నిత్యజీవితంలో ప్రతిఫలించని జ్ఞానం నిరర్ధకం

24, మే 2017, బుధవారం

Manchester Islamic Terrorist Attack - జ్యోతిష్య పరిశీలన

సోమవారం రాత్రి పదిన్నర ప్రాంతంలో ఇంగ్లాండ్ లోని మాంచెస్టర్ లో ఇస్లామిక్ రాక్షసులు పేల్చిన బాంబు పేలి దాదాపు 22 మంది చనిపోయారు. వీరిలో చిన్నపిల్లలు కూడా ఉన్నారని అంటున్నారు. ప్రపంచమంతా ' వరస్ట్ ఫెలోస్' అని తిడుతున్నా వీళ్ళకు బుద్ధీ జ్ఞానం కలగడం లేదు. బాంబులు పెట్టి అమాయకుల్ని చంపడం పెద్ద గొప్ప అని వీరి ఊహ. దీనికి తోడు బాంబు పెట్టి పెల్చినవాడు ఖలీఫా సైనికుడట. వాడికి డైరెక్ట్ గా స్వర్గం వస్తుందట. వీళ్ళ అజ్ఞానానికి మూర్ఖత్వానికీ అంతూ పొంతూ కనపడటం లేదు. ఇదంతా చూస్తుంటే, ఇస్లామిక్ రాక్షసత్వం మీద ట్రంప్ కామెంట్స్ కరెక్టే అని అనిపిస్తున్నాయి.

ఈ విధంగా జనాలు ఎక్కువగా చేరే చోట బాంబులు పెట్టి అమాయక ప్రజలను చంపడం లాంటి పనులను ఎవ్వరూ ఆపలేరు. అది జరిగే పని కాదు. అయిపోయాక ఖండించడం, నివాళి అర్పించడం మాత్రమే చెయ్యగలరు ఎవరైనా. కాకుంటే కొంత జాగ్రత్త తీసుకోవచ్చు. అది కూడా ఎల్లవేళలా సాధ్యం కాదు. కనుక వీళ్ళను భూమ్మీద నుంచి తుడిచి పెట్టేసెంత వరకూ ఈ గోల తప్పదు. అది ఎవరు చేస్తారో భవిష్యత్తు నిర్ణయిస్తుంది.

ఇలాంటి ఘోరమైన తప్పుడు పనులు చేస్తూ కూడా "ఇస్లాం అంటే శాంతి" అని చెప్పడం దయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉంది.

కాకుంటే, ప్రస్తుతం ఈ సంఘటన జరగడానికి జ్యోతిష్య సూచనలు ఎంత కరెక్ట్ గా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.

ఈ సంఘటనను స్పష్టంగా ఖచ్చితంగా సూచిస్తున్నవారు శని, యురేనస్ లు. ప్రస్తుతం శని ధనుస్సు ఒకటో పాదంలో రెండు డిగ్రీల మీద ఉన్నాడు. యురేనస్ ఖచ్చితంగా అతనికి కోణ దృష్టిలో మేషంలో రెండు డిగ్రీల మీద ఉన్నాడు. నవాంశలో శని మేషంలో ఉంటూ నీచ స్థితిలో ఉన్నాడు. యురేనస్ కూడా నవాంశలో మేషంలోనే ఉన్నాడు. శని సామాన్య ప్రజలకూ, యురేనస్ బాంబు పేలుళ్ళకూ, మేషరాశి ఇంగ్లాండ్ కూ సూచకులని మనకు తెలుసు. ఇంకేం కావాలి? ఈ దురదృష్టకర సంఘటనను సూచిస్తున్న ఖచ్చితమైన గ్రహయోగం ఇదే.

ఈ రకంగా రెండుసార్లు సూచింపబడుతున్న మేషరాశి, ఇంగ్లాండ్ కు సూచిక అని గుర్తుంచుకుంటే, ఈ ప్రమాదం ఇంగ్లాండ్ లోనే ఎందుకు జరిగిందో అర్ధమౌతుంది.

ముస్లిమ్స్ కు సూచకుడైన శుక్రుడు ప్రస్తుతం మీనంలో ఉచ్చ స్థితిలో ఉంటూ వారి ప్లాన్ సక్సెస్ అవడాన్ని సూచిస్తున్నాడు.

ఆ శుక్రునితో చంద్రుడు కలసి ఇద్దరూ బుధుని రేవతీ నక్షత్రంలో ఉన్నారు. ఆ బుధుడు మళ్ళీ మేషరాశిలో ఉన్నాడు. మూడో సారి మేషరాశి తెర మీదకు వచ్చింది.

అమెరికన్ సింగర్ Ariana Grande అనే అమ్మాయి ఇస్తున్న పాటల ప్రోగ్రాంలో ఈ బాంబు పేలుడు జరిగింది. ఈ అమ్మాయి పేరులో ఉన్న Ariana అనే అక్షరాలు Aries sign అంటే మేష రాశిని సూచిస్తూ, దానిద్వారా ఇంగ్లాండ్ ను సూచిస్తున్నాయి.

ఇవన్నీ చాలవన్నట్లు - ప్రస్తుతం మనం అమావాస్య నీడలో ఉన్నాం. ఎల్లుండే అమావాస్య. ఈ విషయాన్ని ఇప్పటికి లెక్కలేనన్ని సార్లు రుజువు చేసి చూపించాను. మళ్ళీ అమావాస్య పరిధిలోనే ఈ సంఘటన జరగడం కాకతాళీయం ఎలా అవుతుంది?

అంతేకాదు, హిమాలయ ప్రాంతాలలో జరుగుతున్న ప్రమాదాలకూ, పాకిస్తాన్ సరిహద్దులోని యుద్ధ వాతావరణానికీ కూడా ఈ గ్రహయోగమే కారణం. ఎందుకంటే మేషరాశి కొండ కోనలకు సూచిక మాత్రమే గాక పాకిస్తాన్ లగ్నం కూడా.

జ్యోతిష్య శాస్త్రం సత్యమైన శాస్త్రం అని మళ్ళీ ఈ సంఘటనలు రుజువు చేస్తున్నాయి.