నిత్యజీవితంలో ప్రతిఫలించని జ్ఞానం నిరర్ధకం

29, నవంబర్ 2015, ఆదివారం

Ay Dil Ab Kahin Le Ja - Hemanth Kumar



YouTube Link
https://youtu.be/__0sWgsiL5k


ఏ దిల్ అబ్ కహీ లేజా -- నా కిసీకా మై నా కోయీ మేరా....

రబీంద్ర సంగీత్ పాడటంలో మహాఘనుడైన "హేమంత్ కుమార్" స్వరంలో నుంచి సుతారంగా జాలువారిన ఒక మధుర విషాదగీతం ఇది.దీనిని విషాదగీతం అనడం కంటే పశ్చాత్తాపంతో బాధతో విరక్తితో పాడిన గీతం అనవచ్చు.ఈ పాట మూడ్ ఏదైనా, ఈ రాగం మాత్రం చాలా 'హాంటింగ్ మెలోడీ' అనే చెప్పాలి.షమ్మీ కపూర్ నటన ఈ పాటకు వన్నె తెచ్చింది.మామూలుగా కోతినటనకు మారుపేరైన షమ్మీ విషాదాన్ని కూడా ఎంత బాగా పండించగలడో ఈ పాటలో అతని అభినయం నిరూపిస్తుంది.

ఒక్కసారి మనసు పెట్టి వింటే కొన్ని రోజుల తరబడి ఈ రాగం మనల్ని వెంటాడుతూనే ఉంటుంది.అలాంటి మధురమైన రాగం ఇది.ఈ పాట భావం కూడా ఎంతో లోతైనదే.జీవితంలో చాలాసార్లు మనం ఎవరికోసమో వేచి ఉంటాం.వారికోసం ఎంతో ఎదురుచూస్తాం.వారిని ఎంతో ప్రేమిస్తాం.కానీ వాళ్ళు మనల్ని లెక్క చెయ్యరు. మన మనస్సును ఎంతమాత్రం అర్ధం చేసుకోరు.మనకోసం ఎదురుచూడరు. కనీసం మనల్ని ఒక మనిషిగా గుర్తించరు.ఇది జీవితంలో అందరికీ అనుభవమే.

అలాంటి వారికోసం మనం ఎందుకు ఆగాలి? మన సమయాన్ని మనం ఎందుకు ఇలాంటి వారికోసం వృధా చేసుకోవాలి?మనల్ని ఏమాత్రమూ లెక్కచెయ్యని వారికోసం మన పయనాన్ని ఎందుకు ఆపుకోవాలి?

ప్రేమవిలువ తెలియనివారికి,అద్భుతమైన మన ప్రేమను పంచాలని మనమెందుకు ప్రయత్నించాలి? అసలెందుకీ వృధా ప్రయాస?ఈ ఆత్మవిమర్శ ప్రతివారికీ జీవితంలో ఏదో సమయంలో తప్పకుండా వస్తుంది. అలాంటి సమయాలలో ఈపాటే మన చెవులలో వినబడుతుంది. ఊరకే వినబడటం కాదు.మార్మోగుతుంది.అనుక్షణం వెంటాడుతుంది.

వినగా వినగా ఈ పాట మన హృదయాన్ని తేలిక పరుస్తుంది.ఒక క్రొత్త ఉదయానికి తెరతీస్తుంది.ఒక నూతనగమ్యం వైపు నడిపిస్తుంది.

ఈ పాట సాహిత్యమూ సంగీతమూ రెండూ అద్భుతమైనవే.అందుకే 50 ఏళ్ళు గడచినా ఈ పాట ఈనాటికీ నిత్యనూతనంగా వెలుగుతూనే ఉంది.వినేవారిని మైమరపిస్తూనే ఉంది.

ఈ ట్యూన్ ని మన తెలుగులో కూడా వాడుకున్నారు.1968 లో రిలీజైన 'అమాయకుడు' సినిమాలో దేవులపల్లి కృష్ణశాస్త్రి వ్రాసిన 'మనిషైతే మనసుంటే- కనులు కరగాలిరా- కరిగి కరుణ కురియాలిరా- కురిసి జగతి నిండాలిరా' అనే పాటను ఘంటసాల మాస్టారు పాడగా బీ.శంకర్ సంగీతం సమకూర్చారు.ఆ పాట రాగం అంతకు ముందు 1963 లో రిలీజైన  'బ్లఫ్ మాస్టర్' సినిమాలోని ఈ పాట రాగమే.

ఈ పాటను ఇంతకు ముందు పాడినప్పటికీ, ప్రస్తుతం ఇంతకు ముందు కంటే ఇంకా 'క్లీన్ ట్రాక్' దొరికిందున మళ్ళీ పాడటం జరిగింది.

నా స్వరంలో కూడా ఈ మధురగీతాన్ని మళ్ళీ ఒకసారి వినండి మరి.

Movie:-Bluff Master (1963)
Lyrics:--Rajinder Krishan
Music:-Kalyanji Anandji
Singer:-Hemant Kumar
Actor:-Shammi Kapur
Karaoke Singer:-Satya Narayana Sarma

Enjoy.
-----------------------------------------------
Aey dil ab kahee le jaa,
Na kisee kaa mai na koyee mera

Aey dil ab kahee le jaa,
na kisee kaa mai na koyee mera
Aey dil

Jab chale ham raah uljhee--pyaar duniyaa ne kiya
Jab chale ham raah uljhee-- pyaar duniyaa ne kiya
Raah sidhee jab milee toh
Sabne thukra diya-- sabne thukra diya
Aey dil ab kahee le jaa
na kisee kaa mai na koyee mera
Aey dil

Naa kisee ko chaah meree-- naa kisee ko intjaar
Naa kisee ko chaah meree-- naa kisee ko intjaar
Kis liye phir mudke peeche
Dekhna baar baar-- dekhna baar baar
Aey dil ab kahee le jaa
na kisee kaa mai na koyee mera
Aey dil ab kahee le jaa
na kisee kaa mai na koyee mera

Aey dil
Aey dil
Aey dil
oo hooo...


Meaning:--

Oh my heart ! Take me now anywhere you want
I belong to none and nobody is mine
Oh my heart !

When I was on the wrong path
the world loved me very much
But when I stepped into the right path
Everyone ditched me

Oh my heart ! Take me now anywhere you want
I belong to none and nobody is mine
Oh my heart !

Nobody loves me
and nobody waits for me...
Then why should I stop
and look back again and again
For whom?

Oh my heart ! Take me now anywhere you want
I belong to none and nobody is mine
Oh my heart !

Oh my heart !
Oh my heart !