“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

1, నవంబర్ 2015, ఆదివారం

Gori Tera Gaon Bada Pyara - Jesudas - Ravindra Jain





 గోరి తేరా గావ్ బడా ప్యారా
మై తో గయా మారా
ఆకే యహా రే...

అంటూ జేసుదాస్ మధురాతి మధురంగా ఆలపించిన ఈ గీతం ' చిత్ చోర్ ' (1976) అనే చిత్రం లోనిది.ఈ గీతాన్ని వ్రాసినదీ సంగీతాన్ని సమకూర్చినదీ రవీంద్ర జైనే.

ఈ మధ్యనే గతించిన రవీంద్ర జైన్ కు నివాళిగా ఈ పాటను పాడుతున్నాను.

ఈ పాటలో అమోల్ పాలేకర్, జరీనా వహాబ్, మాస్టర్ రాజు నటించారు.

ఈ సినిమాలోని పాటలన్నీ సూపర్ హిట్ సాంగ్సే.ఈనాటికీ వాటి మాధుర్యం ఏమాత్రం కూడా చెక్కు చెదరలేదంటే వాటికి రాగాలను సమకూర్చిన రవీంద్ర జైన్ ఎంతటి సంగీత తపస్వియో అర్ధం చేసుకోవచ్చు.పుట్టుగుడ్డి అయిన ఆయనకు భగవంతుడు అంతటి సంగీతజ్ఞానాన్ని ఇవ్వడం ఒక పెద్ద అద్భుతం.దానికి తోడు - సెలయేళ్ల గలగలలనూ, కోకిల కుహుకుహు స్వరాలనూ ఆయన విని మైమరచి పోయాడంటే అర్ధం చేసుకోవచ్చు.కానీ ప్రియురాలి అందాన్నీ,ఇంద్రధనుస్సు రంగులనూ,పురివిప్పిన నెమలి నాట్యాన్నీ,పచ్చని ప్రకృతినీ, కరిమబ్బులనూ, వినీలాకాశాన్నీ కూడా ఆయన చూస్తున్నట్లుగా వర్ణిస్తూ పాటలు వ్రాశాడంటే అదీ అసలైన అద్భుతం.


ఎన్నేళ్ళైనా నిలబడే పాటలు చెయ్యాలంటే దానికి ఎంతో తపస్సు అవసరం అవుతుంది.సరస్వతీమాత కటాక్షం ఉంటేనే గాని అలాంటి అద్భుతాలు చెయ్యడం సాధ్యంకాదు.అటువంటి కటాక్షాన్ని పొందిన ధన్యులలో రవీంద్ర జైన్ ఒకడు.

ఈపాటను ఇప్పటికి మీరందరూ ఎన్నోసార్లు వినే ఉంటారు.నా స్వరంలో కూడా మరొక్కసారి వినండి మరి.

Movie:--Chit Chor (1976)

Lyrics:-- Ravindra Jain
Music :-- Ravindra Jain
Singer :-- Jesudas
Karaoke Singer :-- Satya Narayana Sarma

Enjoy
------------------------------------------
Uhu uhu uhu oho ho oo oo oo oo

Gori Tera Gaon Bada Pyara
Main To Gaya Maara, Aake Yahan Re 
Us Par Roop Tera Saada
Chandrama Jo Aadha, Aadha Jawaan Re 
Gori Tera Gaon Bada Pyara
Main To Gaya Maara, Aake Yahan Re 
Aake Yahan Re

Ji Karta Hai Mor Ke Paon Mein 
Payaliya Pehna Doon 
Kuhu Kuhu Gaati Koyaliya Ko 
Phoolon Ka Gehna Doon 
Yahin Ghar Apna Banane Ko Panchi Kare Dekho 
Tinke Jama Re, Tinke Jama Re 
Gori Tera Gaon Bada Pyara
Main To Gaya Maara, Aake Yahan Re 
Aake Yahan Re

Rang Birange Phool Khile Hain 
Log Bhi Phoolon Jaise 
Aa Jaye Ek Baar Yahan Jo
Jayega Phir Kaise 
Jhar Jhar Jharte Hue Jharne, Man Ko Lage Harne 
Aisa Kahan Re, Aisa Kahan Re 
Us Par Roop Tera Saada
Chandrama Jyon Aadha, Aadha Jawaan Re
Aadha Jawaan Re 

Pardesi Anjaan Ko Aise 
Koi Nahin Apnaata 
Tum Logo Se Jud Gaya Jaise 
Janam Janam Ka Naata 
Apni Dhun Mein Magan Dole Log Yahan Bole 
Dil Ki Zaba Re, Dil Ke Zaba Re 

Gori Tera Gaon Bada Pyara
Main To Gaya Maara, Aake Yahan Re 
Us Par Roop Tera Saada
Chandrama Jo Aadha, Aadha Jawaan Re
Uhu uhu uhu oho ho oo oo oo oo


Meaning:--

Oh Beauty, your village is very lovely
Having come here, I have been bowled over
On the top of it
Your enchanting yet simple beauty
is like the half moon
half grown and still growing

My heart wishes to adorn anklets to the feet of peacock
I desire to give jewels made of flowers to the Cuckoo
that sings kuhoo .....kuhoo....
the sound of waterfall yonder
is stealing away my heart completely
Where is some other place like this?
On the top of it, your enchanting yet simple beauty
is like the half moon
half grown and still growing

In your village, colorful flowers are always on the bloom
and people also are like flowers (soft and good)
Once anybody comes here, how can he go back?
Make your own home here
Look ! the birds are collecting
pieces of straw to make their nests

In this world, none accepts and welcomes
a stranger like you have done
As if I am bound to you people
by some unknown bond that exists life after life
Yes.It is a bond of heart...

Oh Beauty, your village is very lovely
Having come here, I have been bowled over
On the top of it
Your enchanting yet simple beauty
is like the half moon

half grown and still growing...

తెలుగు స్వేచ్చానువాదం

ఓ జవ్వనీ ! మీ ఊరు చాలా బాగుంది
ఇక్కడకు రావడంతోనే నేను మైమరచి పోయాను
దానికితోడు నీ విరిసీ విరియని అందం
ముగ్ధమనోహరంగా ఉంది

నాట్యం చేసే ఆ నెమళ్ళ కాళ్ళకు గజ్జెలు కట్టాలని ఉంది
మధురస్వరాలు ఆలపించే కోయిలలకు రత్నాల పూలు
సమర్పించాలనిపిస్తోంది
ఇక్కడ ఇళ్ళు కట్టుకోవాలని పుల్లలు
ఏరుతున్న ఆ పక్షులను చూస్తుంటే
ఎంతో ఆనందంగా ఉంది

ఇక్కడ ఎప్పుడూ రంగురంగుల పూలు పూస్తున్నాయి
మీరంతా కూడా పూలలాగే ఉన్నారు
ఒకసారి ఇక్కడకు వచ్చినవాడు
ఎలా వెనక్కు పోగలడు?
పారుతున్న ఆ సెలయేటి ధ్వని
మనస్సును ఏదో లోకాలలో విహరింపజేస్తోంది
ఇలాంటి ప్రదేశం లోకంలో ఇంకెక్కడుంటుంది?

ముక్కూ ముఖం తెలియని నాలాంటి వాడిని
మీరు తప్ప ఇంకెవరు దగ్గరకు తీసుకుంటారు?
మీతో నాకేదో జన్మజన్మల బంధం ఉందనిపిస్తోంది
నిజమే
మీతో నా బంధం హృదయానుగతమే
అని అందరూ అంటున్నారు

ఓ జవ్వనీ ! మీ ఊరు చాలా బాగుంది
ఇక్కడకు రావడంతోనే నేను మైమరచి పోయాను
దానికితోడు నీ విరిసీ విరియని అందం
ముగ్ధమనోహరంగా ఉంది

మీ ఊరు చాలా బాగుంది
మీ ఊరు చాలా బాగుంది