బేలన్స్ అయి పిచ్చిపిచ్చిగా ప్రవర్తిస్తూ ఉంటారు. గమనించండి.

సులువైన ఈ జాగ్రత్తలు పాటించి ఈ గ్రహణ ప్రభావాలనుండి బయట పడండి.
read more " 27-7- 2018 పౌర్ణమి + చంద్ర గ్రహణం ప్రభావాలు "

23, జులై 2018, సోమవారం

Rahe Na Rahe Hum - Lata Mangeshkar


Rahe Na Rahe Hum...

అంటూ లతా మంగేష్కర్ మధురంగా ఆలపించిన ఈ గీతం 1966 లో వచ్చిన Mamta అనే సినిమా లోది. ఈ పాటకు మధుర సంగీత దర్శకుడు రోషన్ చక్కటి రాగాన్ని సమకూర్చాడు. ఈ పాటను వింటే ఏదో తెలియని బాధ గుండెల్ని పిండేస్తుంది. ఈ సాహిత్యమూ ఈ రాగమూ అలాంటివి. ఈ పాటలో అశోక్ కుమార్, సుచిత్రా సేన్ నటించారు. బెంగాలీ వాళ్ళు తీసిన సినిమాలలో సాహిత్య విలువలూ సంగీత విలువలూ ఉన్నతంగా ఉంటాయి. ఈ పాట కూడా అలాంటిదే.

నా స్వరంలో కూడా ఈ విషాద మధురగీతాన్ని వినండి మరి !

Movie :-- Mamta (1966)
Lyrics:--Majrooh Sultanpuri
Music:--Roshan
Singer:-- Lata Mangeshkar
Karaoke Singer:-- Satya Narayana Sarma
Enjoy
-------------------------------------
Rahe na rahe hum – Mehka karenge
Ban ke kali banke saba bage vafa me
Rahe na rahe hum

Mousam koiho – Is chaman me
Rang banke rahenge – hum fiza me
Chahat ki khushbu – Yuhi zulfo se udegi – khiza ho ya bahare
Yuhi Jhoomte – Yuhi jhoomte aur
Khilte rahenge
Ban ke kali banke saba bage vafa me
Rahe na rahe hum
Mehka karenge
Ban ke kali banke saba bage vafa me

Khoye ham aise – Kya hai milna
Kya bichadna – Nahi hai – Yaad hamko
Kuche me dilke – Jab se aaye
Sirf dil ki – Zami hai – Yaad hamko
Isi sarzami – Isi sarzami pe
Ham tho rahenge
Ban ke kali banke saba bage vafa me
Rahe na rahe hum

Jab hamna honge – Jab hamari
Khaak pe tum – Rukoge chalte chalte
Ashkonke bheegi – Chandni me
Ik sadasi sunoge – Chalte chalte
Wahipe kahi – Wahi pe kahi hum
Tumse milenge
Ban ke kali banke saba bage vafa me
Rahe na rahe hum

Meaning

Whether I remain here or not, my fragrance will remain
Like a flower, like a breeze in our garden of love

Whatever be the season in this garden
I will remain here as a color in the breeze
Whether it be Autumn or Spring
the sweet fragrance of our love will spread from my hair
I will continue to bloom and swing
as a flower, as a breeze in our garden of love

I am so deeply lost in your love that
I don't remember separation or union
Ever since you entered the lanes of my heart
I just remember the world of love, and nothing else
In that realm of love I remain
as a flower, as a breeze in our garden of love

When I am gone and
When you pass by my ashes during your walk
In that rainy moonlight, wet with my tears
You will hear my voice again
whispering in your ears
Somewhere, sometime, we surely will meet again
Till then, I remain here
as a flower, as a breeze in our garden of love

Whether I remain here or not, my fragrance will remain
Like a flower, like a breeze in our garden of love

తెలుగు స్వేచ్చానువాదం

నేనున్నా లేకపోయినా
నా సుగంధం ఇక్కడే ఉంటుంది
ఒక పువ్వులా ఒక చిరుగాలిలా
మన ప్రేమవనం లోనే అదెప్పుడూ ఉంటుంది

ఈ తోటలో ఏ ఋతువు ఉన్నా
ఈ గాలికి గాలినై నేను దానికి వెలుగును తెస్తాను
అది వసంతమైనా శిశిరమైనా
మన ప్రేమ సుగంధం నా కురుల నుంచి
ఈ తోటలో వ్యాపిస్తూనే ఉంటుంది
ఒక పువ్వులా ఒక చిరుగాలిలా
నేనిక్కడ వికసిస్తూ వీస్తూ ఉంటాను

నేను నీ ప్రేమలో ఎంతగా మైమరచి పోయానంటే
కలయికా ఎడబాటూ అనేవి నాకసలు గుర్తే లేవు
నువ్వు నా హృదయపు వీధులలో
అడుగు పెట్టిన రోజునుంచీ
నాకు ప్రేమ తప్ప ఇంకో లోకం తెలీదు
ఒక పువ్వులా ఒక చిరుగాలిలా మారి
ఆ ప్రేమలోకంలోనే నేనుంటాను

నేను పోయాక
నా చితాభస్మం పక్కగా నువ్వు నడిచినప్పుడు
కన్నీటితో తడిసిన వర్షాకాలపు వెన్నెలలో
నా స్వరం నీకు మళ్ళీ వినవస్తుంది
ఎక్కడో ఎప్పుడో తప్పకుండా మనం మళ్ళీ కలుసుకుంటాం

నేనున్నా లేకపోయినా
నా సుగంధం ఇక్కడే ఉంటుంది
ఒక పువ్వులా ఒక చిరుగాలిలా
మన ప్రేమవనం లోనే అదెప్పుడూ ఉంటుంది
read more " Rahe Na Rahe Hum - Lata Mangeshkar "

Tae Kwon Do Grand Master Jhoon Rhee - Astro analysis














"A picture is worth a 1000 words; an action is worth a 1000 pictures;" -- Grand Master Jhoon Rhee, 10th degree black belt, Tae Kwon Do

Tae Kwon Do సర్కిల్స్ లో ఝూన్ రీ పేరు తెలియని వారుండరు. ఈయనా బ్రూస్లీ మంచి ఫ్రెండ్స్. బ్రూస్లీ అందరికీ తెలుసు. కానీ ఈయన టైక్వాన్ డో సర్కిల్స్ లో మాత్రమే తెలుసు. బ్రూస్లీ వాడే హైకిక్స్ అన్నీ ఝూన్ రీ దగ్గర నేర్చుకున్నవేనని, అవి కుంగ్ ఫూ కిక్స్ కావని, టైక్వాన్ డో కిక్స్ అనీ తెలిస్తే మీకు ఆశ్చర్యం కలుగుతుంది.

ఉదాహరణకు, Return of the Dragon సినిమాలో, చక్ నారిస్ కూ బ్రూస్లీకీ జరిగే కోలోజియం ఫైట్ లో, బ్రూస్లీ వాడినవి అన్నీ టైక్వాన్ డో కిక్సే. అతను చేసినది కుంగ్ ఫూ కాదు. తన పర్సనల్ స్టైల్ అయిన Jeet Kune Do మరియు టైక్వాన్ డో కలిపి ఆ సీన్లో బ్రూస్లీ వాడాడు.

ఝూన్ రీ జనవరి 7 - 1932 న సౌత్ కొరియా లోని Asan అనే ఊళ్ళో పుట్టాడు. 30-4-2018 న అమెరికాలోని వర్జీనియా స్టేట్,  ఆర్లింగ్ టన్ లో తన 86 వ ఏట చనిపోయాడు. ఈయనకు Father of American Tae Kwon Do అనే పేరుంది. ఈయన 1960 లలో అమెరికాకు వలస వచ్చాడు. Washinton DC లో తన మొదటి స్కూల్ పెట్టాడు. తర్వాత అదే రాష్రంలో అనేక స్కూల్స్ స్థాపించాడు. క్రమేణా సెలబ్రిటీ అయ్యాడు.

నేను స్వతహాగా టైక్వోన్ డో అభ్యాసిని కాను. కానీ అందులోని "కార్ట్ వీల్ కిక్" లాంటి కొన్ని కిక్స్ అంటే నాకున్న ఇష్టం వల్ల వాటిని నేర్చుకుని నా పర్సనల్ స్టైల్లోకి తీసుకున్నాను. నాకు ప్రత్యేకంగా ఒక మార్షల్ ఆర్ట్ అంటే ఇష్టమూ ఇంకొకటంటే ద్వేషమూ ఏమీ లేవు. Take everything that is useful అనే బ్రూస్లీ సూక్తిని నేను పాటిస్తాను. అందుకని రకరకాల మార్షల్ ఆర్ట్స్ లోనుంచి నేను అనేక టెక్నిక్స్ నేర్చుకుని వాటిని కలగలిపి వాడుతూ ఉంటాను.

టైక్వోన్ డో అనేది కొరియన్ మార్షల్ ఆర్ట్. దీనిలో 80% కిక్స్, 20 % పంచెస్ ఉంటాయి. ప్రధానంగా ఇది హైకిక్స్ ని ఎక్కువగా వాడే ఆర్ట్.

గ్రాండ్ మాస్టర్ ఝూన్ రీ జాతకాన్ని గమనిద్దాం. ఈయన పుట్టిన సమయం తెలియదు. కనుక మన పద్ధతులు ఉపయోగిద్దాం. ఇతని జాతకంలో కుజుడు ఆత్మకారకుడయ్యాడు. కుజుడు ఆత్మకారకుడైతే లేదా జాతకంలో బలంగా ఉంటే, అతనికి వీరవిద్యలు గాని, వ్యాయామాలు గాని చెయ్యడం వస్తుంది. మార్షల్ ఆర్ట్స్ వీరుల జాతకాలలోనూ, బాక్సింగ్ వీరుల జాతకాలలోనూ, కుజుడు బలంగా ఉండటం గమనించవచ్చు. ఎందుకంటే కుజుడు యుద్ధప్రియుడు. Red planet, Planet of War అని ఇతనికి పేర్లున్నాయి.

కారకాంశ ధనుస్సు అయింది. చంద్రలగ్నం కూడా ధనుస్సే అయింది. సూర్యలగ్నం కూడా ధనుస్సే అయింది. కనుక ఇతని జాతకంలో ధనుస్సుకు ప్రాధాన్యత ఎక్కువగా ఉన్నది. ఇతను అమావాస్య రోజున పుట్టాడు.

లగ్నంలో నవమాధిపతి అయిన సూర్యుడు ఉండటంతో ఈయన అమెరికాలో స్థిరపడ్డాడు. అష్టమస్థానం యుద్ధాన్నీ మరణాన్నీ గాయాలనూ సూచిస్తుంది. అష్టమాదిపతి అయిన చంద్రుడు కూడా లగ్నంలో ఉండటమూ, అదికూడా వీరవిద్యలకు అధిపతి అయిన కుజునితో కలసి ఉండటమూ ఈయనను టైక్వాన్ డో గ్రాండ్ మాస్టర్ని చేశాయి. అష్టమంలో గురువు వక్రించి ఉండటమూ, శరీర శ్రమకూ, కష్టాన్ని ఓర్చుకోవడానికీ కారకుడైన శని అష్టమాన్ని చూస్తూ ఉండటమూ, ఆ శని షష్ఠస్థానాధిపతి అయిన శుక్రునితో కలసి ఉండటమూ గమనిస్తే ఈయనకు వీరవిద్యలు ఎందుకు పట్టుబడ్డాయో అర్ధమౌతుంది.

1964 లో California లో జరిగిన Ed Parker's Long Beach Karate Championship Event లో మొదటి సారిగా బ్రూస్లీ, ఝూన్ రీని కలిశాడు. అక్కడ వాళ్ళిద్దరూ మంచి ఫ్రెండ్స్ అయ్యారు. అప్పటి వరకూ బ్రూస్లీ తన Wing Chun Style లో ఉన్న హ్యాండ్ టెక్నిక్స్ ఎక్కువగా వాడేవాడు. కానీ ఆ తర్వాత అతను ఝూన్ రీ దగ్గర Kicks నేర్చుకున్నాడు. తర్వాత తర్వాత బ్రూస్లీ డెవలప్ చేసిన Jeet Kune Do లో బేసిక్ టెక్నిక్ గా ఝూన్ రీ దగ్గర నేర్చుకున్న Side Kick ను తీసుకున్నాడు. ఈ విధంగా బ్రూస్లీ కిక్స్ వెనుక ఝూన్ రీ శిక్షణ ఎంతో ఉంది. ఈ సంగతి చాలా మందికి తెలియదు. ఇక్కడ ఝూన్ రీ, బ్రూస్లీ ఇద్దరూ చేస్తున్న సైడ్ కిక్ ను గమనిస్తే ఈ సంగతి తేలికగా అర్ధమౌతుంది. ఇది టైక్వాన్ డో కిక్ మాత్రమే, కుంగ్ ఫూ లో ఇలాంటి కిక్స్ ఉండవు. అవి వేరుగా ఉంటాయి.

అంతేకాదు. మహమ్మద్ ఆలీకి Accu Punch అనేదాన్ని నేర్పించింది Jhoon Rhee అనే సంగతీ చాలామందికి తెలియదు. బహుశా దీనిని Jhoon Rhee, బ్రూస్లీ దగ్గర నేర్చుకుని ఉండవచ్చు. ఎందుకంటే Tai Kwon Do లో పంచెస్ కి అంత ప్రాధాన్యత ఉండదు. కానీ బ్రూస్లీ నేర్చుకున్న Wing Chun Kung Fu లో ఎక్కువగా పంచెస్ నే వాడతారు. వింగ్ చున్ సిస్టంలో హైకిక్స్ కి ప్రాధాన్యత ఉండదు. ఉంటేగింటే,  లోకిక్స్ ఉంటాయి లేదా బెల్ట్ లెవల్ కిక్స్ ఉంటాయి. అంతే. ఆ విధంగా Accu Punch అనేది బ్రూస్లీ నుంచి, ఝూన్ రీ ద్వారా, మహమ్మద్ అలీకి చేరింది. 1975 లో ఈ పంచ్ ని ఉపయోగించే, UK Heavy Weight Boxing Champion Richard Dunn ని మట్టి కరిపించానని అలీ చెప్పేవాడు.

మార్షల్ ఆర్ట్ అనేది, అది ఏ రకమైన మార్షల్ ఆర్ట్ అయినా సరే, ఊరకే రాదు. ప్రతిరోజూ బద్దకాన్ని వదల్చుకుని కఠోరంగా శ్రమిస్తేనే దానిలో మాస్టరీ వస్తుంది. 86 ఏళ్ళ వయసులో కూడా ఝూన్ రీ ప్రతిరోజూ క్రమం తప్పకుండా మూడు గంటలు ప్రాక్టీస్ చేసేవాడంటే అర్ధం చేసుకోండి మరి అతనికి 10th Degree Black Belt ఎలా వచ్చిందో? అతను అమెరికాలో అంత సెలబ్రిటీ ఎలా అయ్యాడో?

జాతకంలో కుజుడూ శనీ బలంగా ఉన్నప్పుడు కష్టపడే తత్త్వమూ పట్టుదలా అవే వస్తాయి. అలాంటి వాళ్ళకే మార్షల్ ఆర్ట్స్ పట్టుబడతాయి.
read more " Tae Kwon Do Grand Master Jhoon Rhee - Astro analysis "

నర - హరి

మనుషుల మనస్తత్వాలను గమనిస్తూ ఉంటె నాకు భలే నవ్వొస్తూ ఉంటుంది. అదే సమయంలో విపరీతమైన జాలీ కలుగుతూ ఉంటుంది 'వీళ్ళెప్పటికి ఎదుగుతారా?' అని.

మొన్నొకాయన ఫోన్ చేశాడు.

'ఏమండి? నా పేరు నరహరి. మీరు చెప్పిన దక్షిణామూర్తి స్తోత్రం ఆడియో ఫైల్స్ నేను విన్నాను.' అన్నాడు ఎత్తుకుంటూనే, అదేదో నన్ను ఉద్ధరిస్తున్నట్టు !

అతని గొంతు వింటే, ఏదో వాదన పెట్టుకునేలా అనిపించింది.

'సరే ఏంటో చెప్పండి' అన్నాను.

'విషయం బాగానే ఉందిగాని మీరు చెప్పిన తీరు నాకు నచ్చలేదు.' అన్నాడు.

విషయం నాకర్ధమై పోయింది.

'అంటే, దక్షిణామూర్తి స్తోత్రం అంటే మీకు ఇష్టమే గాని, నేను మీకు నచ్చలేదు అంతేకదా?' అన్నాను.

'అవును' అన్నాడు.

'పోనీలెండి ఇంకో సంబంధం వెతుక్కుంటాను. నన్ను మెచ్చే పిల్ల ఎక్కడో పుట్టే ఉంటుంది' అన్నాను నవ్వుతూ.

నేను జోక్ చేస్తున్నానని అతనికి అర్ధమైంది.

'అదే ! ఈ జోకులే మాకు నచ్చంది.' అన్నాడు.

'దానికి నేనేం చేసేది? అది నా స్వభావం. మీరూ నాకు నచ్చలేదు. కొత్తవాళ్ళతో ఇంత రూడ్ గా మాట్లాడుతున్న మీ పద్ధతి కూడా నాకు నచ్చలేదు. ఏం చేద్దాం?' అన్నాను.

'అంత సీరియస్ సబ్జెక్ట్ ని సరదాగా, జోకులేస్తూ చెబుతున్నారు. పైగా, మీ ఉపన్యాసం వింటున్నవాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తూ నవ్వుతున్నారు. అది తప్పు కదా?' అడిగాడు సీరియస్ గా.

'నవ్వడం తప్పా? ఇదేంటి కొత్తగా వింటున్నానే? నవ్వమనీ, మనస్ఫూర్తిగా నవ్వితే ఆరోగ్యానికి మంచిదనీ అందరూ చెబుతున్నారు. మీకేంటి నవ్వు నచ్చడం లేదు. మీకేదైనా సీరియస్ మానసిక రోగం ఉందేమో చెక్ చేయించుకోండి' అన్నాను.

'ఆధ్యాత్మిక విషయాలు చెప్పేటప్పుడు సీరియస్ గా చెప్పాలి. మీరేదో కామెడీగా చెబుతున్నారు.' అన్నాడు మళ్ళీ.

'ఏం కొంపలు మునిగాయని అంత సీరియస్ గా ఉండాలి? ఆధ్యాత్మికమంటే సీరియస్ అని మీకెవరు చెప్పారు?' అడిగాను.

'మాకు తెలుసు. మా గురువుగారు చెప్పారు' అన్నాడు.

'మీ గురువుగారికి నవ్వడం అంటే పడదా?' అడిగాను.

'ఆయన నవ్వగా నేనెప్పుడూ చూడలేదు. మేం నవ్వినా కూడా ఆయన ఒప్పుకోడు.' అన్నాడు.

'ఓహో. ఒక పని చెయ్యండి. మీ గురువూ, మీ బృందమూ అందరూ కలసి ఒక సైకియాట్రిస్ట్ ని కలవండి. ఇదొక మానసిక రోగం. ఇతరులు నవ్వితే భరించలేకపోవడం చాలా పెద్ద రోగం. మీకు తెలీడం లేదు. ముందు మంచి ట్రీట్మెంట్ తీసుకోండి. ఆ తర్వాత నాకు ఫోన్ చేద్దురుగాని' అన్నాను ఫోన్ పెట్టెయ్యబోతూ.

'ఆగండి. ఫోన్ పెట్టకండి. ఇంకా మాట్లాడాలి.' అన్నాడు సీరియస్ గా.

'చెప్పండి' అన్నాను.

'సీరియస్ సబ్జెక్ట్ ని సీరియస్ గా చెప్పకపోతే ఎలా? మీకసలు ఆ సబ్జెక్ట్ ఎంత అర్ధమైంది?' అన్నాడు ఇంకా సీరియస్ గా.

విషయం ముదురుతోందని, ఏదో విధంగా నన్ను ఇన్సల్ట్ చెయ్యడమే ఇతని ఉద్దేశమని నాకర్ధమైంది.

'అంతా విన్నానని మీరే చెప్పారు కదా ! అవన్నీ విన్న తర్వాత కూడా నాకెంత అర్ధమైందో మీకర్ధం కాలేదా?' అడిగాను.

'దీన్నే దురహంకారం అంటారు' అన్నాడు ఎగతాళిగా.

'అవునా? మరి ఫ్రీ గా ఒకరు పెట్టిన ఆడియో ఫైల్స్ అన్నీ చక్కగా విని, అతనికి ఫోన్ చేసి, కనీస కృతజ్ఞతలు చెప్పకుండా, డైరెక్ట్ గా 'మీరు చెప్పినది మాకు నచ్చలేదు' అనేవాళ్ళను ఏమంటారు? అది దురహంకారం కాదా?' అన్నాను.

'నా అభిప్రాయం నేను చెప్పాను ' అన్నాడు దురుసుగా.

'సరే. నా అభిప్రాయం కూడా చెప్పమంటారా మరి?' అన్నాను.

'చెప్పండి' అన్నాడు.

'చింపాంజీలకు దక్షిణామూర్తి స్తోత్రం ఎలా అర్ధమౌతుంది?' అన్నాను.

'అదేంటి?' అన్నాడు అయోమయంగా.

'మీరు చింపాంజీ కదా? మీకు వేదాంతం అర్ధం కాదని అంటున్నాను' అన్నాను.

'ఏంటి మీరు మాట్లాడేది?' అన్నాడు కోపంగా.

'కోపం తెచ్చుకోకండి. మీ పేరు నరహరేగా?' అడిగాను.

'అవును' అన్నాడు.

'మీ పేరు అర్ధమే మీకు తెలీదు. ఇక దక్షిణామూర్తి స్తోత్రం ఎలా అర్ధమౌతుంది మీలాంటి మట్టిబుర్రలకు?' అన్నాను.

'ఏం మాట్లాడుతున్నారు మీరు?' అన్నాడు అరుస్తూ.

'తగ్గండి. చెప్తా వినండి. నరహరి అంటే ఏమిటి?' అన్నాను.

'నరసింహస్వామి' అన్నాడు.

'పోనీ అలా అనుకున్నా కూడా, మీలో మృగం లక్షణాలు కొన్ని ఉన్నాయని అర్ధం. మృగాలకు వేదాంతం ఎలా అర్ధమౌతుంది? ఎంతో రిఫైండ్ మైండ్స్ కి కాని అది అర్ధం కాదు. ఇంకో అర్ధం చెబుతా వినండి. నర అంటే మనిషి. హరి అంటే కోతి అని సంస్కృతంలో అర్ధం. అంటే మనిషికి తక్కువ కోతికి ఎక్కువ అనర్ధం. అంటే చింపాంజీ అనే కదా? ఇక మీకు దక్షిణామూర్తి స్తోత్రం ఎలా అర్ధమౌతుంది? దానిని ఎలా చెప్పాలో ఎలా అర్ధం చేసుకోవాలో ఎలా తెలుస్తుంది?

సీరియస్ సబ్జెక్ట్ ని సరదాగా చెప్పడమే అసలైన టాలెంట్. సామాన్యంగా ఇలాంటి ఉపన్యాసాలు వినేవాళ్ళు నిద్రపోతూ ఉంటారు. కానీ ఇక్కడ, వినేవాళ్ళు నవ్వుతున్నారంటే వాళ్ళు సబ్జెక్ట్ ని బాగా ఎంజాయ్ చేస్తున్నారన్నమాట. అంటే, వాళ్లకు బాగా అర్ధమౌతోందన్న మాట. ఇంత సింపుల్ విషయం అర్ధం కాని మీరేమో అదేదో తప్పుగా అనుకుంటూన్నారు. అది చాలక నాకు ఫోన్ చేసి మీ అజ్ఞాన ప్రదర్శన చేస్తున్నారు. పైగా నాది తప్పంటున్నారు. నవ్వడం తప్పంటున్నారు. మీరు అర్జెంటుగా పేరైనా మార్చుకోండి, లేదా మీ అభిప్రాయమైనా మార్చుకోండి. లేదా ఎవడో ఒక పిచ్చి డాక్టరు దగ్గర మంచి ట్రీట్మెంట్ అయినా తీసుకోండి. ఏదో ఒకటి త్వరగా చెయ్యండి. అంతేగాని నాకిలా ఫోన్ చేసి నా టైం వెస్ట్ చెయ్యకండి.' అన్నాను.

'మీరు తెలివైనవారనీ, నా మాటకు ఒప్పుకోరనీ మాకు తెలుసు. ఈ విషయంలో ముఖాముఖీ వాదనకు మీరు సిద్ధమేనా?' అడిగాడు.

'ఇందులో వాదనతో తేలేది ఏముంది?' అడిగాను.

'మీరు చెప్పేది తప్పని రుజువు చేస్తాను. అంతేకాదు. మీ శిష్యులను మీరు తప్పుదారి పట్టిస్తున్నారు. ఇంతకీ మీరు వాదనకు సిద్ధమేనా?' అడిగాడు.

'ముఖాముఖీ వాదనకే కాదు, హాండ్ టు హాండ్ ఫైటింగ్ కైనా నేను సిద్ధమే. డేట్, వెన్యూ మీ ఇష్టం. నిర్ణయించుకుని నాకు చెప్పండి. నా మార్షల్ ఆర్ట్స్ టెక్నిక్స్ గుర్తున్నాయో మర్చిపోయానో ఒకసారి ప్రాక్టికల్ గా టెస్ట్ చేసుకోవాలని నాకు మహా దురదగా ఉంది. ఎప్పుడు ఫోన్ చేస్తారు మరి?' అడిగాను.

అవతల నుంచి నిశ్శబ్దం.

నవ్వుకుంటూ ఫోన్ కట్ చేశాను.

ఆధ్యాత్మిక ప్రపంచంలో కూడా జెలసీ, ఈగోలే ఎక్కువగా ఉంటాయని, ఓపన్ మైండ్ అనేది ఎక్కడో తప్ప ఉండదనీ, ఇలాంటి మనుషులను చూస్తుంటే అర్ధం కావడం లేదూ?
read more " నర - హరి "