“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

17, జులై 2017, సోమవారం

నీలిమేఘాలలో గాలికెరటాలలో - ఘంటసాల - ఎస్. జానకి


పాతకాలపు చిత్రాలలోని పాటలు కొన్ని ఎన్ని తరాలు మారినా అలా అజరామరంగా నిలిచి ఉంటాయి. ఈనాడు పాడుకున్నా ఎంతో హాయిగా ఉంటాయి ఈ పాటలు.
అలాంటి నిత్యనూతన గీతాలలో ఇదీ ఒకటి. అందుకే 57 ఏళ్ళు గడచినా ఈ పాట ఇంకా మన స్మృతిపధంలో మెదులుతూనే ఉంది. మనల్ని అలరిస్తూనే ఉంది.

ఈ పాటను ఘంటసాల మాస్టారు పాడారు. అలాగే జానకి గారూ పాడారు. జానకి గారు తనదైన పై స్థాయిలో అలవోకగా పాడారు. సహజంగానే ఆడవాళ్ళ స్వరం చాలా షార్ప్ గా ఉంటుంది. ఘంటసాల మాస్టారు కొద్దిగా తక్కువ శ్రుతిలో మంద్రస్వరంలో పాడారు. ఎవరి శైలి వారిదే, ఎవరి శృతి వారిదే, ఎవరి మాధుర్యం వారిదే. రెండూ బాగానే ఉంటాయి. 

నా స్వరంలో కూడా ఈ పాటను వినండి మరి.

చిత్రం :-- బావా మరదళ్ళు (1960)
సాహిత్యం:--ఆరుద్ర
సంగీతం:-- పెండ్యాల
గానం:-- ఘంటసాల, ఎస్. జానకి (విడివిడిగా)
కరావోకే గానం:-- సత్యనారాయణ శర్మ
వినండి మరి
-----------------------------------

నీలి మేఘాలలో గాలికెరటాలలో
నీవు పాడే పాటా వినిపించునీ వేళా
నీలి మేఘాలలో 

ఏ పూర్వపుణ్యమో నీ పొందుగా మారీ - 2
అపురూపమై నిలచే నా అంతరంగానా
నీలి మేఘాలలో గాలికెరటాలలో
నీవు పాడే పాటా వినిపించునీ వేళా
నీలి మేఘాలలో 

నీ చెలిమిలో నున్న నెత్తావి మాధురులూ - 2
నా హృదయ భారమునే మరపింప జేయూ
నీలి మేఘాలలో 

అందుకోజాలనీ ఆనందమే నీవూ - 2
ఎందుకో చేరువై దూరమౌతావూ
నీలి మేఘాలలో గాలికెరటాలలో
నీవు పాడే పాటా వినిపించునీ వేళా
నీలి మేఘాలలో....