“అసమర్ధజాతికి ఆత్మగౌరవ అర్హత ఉండదు"

20, మే 2018, ఆదివారం

Aayi Baharon Ki Shaam - Mohammad Rafi


Aayi Baharon Ki Shaam

అంటూ మహమ్మద్ రఫీ మధురాతి మధురంగా ఆలపించిన ఈ గీతం 1969 లో వచ్చిన Waapas అనే చిత్రంలోనిది. ఇది కూడా మరపురాని మధురగీతాలలో ఒకటే. ఈ రోజుల్లో ఇలాంటి ఉదాత్తమైన భావాలతో పాటలు వ్రాసే కవులూ లేరు. ఇలాంటి మధుర రాగాలను కూర్చేవారూ పాడేవారూ ఎవ్వరూ లేరు. నేటి సినిమా పాటలు వినాలంటేనే భరింపరాని అసహ్యంగా తయారైంది. అందుకే 50 ఏళ్ళ తర్వాత కూడా ఇలాంటి పాటలను మనం వెదుక్కుని మరీ వింటున్నాం పాడుతున్నాం.

నా స్వరంలో కూడా ఈ మధురగీతాన్ని వినండి మరి. నా పాట అని చెబుతూ రఫీ సాంగ్ ని పోస్ట్ చేశానని భ్రమించకండి. అక్షరాలా నేనే పాడాను.

Movie:--Waapas (1969)
Lyrics:--Majrooh Sultanpuri
Music:--Laxmikant Pyarelal
Singer:-- Mohammad Rafi
Karaoke Singer:-- Satya Narayana Sarma
Enjoy
----------------------------
Ayi baharon ki shaam – 2
Kya jane phir kiske naam
Thandi hawa bheegi fiza
Laayi hai phir kiska salam
Ayi baharon ki shaam
Kya jane phir kiske naam
Ayi baharon ki shaam

[Sitaron ne baandha gagan par
Sama jaise khilte gulon ka ]-2
Sunsaan sapno bhari waadiyo me
Chaandni se saje Raaston ka
Ghata ne kiya intzaam
Kya jane phir kiske naam
Ayi baharon ki shaam

[Mai gaatahu kis dilrubaa ki
Mohabbat ke rangee taraane]-2
Koun aanewala hai tanhaayiyo me
Chupke chupke ye dilme na jane
Dhadakta hai kiska payaam
Kya jane phir kiske naam
Ayi baharon ki shaam

[Kiseene pukara hai jaisi
Mujheeko behekte labon se]-2
Leherake achal khusbu udake
Mehendiwali hasi ungliyon se
Banaya tamanna ka jaam
Kya jane phir kiske naam
Thandi hawa bheegi fiza
Laayi hai phir kiska salam
Ayi baharon ki shaam
Ayi baharon ki shaam

Meaning

Evening of spring season has arrived
who knows in whose honor?
this cool breeze, this cool weather
whose greeting they have brought again?

The stars of the sky have set
the mood of the blooming flowers
In the desolate valleys
full of dreams and hopes
In the paths of Moonbeams
the clouds have made an arrangement
who knows in whose honor?
The evening of spring has arrived

Who is the sweetheart for whom I sing
these splendid songs of love
who will come to my lonely place in silent steps?
I don't know who she will be
Whose message is throbbing in my heart?
who knows in whose honor?
The evening of spring has arrived

As if someone has called me
with her passionate lips
by waving her veil and tossing her fragrance
with her lovely painted fingers
has prepared a goblet of wine for me

who knows in whose honor?
The evening of spring has arrived

తెలుగు స్వేచ్చానువాదం

వసంతపు సాయంత్రం అరుదెంచింది
ఎవరి కోసమో?
ఈ చల్లని గాలి, ఈ చల్లని సాయంత్రం
మళ్ళీ ఎవరి సందేశాన్ని మోసుకొచ్చాయో?

ఆకాశంలోని నక్షత్రాలు
నేలపైన విరుస్తున్న పూలకు
ప్రేమ సందేశాన్ని పంపుతున్నాయి
కలలతో ఆశలతో నిండిన ఒంటరి లోయలలో
చంద్రకిరణాల దారులలో
మేఘాలు ఏవో ఏర్పాట్లు చేశాయి
ఎవరి కోసమో?

ఎవరికోసమైతే నేనీ
మధుర ప్రేమగీతాలను పాడుతున్నానో 
ఆమె ఎవరో?
నిశ్శబ్దపు అడుగులతో నేనున్న
ఈ ఏకాంతప్రదేశానికి తనొస్తుందా?
ఏమో?
నా గుండెలో ప్రతిధ్వనిస్తున్న
ఈ సందేశం ఎవరిదో?

ప్రేమతో నిండిన పెదవులతో
తను నన్ను పిలిచినట్లు
తన మేలిముసుగును నాపైన విసరి
తన మేని సుగంధాన్ని
నా చుట్టూ విరజిమ్మినట్లు అనిపిస్తోంది
గోరింటాకుతో ఎర్రబడిన తన చేతులతో
నాకోసం కోర్కెల మధుపాత్రను
సిద్ధం చేసే ఉంటుంది

వసంతపు సాయంత్రం అరుదెంచింది
ఎవరి కోసమో?
ఈ చల్లని గాలి, ఈ చల్లని సాయంత్రం
మళ్ళీ ఎవరి సందేశాన్ని మోసుకొచ్చాయో?