“అసమర్ధుని వద్ద ధనము, సుఖము, కీర్తి, ధర్మము ఏవీ నిలచి ఉండవు"

17, సెప్టెంబర్ 2017, ఆదివారం

Mann Re Tu Kahe Na Dheer Dhare - Mohammad Rafi


Mann Re Tu Kaahe Na Dheer Dhare...

అంటూ మహమ్మద్ రఫీ మధురాతి మధురంగా ఆలపించిన ఈ గీతం 1964 లో వచ్చిన Chitralekha అనే సినిమాలోనిది. ఈ పాటలో పాతతరం హీరో ప్రదీప్ కుమార్ నటించారు. మీనా కుమారి, అశోక్ కుమార్ ఇతర తారాగణం. ఈ చిత్రానికి కిదార్ శర్మ దర్శకత్వం వహించారు.

చంద్రగుప్తమౌర్యుని సామంతరాజైన బీజగుప్తుడు చిత్రలేఖను ప్రేమిస్తాడు. ఆమె చంద్రగుప్తుని ఆస్థానంలో నర్తకి. కానీ ఆమె ఇతన్ని ప్రేమించదు. ఈ నేపధ్యంలో ఈ పాట సాగుతుంది.

సాహిర్ లూధియాన్వి సాహిత్యానికి, రోషన్ సమకూర్చిన మధుర సంగీతం తోడైంది. ఈ రెంటికి రఫీ మధురస్వరం ప్రాణం పోసింది. అందుకే ఈ పాటను ఒక అర్ధశతాబ్దం తర్వాత కూడా మనం పాడుకుంటున్నాం.

ఈ పాటలో వాడబడిన 'సరోద్' అనే వాయిద్యం నాకు చాలా ఇష్టమైన వాయిద్యాలలో ఒకటి. మెలోడీ ని ఇష్టపడేవారు సరోద్ ను ఇష్టపడకుండా ఉండలేరు.

ఈ పాట యమునా కల్యాణి రాగంలో స్వరపరచబడింది. నా స్వరంలో కూడా ఈ మధురగీతాన్ని వినండి మరి.

Movie:-- Chitralekha (1964)
Lyrics:-- Sahir Ludhiyanvi
Music:-- Roshan
Singer:-- Mohammad Rafi
Karaoke Singer:-- Satya Narayana Sarma
Enjoy
---------------------------------------------
Man re tu kahe na dheer dhare
O nirmohi moh na jaane Jinka moh kare
Man re tu kahe na dheer dhare

Is jeevan kee chadthee dhalthee - Dhoop ko kisne baandhaa
Rang pe kisne pahre dale – Roop ko kisne baandhaa
Kaahe ye jatan kare
Man re tu kahe na dheer dhare

Utnaa hee upkar samajh koi - Jitna saath nibhaa de
Janam maran kaa Mel hai sapna - Ye sapna bisra de
Koyi na sang mare
Man re tu kahe na dheer dhare
O nirmohi moh na jaane - Jinka moh kare…ho
Man re tu kahe na dheer dhare..

Meaning

O my heart ! Why don’t you take courage?
She whom you love
doesn’t know what passion is
O my heart ! Why don’t you take courage?

The heat that governs life and death alike
Who was able to control?
Who could jail color and complexion?
And who could restrain beauty?
Why should you try to do that?

As long as she is true to you
You reciprocate her love
Being together in life and death
Is but a wild dream
Just forget it
None accompanies you in death

O my heart ! Why don’t you take courage?
She whom you love
doesn’t know what passion is
O my heart ! Why don’t you take courage?

తెలుగు స్వేచ్చానువాదం

ఓ మనసా !
ఎందుకు నువ్వు ధైర్యంగా ఉండలేకపోతున్నావు?
నీ ప్రేయసికి మోహం అంటే తెలీదు
అలాంటి దాన్ని నువ్వు ప్రేమిస్తున్నావు
ఓ మనసా ధైర్యం తెచ్చుకో

ఈ జీవనమూ మరణమూ రెంటినీ
నడిపిస్తున్న శక్తిని ఎవడు ఒడిసి పట్టగలిగాడు
శరీర కాంతిని ఎవడు బంధించగలిగాడు
అందాన్ని ఎవడు అదుపు చేయ్యగలిగాడు
నువ్వు మాత్రం ఎలా చెయ్యగలవు?
నీకెందుకా పని?

తను నీతో నమ్మకంగా ఉంటే
నువ్వూ తనలాగే ఉండు
అంతేగాని, జీవితంలోనూ మరణంలోనూ
కలిసే ఉండాలన్నది ఒక పిచ్చి కల
దానిని మర్చిపో
నీ చావులో నీకెవరూ తోడు రారు

ఓ మనసా !
ఎందుకు నువ్వు ధైర్యంగా ఉండలేకపోతున్నావు?
నీ ప్రేయసికి మోహం అంటే తెలీదు
అలాంటి దాన్ని నువ్వు ప్రేమిస్తున్నావు
ఓ మనసా ధైర్యం తెచ్చుకో