“అసమర్ధజాతికి ఆత్మగౌరవ అర్హత ఉండదు"

26, మే 2018, శనివారం

Dil Doondta Hai Phir Wohi - Lata Mangeshkar, Bhupender


Dil Doondta Hai Phir Wohi Fursat Ke Raat Din

అంటూ లతా మంగేష్కర్, భూపేందర్ లు మధురంగా ఆలపించిన ఈ గీతం 1975 లో వచ్చిన Mousam అనే చిత్రంలోనిది. ఈ గీతం ఒక మరపురాని మధురగీతం. ఈ చిత్రానికి సంగీత దర్శకుడు మదన్ మోహన్ ఎంతో చక్కటి రాగాన్ని సమకూర్చాడు. పాతతరం సంగీత దర్శకులలో ఈయన చెయ్యని మెలోడీలు లేవు. ఈయన చేసిన ప్రతిపాటా ఒక మరపురాని మధురగీతమే.

ఈ పాటను వ్రాసినది గుల్జార్. ఇక ఎంత చక్కని భావాలను దీనిలో పొందుపరచాడో చెప్పనవసరం లేదు. గుల్జార్ పేరే చాలు ఎంత చక్కని పాటలు ఆయన కలంలోనుంచి జాలువారుతాయో చెప్పడానికి.

ఇకపోతే, భూపేందర్ స్వరం జలుబు గొంతులాగా ఉంటుంది. ఈయన నార్త్ ఈస్ట్ నుంచి వచ్చిన గాయకుడు. కానీ ఈయన స్వరంలో ఏదో తెలియని ఒక మాధుర్యం ఉంటుంది. నేనాయనను అనుకరించకుండా సాధ్యమైనంత వరకూ నాలాగే పాడాను.

ఈ సినిమా నేను చూడలేదు. ఈ పాటను ఎవరి మీద చిత్రీకరించారో కూడా నాకు తెలీదు. యూట్యూబ్ లో చూడవచ్చు. కానీ వీడియో చూచి, ఈ పాట ఇచ్చే మధురానుభూతిని పోగొట్టుకోవడం నాకిష్టం లేదు. అందుకే దాని జోలికి పోలేదు.

నాకు చాలా ఇష్టమైన పాటల్లో ఇదీ ఒకటి. ట్రాక్ లో లతాజీ స్వరం అలాగే ఉంటుంది. భూపేందర్ బదులు నేను పాడాను.

నా స్వరంలోకూడా ఈ మధురగీతాన్ని వినండి మరి.

Movie :-- Mausam (1975)
Lyrics :-- Gulzaar
Music:-- Madan Mohan
Singers:--Lata Mangeshkar, Bhupendar
Karaoke Singer :-- Satya Narayana Sarma
Enjoy
----------------------------------------
Dil doondta hai Phir wohi - Phursat ke raat din
Baithe rahe tasavvur E jaana kiye huye
Dil doondta hai Phir wohi - Phursat ke raat din

Jaadon ki narm dhoop aur - Aangan me let kar - 2
Aakhon me kheench kar tere - Daaman ke saaye ko
Andhe pade rahe kabhee - karvat liye huye
Dil doondta hai Phir wohi - Phursat ke raat din
Dil doondta hai Phir wohi

Ya garmiyon ki raat jo - Purvaayiyan chale - 2
Thandi safed chadaron pe - Jage der tak
Taronko dekhte rahe - Chat par pade huye
Dil doondta hai Phir wohi - Phursat ke raat din
Dil doondta hai Phir wohi

Barfilee sardiyon me - Kisi bhi pahaad par - 2
Vaadi me goonjti huyee - Khamoshiyan sune
Aakhon me bheege bheege se - Lamhe liye huye
Dil doondta hai Phir wohi

Dil doondta hai Phir wohi - Phursat ke raat din - 2
Baithe rahe tasavvur E jaana kiye huye
Dil doondta hai Phir wohi - Phursat ke raat din
Dil doondta hai Phir wohi

Meaning

Once again, my heart is searching for
those lazy days and nights
Just sitting and thinking
and painting your picture in my mind

Relaxing in the backyard
in the mild winter sunlight
just pulling your shadow onto my eyes
at times lying face down
at others, curling up on my side
Once again, my heart is searching for
those lazy days and nights

Again, in the windy summer nights
Staying awake till late night
on cool white bed sheets
Lying on the roof and gazing at the stars
Once again, my heart is searching for
those lazy days and nights

In rainy season, on some snowy mountain
listening to the silence of the valleys
Taking the shower of rainy moments into my eyes
Just sitting and thinking
and painting your picture in my mind
Once again, my heart is searching for
those lazy days and nights

తెలుగు స్వేచ్చానువాదం

మళ్ళీ ఒకసారి నా హృదయం నెమరు వేస్తోంది
ఆ బద్ధకపు రాత్రులు పగళ్ళను.
ఊరకే కూర్చుని ఆలోచిస్తూ
నిన్ను నా మనోఫలకం మీద చిత్రీకరిస్తూ
గడిపిన రోజులను
మళ్ళీ ఒకసారి నా హృదయం నెమరు వేస్తోంది

పెరట్లో శీతాకాలపు ఎండలో పడుకుని
నీ నీడను నా కన్నుల మీదకు లాక్కుని
కొన్ని సార్లు బోర్లా పడుకుని
కొన్ని సార్లు మూడంకె వేసుకుని
నీ గురించి కలలు కంటూ గడిపిన రోజులను
మళ్ళీ ఒకసారి నా హృదయం నెమరు వేస్తోంది

కొన్నిసార్లు ఎండాకాలపు రాత్రులలో
చల్లని దుప్పటేసుకుని
డాబామీద పడుకుని
చీకట్లో ఆకాశంలోని చుక్కలను చూస్తూ 
నిన్ను తలచుకుంటూ రాత్రంతా మేలుకున్న రోజులను
మళ్ళీ ఒకసారి నా హృదయం నెమరు వేస్తోంది

వర్షాకాలపు చలిలో
ఏదో ఒక కొండమీద కూచుని
వానతుప్పర్లు మీదపడుతుండగా
లోయలు చెప్పే మౌనపు ఊసులు వింటూ
ఆ వర్షపు క్షణాలను కన్నులలో పొదువుకుంటూ
నిన్ను స్మరిస్తూ గడిపిన రోజులను
మళ్ళీ ఒకసారి నా హృదయం నెమరు వేస్తోంది

ఆ బద్ధకపు రాత్రులు పగళ్ళను.
ఊరకే కూర్చుని ఆలోచిస్తూ
నిన్ను నా మనోఫలకం మీద చిత్రీకరిస్తూ
గడిపిన రోజులను
మళ్ళీ ఒకసారి నా హృదయం నెమరు వేస్తోంది