“అసమర్ధుని వద్ద ధనము, సుఖము, కీర్తి, ధర్మము ఏవీ నిలచి ఉండవు"

1, ఆగస్టు 2015, శనివారం

Mera Man Tera Pyasa - Mohammad Rafi




  నేను పాడిన ఈ కరావోకే పాటను యూ ట్యూబ్ లో ఇక్కడ చూడండి.

https://youtu.be/Zk2I2XWDLwo

మేరా మన్ తేరా ప్యాసా..మెరా మన్ తేరా...
మహమ్మద్ రఫీ మధుర స్వరంలోనుంచి జాలువారిన ఈ గీతం 1971 లో రిలీజైన Gambler అనే సినిమాలోది.ఇది దేవానంద్ మీద చిత్రీకరింపబడిన సోలో గీతం.రఫీ స్వరంలో ఈ గీతం మరపురాని మధురగీతంగా ఈ నాటికీ మెలోడీ ప్రియులను అలరిస్తూనే ఉన్నది.

Movie:--Gambler (1971)
Lyrics:--Gopal Das Neeraj
Music:--S.D.Burman
Singer:--Mohd.Rafi
Karaoke Singer:--Satya Narayana Sarma

Enjoy
-----------------------------------------
mera man tera pyasa, mera man tera
mera man tera pyasa, mera man tera
puri kab hogi aasha, mera man tera
mera man tera pyasa, mera man tera

[jab se maine dekha tujhe mera dil nahi raha, mera
de de apna hath mere hatho me kya jaaye, tera]-2
ab to na todo aasha, mera man tera
mera man tera pyasa, mera man tera

[zindagi hai meri ik danv, tu hai haar-jit, meri
aise vaise kaise bhi tu khel hamse jaisi marzi, teri]-2
kitni hai bholi asha, mera man tera
mera man tera pyasa, mera man tera

[pata nahi kaun hu mai, kya hu aur kaha mujhe, jana
apni vo kahani jo anjani ho ke ban gayi, fasana]-2
jivan kya hai, tamasha, mera man tera
mera man tera pyasa, mera man tera
puri kab hogi aasha, mera man tera

mera man tera pyasa, mera man tera

Meaning

My heart is thirsty for you...
my heart is thirsty for you...
when will my hope be fulfilled?
my heart is thirsty for you...

From the day I saw you for the first time
my heart is never with me..
give me your hand once
what harm does it cause to you?
now dont destroy my hopes..
know that my heart is thirsty for you...

My life is just a gamble
You are its victory
you are its loss
Play me either this way or that
It is wholly upto you
but know that my heart is thirsty for you...

I have no idea of who I am
what I am and where am I going
the story of my life is so strange that
till now it is a mystery
and now it has become a fable
what is this life except a farce?
But my heart is thirsty for you....

తెలుగు స్వేచ్చానువాదం

నా మనసు నీకోసం తపిస్తోంది
నా మనసు నీకోసం తపిస్తోంది
నీ కోసం...
నా ఆశ ఎప్పటికి తీరుతుందో మరి?
నా మనసు మాత్రం నీకోసం తపిస్తోంది

నిన్ను చూచిన క్షణం నుంచి
నా హృదయం నాది కాకుండా పోయింది
ఒక్కసారి నీ చేతిని నాకందివ్వవా?
అలా చేస్తే నీ సొమ్మేం పోతుంది గనుక?
ఎందుకింత బెట్టు చేస్తున్నావ్?
నా మనసు నీకోసం తపిస్తోంది...

నా ఈ జీవితం ఒక పందెం
ఇందులో గెలుపూ నువ్వే... ఓటమీ నువ్వే
ఏ పందెం వేస్తావో మరి?
పూర్తిగా నీ ఇష్టం
నా మనసు మాత్రం నీకోసం తపిస్తోంది

అసలు నేనెవర్నో
ఎక్కడున్నానో
ఎక్కడికి పయనం సాగిస్తున్నానో
నాకే తెలీదు
నా జీవితం ఇప్పటిదాకా ఒక రహస్యం
ఇప్పుడో...
అదొక గాధగా మారింది
జీవితం ఎంత తమాషానో చూడు

నా మనసు మాత్రం నీకోసం తపిస్తోంది
నా మనసు నీకోసం తపిస్తోంది
నీ కోసం...
నా ఆశ ఎప్పటికి తీరుతుందో మరి?
నా మనసు మాత్రం నీకోసం తపిస్తోంది
నీ కోసం...