“There are many who just talk, but very very few who really realize" - Self Quote

25, జులై 2017, మంగళవారం

Roshan Tumhee Se Duniya - Mohammad Rafi


Roshan tumhi se duniya – Ronak tumhi jahaa ki

అంటూ మహమ్మద్ రఫీ మధురాతి మధురంగా ఆలపించిన ఈ గీతం 1963 లో వచ్చిన "Paras Mani" అనే సినిమాలోది. లక్ష్మీకాంత్ - ప్యారేలాల్ కు సంగీత దర్శకులుగా ఇది మొదటి సినిమా. మొదటి సినిమాలోనే అద్భుతమైన సంగీతాన్ని అందించి ఇద్దరూ మంచిపేరు తెచ్చుకున్నారు. ఈ సినిమాలోని పాటలన్నీ హిట్లే.

రఫీ పాటల్లో చాలా ఆరోహణ అవరోహణలుంటాయి. చాలా సున్నితమైన విరుపులుంటాయి. వాటిని పూర్తిగా పాడటం చాలా కష్టం. కనీసం 80 % పాడితే బాగా పాడినట్లే. పైగా ఇది 'పహాడీ' అనే శాస్త్రీయ హిందూస్తానీ రాగం బేస్ అయినట్టి పాట. దీనికి నేను చాలా వరకూ న్యాయం చేశాననే అనుకుంటున్నాను. ఈ పాటలోని ఆలాపన చాలా మంద్రంగా మధురంగా ఉంటుంది.

ఇది కూడా ప్రియురాలి అందాన్ని వర్ణిస్తూ సౌందర్యారాధనతో సాగే పాటే. ఈ ప్రియురాలు ఎవరు? ఈమె మానవ వనిత కాదు. ఒక అప్సరస. అందుకే ఆమె అందం అంత మనోహరంగా ఉంటుంది.


తంత్రశాస్త్రంలో అప్సరసా సాధనలున్నాయి. రంభా, ఊర్వశీ, మేనక, తిలోత్తమ, పుష్పదేహ,ఘ్రుతాచి, పూర్వచిత్తి, స్వయంప్రభ, మిశ్రకేశి,దండగౌరి, వరూధిని, గోపాలి, సహజన్య, కుంభయోని, ప్రజాగర, చిత్రసేన, చిత్రలేఖ, మధుమతి, స్నేహవల్లి, మధురాశ్వాన, కోలముఖి, విద్యాధరి, సురసుందరి మొదలైన వేలాదిమంది అప్సరసలున్నట్లు మన పురాణాలు చెబుతున్నాయి. వీరిలో చాలామందికి తంత్రశాస్త్రంలో మంత్రాలున్నాయి.

ఆయా సాధనలు చేస్తే వారు ప్రత్యక్షమై సాధకునికి వశమై అతనికి స్వర్గసుఖాలు ఇవ్వడం నిజమే. ప్రాచీనకాలంలో ఎందుకు? నేటికీ ఈ సాధనలు చేసినవాళ్ళూ చేస్తున్నవాళ్ళూ మన దేశంలోనే ఉన్నారు. ఇవి అబద్దాలూ, హెలూసినేషన్సూ కావు. నిజాలే. అయితే ఇవి రహస్య సాధనలు గనుక అందరికీ తెలిసేటట్లు బజారులో దొరకవు. ఈ అప్సరసల అందాన్ని చూచిన సాధకునికి ప్రపంచంలో ఇక ఏ అమ్మాయీ నచ్చదు. వీళ్ళు అంత అందంగా ఉంటారు.

ఈ పాటను వ్రాసిన కవి ఇలాంటి అప్సరసను, ముఖ్యంగా 'పుష్పదేహ' అప్సరసను దృష్టిలో ఉంచుకుని ఈ పాటను వ్రాశాడని నా అనుమానం.

నా స్వరంలో కూడా ఈ పాటను వినండి మరి...

Movie:-- Paras Mani (1963)
Lyrics:-- Indeevar
Music:-- Laxmikant Pyarelal
Singer:-- Mohammad Rafi
Karaoke Singer:-- Satya Narayana Sarma
Enjoy
-----------------------------------------------------
aaaa... aaaa... aaaa...

Roshan tumhi se duniya – Ronak tumhi jahaa ki
Phoolo me palne vaali – Rani ho gul sithaa kee
Salamat raho … Salamat raho … Salamat raho

o..o..o..ooo
Naazuk ho naaj se bhi – Tum pyar se bhi pyari
Tum husn se hasee ho – Kya baat hai tumhaari
Kya baat hai tumhaari
Aakho me do jahaa hai – Maalik ho do jahaa kee
Salamat raho … Salamat raho … Salamat raho

aaaa.....aaaa.....aaaa

o..o..o..ooo
[Dil chahe toot jaaye – Mere dilse yoo hi khelo] - 2
Jeethe rahee Yuhee tum – Meree bhi umr lelo
Meree bhi umr lelo
Kis din duvaa na maangee – Hamne tumhari jaaki
Salamat raho … Salamat raho

Meaning

Because of you the world is brilliant
You are the light of the world
Your bed is that of flowers
You are the queen of bloomed roses
Be happy always, be happy

You are softer than softness
More lovable than love
Beautiful than beauty itself
What a lovely girl you are !!
There are two worlds in your eyes
and you are the queen of both Heaven and Earth

Let my heart break into pieces
but you play with it always
Take my life if you want
and live long
My day never passes
without praying for your well being

Because of you the world is brilliant
You are the light of the world
Your bed is that of flowers
You are the queen of bloomed roses
Be happy always, be happy...

తెలుగు స్వేచ్చానువాదం

నీ వల్లే లోకంలో వెలుగు ఉంది
నువ్వే లోకానికి దీపానివి
పూలమీద నువ్వు విశ్రమిస్తావు
నిజానికి నువ్వు గులాబీల రాణివి

నీవు మెత్తదనం కంటే మెత్తనిదానవు
ప్రేమకంటే ఎక్కువ ప్రేమమయివి
సౌందర్యం కంటే అందమైనదానివి
ఎంత అందం నీది?
నీ కళ్ళలో రెండు లోకాలున్నాయి
నీవు భూమికీ స్వర్గానికీ రాణివి

నా హృదయం పగిలి ముక్కలైపోనీ
కానీ నువ్వు దానితో ఆడుకోవాలి
కావాలంటే నా ఆయుస్సు కూడా తీసుకో
చిరకాలం జీవించు
నీ అనుగ్రహం కోసం ప్రార్ధించకుండా
నాకు రోజు గడవడం లేదు

నీ వల్లే లోకంలో వెలుగు ఉంది
నువ్వే లోకానికి దీపానివి
పూలమీద నువ్వు విశ్రమిస్తావు
నిజానికి నువ్వు గులాబీల రాణివి
read more " Roshan Tumhee Se Duniya - Mohammad Rafi "

24, జులై 2017, సోమవారం

నిత్య జీవితం - 2

ఈరోజూ రేపూ ఏం జరుగుతుంది?
-------------------------------------------

విలువైన వస్తువులు పోగొట్టుకుంటారు.

పోలీస్ స్టేషన్లు దర్శిస్తారు. లేదా పోలీసులను కాంటాక్ట్ చేస్తారు.

సెక్సు కోరికలు నిద్రలేస్తాయి లేదా హెరాస్ మెంట్ కు గురౌతారు.

మెంటల్ టెన్షన్ ఎక్కువౌతుంది.

ఇంట్లో వాళ్ళతోనూ బయట వాళ్ళతోనూ గొడవలౌతాయి.
read more " నిత్య జీవితం - 2 "

23, జులై 2017, ఆదివారం

గుండెనిండా గుడిగంటలు - ఎస్.పీ.బాలసుబ్రమణ్యం


'గుండెనిండా గుడిగంటలు' అంటూ బాలసుబ్రమణ్యం తనదైన శైలిలో మధురంగా ఆలపించిన ఈ గీతం 1998 లో వచ్చిన 'శుభాకాంక్షలు' అనే చిత్రంలోది. ఈ పాటను సిరివెన్నెల సీతారామ శాస్త్రి వ్రాయగా, కోటి సంగీతాన్ని అందించారు.

నా స్వరంలో కూడా ఈ పాటను వినండి మరి.
------------------------------------------------

గుండె నిండా గుడిగంటలు – గువ్వల గొంతులు – ఎన్నో మోగుతుంటే
కళ్ళ నిండా సంక్రాంతులు – సంధ్యా కాంతులు – శుభాకాంక్షలంటే
వెంటనే పోల్చాను నీ చిరునామా ప్రేమా
గుండె నిండా గుడిగంటలు – గువ్వల గొంతులు – ఎన్నో మోగుతుంటే
కళ్ళ నిండా సంక్రాంతులు – సంధ్యా కాంతులు – శుభాకాంక్షలంటే

చూస్తూనే మనసు వెళ్లి నీ ఒళ్లో వాలగా
నిలువెల్లా మారిపోయా నేనేనీ నీడగా
నిలువదు నిముషం – నువు ఎదురుంటే
కదలదు సమయం – కనబడకుంటే
నువ్వొస్తూనే ఇంద్రజాలం చేశావమ్మా- కవ్విస్తూనే చంద్రజాలం వేశావమ్మా
పరిచయమే చేశావే నన్నే నాకు కొత్తగ ఓ ప్రేమా
గుండె నిండా గుడిగంటలు – గువ్వల గొంతులు – ఎన్నో మోగుతుంటే
కళ్ళ నిండా సంక్రాంతులు – సంధ్యా కాంతులు – శుభాకాంక్షలంటే

నీ పేరే పలవరించే నాలోని ఆశలు
మౌనాన్నే ఆశ్రయించే ఎన్నెన్నో ఊసులు
తెరిచిన కనులే - కలలకు నెలవై
కదలని పెదవే - కవితలు చదివే
ఎన్నెన్నెన్నో గాధలున్న నీ భాషని – ఉన్నట్టుండి నేర్పినావె ఈ రోజుని
నీ జతలో క్షణమైనా బ్రతుకును చరితగ మార్చేస్తుందమ్మా

గుండె నిండా గుడిగంటలు – గువ్వల గొంతులు – ఎన్నో మోగుతుంటే
కళ్ళ నిండా సంక్రాంతులు – సంధ్యా కాంతులు – శుభాకాంక్షలంటే
వెంటనే పోల్చాను నీ చిరునామా ప్రేమా
read more " గుండెనిండా గుడిగంటలు - ఎస్.పీ.బాలసుబ్రమణ్యం "

22, జులై 2017, శనివారం

పాశుపతాస్త్రం

చిన్న వయసులోనే సెటిలైపోతున్న జీవితాలూ, చేతిలో ఆడుతున్న డబ్బూ, దానికి తోడు వేలం వెర్రిగా విస్తరిస్తున్న విదేశీ సంస్కృతీ కలిసి ఎలా వెర్రి తలలు వేస్తున్నాయో అనడానికి ఈ మధ్య నాకొచ్చిన ఈ ఫోన్ కాలే ఉదాహరణ.

ఒక రోజు మధ్యాన్నం పూట ఫోన్ మ్రోగుతుంటే 'హలో' అన్నా.

'నేను నరసింహారావును మాట్లాడుతున్నా' అంది అవతల నుంచి ఒక స్వరం.

'ఎవరి కోసం?' అడిగా.

'సత్యనారాయణ శర్మగారేనా?' అంది అవతలనుంచి.

'అవును.చెప్పండి' అన్నా.

'నేను మీ బ్లాగ్ రెగ్యులర్ గా చదువుతూ ఉంటా. నాకొక జీవన్మరణ సమస్య వచ్చింది.అందుకే మీకు ఫోన్ చేస్తున్నా.' అంది స్వరం.

'అదేంటి? అలాంటి సమస్యలొస్తేగాని నేను గుర్తు రానా?' అందామని నోటిదాకా వచ్చింది గాని, అవతలాయన ఏదో సమస్య అంటుంటే నేను జోకులెయ్యడం బాగోదని మింగేసి 'ఏంటది' అన్నా.

'ఎలా చెప్పాలో అర్ధం కావడం లేదు.' అన్నాడాయన.

'మీకే అర్ధం కాకపోతే ఇక నాకెలా అర్ధమౌతుంది? ముందు మీరు అర్ధం చేసుకుని ఆ తర్వాత తీరిగ్గా ఫోన్ చెయ్యండి' అన్నా కట్ చేయ్యబోతూ.

'ఆగండాగండి. కట్ చెయ్యకండి. మా అమ్మాయి ప్రేమలో పడింది' అన్నాడు.

'ఏదో బురదలో పడింది అన్నట్లు చెబుతున్నారేంటి? ఈ రోజుల్లో ఇది మామూలేగా? ప్రతి ఇంట్లోనూ ఈ కధలు వింటున్నాం. పెళ్లి చేసెయ్యండి.' అన్నా.

'అదే కుదరదు' అన్నాడాయన.

'ఏం ఎందుకని?' అడిగా నేను.

'ఆ అబ్బాయి మా అమ్మాయికి అన్నయ్య వరస అవుతాడు. మా బంధువులే.' అన్నాడు.

'హతోస్మి' అనుకుంటూ 'మరి ఇన్నాళ్ళూ మీరేం చేస్తున్నారు?' అడిగాను కొంచం కరుకుగానే.

'నేనూ మా ఆవిడా ఇద్దరమూ వర్కింగే. ఇద్దరం ఆఫీసులకు పోతాం. మా అమ్మాయి కాలేజీకి పోతుంది. చివరకు ఇదైంది.' అన్నాడు.

'పోనీలెండి ఇంకేదో కాకుండా ఇదొక్కటే అయింది. సంతోషించండి. నా సలహా ఒక్కటే. మీకు చేతనైతే నచ్చచెప్పి మీ అమ్మాయి మనసు మార్చండి. లేదా అతనితోనే పెళ్లి చేసెయ్యండి.' అన్నాను.

'అదేంటి సార్ ! ఇలాంటి తప్పుడు సలహా ఇస్తారు?' అన్నాడాయన కోపంగా.

నాకు తిక్క రేగింది.

'మీ అమ్మాయి చేసింది మంచి పనీనూ నేనిచ్చేది తప్పుడు సలహానా? వాళ్ళిద్దరూ మేజర్లేనా?' అడిగాను.

' ఆహా! ఇద్దరూ బీ టెక్కులు అయిపోయి క్యాంపస్ సెలక్షన్స్ లో ఉద్యోగాలు వచ్చి ఒకరు చెన్నైలో ఇంకొకరు బెంగుళూరులో ఉద్యోగాలు వెలగబెడుతున్నారు.' అన్నాడు.

'మరి ఈ ప్రేమ ఎప్పుడు మొదలైంది?' అడిగాను.

'ఏమో తెలీదు. కాలేజీలోనే మొదలైనట్టుంది. కలిసి తిరిగేవాళ్ళు. అన్నా చెల్లెళ్ళు కదా అని మేమూ చూసీ చూడనట్లు ఉండేవాళ్ళం. ఇప్పుడేమో పెళ్లి దాకా వచ్చారు.' అన్నాడు.

'సరే నన్నేం చెయ్యమంటారో చెప్పండి' అన్నాను.

'మీకు జ్యోతిష్యమూ మంత్ర తంత్రాలూ వచ్చు కదా. ఏదో ఒకటి చేసి అతనంటే మా అమ్మాయి మనసు విరిగిపోయేటట్లు చెయ్యాలి.' అన్నాడు.

'ఓహో అదా సంగతి' అనుకుని, 'సరే చేస్తాను. పది లక్షలౌతుంది.' అన్నా ప్రొఫెషనల్ కిల్లర్ లా ఫీలైపోతూ.

'అది చాలా ఎక్కువ సార్. ఏదో ఒకటి రెండు లక్షలైతే ఇవ్వగలం. మేము అంత డబ్బున్న వాళ్ళం కాదు. మిడిల్ క్లాస్.' అన్నాడు.

'సరే మీ ఇష్టం. దానికి తక్కువైతే నేనేం చెయ్యలేను.' అన్నాను.

' సరే సార్. ఏదో రకంగా సెటిల్ చేస్తాను. మీ ప్లాన్ ఏంటో ముందు చెప్పండి. రిజల్ట్ ఖచ్చితంగా కనిపించాకే డబ్బిస్తాం.' అన్నాడు.

' అలా కుదరదు. ముందు ఫిఫ్టీ పర్సెంట్ ఇవ్వాలి. పని పూర్తయ్యాక మిగతా సగం ఇవ్వాలి.' అన్నా నేను మాఫియా దాదా టైపులో.

'సరే. చెప్పండి.ఇంతకీ మీరేం చేస్తారో?' అన్నాడు తను అయిష్టంగా.

' పాశుపతాస్త్రం అని ఒకటుంది దానిని ప్రయోగించాలి.' అన్నా వస్తున్న నవ్వునాపుకుంటూ.

అవతల నుంచి ఒక కేక వినిపించింది.

'పాశుపతాస్త్రం ఆల్రెడీ అయిపోయింది సార్.' అంది స్వరం.

'ఓహో ! అన్నీ అయ్యాక నా దగ్గరికి వస్తున్నావా?' అని మనసులో అనుకోని ' 'ఏంటి మీరనేది?' అన్నాను.

'ఇక్కడే హైదరాబాద్ లో ఒకాయనున్నాడు. టీవీలో కూడా వస్తుంటాడు. ఆయన్ను కన్సల్ట్ చేస్తే ఇదే మాట చెప్పి రెండు లక్షలు తీసుకుని పాశుపతాస్త్రం అంటూ హోమం చేసి విభూది ఇచ్చి మా అమ్మాయి ముఖాన పెట్టుకోమన్నాడు. తీర్ధం ఇచ్చి తాగమన్నాడు. అలాగే చేశాం.' అన్నాడు.

'అప్పుడేమైంది?' అడిగాను.

'ఆ తర్వాత వీళ్ళ మధ్యన లవ్వు మరీ డీప్ అయిపోయింది. ఇద్దరూ వారం రోజులు సెలవు పెట్టి ఎక్కడెక్కడో తిరిగి వచ్చారు. అప్పుడేం జరిగిందో ఊహించడానికే భయంగా ఉంది' అన్నాడు ఏడుపు గొంతుతో.

'అంత గెస్ వర్క్ ఏమీ అక్కర్లేదు. ఏది జరగాలో అదే జరిగి ఉంటుంది. లైట్ గా తీసుకోండి.' అన్నా.

'ఎలా తీసుకోమంటారండి? వాళ్ళిద్దరూ వరసకు అన్నాచెల్లెళ్ళు' అన్నాడు బెక్కుతూ.

'వరసకేగాని నిజానికి కాదుగా.' అన్నా.

'అసలూ - పాశుపతాస్త్రం ఎలా ఫెయిల్ అయిందో?' అడిగాడు అనుమానంగా.

'మీరిచ్చిన డబ్బు ఆయనకు సరిపోయి ఉండదు. అందుకని కక్కుర్తి పడి హోమంలో నెయ్యి బదులు డాల్డా వాడి ఉంటాడు. అందుకే పాశుపతాస్త్రం రివర్స్ అయి మన్మధాస్త్రంగా మారి ఉంటుంది.' అన్నాను. 

'ఏంటి సార్? మేము బాధల్లో ఉండి ఫోన్ చేస్తే మీకు జోగ్గా ఉందా?' అంది స్వరం.

' అబ్బే అదేం లేదు. మీ సమస్య నాకర్ధమైంది.పోనీ మీకు పాశుపతాస్త్రం మీద నమ్మకం లేకపోతే ఇంకేదైనా అస్త్రం చూద్దాం.' అన్నా.

'వద్దండి. ఈ అస్త్రాలు శస్త్రాలు మాకు నమ్మకం లేదు. ఏదైనా పనికొచ్చే రెమెడీ చెప్పండి.' అన్నాడు.

ఆట పట్టించినది చాల్లే ఇకనైనా రూట్లో కొద్దామని అనుకున్నా.

'చూడండి. నేను చెప్పేది సరిగ్గా వినండి. మీ సమస్య పెద్దదే నేను కాదనడం లేదు. కానీ ఇది మంత్రతంత్రాలతో సాల్వ్ కాదు. అనవసరంగా జ్యోతిష్కులు మంత్రగాళ్ళ చుట్టూ తిరిగి డబ్బు పోగొట్టుకోకండి.' అన్నా.

'అదేంటి సార్ . మీరే అలా అంటున్నారు' అంది స్వరం.

'నేను కాబట్టి ఉన్న విషయాన్ని చెబుతున్నాను. ఇంకోడైతే మీ దగ్గర ఇంకో రెండు లక్షలు లాగి ఉండేవాడు. మీ సమస్యకు ఒకటే పరిష్కారం. ముందే చెప్పాను. మీకు చేతనైతే మీ అమ్మాయికి గట్టిగా చెప్పి వేరే పెళ్లి చెయ్యండి. లేదా వాళ్ళిద్దరికే పెళ్లి చెయ్యండి. ఇది తప్ప వేరే మార్గం లేదు.' అన్నా.

'వేరే పెళ్లి చేస్తే సూయిసైడ్ చేసుకుంటానని అమ్మాయి అంటోంది.' అన్నాడు.

'అంటే వెకేషన్ కెళ్ళినపుడు మన్మధాస్త్రం బలంగా పని చేసిందన్నమాట' అన్నా.

'ఏమో సార్. అదంతా మాకు తెలీదు. రెమెడీ చెప్పండి. వాళ్ళిద్దరికీ పెళ్లి చేస్తే మా బంధువులందరూ మా మొహాన ఉమ్మేస్తారు.' అంది స్వరం మళ్ళీ.

'ఉమ్మేస్తే మంచి సబ్బుతో కడుక్కోండి.' అందామని నోటిదాకా వచ్చి మళ్ళీ ఆపుకుని, 'నాకు తెలిసిన రెమెడీ ఇదొక్కటే. మీకు డబ్బులు ఎక్కువైతే మంత్రగాళ్ళని ఆశ్రయించి డబ్బులు వదుల్చుకోండి. సమస్య పరిష్కారం కావాలంటే నేను చెప్పినట్టు చెయ్యండి. ఎలాగూ వాళ్ళిద్దరూ మేజర్లే, ఇద్దరూ ఉద్యోగస్తులే కాబట్టి వాళ్ళు పోలీస్ స్టేషన్ కెళితే వాళ్లకు దండలేసి మీకు బేడీలేస్తారు. ఏది కావాలో మీరే ఆలోచించుకోండి.' అన్నా.

'ఇదేం ఖర్మ సార్ ! మా వంశంలో ఇలాంటివి ఎక్కడా లేవు. ఆడపిల్లను చదివించినందుకు ఇలా తయారైంది. అంతా మా ఖర్మ' అంది స్వరం.

'ఆడపిల్లను చదివించినందుకు ఇలా కాలేదు. మీరిద్దరూ ఉద్యోగాలు చేసుకుంటూ పిల్లను పట్టించుకోలేదు. ఆ అమ్మాయి ప్రేమకోసం ముఖం వాచి, ఎవడు కొంచం ప్రేమ చూపిస్తే వాడికి పడిపోయింది. అంతే ! కాకుంటే మీరు ఇంకా అదృష్టవంతులు. మీ కులంలోనే మీ బంధువులలోనే ఈ ప్రేమ నడిచింది. చాలామంది వేరే కులం వాళ్ళని ప్రేమించి ఇంట్లోంచి లేచిపోయి ఆరు నెలల తర్వాత కడుపుతో ఇంటికి వచ్చిన వాళ్ళున్నారు. డబ్బు ఒక్కటి తెచ్చి ఇస్తే సరిపోదు. ఎదిగే పిల్లలని అనుక్షణం కనిపెట్టి ఉండాలి. వాళ్లకు మీరే స్కూటీలూ, యాపిల్ ఫోన్లూ, పాకెట్ మనీ ఇచ్చి దేశం మీదకు పొమ్మంటున్నారు. వాళ్లేదురుగానే మీరు తాగి తందనాలాడుతున్నారు. వాళ్ళు ఇంకేం చేస్తారని మీ ఉద్దేశ్యం? తప్పు వాళ్ళది కాదు. మీది. చుట్టూ వాతావరణం ఎలా ఉంది? సినిమాలు, స్నేహాలు ఎలా ఉంటున్నాయి? అలాంటప్పుడు మీరు కేర్ లెస్ గా పట్టించుకోకుండా ఉంటె ఇలాగే అవుతుంది. ఇప్పుడు బాధపడి మంత్రాలు తంత్రాలు అని పరిగెత్తితే ఏమీ ఉపయోగం లేదు. నేను చెప్పిన రెండే పరిష్కారాలు. తరవాత మీ ఇష్టం.' అన్నాను.

' సర్లెండి. ఇలాంటి చెత్త సలహా ఇచ్చినందుకు థాంక్స్.' అన్నాడాయన కోపంగా.

'పరమ చెత్తగా మీ అమ్మాయిని పెంచినందుకు మీకు నా కంగ్రాట్స్. "వీప్ యువర్ వీపింగ్" అన్నా బట్లర్ ఇంగ్లీషు వాడుతూ.

ఫోన్ కట్ అయిపోయింది.

అదీ సంగతి !!

కధ కంచికి మనం ఇంటికి.
read more " పాశుపతాస్త్రం "

21, జులై 2017, శుక్రవారం

Dil Tadap Tadap Ke - Mukesh, Lata Mangeshkar


Dil Tadap Tadap Ke Kehe rahaa hai aabhi jaa

అంటూ లతా, ముకేష్ లు మధురంగా ఆలపించిన ఈ గీతం 1958 లో వచ్చిన మధుమతి అనే సినిమాలోది. నా స్వరంలో కూడా ఈ గీతాన్ని వినండి మరి.

Movie:--Madhumathi (1958)
Lyrics:--Shailendra
Music:--Salil choudhury
Singers:-- Mukesh, Latha
Karaoke Singer:-- Satya Narayana Sarma
Enjoy
------------------------------------------
Male
Dil Tadap Tadap Ke Keh Raha Hai Aa Bhee Ja
Too Humse Aankh Na Chura, Tujhe Kasam Hai Aa Bhee Ja
Dil Tadap Tadap Ke Keh Raha Hai Aa Bhee Ja
Too Humse Aankh Na Chura, Tujhe Kasam Hai Aa Bhee Ja

Too Nahee Toh Yeh Bahar Kya Bahar Hai
Gul Nahee Khile Ke Teraa Intejar Hai

Too Nahee Toh Yeh Bahar Kya Bahar Hai

Gul Nahee Khile Ke Teraa Intejar Hai

Ke Teraa Intejar Hai

Ke Teraa Intejar Hai
Dil Tadap Tadap Ke Keh Raha Hai Aa Bhee Ja
Too Humse Aankh Na Chura, Tujhe Kasam Hai Aa Bhee Ja

Female
Dil Dhadak Dhadak Ke De Raha Hai Yeh Sada
Tumharee Ho Chukee Hu Mai, Tumhare Pas Hu Sada

Dil Dhadak Dhadak Ke De Raha Hai Yeh Sada

Tumharee Ho Chukee Hu Mai, Tumhare Pas Hu Sada
Tum Se Meree Jindagi Ka Yeh Singar Hai
Jee Rahee Hu Mai Ke Mujhko Tumse Pyar Hai

Tum Se Meree Jindagi Ka Yeh Singar Hai

Jee Rahee Hu Mai Ke Mujhko Tumse Pyar Hai

Ke Mujhko Tumse Pyar Hai

Ke Mujhko Tumse Pyar Hai

Male
Dil Tadap Tadap Ke Keh Raha Hai Aa Bhee Ja
Too Humse Aankh Na Chura, Tujhe Kasam Hai Aa Bhee Ja

Female
Dil Dhadak Dhadak Ke De Raha Hai Yeh Sada

Tumharee Ho Chukee Hu Mai, Tumhare Pas Hu Sada

Male

Muskurate Pyar Ka Asar Hai Har Kahee
Ham Kahan Hain Dil Kidhar Hai Kuchh Khabar Nahee
Female
Muskurate Pyar Ka Asar Hai Har Kahee
Ham Kahan Hain Dil Kidhar Hai Kuchh Khabar Nahee

Kidhar Hai Kuchh Khabar Nahee

Kidhar Hai Kuchh Khabar Nahee
Male

Dil Tadap Tadap Ke Keh Raha Hai Aa Bhee Ja
Too Humse Aankh Na Chura, Tujhe Kasam Hai Aa Bhee Ja

Female
Dil Dhadak Dhadak Ke De Raha Hai Yeh Sada
Tumharee Ho Chukee Hu Mai, Tumhare Pas Hu Sada

Meaning

Through its beats my heart is calling you
Don't try to hide yourself from me
Promise that you will come to me

If you are not here, then this spring season
is not worth its name
The flowers are waiting for you
and have not bloomed
They are waiting for you

My heart is beating and telling you always
I am yours already, I am with you always
My life has become become beautiful because of you
I am alive because I love you
because I am in love with you

This is the result of my innocent love
that i dont know where I am
and where my heart is
no idea and no idea

Through its beats my heart is calling you
Don't try to hide yourself from me
Promise that you will come to me
My heart is beating and telling you always
I am yours already, I am with you always

తెలుగు స్వేచ్చానువాదం

నా గుండె చప్పుడు నిన్ను పిలుస్తోంది
నానుంచి దాక్కోకు, దగ్గరకు రా

నువ్వు లేకపోతే వసంతమే లేదు?
నీ కోసం ఎదురుచూస్తూ
పువ్వులు పూయడం మానేశాయి

నా గుండె చప్పుడు చెబుతోంది విను
నేను నీదాననే నీ దగ్గరగానే ఉన్నాను
నా జీవితంలో నువ్వే ఆనందానివి
నిన్ను ప్రేమించడం వల్లే నేను బ్రతికున్నాను

మన చుట్టూ సంతోషపు ప్రేమ వెల్లివిరుస్తోంది
మనమెక్కడున్నామో మనకే తెలీడం లేదు

నా గుండె చప్పుడు నిన్ను పిలుస్తోంది
నానుంచి దాక్కోకు, దగ్గరకు రా
నా గుండె చప్పుడు చెబుతోంది విను
నేను నీదాననే నీ దగ్గరగానే ఉన్నాను
read more " Dil Tadap Tadap Ke - Mukesh, Lata Mangeshkar "

గుదిబండ శిష్యులు

పాతకాలంలో గుదిబండ అని ఒకటి ఉండేది. ఆకతాయి పశువులను కంట్రోల్ చెయ్యాలంటే దాని మెడలో ఒక బండను కడతారు. ఆ బరువుకు ఆ పశువు పరుగు పూర్తిగా ఆగిపోతుంది. ఆ బండా ముందుకు కదలదు. ఈ పశువునూ కదలనివ్వదు. అదీ గుదిబండ ఉపయోగం.

నవీన కాలంలో గురువుల చుట్టూ చేరే శిష్యులు కూడా చాలామంది గుదిబండలాంటి వాళ్ళే ఉంటున్నారు. ఎందుకంటే వాళ్ళూ ఇవాల్వ్ కారు. ఈ గురువునూ ముందుకు పోనివ్వరు. అందుకే వీరిని గుదిబండ శిష్యులు అంటే చాలా సరిగ్గా ఉంటుంది.

'శిష్యులను చేర్చుకోకు అదే నీ పతనానికి కారణం అవుతుంది' అని రామతీర్ధస్వామి నూరేళ్ళ క్రితం ఒక మహత్తరమైన మాటను గురువులందరికీ సెలవిచ్చాడు. అది అక్షరాలా నిజం.

తన ఆత్మానుభవంలో తనకు తానుగా నిలిచి ఉండాలని అనుకునే ఏ గురువూ శిష్యులను దగ్గరకు రానివ్వడు. ఎందుకంటే ఈ శిష్యులనే వారిలో ఎక్కువమంది అహంకారులూ,మోసగాళ్ళూ,జెలసీతో లోపల్లోపల కుళ్ళిపోయిన వాళ్ళూ, మానసిక స్థిరత్వం లేకుండా రోజుకొక మాట మార్చేవాళ్ళూ, ఒకటి చెబుతూ ఇంకోటి చేసేవాళ్ళూ ఉంటారన్న పచ్చినిజం వారికి బాగా తెలుసు. కానీ ఇదంతా తెలిసి కూడా శిష్యులకు చెప్పాలనీ బోధించాలనీ కొందరు గురువులు చూస్తారు. దానికి కారణం ఏమంటే చెప్పగా చెప్పగా ఎప్పటికో కొంత కాకపోతే కొంతైనా ఎక్కుతుంది కదా? దానివల్ల వాళ్లకు కూడా నేడు కాకుంటే రేపైనా కొంత మేలు కలగకపోతుందా? అని వీరి ఆశ. అది వారి కరుణకు సంకేతంగాని ఈ శిష్యుల గొప్పదనం కాదు.

ఇలా ప్రయత్నించడం వల్ల ఈ గురువులకు కొత్తగా ఒరిగేది కూడా ఏమీ ఉండదు. తాము చేరిన గమ్యాన్ని వాళ్లకు కూడా చూపిద్దామనీ ఆ దారిలో వారిని కూడా నడిపిద్దామనీ నిస్వార్ధంగా ఈ గురువులైనవాళ్ళు ప్రయత్నిస్తారు గాని ఈ ప్రయత్నంతో వీరికి లాభం ఏమీ ఉండదు. 'పోరాడితే పోయేదేముంది సంకెళ్ళు తప్ప' - అని కమ్యూనిస్టు స్లోగన్ ఒకటుంది. అలాగే 'బోధిస్తే పోయేదేముంది వినేవాళ్ళ అజ్ఞానం తప్ప?' అని గురువులు అనుకుంటే పప్పులో కాలేసినట్లే. ఎందుకంటే ఈ సోకాల్డ్ శిష్యులు అనేవారితో ప్రయాణం నరకంతో సమానంగా ఉంటుంది.

'ఎంతోమంది వింటారు కానీ ఎవరూ అర్ధం చేసుకోరు. ఎంతోమంది చూస్తారు కానీ ఎవరూ గుర్తించలేరు.' అని జీసస్ ఊరకే అనలేదు మరి !!

ఈ శిష్యులలో చాలామంది ఎలాంటి వాళ్ళంటే - మనం చెప్పినది అర్ధం చేసుకోరు. ఆచరించరు. కానీ అదే సమయంలో మనల్ని వదలరు. వాళ్ళ చెత్త మైండ్ సెట్ వాళ్ళు చస్తే ఒదులుకోరు. కానీ దానికి మన సపోర్ట్ ను ఆశిస్తారు. ఈలోపల నానా రచ్చా చేసి అందరి మనసులూ పాడుచేస్తుంటారు.

ఇలాంటి వాళ్ళేమనుకుంటారంటే - 'నేనిచ్చే బహుమతులూ, నేను పొగిడే పొగడ్తలూ, నేను చెప్పే మాయమాటలూ, నేను ఆడే నాటకాలకు ఈయన పడిపోతాడు. ఇక మన ఇష్టారాజ్యంగా ఈయన్ని ఆడుకోవచ్చు' అనుకుంటారు. కానీ ఆ గురువైనవాడి దగ్గర పవర్ ఫుల్ స్కానింగ్ మిషన్ ఉందనీ ఆ స్కానింగ్ లో వారికి తెలీని నిజాలు కూడా బయటపడతాయనీ వాళ్ళు గ్రహించలేరు. ఈ నాటకాలను అతను గుర్తించలేడని వీళ్ళు అనుకోడానికి ఎంత అహమూ ఎంత అజ్ఞానమూ వారిలో గూడుకట్టుకుని ఉంటాయో మనం అర్ధం చేసుకోవచ్చు. 

వీళ్ళలో ఇంకొక విచిత్రమైన పోకడను మనం చూడవచ్చు.

ఒకపక్కన - గురువంటే దేవుడితో సమానం, మన తల్లీ తండ్రీ బంధువులూ అందరి కంటే గురువే ఎక్కువ అని ఎదుటివారికి నీతులు చెబుతూ ఉంటారు. కానీ తాము మాత్రం ఈ నీతుల్లో దేనినీ పాటించరు. సామాన్యంగా మిగతావాళ్ళ కంటే ముందుగా జాయిన్ అయిన సీనియర్ శిష్యులలో ఈ పోకడలు చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. వీరికి లోపల్లోపల అధికారదాహం ఉంటుంది. ఐడెంటిటీ క్రైసిస్ కూడా ఉంటుంది. ఈ రెంటిని తీర్చుకోడానికి ఆధ్యాత్మిక వేషాలు వేస్తూ నటిస్తూ పక్కవాళ్ళకు బోధిస్తూ ఉంటారుగాని వీరికి దేవుడూ అక్కర్లేదు గురువూ అక్కర్లేదు. ఇతరులకు తాము ఏ నీతులైతే చెబుతున్నారో ఆ నీతులన్నీ ముందుగా తాము పాటించాలని మాత్రం వారికి ఏమాత్రమూ అనిపించదు.

'నేను ప్రోమోట్ చెయ్యబట్టి ఈయన గురువయ్యాడు లేకుంటే ఈయన ముఖం ఎవరు చూస్తారు?' అన్న అహంకారం కూడా వీళ్ళలో లోపల్లోపల ఉంటుంది. గురువును నలుగురిలో పొగడటం నిజానికి వారివారి ఈగో ప్రొమోషన్ మాత్రమే గాని ఇంకేమీ కాదు.

గురువులూ మోసగాళ్ళే అయి, డబ్బు మీదా, అధికారం మీదా నాటకాల మీదా ఆశ ఉన్నవాళ్ళే అయినప్పుడు ఇలాంటి శిష్యులకూ అలాంటి గురువులకూ బాగా సరిపోతుంది. అందరూ కలసి చక్కగా నాటకం ఆడి లోకాన్ని మోసం చెయ్యవచ్చు.

కానీ గురువు నిజమైన గురువైనప్పుడు ఈ సోకాల్డ్ శిష్యులు వేసే ఇలాంటి నాటకాలను ఏమాత్రం సమర్ధించక పోగా వాళ్ళను అడుగడుగునా సరిదిద్దాలని చూస్తాడు. అవసరం అయితే కరుకుగా మాట్లాడి అయినా ఈ లోపాలనూ వేషాలనూ దిద్దాలని ప్రయత్నిస్తాడు. ఇది ఆ శిష్యులకు సుతరామూ నచ్చదు. ఎందుకంటే వాళ్ళలో కనపడని దురహంకారం గూడు కట్టుకుని ఉంటుంది. అందుకని ఆ సంస్థనూ ఆ గురువునూ అర్ధాంతరంగా వదిలేసి వెళ్ళిపోతూ ఉంటారు. అలా వదిలేసిన తర్వాత కూడా - 'తప్పు నాది కాదు. అంతా మా గురువుదే, ఆయనే నన్ను సరిగ్గా అర్ధం చేసుకోలేదు. ఎప్పటినుంచో ఉన్న నన్ను నానారకాల మాటలతో బాధపెట్టి నిన్నగాక మొన్న వచ్చిన వాళ్ళను దగ్గరకు తీస్తున్నాడు. వాళ్లకు సంస్థలో మంచి పొజిషన్స్  ఇస్తున్నాడు. మొదటినుంచీ ఉన్న మాకేమో దిక్కూ మొక్కూ లేదు' అని కామెంట్ చేస్తూ ఉంటారు.

ఇలా వెళ్ళిపోయిన ఇంకొందరు - ' అసలు ఆయన దగ్గర ఏ శక్తీ లేదు. ఊరకే జనాన్ని మాయమాటలతో మోసం చేస్తున్నాడు. ఈరోజు నేను బయటకొచ్చాను. రేపు మీకూ నా గతే పడుతుంది.' అని సాటి శిష్యులకు ఎక్కిస్తూ ఉంటారు.

వీరికి - 'నేను చాలా ప్రత్యేకమైన మనిషిని. చాలా తెలివితేటలు నాకున్నాయి. నేను లేకపోతే ప్రపంచం నడవదు' అన్న దురహంకారం ఉంటుంది. ఈ అహంకారంతోనే వాళ్ళ సంసారాన్నీ వాళ్ళు పాడు చేసుకుంటూ ఉంటారు. తమను ఆదరించిన సంస్థనూ పాడుచేస్తారు. ఇలాంటి దురహంకారులతోనూ, మెంటల్ స్టెబిలిటీ లేనివారితోనూ, ఎవరూ సుఖంగా శాంతంగా ఉండలేరు - వారి కుటుంబ సభ్యులతో సహా, కానీ ఈ విషయాన్ని వాళ్ళు చస్తే ఒప్పుకోరు. సామాన్యంగా వీళ్ళంతా వారివారి ఫేమిలీ లైఫ్ లో ఘోరంగా ఫెయిల్ అయి ఉంటారు. ఆ ఫ్రస్ట్రేషన్ ను ఇతరుల మీద రుద్దుతూ ఉంటారు.

ఈ విధంగా - అహంతోనూ, నిలకడ లేకపోవటం తోనూ, జెలసీ తోనూ, కోపంతోనూ, తమ ఊహలు నెరవేర లేదన్న అక్కసుతోనూ ఇలాంటివాళ్ళు నానారకాలుగా అన్ బేలన్స్ అయి ప్రవర్తిస్తూ ఉంటారు గాని, ఆ గురువు ఏం చెబుతున్నాడు? దానిని ఎలా ఆచరించాలి? ఎలా తమ మైండ్ సెట్స్ మార్చుకోవాలి? ఏ విధంగా ఆధ్యాత్మిక మార్గంలో నడవాలి? ఎలా సాధన చెయ్యాలి? ఆధ్యాత్మికంగా ఎలా ఎదగాలి? ' అన్న విషయాలు మాత్రం పొరపాటున కూడా ఆలోచించరు. ఆ గురువును అనుసరించరు.

నిజానికి వీళ్ళంతా మెంటల్ పేషంట్లు. వీళ్ళలో స్కిజోఫ్రేనియా, బైపోలార్ డిజార్డర్, ADHD మొదలైన రోగాలుంటాయి.  వీళ్ళకు సైకియాట్రీ ట్రీట్మెంట్ చాలా అవసరం. కానీ ఆ విషయాన్ని ఒప్పుకోకుండా ఇలాంటి వేషాలతో కాలక్షేపం చేస్తూ, తమ చర్యల్ని తెలివిగా సమర్ధించుకుంటూ, చివరికి అందరినీ దూరం చేసుకుంటూ ఉంటారు.

ఇలాంటి వాళ్ళను ముందే కనిపెట్టి మొదట్లోనే వదిలించుకోకపోతే, కొన్నేళ్ళు పోయాక 'నాతో ఆధ్యాత్మికమార్గంలో నడవకుండా, ఊరకే కుళ్ళు రాజకీయాలు చేసే ఇలాంటి గుదిబండలతో ఎందుకిలా ఏళ్ళకేళ్ళు నా విలువైన కాలాన్ని వృధా చేశానా?' అని మనం చింతించవలసి వస్తుంది.

మనం చెప్పే బోధనలను నిజంగా అర్ధం చేసుకుని, ఆచరించే వాళ్ళనే మనం దగ్గరకు తియ్యాలిగాని, ఎవరిని బడితే వారిని దగ్గరకు రానిస్తే చివరకు ఘోరంగా ఆశాభంగం చెంది విచారించవలసి వస్తుందనేది నగ్నసత్యం.

ఇలాంటి దొంగశిష్యుల మాయలో పడితే - 'దగ్గరకు తీసుకుంటే వచ్చేదేముంది? వెన్నుపోట్లు తప్ప?' అని చివరిలో అనుకోవలసి వస్తుంది మరి !!
read more " గుదిబండ శిష్యులు "

20, జులై 2017, గురువారం

Chand Phir Nikla - Lata Mangeshkar


'చాంద్ ఫిర్ నిక్ లా' అంటూ లతా మంగేష్కర్ మధురంగా ఆలపించిన ఈ పాథోస్ గీతం 'పేయింగ్ గెస్ట్' అనే సినిమాలోది. ఈ సినిమా 1957 లో వచ్చింది. 60 ఏళ్ళ తర్వాత కూడా ఇది మరపురాని మధురగీతమే. నా స్వరంలో కూడా ఈ పాటను వినండి మరి.

Movie:-- Paying Guest (1957)
Lyrics:--Majrooh Sultanpuri
Music:-- S.D.Burman
Singer:--Lata Mangeshkar
Karaoke Singer:-- Satya Narayana Sarma
Enjoy
--------------------------------------

Chand phir nikla - Magar tum na aaye
Jala phir mera dil - Karu kya me haaye
Chand phir niklaa

Ye raat kehtee hai - Vo din gaye tere
Ye jaantaa hai dil - Ke tum nahi mere
Khadee hu me phir bhee - Nigahe bichaye
Me kya karu haaye - Ki tum yaad aaye
Chaand phir niklaa

Sulagthe seene se - Dhuvasa utthaa hai 
Lo ab chale aavo - Ke dum ghutthaa hai
Jala gaye tan ko - Baharo ke saaye
Me kya karu haaye - Ke tum yaad aaye
Chand phir nikla - Magar tum na aaye
Jala phir mera dil - Karu kya me haaye
Chand phir niklaa

Meaning

The Moon rose again
but you haven't come yet
My heart is burning again
Alas ! What can I do?

The night says - 'your good days are gone'
My heart knows that you are no longer mine
Yet, I am standing here waiting for you
with wide open eyes
with a hope that you will come back
What can I do?
I am haunted by your thoughts

Something like a smoke is coming
out of my burning heart
Come back to me because
my life energy is ebbing out
The shadow of spring season
has scorched my whole body
What can I do?
I am haunted by your thoughts

The Moon rose again
but you haven't come yet
My heart is burning again
Alas ! What can I do?

తెలుగు స్వేచ్చానువాదం

చంద్రుడు మళ్ళీ ఉదయించాడు
కానీ నువ్వు ఈరోజు కూడా రాలేదు
నా హృదయం కాలుతోంది
ఏం చెయ్యను?

'నీ మంచి రోజులు గతించాయి' అంటూ ఈ రాత్రి అంటోంది
నువ్వు నావాడివి కాదని నా హృదయం చెబుతోంది
కానీ కళ్ళు విప్పార్చుకుని నేనిక్కడే నిల్చుని ఉన్నాను
నువ్వు తిరిగి రాకపోతావా అన్న ఆశతో
నేనేం చెయ్యగలను?
నువ్వు నాకు గుర్తొస్తున్నావు

మండుతున్న నా గుండె నుంచి
బాధ అనే పొగ లేస్తోంది
నా ప్రాణం క్రుంగిపోతోంది
వసంతపు నీడ నన్ను మొత్తం కాల్చేసింది
నేనేం చెయ్యగలను?
నువ్వు నాకు గుర్తొస్తున్నావు

చంద్రుడు మళ్ళీ ఉదయించాడు
కానీ నువ్వు ఈరోజు కూడా రాలేదు
నా హృదయం కాలుతోంది
ఏం చెయ్యను?
read more " Chand Phir Nikla - Lata Mangeshkar "

సెవెంత్ హౌస్ వెంకటేశ్వరరావు - SHV

మొన్న ఏదో పనిమీద బజారుకెళితే రోడ్డుమీద ఆప్కో శాస్త్రిగారు కలిశాడు. ఈయన ఆప్కోలో పనిచేసి విరమించాడు. 'అందరూ నన్ను ఆప్కో శాస్త్రి ఆప్కో శాస్త్రి అంటూ ఉంటారుగాని నేను ఏదీ ఆపుకోలేను, ఎందుకంటే నాకు షుగరుంది మరి' అని జోకులేస్తూ ఉంటాడు. కనిపించి చాలా నెలలైంది గనుక తన కుటుంబ విషయాలూ మిత్రుల విషయాలూ చెప్పుకొచ్చాడు. ఆ సందర్భంలోనే సెవెంత్ హౌస్ వెంకటేశ్వరరావుగారు నవంబర్ లో చనిపోయాడని కూడా చెప్పాడు. చివరలో ఆయనకు పెరాలిసిస్ వచ్చిందని చెప్పాడు.

సెవెంత్ హౌస్ వెంకటేశ్వరరావుగారికి ఆ పేరును నా ఇంకో మిత్రుడు వెంకటాద్రి పెట్టాడు. ఆయన్ను మేము క్లుప్తంగా SHV అని పిలిచేవాళ్ళం. "అదేం పేరు? SHV ఏంటి అసహ్యంగా, HIV అన్నట్టు?" అని ఆయన అంటూ ఉండేవాడు. కానీ మేమాయన్ని అలాగే పిలిచేవాళ్ళం.

SHV కి జ్యోతిష్యం ఒక మోస్తరుగా వచ్చు. కానీ ఆయన దృష్టీ రీసెర్చీ అంతా సెవెంత్ హౌస్ మీదనే జరిగేది. ఆయన ఉండటం కూడా అరండల్ పేట ఏడో లైన్ లోనే ఉండేవాడు.

జాతకంలో ఏయే యోగాలుంటే గర్ల్ ఫ్రెండ్స్ ఎక్కువగా ఉంటారు? ఏయే యోగాలుంటే ఎక్స్ట్రా మారిటల్ ఎఫైర్స్ ఉంటాయి? అవి ఏయే సందర్భాలలో జరుగుతాయి? మొదలైన విషయాలలో ఆయన కొన్నేళ్ళ పాటు చాలా రీసెర్చి చేశాడు. తన జీవితంలోని సెక్సువల్ ఎడ్వెంచర్స్ ను సమర్ధించుకోడానికీ, తప్పు నాది కాదు గ్రహాలది అని చెప్పడానికీ ఆయన జ్యోతిష్యం నేర్చుకున్నాడని వెంకటాద్రి నవ్వుతూ అనేవాడు.

వెంకటాద్రీ ఈయనా కలసి ఒక విచిత్రమైన జ్యోతిష్య రీసెర్చిని కొన్నేళ్ళపాటు చేసి కొన్ని సూత్రాలను కనుక్కున్నారు. వాటిని ఉపయోగించి ఒక వ్యక్తి జీవితంలో ఫస్ట్ సెక్సువల్ ఎక్స్ పీరిఎన్స్ ఎప్పుడు జరిగింది. ఎలా జరిగింది? ఏయే పరిసరాలలో, ఏ వాతావరణంలో, ఎవరితో జరిగింది? మొదలైనవి ఖచ్చితంగా చెప్పగలిగేవారు. వాళ్ళ ఎనాలిసిస్ చాలా సరదాగా ఉండేది. వాళ్ళ టెక్నిక్ ను నాతో చెప్పారు. దానిని నేను ఫైన్ ట్యూన్ చేసి వాళ్లకు ఇచ్చాను.

ఇలాటి రీసెర్చి చేసి ఉపయోగం ఏముంది? కాస్త ఉపయోగపడేది చెయ్యండయ్యా అని నేను వాళ్ళతో అనేవాణ్ణి గాని వాళ్ళు వినేవాళ్ళు కాదు. వాళ్లకు ఇష్టమైన సబ్జెక్ట్ సెవెంత్ హౌస్ కాబట్టి దానిమీదే వాళ్ళ దృష్టంతా ఉండేది.

వీళ్ళిద్దరూ సెవెంత్ హౌస్ వీరులే. వెంకటాద్రిగారు 2004 లో చనిపోయాడు. SHV ఏమో 2016 లో పోయాడు. వీళ్ళు నాకంటే దాదాపు ఇరవై ఏళ్ళు పెద్దవాళ్ళు. మొదటినుంచీ అదేంటోగాని అలాంటి వాళ్ళతోనే నాకు స్నేహం ఉండేది. నాలుగైదు ఏళ్ళ క్రితం వరకూ నాతో బాగానే టచ్ లో ఉండేవాడు SHV. శంకర్ విలాస్ సెంటర్లోనో లేకపోతే అరండల్ పేట ఏడో లైన్ మొదట్లోనో ఎక్కడో ఒకచోట కూచుని ఉండేవాడు. నేను అటూ ఇటూ పోతూ కనిపిస్తే కూచోమని చెప్పి, కాఫీ తెప్పించి, ఇక ఆయన సోదంతా నాతో చెబుతూ ఉండేవాడు.

ఈ రిటైరైన వాళ్లకు వేరే పని ఏమీ ఉండదు. వాళ్లమాట ఎవరూ వినరు. వాళ్ళను పట్టించుకోరు. పాపం శ్రోతలు కనిపిస్తే ఇక వాళ్ళ సోది మనకు చెబుతూ ఉంటారు. పోనీలే మనకు పోయేదేముందని కాసేపు ఆయన మాటలు వినేవాడిని. ఆ తర్వాత, "ఇంకా ఎందుకండీ మీకివన్నీ? నామాటలు కాస్త ఇప్పుడన్నా వినండి" అంటూ మన వేదాంత ధోరణి మొదలు పెడితే అది వాళ్లకు నచ్చేది కాదు. అందుకని 'సరే వెళ్ళిరండి' అనేవాడు.

నా మార్గంలోకి వాళ్ళను తెద్దామని విశ్వప్రయత్నం చేశాను. కానీ వాళ్ళు రాలేకపోయారు. ఒక జీవికి నెగటివ్ కర్మ బలంగా ఉన్నప్పుడు మన దారిలోకి వాళ్ళు రాలేరు. వాళ్ళ కర్మ వాళ్ళను రానివ్వదు. కర్మ అంత బలంగా ఉన్నప్పుడు నేను చెయ్యగలిగేది కూడా ఏమీ ఉండదు.

నాతో టచ్ లో ఉన్నంత వరకూ ఆయన బాగానే ఉండేవాడు. తనకు జరుగుతున్న దశలు చూపించి రెమేడీలు అడిగేవాడు. నాకు తోచినవి చెప్పేవాడిని చేసుకునేవాడు. మొత్తం మీద బాగానే ఉండేవాడు. నాతో ఎప్పుడైతే దూరం అయ్యాడో అప్పటినుంచీ ఆయనకు బ్యాడ్ టైం మొదలైంది. చివరకు మొన్న నవంబర్ లో పోయాడని తెలిసింది. పోయేముందు కూడా డబ్బుపరంగా, ఫేమిలీ పరంగా చాలా బాధలు పడ్డాడని తెలిసింది.

ఏది ఏమైనా, మనిషి దుర్మార్గుడు కాదు. ఒకరిని ముంచి మనం బాగుపడాలి, ఎవరేమై పోయినా నేను బాగుండాలి, ఎదుటివారిని నా స్వార్ధానికి వాడుకోవాలి అన్న మనస్తత్వం కాదు ఆయనది. అందుకే కొన్నాళ్ళు కాకపోతే కొన్నాళ్ళైనా నాతో స్నేహం కలిగింది.

నేను ఒక విచిత్రాన్ని చాలాసార్లు గమనించాను. మొదట్లో నాకు దగ్గరగా ఉండి తర్వాత దూరమైన చాలామంది చాలా బాధలకు గురవ్వడం నేను చూస్తున్నాను. దానికి కారణం ఏమంటే - సరియైన మార్గదర్శనం ఇచ్చే మనిషిని వాళ్ళు కోల్పోవడమే. జీవితంలో ఇది చాలా పెద్ద లాస్. కానీ అది తర్వాత ఎప్పుటికో గాని వాళ్లకు అర్ధం కాదు. అది అర్ధమయ్యేనాటికి ఇక చేసేది కూడా ఏమీ ఉండదు. బహుశా ఖర్మ దశలు వచ్చినప్పుడు అలా దూరంగా పోవాలని వాళ్లకు బుద్ధి పుడుతుందేమో?

SHV ఆత్మకు శాంతి కలగాలని శ్రీరామకృష్ణులను ప్రార్ధిస్తున్నాను.
read more " సెవెంత్ హౌస్ వెంకటేశ్వరరావు - SHV "

19, జులై 2017, బుధవారం

Kaliyon Ne Ghunghat Khole - Mohammad Rafi


Kaliyon Ne Ghunghat Khole

అంటూ మహమ్మద్ రఫీ హుషారుగా పాడిన ఈ మధుర ప్రేమగీతం 1966 లో వచ్చిన Dil Ne Phir Yaad Kiya అనే చిత్రం లోనిది. రఫీ స్వరంలో చిలిపిగా జాలువారిన ఈ గీతాన్ని నా స్వరంలో కూడా వినండి మరి.

Movie:-- Dil Ne Phir Yaad Kiya (1966)
Lyrics:--G,L.Rawal
Music:-- Sonic Omi
Singer:-- Mohammd Rafi
Karaoke Singer:-- Satya Narayana Sarma
Enjoy
-------------------------------------------------
Kaliyo ne ghunghat khole har phul pe bhanvaraa dole
Lo aayaa pyaar kaa mausam gul o gulazaar kaa mausam
Kaliyo ne ghunghat khole har phul pe bhanvaraa dole

O hoy jab tu chaman me aae har gunchaa muskaraae
Hai behijaab teraa shabaab ham ho gaye divaane
Lo aayaa pyaar kaa mausam tere didaar kaa mausam
Kaliyo ne ghunghat khole har phul pe bhanvaraa dole

O hoy harsu teraa nashaa hai har zarraa pi rahaa hai
Harsu teraa nashaa hai har zarraa pi rahaa hai
Tu aaftaab jaam-e-shabaab roshan hue maikhaane
Lo aayaa pyaar kaa mausam visaal-e-yaar kaa mausam
Kaliyo ne ghunghat khole har phul pe bhanvaraa dole

O hoy Jaan-e-bahaar aa jaa dil ke qaraar aa jaa
Jaan-e-bahaar aa jaa dil ke qaraar aa jaa
Ye shab ye khvaab ye maahataab ab to lage tadpaane
Lo aayaa pyaar kaa mausam mere dildaar kaa mausam
Kaliyo ne ghunghat khole har phul pe bhanvaraa dole

Lo aayaa pyaar kaa mausam gul-o-gulazaar kaa mausam
Kaliyo ne ghunghat khole har phul pe bhanvaraa dole

Meaning

Flowers have removed their veils
Bees are hovering on them
Here comes the season of love
the season of abundance

When you stepped into the garden

Every rose has smiled
When your beauty is unveiled
I became mad
Here comes the season of love
the season of your coming

Your intoxication is everywhere

Every atom is drinking its wine
What a sweet and dear wine you are?
The taverns are lit up with your sweetness
Here comes the season of love
the season of uniting with the beloved

Come O sweetheart

Come O my mind's solace
This night, this dream and this moonlight
are now torturing me
Here comes the season of love
the season of my heart's beloved

తెలుగు స్వేచ్చానువాదం


పువ్వులన్నీ తమ ముసుగులు తొలగించాయి

తుమ్మెదలు వాటి చుట్టూ విహరిస్తున్నాయి
చూడు ! పూల వాసనలు గుబాళించే
ప్రేమ వసంతం వచ్చేసింది

తోటలోకి నువ్వు అడుగు పెట్టినపుడు
ప్రతి పువ్వూ నవ్వింది
నీ సౌందర్యాన్ని చూచి
నాకు మతి పోయింది
నీతో బాటే వసంతం కూడా వచ్చింది

నీ మాయమత్తు అంతటా పరచుకుంది

ప్రతి అణువూ దానిని ఆస్వాదిస్తోంది
నువ్వెలాంటి తీపి మధువువో?
ప్రతి పానశాలా వెలుగుతో నిండిపోయింది
ప్రియురాలితో ఏకమయ్యే సమయం వచ్చింది

ఓ ప్రేయసీ నా వద్దకు రా !
నా మనస్సుకు శాంతిని కలిగించు
ఈ రాత్రీ, ఈ స్వప్నమూ, ఈ వెన్నెలా
నన్ను చాలా బాధ పెడుతున్నాయి
నా హృదయరాణితో ఒకటయ్యే సమయం వచ్చింది

పువ్వులన్నీ తమ ముసుగులు తొలగించాయి
తుమ్మెదలు వాటి చుట్టూ విహరిస్తున్నాయి
చూడు ! పూల వాసనలు గుబాళించే
ప్రేమ వసంతం వచ్చేసింది
read more " Kaliyon Ne Ghunghat Khole - Mohammad Rafi "