Love the country you live in OR Live in the country you love

18, మే 2017, గురువారం

రెండవ అమెరికా యాత్ర - 37 (International Tai Chi day)

ఆదివారం ఉదయాన్నే అయిదుకల్లా లేచి తయారై ఆరింటికల్లా మొదటి రిట్రీట్ హోమ్ కు వచ్చేశాం. ఆ ఇంటినుంచి బయలుదేరి వస్తుంటే రావాలనిపించదు. ఎందుకంటే, మనకు ఎంతో నచ్చినట్లుగా, అడవిలో ఒంటరిగా,చుట్టూ ఎవరూ లేకుండా, జనసంపర్కం లేకుండా ఉన్నప్పటికీ, మంచి రోడ్ యాక్సెస్ తో ఉన్నదా ఇల్లు. వానజల్లు పడుతూ చాలా చలిగా ఉన్నది వాతావరణం. బలవంతంగా బయలుదేరి పది నిముషాలలో మొదటి రిట్రీట్ హోమ్ కు వచ్చేశాం. దారంతా నిర్మానుష్యం. మనుషులెవరూ లేరు. అక్కడక్కడా విసిరేసినట్లుగా ఇళ్ళు. విశాలమైన పచ్చిక బయళ్ళు. ఎక్కడో అడవిలోకి ఒంటరిగా కారులో ప్రయాణిస్తున్నట్లు ఉన్నది.

ఇంటికి వచ్చాక అప్పటికే సిద్ధంగా ఉన్న శిష్యులతో కలసి యోగాభ్యాసమూ, సాధనా అన్నీ అయ్యేసరికి తొమ్మిదిన్నర అయింది. కొద్దిగా ఉపాహారం సేవించి అందరిచేతా చిన్న చిన్న తైఛి బిట్స్ చేయించాను. ఎందుకంటే ఆదివారం International Day of Tai Chi అయ్యింది.

ఆ తర్వాత బయట పచ్చికలో వానలో తడుస్తూ Yang Tai Chi Form చేశాను. అవన్నీ ఇక్కడ చూడవచ్చు.