“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

19, జులై 2015, ఆదివారం

Hindi Melodies-Mukesh--Koi Jab Tumhara Hriday Tod De...కోయీ జబ్ తుమారా హృదయ్ తోడ్ దే
తడప్తా హువా జబ్ కోయీ చోడ్ దే...

పంచవటి సభ్యుడైన మణిబాబు కోరిన మీదట ఈ మధురగీతాన్ని ఆలపిస్తున్నాను.ఇది ముకేష్ గళంలో నుంచి జాలువారిన సుతార మంద్రగీతం.ఇది 'పూరబ్ ఔర్ పశ్చిమ్' అనే సినిమాలోని గీతం.సామాన్యంగా ముకేష్ స్వరంలో విషాద గీతాలే బాగా పండుతాయని లోకాభిప్రాయం ఉన్నది.దానికి తగినట్లే ఆయనకు అలాంటి పాటలే ఎప్పుడూ దొరికేవి.ఇది పూర్తిగా విషాదగీతం కాకపోయినా దాదాపుగా అలాంటి చాయలే ఉన్న గీతం.విషాదం కంటే దీనిలో ఫిలాసఫికల్ చాయలు ఎక్కువగా ఉన్నాయి.

ఈ సినిమాలో మనోజ్ కుమార్ సైరాబానూ జంటగా నటించారు.పాశ్చాత్య పోకడలకు బాగా అలవాటు పడిన ఒక యువతిని మంచిదారిలో పెట్టడానికి ప్రయత్నించే సాంప్రదాయ భావాలున్న ప్రేమికుడిగా మనోజ్ కుమార్ నటించాడు.మనోజ్ కుమార్ మంచి దేశభక్తి ఉన్న వ్యక్తి.అందుకే ఆయన తీసిన సినిమాలన్నీ దేశభక్తి అనే విషయంతో ముడిపడి ఉంటాయి.ఈయన వ్యక్తిగత జీవితంలో మంచి హోమియోపతి వైద్యుడు కూడా.

ఈ గీతానికి అనేక కోణాలున్నాయి.ఇది ఒక విషాద ఛాయలున్న ప్రేమగీతమే గాక ఒక మంచి ఆధ్యాత్మిక అర్ధాన్నిచ్చే గీతం కూడా.

మనిషి అహంకారంతో విర్రవీగే సమయంలో దైవం గుర్తురాదు.కాలప్రభావంతో ఆ అహంకారం పటాపంచలై వాస్తవం కళ్ళముందు సాక్షాత్కారించినప్పుడు దైవం గుర్తొస్తుంది.కానీ అప్పటిదాకా దైవం మనకోసం ఓపికగా ఎదురు చూస్తూనే ఉంటుంది.

ఈ గీతాన్ని -- ఒక కల్మషం లేని ప్రియుడు తన ప్రేయసితో పాడే గీతంగానూ చూడవచ్చు.లేదా - అజ్ఞానంలో ఉన్న తన భక్తుని ఉద్దేశించి దైవం పాడుతున్న పాటగానూ చూడవచ్చు.ఈ రెంటిలో ఎలా తీసుకున్నా, చివరకు మిగిలేవి శాశ్వతమైన విలువలే అన్న విషయం మాత్రం నిజం.

ఈ నిజాన్ని అతి సున్నితంగా వివరించే పాట ఇది.

Movie:--Purab Aur Paschim (1970)
Lyrics:--Indeevar
Music:--Kalyanji Anandji
Singer:--Mukesh
Karaoke Singer:--Satya Narayana Sarma
Enjoy
----------------------------------------
Koi jab tumhara hriday tod de
Tadaptaa huaa jab koi chod de
Tab tum mere paas aanaa priye
Meraa dar khulaa hai
khulaa hi rahegaa tumhaare liye
Koi jab tumhara hriday tod de
Tadaptaa hua jab koi chod de

Abhi tumko meri zarurat nahee
Bahut chaahanewale mil jayenge
Abhii ruup ka ek saagar ho tum
Kawal jitne chaahoge- khil jayenge
Darpan tumhe jab - daraane lage
Jawaani bhi daaman - chudaane lage
Tab tum mere paas aanaa priye
Mera sar jhuka hai
jhuka hi rahega tumhare liye
Koi jab tumhara hriday tod de
Tadapta hua jab koi chhod de

Koi shart hotee nahi - pyaar me

Magar pyaar sharto pe tumne kiyaa
Nazar me sitare jo - chamake zaraa
Bujhane lagi aarti ka diya
Jab apni nazarme hi - girne lago
Andhero me apnehi - ghirne lago
Tab tum mere paas aana priye
Ye deepak jalaa hai
jalaa hi rahega tumhare liye
Koi jab tumhara hriday tod de
Tadapta hua jab koi chhod de

Meaning


When someone breaks your heart
when someone deserts you in hard times
then you come to me, Darling
my door is open to you
and will always remain so forever...

Now you may not need me because
there are many who are ready to love you
Now you are an ocean of beauty
and many lotuses will bloom for you as per your desire
But when your image in the mirror scares you (in old age)
when your youth and beauty leave you
Then you will come to me, darling
my head is bowed for you
and will always remain so...
When someone breaks your heart
when someone deserts you in hard times
then you come to me, Darling

There are no conditions in Love, they say
but your love is based on conditions
the stars that once glittered in your eyes
when begin to fade away like a camphor flame
when you lose your self-esteem
when the darkness created by you
starts to swallow you up
then you will come to me,darling
I have lighted a flame for you
and this flame will always keep burning for you
When someone breaks your heart
when someone deserts you in hard times
then you come to me, Darling
my door is open to you
and will always remain so forever...

తెలుగు స్వేచ్చానువాదం

ఎవరైనా నీ హృదయాన్ని ముక్కలు చేసినప్పుడు
బాధలలో నిన్ను ఒంటరిగా ఒదిలేసినప్పుడు
నా దగ్గరకు రా ప్రేయసీ
నా వాకిలి నీకోసం తెరిచి ఉన్నది
అది ఎప్పుడూ అలా తెరిచే ఉంటుంది
నీ కోసం...

ఇప్పుడు నా అవసరం నీకు లేకపోవచ్చు
నిన్ను కోరుకునే వారు ఎందఱో ప్రస్తుతం నీ ఎదుట ఉండవచ్చు
ప్రస్తుతం నువ్వు ఒక సౌందర్య జలధివి
నీకోసం ఎన్నో కమలాలు ఇప్పుడు వికసిస్తాయి
కానీ ఎప్పుడైతే
అద్దంలో నిన్ను చూచుకోడానికి నీకే భయమేస్తుందో
నీ అందం నీ యవ్వనం ఎప్పుడైతే నిన్ను వదలి వెళ్లిపోతాయో
అప్పుడైనా నా దగ్గరకు రా ప్రేయసీ
నా వాకిలి నీకోసం తెరిచి ఉన్నది
అది ఎప్పుడూ అలా తెరిచే ఉంటుంది
నీ కోసం...

ప్రేమలో షరతులు ఏవీ ఉండవని అంటారు
కానీ నీ ప్రేమ అనేక షరతులతో కూడి ఉన్నది
నేడు నీ కళ్ళలో వెలుగుతున్న నక్షత్రపు వెలుగులు
హారతి మంటలా మసకబారినప్పుడు
నీ ఆత్మవిశ్వాసాన్ని నువ్వు కోల్పోయినప్పుడు
నువ్వు సృష్టించుకున్న చీకటి
నిన్నే మింగెయ్యడం మొదలైనప్పుడు
అప్పుడైనా నా దగ్గరకు రా ప్రేయసీ
నా వాకిలి నీకోసం తెరిచి ఉన్నది
అది ఎప్పుడూ అలా తెరిచే ఉంటుంది
నీ కోసం...

ఎవరైనా నీ హృదయాన్ని ముక్కలు చేసినప్పుడు
బాధలలో నిన్ను ఒంటరిగా ఒదిలేసినప్పుడు
కనీసం అప్పుడైనా నా దగ్గరకు రా ప్రేయసీ
నా వాకిలి నీకోసం తెరిచి ఉన్నది
అది ఎప్పుడూ అలా తెరిచే ఉంటుంది
నీ కోసం...