“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

10, ఏప్రిల్ 2016, ఆదివారం

Choud Vi Ka Chand Ho - Mohd Rafiచౌద్ వి కా చాంద్ హో యా ఆఫ్ తాబ్ హో...
అంటూ మహమ్మద్ రఫీ అత్యంత మధురంగా ఆలపించిన ఈ గీతం "చౌద్ వి కా చాంద్" అనే చిత్రం లోనిది.ఈ సినిమా 1960 లో వచ్చింది.దీనిని గురుదత్ నిర్మించాడు.ఈ మధురగీతాన్ని వ్రాసింది షకీల్ బదయూని అయితే సంగీతాన్ని సమకూర్చింది రవి శంకర్ శర్మ ఉరఫ్ రవి.

కొన్ని పాటలు అజరామరంగా నిలిచిపోతాయి.ఆ తర్వాత ఎన్నెన్ని పాటలు ఆ బాణీలో వచ్చినా వీటికి ఏమాత్రం వన్నె తగ్గదు. ఎన్ని తరాలైనా సరే భావుకతలోగానీ మాధుర్యంలో గానీ అవి చెక్కు చెదరకుండా ఉంటాయి.ఈ పాట కూడా అలాంటిదే.

ఇది నాకు అత్యంత ఇష్టమైన పాటలలో ఒకటి.నాకే కాదు ఎందఱో భావుకులకూ స్వాప్నికులకూ సున్నిత హృదయులకూ ఈ గీతం ఎంతో ఇష్టమైన గీతం.

ఈ గీతాన్ని తదేకంగా వింటే, పల్లెటూరి రాత్రిపూట, పారిజాతం చెట్టు పక్కనే మంచం వేసుకుని హాయిగా రిలాక్స్ అవుతూ, ఆ సుగంధాన్ని పీలుస్తూ, ఆకాశంలో పున్నమి చందమామను చూస్తూ,చెరువు మీద నుంచి వచ్చే చల్లని గాలిని ఆస్వాదిస్తూ ఉన్న అనుభూతి కలుగుతుంది.

ఎక్కువ వాయిద్యాల హోరు ఏమాత్రం లేకుండా కేవలం రాగప్రాధాన్యతతో ఎంత మాధుర్యాన్ని తేవచ్చో అనడానికి ఈ పాటే ఉదాహరణ.

ఈ అద్భుతమైన గీతాన్ని నా స్వరంలో కూడా ఒక్కసారి వినండి మరి.

Movie:--Choud Vi Ka Chand (1960)
Lyrics:--Shakeel Badayuni
Music:--Ravi Shankar Sharma (Ravi)
Singer:--Mohammad Rafi
Karaoke Singer:--Satya Narayana Sarma
Enjoy
-------------------
{Choud vi ka chand ho - Ya aftaab ho
Jo bhi ho tum khuda ki kasam Lajavaab ho}-2
Choud vi ka chand ho

Julfe hai jaise kaandho pe baadal jhuke huye
Ankhe hai jaise mai ke pyaale bhare huye
Masti hai jisme pyar ki tum, vo sharab ho
Choud vi ka chand ho...

Chehra hai jaise jheel me hasta huva kaval
Ya zindagi ke saaz pe chedi huyee ghazal
Jane bahaar tum kisi shaayar ka khwaab ho
Choud vi ka chand ho...

Honton pe kheltee hai tabassum ki bijiliyaa
Sajde tumhari raah me kartee hai kehkashaan
Duniya-e-husn-o-ishka ka tum hi shabaab ho

{Choud vi ka chand ho - Ya aftaab ho
Jo bhi ho tum khuda ki kasam Lajavaab ho}-2
Choud vi ka chand ho
------------------------------
Meaning:--

Are you full moon?
or the sunlight?
whatever you are
You are exquisitely beautiful

Your hair is
as if dark clouds are bending
over your shoulders
Your eyes are
as if goblets are full of wine
You  are like the wine
that is full of the power of love

Your face is
as if a lotus is blooming in a lake
Or it is like
a love song that is played on
the lute of life
My love..You are the lovely dream
of a mystic poet

Your smiles are like
play of lightening on your lips
The angelic stars
are saluting you on your way
In this world
you are the representative of
ultimate beauty and ultimate love

Is it full moon?
or the sun?
whatever you are
You are exquisitely beautiful

తెలుగు స్వేచ్చానువాదం

నువ్వు పున్నమి జాబిలివా?
లేక సూర్యకాంతివా?
ఏదైనా కానీ
నువ్వు మాత్రం ఒక అలౌకిక సౌందర్యానివి

నీ కురులు
నీ భుజాలను ముద్దిడుతున్న
నల్లని మేఘాలలా ఉన్నాయి
నీ కనులు
మధువుతో నిండిన
పానపాత్రలలా ఉన్నాయి
అసలు నువ్వే
ప్రేమతో నిండిన మధువులా ఉన్నావు

నీ వదనం
సరస్సులో వికసించిన పద్మంలా ఉంది
జీవితం అనే వీణ
పలికించిన ప్రేమగీతంలా ఉంది
ఓ సఖీ...
ఒక అలౌకిక ప్రేమకవి
హృదయంలో పొంగిన స్వప్నానివి నీవు

నీ చిరునవ్వులు
నీ పెదవులపై
చిందులేస్తున్న మెరుపులలా ఉన్నాయి
నువ్వు నడచే దారిలో
నక్షత్ర కన్యలు నీకు
సాష్టాంగ నమస్కారం చేస్తున్నారు
ఈ ప్రపంచంలో
సౌందర్యానికీ ప్రేమకూ
నీవే అధిదేవతవు

నువ్వు పున్నమి జాబిలివా?
లేక సూర్యకాంతివా?
ఏదైనా కానీ
నువ్వు మాత్రం ఒక అలౌకిక సౌందర్యానివి