Love the country you live in OR Live in the country you love

9, మే 2017, మంగళవారం

రెండవ అమెరికా యాత్ర - 27 (గాంగెస్ రిట్రీట్ - రెండవ రోజు)

రిట్రీట్ హోమ్ కు తిరిగి వచ్చాక గాంగెస్ ఆశ్రమంలో జరిగిన విషయాల గురించి మిగతా సభ్యులకు వివరించాము. అక్కడ ఆశ్రమం కోసం సైట్ కొనడం మీద అందరూ వ్యతిరేక అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆ రాత్రికి సంభాషణ ముగించి అందరం నిద్రకు ఉపక్రమించారు. మేము కొద్ది మందిమి మాత్రం అక్కడకు అయిదు మైళ్ళ దూరంలో ఉన్న రెండో రిట్రీట్ హోమ్ కు వెళ్లి అక్కడ నిద్రపోయాం. పొద్దున్నే లేచి ఆరు గంటల కల్లా వెనక్కు వచ్చేశాం.

అప్పుడు జరిగిన సాధనా కార్యక్రమంలో ఇద్దరికి మొదటి లెవల్ దీక్షనూ మిగతా వారికి సెకండ్ లెవల్ దీక్షనూ ఇచ్చాను. ఈ దీక్షలు స్వీకరించిన అదృష్టవంతులను ఈ ఫోటోలో చూడవచ్చు.