“అసమర్ధుని వద్ద ధనము, సుఖము, కీర్తి, ధర్మము ఏవీ నిలచి ఉండవు"

19, జులై 2015, ఆదివారం

Telugu Melodies-P.B.Srinivas-అందాల ఓ చిలకా అందుకో నా లేఖా..




మరపురాని రాగాలను ఎన్నింటినో అందించిన మధుర సంగీతదర్శకుడు -- పదమూడేళ్ళ పిన్న వయసులోనే కచేరీ చేసిన మ్యూజిక్ ప్రాడిజీ -ఎమ్మెస్ విశ్వనాధన్ స్మృతికి ఈ గీతం అంకితం. మొన్న ఆషాఢ అమావాస్య చాయ లోనే ఆయన గతించారు.అనేక భాషల సినిమాలలో విశ్వనాధన్ మాస్టారు సమకూర్చిన మధురగీతాలు ఎన్నున్నాయో లెక్కించడం చాలా కష్టం. 

ముఖ్యంగా 1960-80 మధ్యలో ఆయన సమకూర్చిన గీతాలన్నీ ఆపాత మధురాలే.ఇది పీబీ శ్రీనివాస్, పీ సుశీలా పాడిన యుగళగీతం.మనతో పాడే లేడీ బ్లాగ్ సింగర్స్ లేరు గనుక, దీనికి నేనే లిరిక్స్ సమకూర్చి నాదైన ఒక మనోహర మార్మికగీతంగా మార్చి సోలో సాంగ్ గా పాడాను.

'అందాల ఓ చిలకా అందుకో నా లేఖా...' అనే పల్లవిని మాత్రం ఆరుద్రగారి గౌరవార్ధం మార్చకుండా అలాగే ఉంచాను.

Original Song:--Andala O Chilakaa

Movie:--Letha Manasulu (1966)
Lyrics:--Arudra
Music:--M.S.Viswanathan
Singers:--P.B.Srinivas, P.Suseela
New Lyrics:--Satya Narayana Sarma
Karaoke Singer:--Satya Narayana Sarma

Enjoy

------------------------------------

అందాల ఓ చిలకా అందుకో నా లేఖా
నా మదిలోని కలలన్నీ ఇక చేరాలి నీదాకా

[మనసున నిన్నే వలచితిని -మరిమరి నిన్నే తలచితిని]-2

మొదటి పరిచయం మరపురాదులే - ప్రణయ పరిమళం మాసిపోదులే
మనసుమాయలో మునుగరాదులే - మధురప్రేమనే మరువరాదులే

అందాల ఓ చిలకా అందుకో నా లేఖా

నా మదిలోని కలలన్నీ ఇక చేరాలి నీదాకా

[తలపుల సుడిలో మునిగితివి - తడబడు వడితో నడచితివి]-2

కనుల బాసలే కల్లకావులే - మరుల జ్వాలలే ఆరిపోవులే
విరుల మాలలే వలపు నింపులే- తరుల ఛాయలే తనివి తీర్చులే

[అందాల ఓ చిలకా అందుకో నా లేఖా

నా మదిలోని కలలన్నీ ఇక చేరాలి నీదాకా]-2

నీకై యుగములు వేచితిని - నీకై లోకం మరచితిని
నిన్ను గానక మరలిపోనులే - నిన్ను చేరక నిలువలేనులే
ఎల్లలెరుగని ఎదురుచూపులో - ఎల్లకాలమూ వేచియుందులే

అందాల ఓ చిలకా అందుకో నా లేఖా

నా మదిలోని కలలన్నీ ఇక చేరాలి నీదాకా...