నిత్యజీవితంలో ప్రతిఫలించని జ్ఞానం నిరర్ధకం

18, ఏప్రిల్ 2017, మంగళవారం

రెండవ అమెరికా యాత్ర -8 (యాస్ట్రో - యోగా - మార్షల్ ఆర్ట్స్ - హోమియో క్లాసులు మొదలయ్యాయి)

గత మూడు దశాబ్దాలుగా ఈ రంగాలలో నాకున్న అపారమైన అనుభవాన్నీ, నేను పొందిన జ్ఞానాన్నీ నా శిష్యులతో పంచుకుంటూ, వారికి ఈ విషయాలను తేలిక విధానంలో వేగంగా నేర్పిస్తూ నేను ప్రారంభించిన యాస్ట్రో - యోగా - మార్షల్ ఆర్ట్స్ - హోమియో క్లాసులు అమెరికాలో మొదలయ్యాయి.

సరాసరి ఈ క్లాసులు అటెండ్ కాలేని వారికి ఆడియో ఫైల్స్ ద్వారా ఈ విషయాలను వివరించడం మొదలైంది. ఆ విధంగా వారు డైరెక్ట్ గా నా సమక్షంలో కూచుని వినలేకపోయినా, ఆ ఆడియో ఫైల్స్ వినడం ద్వారా నా ముందు కూచుని వింటున్న అనుభవాన్ని పొందవచ్చు. ఈ సౌకర్యం 'పంచవటి' సభ్యులకు మాత్రమే అందుబాటులో ఉన్నది.

ఇది గాక, డెట్రాయిట్ లో నివసిస్తున్న పంచవటి సభ్యులకు మొన్న ఈస్టర్ రోజున నా సాధనా మార్గంలో సెకండ్ లెవల్ ఇనీషియేషన్ ఇచ్చాను.

ఈ విధంగా క్షణం తీరిక లేకుండా ప్రస్తుతం అమెరికాలో నా షెడ్యూల్ నడుస్తున్నది.