“Self service is the best service”

5, డిసెంబర్ 2014, శుక్రవారం

Telugu Melodies-Ghantasala-మల్లియలారా మాలికలారా..


సి.నారాయణ రెడ్డిగారి సాహిత్యంలో అదొక విధమైన మహత్యం ఉంటుంది. ఆయన వ్రాసిన సినిమా పాటలు వేటికవే ఆణిముత్యాలు.సాహిత్యపరంగా నేను ఆయన అభిమానినే.

సినారె గారి పాటలతో నేను సులభంగా తాదాత్మ్యతను పొందగలను.నాకు తెలియని ఒక పది పాటలను కలగలుపుగా ఉంచి అందులోంచి నారాయణరెడ్డిగారి పాటను బయటకు తియ్యమంటే,ఆ సాహిత్యాన్ని బట్టీ, సాహిత్యంలోని ఆయన సంతకాన్ని బట్టీ ఆ పాటను సులభంగా నేను గుర్తుపట్టగలను.

ఆయన పాటల్లో ఆత్మా,జీవమూ నిండి ఉండటం నేను చాలాసార్లు గమనించాను.ఎంతో ఫీల్ తో బహుశా ఆయన పాటలు వ్రాస్తారు అని నాకనిపిస్తుంది.అందుకే వాటి క్వాలిటీ మిగిలినవారి పాటలకంటే విభిన్నంగా ఉంటుంది.

ప్రస్తుతపు పాటకూడా అలా ఎప్పటికీ నిలిచిఉండే అద్భుతమైన ఆణిముత్యాలలో ఒకటి.ఎందుకంటే సినారె గారి అద్భుతమైన సాహిత్యానికి ఘంటసాల మాస్టారు సమకూర్చిన అత్యద్భుతమైన సంగీతం దానికా మార్దవాన్నీ సౌందర్యాన్నీ తెచ్చిపెట్టింది.దానికితోడు రామారావు,సావిత్రి గార్ల నటన ఈ పాటకు ఇంకా పరిపూర్ణతను తెచ్చిపెట్ట్టింది.

అందుకే అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికి ఈ పాటను ఎన్నిసార్లు విన్నా ఏదో తెలియని అనుభూతిని మాటిమాటికీ కలిగిస్తూనే ఉంటుంది.

పాట:--మల్లియలారా మాలికలారా..
చిత్రం:--నిర్దోషి (1967)
రచన:--సి.నారాయణ రెడ్డి
సంగీతం,గానం:--ఘంటసాల మాస్టారు.
కరావోకే గానం:--సత్యనారాయణ శర్మ.

Enjoy
------------------------------------------------

{మల్లియలారా మాలికలారా
మౌనముగా ఉన్నారా - మా కధయే విన్నారా}-2 

జాబిలిలోనే జ్వాలలు రేగే - వెన్నెల లోనే చీకటి మూగే-2
పలుకగ లేక-పదములు రాక
పలుకగా లేక- పదములే రాక
బ్రతుకే తానే బరువై సాగె                                 ||మల్లియలారా||

చెదరిన వీణా రవళించేనా - జీవనరాగం చిగురించేనా-2
కలతలు పోయి - వలపులు పొంగి
కలతలే పోయి - వలపులే పొంగి
మనసే లోలో పులకించేనా                             ||మల్లియలారా||