మొన్నా మధ్యన ఒకాయన నుంచి ఫోనొచ్చింది. నా నెంబర్ నా బ్లాగులో బాహాటంగానే లభిస్తుంది గనుక దానిని చూచి చాలామంది ఫోనులు చేసి అనేక సందేహాలు అడుగుతూ ఉంటారు. నాకు తోచినవి చెబుతూ ఉంటాను. అందులో చాలా జవాబులు వాళ్లకు నచ్చవని నాకు తెలుసు. కానీ వారికి నచ్చినా నచ్చకపోయినా నేను చెప్పేది చెబుతూ ఉంటాను. దానిని ఆచరిస్తారో లేదో నాకనవసరం.
'ఏమండి? మా అబ్బాయి మీ బ్లాగులు చదివి మొండిగా తయారౌతున్నాడు. పెళ్లి చేసుకోనంటున్నాడు. మీతో మాట్లాడాలట. ఎప్పుడు రమ్మంటారు?' అడిగిందొక స్వరం చాలా విసుగ్గా.
ఏ ఫోన్ కాలైనా సరే, నేను వెంటనే ఎవరినీ నమ్మను. ఈ అలవాటొకటి రెండు మూడేళ్ళ నుంచీ మొదలైంది. అంతకు ముందు అమాయకంగా అందరినీ నమ్మేవాడిని. కొన్ని ఎదురుదెబ్బలు తగిలాక ఇలా మారాను. ఇప్పుడెవరైనా సరే, ఒకటికి రెండు సార్లు నన్ను కలిసి మాట్లాడితే, వాళ్ళను బాగా పరీక్షించిన తర్వాతే నమ్ముతున్నాను.
'మీ అబ్బాయి పెళ్లి చేసుకోనంటే నేనేం చెయ్యను? డాక్టర్ సమరానికి చూపించండి' అన్నా నేనూ విసుగ్గానే.
'ఎందుకు? మావాడు నిక్షేపంలా ఉన్నాడు. అలాంటి ప్రాబ్లంస్ ఏమీ లేవు. మీ బ్లాగులు చదివి చెడిపోతున్నాడంతే.' అంది కంఠం.
'బ్లాగులు చదివీ, న్యూస్ పేపర్ చదివీ చెడిపోయేవాడిని ఎవరూ బాగు చెయ్యలేరు. అతను చెడిపోవాలనే ఆశపడుతున్నాడేమో? మీరాపితే ఆగుతాడా?' అన్నాను.
అతను కొంచెం తగ్గాడు.
'అది కాదండి. ఎక్కువ సమయం తీసుకోము. మిమ్మల్ని కలిసి మాట్లాడాలని ఉంది మావాడికి. కొంచం టైం ఇవ్వండి' అన్నాడు.
'అలా అయితే సరే. వచ్చే శనివారం సాయంత్రం అయిదుకు మా ఇంటికి రండి' అని చెప్పాను.
అనుకున్నట్లుగానే శనివారం సాయంత్రం నాలుగున్నరకే నేను రెడీ అయి కూచుని ఉన్నాను. కానీ వాళ్ళు అయిదున్నరకు కూడా రాలేదు. ఎవరైనా సరే, చెప్పిన టైంకు రాకపోతే నాకు మహా చిరాగ్గా ఉంటుంది. నేను ఎవరికైనా మాటిస్తే ఖచ్చితమైన టైంను పాటిస్తాను. ఎదుటివారు కూడా అలా పాటించాలని కోరుకుంటాను.
చివరకు వాళ్ళు అయిదూ నలభైకి వచ్చారు. లేటైనందుకు కనీసం 'సారీ' కూడా చెప్పకుండా డైరెక్టుగా విషయంలోకి వచ్చాడాయన. అక్కడే వాళ్ళు ఎంత స్వార్ధపరులో నాకు అర్ధమైపోయింది.
'వీడేనండి మావాడు. ఏదో అడుగుతానన్నవుగా అడుగు' అన్నాడాయన మా ఇంటి నిరాడంబరతను నిర్లక్ష్యంగా చూస్తూ. ఆ అబ్బాయికి పాతికేళ్ళు ఉంటాయి. కొంచం బిత్తర బిత్తరగా ఉన్నాడు.
నేను వాళ్ళిద్దర్నీ మౌనంగా గమనిస్తూ కూచుని ఉన్నాను.
'సార్. నాకు పెళ్లి చేసుకోవాలని లేదు.' అన్నాడా అబ్బాయి.
'చేసుకోబోకు. దానికి నన్నేం చెయ్యమంటావు?' అడిగాను.
వింటున్న వాళ్ళ నాన్న కల్పించుకుని 'అదేంటండి అలా చెప్తారు? చేసుకోమని చెప్పండి' అన్నాడు గదుముతున్నట్లు.
'మీ మాటలు నేను చెప్పే పనైతే, మీరిక్కడి దాకా రావడం ఎందుకు? ఆ మాటలేవో మీరే చెప్పి ఉండవచ్చు కదా? అంటూ ఆ అబ్బాయి వైపు తిరిగి 'ఎందుకు నాయనా పెళ్లి వద్దంటున్నావు?' అన్నాను.
'నాకు ఆధ్యాత్మిక చింతన ఎక్కువగా ఉంది. అందుకని సన్యాసం తీసుకుందామని అనుకుంటున్నాను' అన్నాడు.
'రెండింట్లో నీకిష్టమైంది నువ్వు చేసుకో బాబు. మధ్యలో నాదగ్గరకు ఎందుకు వచ్చావ్?' అడిగాను.
'నేను మీ బ్లాగులు చదువుతూ ఉంటాను. మీ భావాలు నాకు నచ్చుతాయి. మీరెలా చెయ్యమంటే అలా చేస్తాను' అన్నాడు.
'అదేంటి? పెళ్లి చేసుకున్నాక సంసారం కూడా నేను చెప్పినట్లు చేస్తావా? లేక నీ ఇష్టం వచ్చినట్లు చేస్తావా?' అడిగాను.
అతను పిచ్చి చూపులు చూస్తున్నాడు.
ఈ కాలంలో కూడా ఇలాంటి వాళ్ళు ఇంకా ఉన్నారా అనిపించి నవ్వొచ్చింది.
'పెళ్లి చేసుకో నాయనా. తప్పేముంది?' అన్నాను.
'అలా కాదండి. నాకు వైరాగ్యం బాగా ఎక్కువగా ఉంది. అందుకని చేసుకోలేను. సన్యాసం తీసుకుంటాను.' అన్నాడు మళ్ళీ.
'పోనీ అలాగే తీసుకో. నీకు సన్యాసం ఇవ్వడానికి సిద్ధంగా ఎవరున్నారు?' అన్నాను.
'స్వామీ క్విక్కానంద గారని ఒక స్వామీజీ ఉన్నారు. ఈరోజు ఆశ్రమంలో చేరితే రేప్పొద్దున్నే సన్యాసం ఇస్తారు. రమ్మన్నారు.' అన్నాడు.
'ఎంతేంటి ప్యాకేజీ?' అందామని నోటిదాకా వచ్చి ఆగిపోయింది.
'స్వామీ క్విక్కానంద గారని ఒక స్వామీజీ ఉన్నారు. ఈరోజు ఆశ్రమంలో చేరితే రేప్పొద్దున్నే సన్యాసం ఇస్తారు. రమ్మన్నారు.' అన్నాడు.
'ఎంతేంటి ప్యాకేజీ?' అందామని నోటిదాకా వచ్చి ఆగిపోయింది.
'అలా ఫాస్ట్ ఫుడ్ లాగా ఫాస్ట్ సన్యాసం తీసుకుని ఏం చేద్దామని అనుకుంటున్నావు?' అడిగాను.
'అదే భయంగా ఉంది. అసలు నేను సన్యాసిగా నిలబడగలనా? లేదా? నా జాతకం చూచి మీరు చెప్పండి' అన్నాడు.
'భయమా? ఎందుకు? అయినా దీనికి జాతకం చూడటం ఎందుకు? జాతకంతో పని లేకుండానే చెబుతాను.' అన్నా.
'సరే చెప్పండి'
'నువ్వొక పని చెయ్యి బాబు. పెళ్లి చేసుకో. కానీ సంసారం చెయ్యకు. బ్రహ్మచారిగా ఉండు'. అన్నాను.
వాళ్ళ నాన్న అసహనంగా కదులుతున్నాడు.
'అదేంటండి?' అన్నాడు యువకుడు.
'అవును. నాయనా. నువ్వు ఏదీ తెల్చుకోలేకపోతున్నావు గనుక. ఈ పద్ధతి ఫాలో అవ్వు. అప్పుడు రెండు కోరికలూ తీరుతాయి. నువ్వు పెళ్లిచేసుకోవాలన్న మీ నాన్నగారి కోరిక కూడా తీరుతుంది.' అన్నాను.
'ఆ తర్వాత ఆ అమ్మాయి ఊరుకోకపోతే అప్పుడు నేనేం చెయ్యాలి?' అడిగాడు భయంగా.
'తూర్పుకు తిరిగి దణ్ణం పెట్టు' అందామని నోటిదాకా వచ్చింది.
బాగుండదని సంభాళించుకుని 'అప్పుడు తనే నిన్నొదిలేసి సన్యాసం తీసుకుంటుంది. లేదా తనకు నచ్చిన ఇంకొకడిని చేసుకుని వెళ్ళిపోతుంది. మరీ మంచిదే కదా. నీ మీద నింద ఉండదు. అప్పుడు నీ ఇష్టం వచ్చినట్లు నువ్వు ముగ్గులేసుకుంటూ స్వెట్టర్లు అల్లుకుంటూ పేరంటాలకెళుతూ హాయిగా ఉండొచ్చు' అన్నా.
'అలా కాదండి. జాతకం ఏం చెబుతోంది?' అన్నారు ఇద్దరూ.
సరే ఉండమని, వాళ్ళ తృప్తి కోసం, జాతకం వేసి చూచాను. అపుడు వాళ్ళతో ఇల్లా చెప్పాను.
'నీ ప్రస్తుత మానసిక పరిస్థితినే నీ జాతకం చూపిస్తోంది. నువ్వు ఎటూ తేల్చుకోలేకుండా ఉన్నావు. అంతే. ' అన్నాను.
'మరి నన్నేం చెయ్యమంటారు?' అడిగాడు.
'చెప్పా కదా నా సలహా ఏమిటో. నువ్వేం చెయ్యాలో నువ్వు తేల్చుకోవాలి. నేను చెప్పను. నీ జీవితం నీ చేతుల్లో ఉంది నా చేతుల్లో లేదు.' అన్నాను.
'మీ మీద నాకు చాలా నమ్మకం. మిమ్మల్ని నా గురువుగా భావిస్తున్నాను' అన్నాడా అబ్బాయి.
'నిజంగా?' అడిగాను.
'నిజ్జం' అన్నాడు నమ్మకంగా.
మళ్ళీ నవ్వొచ్చింది. ఎందుకంటే, ఇదొక బిస్కెట్ అని నాకు బాగా తెలుసు. ఇలాంటి బిస్కేట్లకు పడటం మానేసి చాలా కాలమైంది.
'మీరు నా గురువు' అని చెబుతూ వాళ్ళ ఇష్టం వచ్చినట్లు చేస్తున్నవారిని ఎంతోమందిని నేను చూస్తున్నాను. వాళ్ళ మనసు చెప్పే పనులు చేసుకోడానికి నన్ను ఒక సపోర్ట్ గా వాడుకునేవారే గాని నిజంగా నేను చెప్పినవి ఆచరించేవారు నాకింతవరకూ తారసపడలేదు. అసలు గురుత్వం అనేదే ఒక పెద్ద ఫార్స్ ! నిజమైన గురువులూ ఎక్కడా లేరు. శిష్యులు అంతకంటే లేరు. అంతా పెద్ద మాయ !
'అలాగా ! సరే ఒక పని చేద్దాం. ఈ రోజునుంచీ మా ఇంట్లో నా శిష్యుడిగా ఉండిపో. ముందుగా నీ సెల్ ఫోన్ నేను లాగేసుకుంటాను. నా దగ్గరున్నంత వరకూ దానిని నువ్వు వాడటానికి వీల్లేదు. ఆ తర్వాత మా ఇంటిపనీ, వంట పనీ, బజారుపనీ అన్నీ నువ్వే చూసుకోవాలి. నేను కనీసం మంచంనుంచి క్రిందకు కూడా దిగను. అన్నీ అక్కడికే అందించాలి. నా బట్టలు ఉతకడం, ఇస్త్రీ చెయ్యడం మాత్రమే గాక, నేను ఏ పని చెబితే ఆ పని ఏ మాత్రం సంకోచించకుండా చెయ్యాలి. మా ఇంట్లో పనిమనిషి కూడా లేదు. అంతా నువ్వే. కానీ జీతం మాత్రం రూపాయి కూడా ఇవ్వను.
మధ్యమధ్యలో నాకు కోపం వస్తే నిన్ను తిడతాను, కొడతాను, తంతాను కూడా. అయినా నువ్వు ఏమీ అనకూడదు. కనీసం నీ ముఖంలో ఫీలింగ్స్ కూడా మార్చకూడదు. నేనేమో నా శిష్యురాళ్ళతో వీడియో చాట్ చేసుకుంటూ ఏసీ రూములో హాయిగా పడుకుంటాను. నువ్వు రాత్రి పన్నెండు వరకూ నా కాళ్ళు పట్టి ఆ తర్వాత క్రింద పార్కింగ్ లో కార్ల మధ్యన చాపేసుకుని పడుకోవాలి. మళ్ళీ పొద్దున్న నాలుక్కే లేచి చన్నీళ్ళు స్నానం చేసి నాలుగున్నర కల్లా నా ఆర్డర్స్ కోసం నా రూమ్ బయట వెయిట్ చేస్తూ ఉండాలి. నువ్వు తిన్నా తినకపోయినా, నీకు వొంట్లో బాగా లేకపోయినా నేను పట్టించుకోను. కనీసం నువ్వు తిన్నావా లేదా అనేది కూడా అడగను. నాకు మాత్రం టైం తప్పకుండా అన్నీ అమర్చి పెడుతూ ఉండాలి. నువ్వు మీ వాళ్ళను ఎవరినీ కలవడానికి వీల్లేదు. మీ నాన్నగారు మా ఇంటి చాయలకు కూడా రావడానికి ఒప్పుకోను. వస్తే ఆయనకు కూడా దేహశుద్ధి జరుగుతుంది. నాకు మార్షల్ ఆర్ట్స్ బాగా వచ్చని నువ్వు గుర్తుంచుకోవాలి. అప్పుడప్పుడు నా పంచింగ్ బ్యాగ్ పాడైపోయినప్పుడు నిన్నే పంచింగ్ బ్యాగ్ గా వాడుతాను. నువ్వు కిమ్మనకూడదు. ఆ విధంగా కొన్నాళ్ళు నా దగ్గర ఉన్నావంటే అప్పుడు నాకు నీ మాటమీద నమ్మకం కుదురుతుంది. అప్పుడు నీ బాధ్యత పూర్తిగా నేను వహిస్తాను.' చెప్పాను.

వాళ్ళ నాన్న బుసలు కొడుతూ పేలిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు.
'అలా ఎన్నాల్లుండాలి?' అడిగాడు అబ్బాయి.
'చెప్పలేను. కనీసం ఒక ముప్పై ఏళ్ళు పట్టచ్చు. లేదా ఇంకా ఎక్కువే పట్టచ్చు. ఎన్నేళ్ళైనా సరే నువ్వు ఎదురు చెప్పకూడదు. అలా ఉంటే, అప్పుడు నేనంటే నీకు గురుభావం ఉందని నమ్ముతాను. అలా కొన్నేళ్ళు పోయాక నాకు బుద్ధి పుట్టినపుడు నువ్వు పెళ్లి చేసుకోవాలా లేదా సన్యాసం తీసుకోవాలా అనేది చెబుతాను. అంతవరకూ నువ్వు బుద్ధిగా వెయిట్ చెయ్యాలి. అదీ శిష్యత్వం అంటే.' అన్నాను.
'అదేంటి సార్. శిష్యుడంటే అలా ఉండాలా? నేనెక్కడా చదవలేదే?' అన్నాడు.
'చదవకపోతే పోనీలే. నేను చెబుతున్నాను కదా. ఇప్పుడు విను.'
ఆ అబ్బాయి అయోమయంగా చూస్తున్నాడు.
అప్పటిదాకా అసహనంగా కదుల్తున్న వాళ్ళ నాన్న నోరు విప్పాడు.
'ఏంటండి ఇదంతా? మావాడు అడిగేదేంటి మీరు చెప్పేదేంటి? మమ్మల్ని చూస్తె తమాషాగా ఉందా?'
ఇక ఇలా కాదని, నేనూ విషయం లోకి వచ్చాను.
'చూడండి. మీ ప్రశ్నకు నా జవాబులు రెండే. ఒకటి. మీ వాడికి ఏది అనిపిస్తే అది చేసుకోనివ్వండి. రెండు. నన్ను గురువుగా స్వీకరిస్తే నేను చెప్పినట్టు వినమనండి. అంతే. మూడో మాట ఇందులో ఉండదు.
అసలు విషయం ఏమంటే, మీవాడు సన్యాసానికీ పనికి రాడు సంసారానికీ పనికిరాడు. రెండూ కష్టమైనవే. ఏదీ తేలికైనది కాదు. సన్యాసం అంటే బజారుకెళ్ళి కూరగాయలు కొనుక్కోవడం కాదు. దాని నియమనిష్టలను మీవాడు ఒక్కరోజు కూడా తట్టుకోలేడు. కనుక సన్యాసిగా మీవాడు ఉండలేడు. పోతే, సంసారిగా కూడా మీవాడు పనికిరాడని నా ఉద్దేశ్యం. ఎందుకంటే మీవాడు ఏదో బిత్తర బిత్తరగా ఆడపిల్లలాగా కులుకుతున్నాడు. ఈ రోజుల్లో ఎవరో టీవీ యాంకర్లు తప్ప ఆడపిల్లలే అలా కులకడం లేదు. అతనికి ఏదో హార్మోన్ లోపాలున్నాయని నా నమ్మకం. మీవాడు నా బ్లాగు చదివి చెడిపోవడం లేదు. చెడిపోవడానికి ఒంట్లో హార్మోన్స్ అన్నీ నార్మల్ కంటే ఎక్కువగా పనిచేస్తూ ఉండాలి. చెడిపోవడం అందరి వల్లా కాదు. మీవాడి వల్ల అసలే కాదు. ముందు మీ వాడిని మంచి డాక్టర్ కి చూపించండి. అంతా సర్దుకుంటుంది.
ఇంకోమాట. అయిదుకు వస్తానని మీరు చెప్పి అయిదూ నలభైకి వచ్చారు. అంటే మీకు సమయం విలువ తెలీదన్నమాట. అది తెలీనప్పుడు సంసారమూ కుదరదు సన్యాసమూ కుదరదు. నాతో అస్సలే కుదరదు. మీకోసం ఈ రెండు గంటలు నా జీవితంలో వెచ్చించినదే చాలా ఎక్కువ. ముందు మీరెళ్ళి ఒక మంచి డాక్టర్ని కలవండి. అంతవరకు ఇతనికి పెళ్లి చేసి ఇంకో ఆడపిల్ల జీవితం నాశనం చెయ్యకండి.' చెప్పాను.
ఆయన కోపంగా చూస్తూ 'పదరా పోదాం!' అని వాళ్ళబ్బాయిని తీసుకుని అదే పోత పోయాడు.
కధ కంచికి మనం ఇంట్లోకి !