“అసమర్ధుని వద్ద ధనము, సుఖము, కీర్తి, ధర్మము ఏవీ నిలచి ఉండవు"

11, మే 2017, గురువారం

రెండవ అమెరికా యాత్ర - 30 (గాంగెస్ రిట్రీట్ - రెండవ రోజు కార్యక్రమాలు)

లేక్ షికారు నుంచి తిరిగి వచ్చాక తీరికగా హాల్లో అందరం సమావేశమయ్యాం. అప్పుడు వారడిగిన ప్రశ్నలకు సందేహాలకు సమాధానాలిచ్చాను. ఆ విధంగా మధ్యాన్నం పన్నెండు వరకూ మాట్లాడుకుంటూ గడిపాము.

వారడిగిన ప్రశ్నలు కొన్నింటిని ఇక్కడ ఇస్తున్నాను.

> తంత్ర సాధన అంటే ఏమిటి? అది ఎన్ని రకాలు? మనం దానిని చెయ్యవచ్చా? అఘోరీల సాధనా మార్గం ఏమిటి? మన మార్గంలో అది ఉంటుందా?

> లలితా సహస్ర నామాలలో స్పెషల్ సాధనలు రహస్యంగా గర్భితమై ఉన్నాయని మీరు చాలాసార్లు అన్నారు. మీ పుస్తకంలో కూడా వాటిని ఉదాహరించారు. అవి ఎలా చెయ్యాలి? వాటిని మాకు నేర్పిస్తారా?

> యోగనిద్ర అంటే ఏమిటి? ధ్యానంలో ఒక విధమైన మత్తుగా అనిపిస్తుంది. అదేనా?

> యోగిక్ లైఫ్ అంటే ఏమిటి? ఒక యోగి తన జీవితాన్ని ఎలా గడపాలి?

> కర్మ కాండలు చెయ్యాలా? పితృ తర్పణాదుల వల్ల ఉపయోగం ఉంటుందా? మనిషి చనిపోయిన తర్వాత ఏమౌతుంది? ఎక్కడకు వెళతాడు? ఏయే లోకాలలో తిరుగుతాడు? మనం చేసే కర్మకాండల ఫలితం వారికి చేరుతాయా?

ఆయా ప్రశ్నలకు సవిస్తరంగా వారికి వివరించాను.ఈ టాక్స్ అన్నీ రికార్డ్ చెయ్యబడి ' పంచవటి' సభ్యులకు అందుబాటులో ఉన్నాయి.

ఆ తర్వాత మధ్యాన్నం జరిగిన ధ్యాన సాధనలో 'బ్రహ్మ విహార ధ్యానసాధన' ఎలా చెయ్యాలో వారికి నేర్పించాను.

ఆ తర్వాత లంచ్ చేసి కొద్ది సేపు విశ్రాంతి తీసుకున్న తర్వాత మళ్ళీ సమావేశమై అనేక ఆధ్యాత్మిక విషయాలు మాట్లాడుకున్నాం. సాయంత్రం మళ్ళీ సాధన చేసి భోజనాలు కానిచ్చి నిద్రకు ఉపక్రమించాం. మేము కొద్ది మందిమి యధావిధిగా మళ్ళీ రెండో రిట్రీట్ హోమ్ కు వెళ్లి అక్కడ నిద్రపోయి పొద్దున్నే తిరిగి వచ్చాం.