“అసమర్ధుని వద్ద ధనము, సుఖము, కీర్తి, ధర్మము ఏవీ నిలచి ఉండవు"

8, ఏప్రిల్ 2016, శుక్రవారం

Kisi Ki Muskurahato Pe Ho Nisar - Mukesh




కిసీకి ముస్కురాహటో పే హో నిసార్...

అంటూ ముకేష్ తనదైన స్వరంలో మధురంగా ఆలపించిన గీతం 1959 లో వచ్చిన 'అనారి' అనే చిత్రం లోనిది.ఈ పాట చాలా అందమైన మధురమైన గీతం.

చాలామంది సాంప్రదాయవాదులు సినిమా పాటలంటే చిన్నచూపు చూస్తారు.కానీ ఆ మూడు నిముషాల పాటకోసం ఆ సంగీత యూనిట్ ఎంత కష్టపడతారో ఒక్కసారి చూస్తే వారు మళ్ళీ ఆ మాట అనరు.

ఇప్పుడంటే సాహిత్యం భ్రష్టు పట్టింది గాని పాతకాలంలో సినిమా పాటలు కూడా చాలా మంచి సాహిత్యంతో, గొప్పదైన వేదాంతతత్త్వంతో నిండి ఉండేవి. జీవిత విలువలనూ,జీవన తత్త్వాన్నీ గొప్పగా ప్రతిబింబిస్తూ ఉండేవి.ఈ పాట కూడా అలాంటిదే. వ్రాసినది శైలేంద్ర అయితే ఇలా ఉండక ఈ పాట ఇంకెలా ఉంటుంది?

సరిక్రొత్త సౌండ్ సిస్టం తో రికార్డ్ చేసిన ఈ పాటను మీకోసం ఈ ఉగాది రోజున ఇస్తున్నాను.నా స్వరంలో కూడా ఈ అమరగీతాన్ని వినండి మరి. 

Movie:--Anari (1959)
Lyrics:--Shailendra
Music:--Shankar Jaikishan
Singer:--Mukesh
Karaoke Singer:--Satya Narayana Sarma
Enjoy
-------------------------------
Kisi ki muskurahaton pe ho nisar
Kisi ka dard mil sake tho le udhar
Kisi ke vaste ho tere dil me pyar
Jeena isi ka naam hai

Maana apni jeb se fakir hai
Fir bhi yaro dil ke ham ameer hai
Mite jo pyar ke liye vo zindagi
Jale bahaar ke liye vo zindagi
Kisi ko ho naho hame to aitbaar
Jeena isi ka naam hai

Rishta dil se dil ke aitbaar ka
Zinda hai ham hee se naam pyar ka
Ke mar ke bhi kisi ko yaad aayenge
Kisi ke aasuvon me muskuraayenge
Kahe gaa phool har kalee se baar baar
Jeena isi ka naam hai

Kisi ki muskurahaton pe ho nisar
Kisi ka dard mil sake tho le udhar
Kisi ke vaste ho tere dil me pyar
Jeena isi ka naam hai

Meaning

Sacrifice yourself for someone's smile
Share your shoulder to lessen the grief of someone
Have a heart full of love for others
This is what is called true life....

By my pocket, I am a beggar
But by my heart, I am very rich
If you can die for love,that is life
If you are desperate for Spring,that is life
Let others believe in this philosophy or not
I have trust in this idea
This is what I call Life...

Trust is the bridge between two hearts
Because of people like us,Love is still alive
If you are remembered by someone
even after your death
If you can smile through tears of some else
Says a flower to all buds, again and again
This is called true life...

తెలుగు స్వేచ్చానువాదం

ఒకరి నవ్వుకోసం నువ్వు త్యాగం చెయ్యగలిగితే
ఒకరి బాధను నువ్వు పంచుకోగలిగితే
ఒకరి కోసం నీ హృదయం ప్రేమమయం అయితే
అదీ అసలైన జీవితమంటే...

నా జేబును బట్టి చూస్తే నేను నిరుపేదనే
నా హృదయాన్ని చూస్తే మాత్రం నేను చాలా ధనవంతుడిని
ప్రేమకోసం నువ్వు మరణించగలిగితే - అదీ అసలైన జీవితం
వసంతం కోసం నువ్వు పిచ్చివాడిలా ఎదురుచూస్తే - అదీ అసలైన జీవితం
ఒకరు నమ్మనీ నమ్మకపోనీ
ఈ నమ్మకం నాకుంది...

రెండు హృదయాలను కలిపే వారధి నమ్మకమే
మనలాంటి వాళ్ళ వల్లనే ప్రేమ ఈ లోకంలో ఇంకా బ్రతికుంది
నువ్వు పోయాక కూడా నిన్ను ఎవరైనా స్మరిస్తే
ఇంకొకరి కన్నీళ్ళలో నీ నవ్వును నింపగలిగితే
అదీ అసలైన జీవితం...
ప్రతీ పువ్వూ మొగ్గలకు ఇదే మాటను
మాటమాటకీ చెబుతుంది..

ఒకరి నవ్వుకోసం నువ్వు త్యాగం చెయ్యగలిగితే
ఒకరి బాధను నువ్వు పంచుకోగలిగితే
ఒకరి కోసం నీ హృదయం ప్రేమమయం అయితే
అదీ అసలైన జీవితమంటే...