నిత్యజీవితంలో ప్రతిఫలించని జ్ఞానం నిరర్ధకం

25, ఏప్రిల్ 2017, మంగళవారం

సంపూర్ణ సూర్య గ్రహణం - 2017 ఫలితాలు ఎలా ఉండవచ్చు?

(నా శిష్యుడు వంశీకృష్ణ చేత ఈ రీసెర్చ్ వ్యాసం వ్రాయబడింది)

Aug 21 2017 న అమెరికాలో సంపూర్ణ సూర్యగ్రహణం రాబోతున్నది. ఈ సందర్భంగా నా ఎనాలిసిస్ ను ఇక్కడ ఇస్తున్నాను.

Great American Total Solar Eclipse Aug 21, 2017

గ్రహణాలనేవి వ్యక్తిగత జీవితాల లోనూ, దేశాల మీదా తప్పకుండా ప్రభావాన్ని చూపిస్తాయి. మనిషి జీవితంలో నైతే ఇవి అనేక చెడు సంఘటనలను కలిగిస్తాయి. దేశాలలో అయితే ఆర్ధిక రాజకీయ సామాజిక వాతావరణ రంగాలలో అనేక మార్పులు కనిపిస్తాయి.

2017 August 21 న అమెరికా సంయుక్త రాష్ట్రాల గుండా ఒక నేరో కారిడార్ లో పడమర నుంచి తూర్పుకు ఈ సూర్య గ్రహణం కనిపిస్తుంది.

సామాన్యంగా గ్రహణాలు 18.5 ఏళ్ళ కొకసారి ఆకాశంలో ఒకే ప్రదేశంలో కనిపిస్తూ ఉంటాయి. వీటిని మెటోనిక్ సైకిల్ అని ఖగోళ శాస్త్రంలో పిలుస్తారు. రాశిచక్రంలో రాహుకేతువుల ఆవృత్తి సమయం కూడా దాదాపుగా ఇంతే ఉంటుందన్నది గమనార్హం.

Map_of_the_solar_eclipse_2017_USA_OSM_Zoom1.jpg

ఈ సమయంలో చంద్రుని గ్రహణ ఛాయ ఉత్తర పసిఫిక్ ప్రాంతం నుంచి మొదలై ఈ క్రింది రాష్ట్రాల గుండా పడమర నుంచి తూర్పుకు అడ్డంగా పాకి వస్తుంది.

Oregon,
Idaho,
Wyoming,
Nebraska,
Kansas,
Missouri,
Illinois,
Kentucky,
Tennessee,
North Carolina,
Georgia,
and South Carolina (a tiny corner of Montana and Iowa are also in the path).

SE2017Aug21T.gif
Greatest Eclipse 2 Minutes 40 seconds
Greatest Duration 2 Minutes 40 seconds

ఈ గ్రహణం సింహ రాశిలో సంభవిస్తున్నది

సింహరాశి రాజరాశి. అధికారాన్నీ శక్తినీ పరిపాలకులనూ ఇది సూచిస్తుంది. ఈ రాశికి గల మంచి లక్షణాలు ఆత్మవిశ్వాసం, ప్రేమ, రక్షణ. ఊహాత్మకశక్తి. చెడు లక్షనాలైతే, అహంకారం, నియంత పోకడలు, అణచివేత, గర్వం, హెచ్చులు మొదలైనవి.

ప్రభుత్వాలు, దేశాధినేతలు, మంత్రులు, రాజకీయ నాయకులు, యుద్ధ పరిస్థితులు, కాల్పులు, పేలుళ్లు, యాక్సిడెంట్లు మొదలైనవి ఈ రాశి అధీనంలో ఉన్నాయి.

ఇది రాశిచక్రంలో పంచమ స్థానం అవుతుంది. మంత్రాంగం, క్రీడలు, సరదాలు, వినోదాలు, జూదం మొదలైనవి ఈ స్థానం అధీనంలో ఉంటాయి.

ఈ సూర్యగ్రహణం సూర్యరాశి మొదటి ద్రేక్కాణంలో పడుతున్నది.

అగ్నితత్వ రాశిలో జరిగే గ్రహణాలు - పశునాశనం, ఒక అధికారి/ దేశాధినేత/ నాయకుడు/ ప్రముఖ వ్యక్తీ దేశం నుంచి పారిపోవడం, జైల్లో పెట్టబడటం, పదవిని పోగొట్టుకోవడం, లేదా హత్య చెయ్యబడటాలను సూచిస్తున్నాయి. ప్రజలలో అసంతృప్తితో తిరుగుబాటు రావచ్చు. సైన్య ప్రయోగం అవసరం కావచ్చు. అగ్నిప్రమాదాలు సంభవించవచ్చు. సొసైటీలో విప్లవం తలెత్తవచ్చు.

స్థిరరాశులలో జరిగే గ్రహణాలు ఎక్కువ కాలం ప్రభావాన్ని చూపిస్తాయి.

అగ్నితత్వ రాశి అయిన సింహం మొదటి ద్రేక్కాణంలో జరిగే గ్రహణం వల్ల ఒక రాజు లేదా రాజకుమారుడు, దేశాధినేత లేదా అత్యున్నత అధికారి మరణాన్ని సూచిస్తున్నది. లేదా ఆ దేశంలో మొక్కజొన్న కరువు రావడాన్ని సూచిస్తున్నది. 

ఈ సంఘటనలు కొంచం అటూ ఇటూగా జరుగవచ్చు. సామాన్యంగా సూర్యగ్రహనాల వల్ల చావులు, దుర్ఘటనలు, విప్లవాలు, తిరుగుబాట్లు, ప్రభుత్వం మీద దాడులు, తత్ఫలితంగా ప్రజలపైన సైనిక చర్య వంటివి చెదురు మదురు సంఘటనలు జరుగుతూ ఉంటాయి.

ప్రాన్స్ , ఇటలీ, రోమానియా, సిసిలీ మొదలైన దేశాలు సింహ రాశి అధీనంలో ఉన్నాయి.

ఈ రాశి నీడలో ఉన్న కొన్ని నగరాలు - చికాగో, ఫిలడెల్ఫియా, లాస్ ఏంజెల్స్, బ్రిస్టల్, ముంబాయ్, ప్రేగ్, రోం, రావెన్నా, బాత్ మొదలైనవి.

గ్రహణ ఫలితాలు ఆ గ్రహనం పడే దేశాలలోనూ ఆ రాశి అధీనంలో ఉన్న నగరాలు దేశాలలోనూ కనిపిస్తాయి.

Eclipse Chart Aug 21 2017 ( with True Node)

Aug212017solarEc.jpg

సింహ రాశిలో రాహువు, చంద్రుడు, సూర్యుడు, బుధుడు ఉండగా వృశ్చికం నుంచి శని తన దశమ దృష్టితో వీరిని వీక్షిస్తున్నాడు.

కర్కాటకంలో శుక్రుడు కుజుడు ఉన్నారు. కన్యలో గురువు, వృశ్చికంలో శనీ ఉన్నారు. కేతువు కుంభరాశిలో ఉన్నాడు.

ఈ గ్రహణ సమయంలో ఈ రాశి మీద ఎక్కువ చెడు గ్రహాల ప్రభావం ఉంటె పైన చెప్పిన చెడు ఫలితాలు ఎక్కువగా జరిగే అవకాశం ఉన్నది.

గోచార సూర్యుడు గోచార రాహుకేతువులతో ఏర్పడే కేంద్ర దృష్టి వల్ల ఈ సంఘటనలు ట్రిగ్గర్ అవుతాయి. కనుక సూర్యుడు వృశ్చిక, కుంభ, వృషభ రాశులలో ఉండగా ఈ సంఘటనలు జరుగుతాయి.

ఈ గ్రహణ కుండలిలో ఈ క్రింది ముఖ్యమైన గ్రహదృష్టులను గమనించవచ్చు.

సూర్య బుధ రాహువులకు శనియొక్క కేంద్ర దృష్టి.

జలరాశి నుంచి శనియొక్క కిన్కంక్స్ దృష్టి అగ్నిరాశిలో ఉన్న యురేనస్ మీద పడుతున్నది.

వాయుగ్రహం అయిన శని దృష్టి అగ్నిరాశిలో ఉన్న అగ్నిగ్రహం సూర్యుని పైన ఉన్నందున, మేజర్ అగ్ని ప్రమాదాలు జరుగవచ్చు. సూర్యుడు ఒక దేశపు పరువును సూచిస్తాడు. కనుక దేశ పరువు ప్రతిష్టలకు సంబంధించిన, యుద్ధాలు, ఉపగ్రహ ప్రయోగాలు, ఆకాశ యుద్హాలు జరుగవచ్చు. అగ్నిపర్వతాలు పేలే అవకాశం కూడా దీని క్రిందికే వస్తుండి.

రాహువు సూర్యునితో కలసి సింహరాసిలో ఉన్నందున దేశాధినేతలు దుందుడుకు చర్యలు తీసుకుంటారు.

ఈ చర్యలు ప్రజలకు నచ్చక ఎదురు తిరగవచ్చు. దీనిని చంద్రుడు సూచిస్తున్నాడు. బుధుడు రవాణాకు సూచకుడు. కనుక ఆ రంగంలో ప్రమాదాలు జరుగవచ్చు.

శని -- భూకంపాలు, అగ్నిప్రమాదాలు, అగ్నిపర్వత పేలుళ్లు, గనుల ప్రమాదాలు, కాల్పులలో జనం చనిపోవడం, తిరుగుబాటు మొదలైనవి జరుగుతాయి.

మేషంలో ఉన్న యురేనస్ వల్ల - పేలుళ్లు ఖచ్చితంగా జరుగుతాయి. అకస్మాత్తుగా జరిగే పేలుళ్లకు ఇది సూచన. మేషరాశి మొదటి ద్రేక్కాణంలో ఉన్న యురేనస్ వల్ల ఆర్మీ యాక్షన్ సూచింపబడుతున్నది.

సింహరాశిలోని నాలుగు గ్రహాలకు, ప్లూటో కోణస్థితిలో ఉన్నాడు. ప్రజాజీవితాలలో ఒక పెద్ద మార్పుకు ఇది సూచన. దీని ప్రభావం చాలా ఎక్కువ ఏళ్ళు ఉండే మార్పుగా ఇది ఉంటుంది.

సెప్టెంబర్ మొదటి వారంలో కుజుడు ఈ గ్రహణ డిగ్రీని దాటుతాడు. కనుక ఆ సమయంలో అనేక సంఘటనలు జరుగుతాయి.

విచిత్రంగా - 225 ఏళ్ళ క్రితం Sep 5, 1793 న సూర్య గ్రహణం జరిగినప్పుడు ఇవే గ్రహస్థితులు ఉన్నాయి.


Sun, Mercury,Moon, Rahu in Leo


sep51793.jpg

Solar Eclipse path of Sep 5 1793
SE1793.jpg

ఆ సమయంలో సూర్య గ్రహణం యూరోప్ గుండా ప్రయాణించింది. పై మ్యాప్ చూడండి.

అప్పుడే, సామాన్య ప్రజలు రాచరికం మీద తిరగబడిన ఫ్రెంచి విప్లవం జరిగింది.

దేశ జాతకాన్ని బట్టి సింహరాశికి ఫ్రాన్స్ దేశం పైన ఆధిపత్యం ఉన్న విషయాన్ని గమనిస్తే, ఈ సంఘటన ఎంత కరెక్ట్ గా జరిగిందో అర్ధమౌతుంది.

States in USA
New York----Leo
Colarado ----Leo
Missouri----Leo
Hawaii----Leo

ఆయా రాష్ట్రాలలో ప్రభుత్వాలు పతనం కావడం, మారడం, లేదా ప్రభుత్వాల మీదా అధికారుల మీదా దాడులు జరగడం జరుగవచ్చు.

ప్రస్తుతం ప్రాన్స్ లో ఎన్నికలు జరుగుతున్నాయన్నది గమనించండి. 

Astro-Carto-Graphy & Solar Eclipse Path
Solar eclips2.jpg



గ్రహణపు దారిని Astro Carto Graph మీద సూపర్ ఇంపోజ్ చేస్తే అవి ఎక్కడెక్కడ పరస్పరం ఖండించుకుంటూ ఉన్నాయో ఆయా ప్రదేశాలలో ప్రమాదాలు జరుగుతాయని చెప్పవచ్చు.

ఒక గ్రహపు దశమ భావ రేఖ అది పోతున్న దేశం యొక్క పరువు ప్రతిష్టలకు చెందిన ముఖ్యమైన విషయాలను చూపిస్తుంది. ఇతర దేశాలు ఆ దేశాన్ని ఎలా చూస్తున్నాయి లేదా అవి తనను ఎలా చూడాలని ఆ దేశం అనుకుంటూ ఉన్నది అనే విషయాలను ఈ రేఖ సూచిస్తుంది. 

ఈ రేఖమీద కుజుడు గనుక ఉంటె, అది రాజకీయ యుద్ధాలను సూచిస్తుంది. అంతేగాక అగ్నిప్రమాదాలు, పేలుళ్లు, భూకంపాలు, పెద్ద పెద్ద యాక్సిడెంట్లు, ప్రముఖుల మరణాలు, సైనిక చర్యలు, మాస్ కిల్లింగ్స్ ను సూచిస్తుంది.

రాహువు గనుక ఈ రేఖమీద ఉంటె - అది అధికారుల, నాయకుల నియంత పోకడలను దుందుడుకు నిర్ణయాలను సూచిస్తుంది.

సూర్యుడు గనుక ఈ రేఖమీద ఉంటె - అధికార దుర్వినియోగం, నియంతృత్వం, అధినేతల మీద చర్యలు, ప్రమాదాలు, మొదలైన పెద్ద పెద్ద సంఘటనలు సూచింప బడతాయి.

చంద్రుడు ఇక్కడ ఉంటె -- ప్రజలు తీవ్రంగా ప్రభావితం కాబడతారు.

బుధుడు ఇక్కడ ఉంటె - రవాణా ప్రమాదాలు జరుగుతాయి 

శని దశమానికి కేంద్రంలో ఉంటె - ఎక్కువ మొత్తంలో జననష్టం, ఆస్తి నష్టాలను సూచిస్తాడు.

నెప్ట్యూన్ మరియు చతుర్ధం పసిఫిక్ ప్రాంతంలో పడుతున్నది ఇందువల్ల ఈ ప్రాంతలో భూకంపాలు రావచ్చు.

Pacific ring of fire మీద పడుతున్న ఈ గ్రహణపు నీడ వల్ల ఆ ప్రాంతంలో భూకంపాలు రావచ్చని సూచిస్తున్నది. ఈ ప్రాంతం భూకంపాలకు పెట్టింది పేరని గుర్తుంచుకోవాలి.

తన పుస్తకం Solar & Lunar Returns లో డోనాల్డ్ బ్రాడ్లే  -- శని నెప్ట్యూన్ సంబంధం గనుక ఉంటె అది సింహాసనాన్ని కూలదోస్తుంది అంటాడు. బలవంతంగా రిజైన్ చెయ్యవలసి రావడం, ప్రభుత్వం పతనం కావడం, చేజిక్కించుకోబడటం, దేశబహిష్కారం కాబడటం, ఉద్యోగాలు ఊడటాలను ఈ యోగం సూచిస్తుంది అంటాడు.

Crossing Uranus/Pluto

“major shakeup” లేదా హటాత్తు కుదిలింపు ను ఈ యోగం సూచిస్తుంది.సామాన్యంగా ఒక ప్రభుత్వం కూలిపోవడాన్ని ఇది సూచిస్తుంది.

Yellow stone caldera super VOLCANO అనేది వ్యోమింగ్ లో ఈ గ్రహణపు దారిలోనే ఉన్నది. ఈ గ్రహణ ప్రభావం వల్ల ఇది పేలిపోయి జనాలను పెద్ద ఎత్తున అక్కడనుంచి తరలించే పని జరుగవచ్చు.

Below are the places and countries natal chart 10th (karma) house degrees in Leo sign which may get some impact as Solar eclipse happening in Leo.


Paris, France

MC 25 Cancer
(+- 5 degrees near the eclipse degree)
Asc 20 Libra
Stuttgart, Germany
MC 04 Leo
Asc 26 Libra
Munich, Germany
MC 08 Leo
Asc 29 Libra
Prague, Czech Rep.
MC 11 Leo
Asc 01 Scorpio
Vienna, Austria
MC 14 Leo
Asc 04 Scorpio
Budapest, Hungary
MC 19 Leo
Asc 07 Scorpio
Belgrade, Yugoslavia
MC 21 Leo
Asc 10 Scorpio
Sofia, Bulgaria
MC 26 Leo
Asc 15 Scorpio
GE, Romania
MC 27 Leo
Asc 14 Scorpio
Athens, Greece
MC 28 Leo
Asc 18 Scorpio


అన్నీ చెడు సంఘటనలే కాదు. మంచి కూడా గ్రహణం వల్ల జరుగుతుంది. అవి చూద్దాం.

ఈ గ్రహణం పడే దారిలో ఉన్న సామాజిక పరిస్థితులు ఆ తర్వాత పూర్గిగా మారిపోవచ్చు.

ఇండియా చైనాల మీదుగా 1999 July లో గ్రహణపు నీడ పడింది. ఆ తర్వాత ఈ రెండు దేశాల ఆర్ధిక రంగాలలో ఎన్ని మార్పులు వచ్చాయో మనకు తెలుసు. 

గుజరాత్ మీదుగా పోయిన ఈ గ్రహణపు నీడ వల్ల ఆ తర్వాత 10 - 15 ఏళ్ళలో ఆ రాష్ట్రం ఆర్ధికంగా విపరీతంగా పుంజుకుంది.

కనుక ఈ సారికూడా పైన వ్రాసిన సంఘటనలు జరిగే సూచనలు బలంగా ఉన్నాయి. చూద్దాం ఏం జరుగుతుందో??