“అసమర్ధుని వద్ద ధనము, సుఖము, కీర్తి, ధర్మము ఏవీ నిలచి ఉండవు"

5, అక్టోబర్ 2009, సోమవారం

మరువలేని మూడు రోజులు

2-10-2009

తెల్లవారు జామున దాదాపు మూడు గంటలకు ఎందుకో మెలకువ వచ్చింది. తరువాత నిద్ర రాలేదు. ఏదో అసహనం గాఉంది. లెచి అటూ ఇటూ పచార్లు చెస్తున్నాను.ఇలా చాలా సార్లు గతంలో జరగటం తరువాత ఏదో దుర్వార్త వినటంజరిగింది. ఇలా ఆలోచిస్తున్నంతలో, కంట్రోల్ రూం నుంచి పోన్ వచ్చింది.

మంత్రాలయం స్టెషన్ అవతల ఉన్న తుంగభద్రా నది పొంగుతున్నది. వంతెన గర్డల్ల వరకూ నీళ్ళు వస్తున్నాయి. రైలుబండ్లు ఎక్కడివక్కడ ఆగి పొయాయి. మంత్రాలయం, మాధవరం,రామాపురం గ్రామాలు జలమయం అవుతున్నాయి. రాఘవెంద్ర స్వామి మటం కూడా మునిగిపొతున్నది.

చెన్నై-ముంబాయి రూటు, బెంగుళూరు-డిల్లీ రూటు ఇదే దారిలొ పోతాయి. కనుక ముఖ్యమైన రైళ్ళు అన్నీ దారిలోనే నడుస్తుంటాయి. గుంతకల్ నుంచి రాయచూరు మధ్యలొ కనీసం రెండు చొట్ల ట్రాక్ మీదుగా నీళ్ళుప్రవహిస్తున్నాయి. కింద ట్రాక్ ఉందో లెదో తెలీని స్థితి. కనుక ముందు జాగ్రత్తగా రైళ్ళు ఆపివేస్తున్నాము. వెంటనేబయలు దెరి కంట్రోలు రూం కు రావాలి. ఇదీ వచ్చిన సందేశం.

అయిదు నిమిషాల్లో తయారై కంట్రొల్ రూం కు చెరుకున్నాను. అప్పుడు మొదలైన పని 5-10-2009 ఉదయానికిపూర్తయింది. మూడు రొజులూ ఎప్పుడు తిన్నానో, ఏం తిన్నానో నాకే తెలీదు. నిద్ర పొయింది కొన్ని గంటలు మాత్రమే.

కంట్రోల్ రూంలో ఒక వంద మంది, బయట పీల్డు లో దాదాపు వెయ్యి మంది మూడు రొజులు పనిచెసి అనెక ప్రమాదాలునివారించ గలిగాం.ఎంతో మందిని కాపాడగలిగాం.

ఊళ్ళన్నీ మునిగిపోతుంటె, దాదాపు వెయ్యిమంది ప్రజలు 2-10-2009 ఉదయం అయిదు గంటలకే మంత్రాలయంస్టేషన్ కు చెరుకున్నారు. వారిని ముందుగా కాపాడాలి. రాయచూరులో రాత్రి హాల్ట్ చెసె ఒక పాసింజరు ట్రెయిన్ ను రెలీఫ్ స్పెషల్ గా మార్చి, పది కిలో మీటర్ల స్పీడులో పరవళ్ళు తొక్కుతున్న తుంగ భద్రా నది బ్రిడ్జి మీద నుంచితీసుకొచ్చి మంత్రాలయం స్టేషన్ లొ చిక్కుకున్న వెయ్యిమందిని అదే స్పీడులో నిదానంగా రాయచూరు చెర్చాము. అది మొదటిగా మెము చెసిన సాహసం.

తరువాత అన్ని పక్కల నుంచీ వస్తున్న ఎన్నో రైళ్ళను చుట్టు తిరిగుడు దారులలో పంపించెశాము. కాని రాజధాని ఎక్స్ప్రెస్, కర్నాటక ఎక్స్ ప్రెస్ మాత్రం రాయచూరు స్టేశన్ లొ చిక్కుకు పొయాయి. ముందూ ట్రాక్ లెదు, వెనుకా లెదు. కొట్టుకుపొయింది. రెండు రైళ్ళలొ కలిపి దాదాపు రెండు వెల మంది ప్రయాణీకులున్నారు.

వారిని రెండు రొజులు అదేస్టెషన్ లొ ఉంచి నీళ్ళు,ఆహారం, కోచ్ లకు ఏసీ సప్లై ఇస్తూ, వర్షాలు కొంచం తగ్గుముఖం పట్టేవరకూ ఉంచాము. ఈ లొగా హైద్రాబాద్ నుంచి రెండు ప్రత్యెక రైళ్ళను రప్పించాము. కాని అవి రాయచూరుకు దాదాపు నలభై కిలొమీటర్ల దూరంలోట్రాక్ కొట్టుకు పోయిన చొటికి వచ్చి ఆగిపొయాయి.

ముప్పై ఆరు కర్ణాటకా స్టెట్ బస్సులలొ వీరందరినీ వాగులూ వంకలూ దాటించి, నలభై కిలొ మీటర్లు ప్రయాణం చెయించి, అక్కడ యర్మరస్ అనే స్టేషన్ లో వెచి ఉన్న రైళ్ళలొ లగెజీలతో సహా ఎక్కించి వారిని షొలాపూర్ వరకూ తీసుకెళ్ళిఅక్కడకు ముంబాయి నుంచి ఇంకొక ప్రత్యెక రైలును రప్పించి, ఎవరి రైలు లొ వారిని మార్చి రెంటినీ వెటి దారులోవాటిని డిల్లీకి పంపాము. ప్రాసెస్ అంతా అవటానికి రెండున్నర రోజులు పట్టింది. అక్కడికి గండం గడిచింది.

ఇప్పుడు, అక్కడక్కడా దాదాపు నాలుగు కిలో మీటర్లు కొట్టుకు పోయిన ట్రాక్ ను తిరిగి వేసి రైళ్ళ రాకపోకల్ని తిరిగిసక్రమంగా నడిచెటట్లు చెయ్యలి. వందల మంది ఉద్యొగులు పని లో తలమునకలుగా ఉన్నారు. మా టీం కు ఇప్పటికి కొంచం ఊపిరి పీల్చుకునే వెసులుబాటు కలిగింది.

నిద్రాహారాలు లెకపొతే పొయె, మా పని మెము చక్కగా చెసామని, ఎందరినో రక్షించగలిగామని, ఆత్మ తృప్తి మాకు కలిగింది. ఈ మూడు రొజులలో ఆదొని, మంత్రాలయం, కర్నూలు జిల్లాలలో ఎన్నో అనుభవాలు, ఎన్నొ విషాద గాధలు, దృశ్యాలు కళ్ళారా చూచాము. అవన్నీ రాస్తె అదె ఒక పుస్తకం అయ్యేంత ఉంది. ఇదీ క్లుప్తంగా ఈ మూడు రొజుల చరిత్ర.