“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

6, మే 2018, ఆదివారం

Ay Husn Zara Jaag - Mohammed Rafi


Ay husn zara jaag tujhe ishq jagaaye

అంటూ మహమ్మద్ రఫీ మృదుమధురంగా ఆలపించిన ఈ గీతం 1963 లో వచ్చిన Mere Mehboob అనే చిత్రంలోనిది. ఈ గీతాన్ని స్వరపరచింది మధుర సంగీత దర్శకుడు నౌషాద్. అందుకే ఇది ఈ నాటికీ మరపురాని మధురగీతంగా నిలిచి ఉంది. నిద్రపోతున్న ప్రియురాలిని ఆ నిద్రనుంచి సుతారంగా ప్రేమగా లేపే గీతం ఇది.

1963 ప్రాంతంలో ఎంతో భావుకతతో కూడిన మధురగీతాలు హిందీ సినిమాలలో చాలా వచ్చాయి. వాటిల్లోనుంచి నాకు చాలా ఇష్టమైన పాటలలో ఇది ఒకటి. ఈ పాటలో ఎంతో ఆధ్యాత్మిక సౌందర్యం ఉందని నా అనుభవం చెబుతోంది.

నా స్వరంలో కూడా ఈ పాటను వినండి మరి !

Movie:-- Mere Mehaboob (1963)
Lyrics:-- Shakil Badayuni
Music:-- Naushad
Singer:--Mohammad Rafi
Karaoke Singer:-- Satya Narayana Sarma
Enjoy
--------------------------------------------------
Ay husn zara jaag tujhe ishq jagaye – 2
Badle meri taqdeer jo – tu hosh me aaye – 2
Ay husn zara jaag tujhe ishq jagaye

Ye pyarke nagme ye - Muhabbat ke taraane
Tujhko bade armaan se - Aayahu sunane
Ummeed mere dilki kahi - toot na jaaye
Ay husn zara jaag tujhe ishq jagaye

Saaze dile khamosh me - Ik soz jagaake
Tubhi meri aawaaz me - Aawaaz milade
Aayahu tere darpe badi - aas lagaye
Ay husn zara jaag tujhe ishq jagaye

Ye shamma tu aajaa zara - Chilmanse nikalke
Hasrat heke rehjaavu teri - aagme jalkea
Parvaana vokya tujhpejo – mitkar na dikhaye

Ay husn zara jaag tujhe ishq jagaye
Badle meri taqdeer jo – tu hosh me aaye
Ay husn zara jaag tujhe ishq jagaye

Meaning

Oh lovely beauty ! Just wake up
to my tune of love
when you wake up
my fate will shine better

These tunes of love, these melodies of infatuation
with great passion, I have brought them
to sing before you
Don't destroy the hopes of my heart
Oh lovely beauty ! Just wake up

In the lonely and silent space of my heart
let a melody of passion arise
In that lovely space, join your voice with mine
I have come to your doorstep
with great hopes
Oh lovely beauty ! Just wake up

O lovely flame ! come out from your hiding
It is my desire to get burnt in your fire
If a moth cannot show its courage by dying in a flame
what kind of a moth it is?

Oh lovely beauty ! Just wake up
to my tune of love
when you wake up
my fate will shine better

తెలుగు స్వేచ్చానువాదం

ఓ సుప్త సౌందర్యమా ! కొంచం కళ్ళు తెరువు
నా ప్రేమగానం నిన్ను మేల్కొలుపుతోంది
నువ్వు నిద్రలేస్తే చాలు
నా జాతకం మారిపోతుంది

ఈ ప్రేమ గీతాలు, ఈ సుమధుర రాగాలు
నీకోసం ఎంతో ఆర్తితో తెచ్చాను
నీకు వినిపిద్దామని
నా హృదయపు ఆశలను భగ్నం చెయ్యవని
అనుకుంటున్నాను

నిశ్శబ్దంగా ఉన్న నా గుండె లోగిలిలో
ఒక మధుర నాదాన్ని నిద్రలేపు
నా స్వరంతో నీ స్వరాన్ని కలుపు
ఎన్నో ఆశలతో నీ వాకిట నిలుచుని ఉన్నాను
నన్ను నిరాశకు గురిచెయ్యకు

ఓ చల్లని దీపమా ! నీ తెరచాటునుంచి బయటకు రా
నీ మంటలో కాలిపోవడం నా చిరకాల స్వప్నం
ప్రేమజ్వాలలో కాలిపోయి తనువు చాలించని
మిడుత కూడా ఒక మిడుతేనా అసలు?

ఓ సుప్త సౌందర్యమా ! కొంచం కళ్ళు తెరువు
నా ప్రేమగానం నిన్ను మేల్కొలుపుతోంది
నువ్వు నిద్రలేస్తే చాలు
నా జాతకం మారిపోతుంది