“There are many who just talk, but very very few who really realize" - Self Quote

20, జూన్ 2009, శనివారం

బ్రూస్ లీ జాతకం

ప్రఖ్యాత కుంగ్ ఫూ స్టార్ బ్రూస్ లీ 27-11-1940 తేదీన 7.12 నిముషాలకు శాన్ ఫ్రాన్సిస్కోలో జన్మించాడు. కుంగ్ ఫు అనే విద్య ఒకటుంది అన్న విషయాన్ని ప్రపంచానికి తనసినిమాలతో పరిచయం చేసాడు. తరువాత ఎందరు కుంగ్ ఫూ స్టార్స్ వచ్చినా ఈయనస్థానం ఈయనదే. ఆయన జాతకాన్ని ఇక్కడ ఇస్తున్నాను.

ఈయన అసలు
పేరు జూన్ ఫాన్ లీ. ఈ పేరులో లీ అనేది వీరి ఇంటి పేరు. ఈయన విక్రమనామ సంవత్సరం కార్తీక బహుళ చతుర్దశి రోజున బుధ వారం బుధ హోరలో స్వాతినక్షత్రం-4 పాదంలో జన్మించాడు. ఈయన జాతకంలో ఆత్మ కారకుడు కూడా బుదుడేకావటం ఒక విశేషం.జన్మ సమయంలో శోభన యోగం, విష్టి కరణం ఉన్నవి.


ఈయన తండ్రి చైనా వా
డు. కాని తల్లి యొక్క తండ్రి జర్మన్ మరియు తల్లి చైనీస్. కనుక జర్మన్ రక్తం ఈయనలోఉన్నది. ఈయన పుట్టినపుడు రాహు/చంద్ర/రాహు/కేతు/రవి దశ జరుగుతున్నది. రాహు కేతువుల మరియు రవిచంద్రుల కలయిక వల్ల ఈయన వంశానికి శాపం ఉన్నది అని చెప్పవచ్చు. రవి ప్రాణ దశ వల్ల అది తండ్రి వైపు నుంచిఉన్నది అని చెప్ప వచ్చు. ఇది నిజమే. ఇటువంటి శాపం వీరి వంశానికి ఉన్నదని చెబుతారు. బ్రూస్ లీ తన 32 వ ఏటఅనుమానాస్పద పరిస్థితుల్లో మరణించాడు. అలాగే ఈయన కొడుకైన బ్రాండన్ లీ తన 26 వ ఏట సినిమా షూటింగ్సమయంలో మరణించాడు. వీరి వంశానికి శాపం ఉన్నది అని బ్రూస్ లీ తండ్రి గట్టిగా నమ్మేవాడు. శాపం ఉందా లేదాఅనేది జాతక విశ్లేషణలో తరువాత చూద్దాము.

ఈయన తండ్రి చైనీస్ ఒపేరాలో ఆర్టిస్టు గా పని చేసేవాడు. బ్రూస్ లీ బాల నటుడిగా కొన్ని సినిమాలలో నటించాడు. చిన్నప్పుడు ఒక గాంగు లీడర్ గా ఉండేవాడు. 13 ఏళ్ళ వయసులో జరిగిన ఒక వీధి కొట్లాటలో బ్రూస్ లీ బాగా దెబ్బలుతిన్నాడు. ఆ పౌరుషంతో ప్రఖ్యాత వింగ్ చున్ మాస్టర్ అయిన యిప్ మాన్ వద్ద శిష్యుడిగా చేరి కుంగ్ ఫూ అభ్యాసంమొదలు పెట్టాడు. 1954-57 మధ్య కాలంలో ఈయన యిప్ మాన్ శిష్యుడిగా ఉండి కుంగ్ ఫూ ప్రాక్టీస్ చేసాడు. ఈసమయంలో ఈయనకు గురు దశలో చంద్ర, కుజ అన్తర్దశలు జరిగాయి. రాహు అంతర్ దశలో వింగ్ చున్ అభ్యాసంమధ్యలో వదలి
పెట్టి తిరిగి అమెరికా చేరాడు. గురువులో రాహువు ఈ విధంగా ఈయన శిక్షణకు గండి కొట్టింది.

మార్షల్ ఆర్ట్స్ ను సూచించే గ్రహ స్థితులు:
స్థిర లగ్నమైన వృశ్చికం రాశి, దశాంశాలలో ఉదయిస్తున్నది. కుజ సంబంధ లగ్నం తో రవి కలిసి ఉండటం వల్ల వీరవిద్యలలో నైపుణ్యం ఉన్నట్లు తెలియటమే కాక లోక ప్రసిద్దుడు అవుతాడని చెప్ప వచ్చు. కాని రవి నీచకు అతి దగ్గరగాఉండుట వల్ల మరియు లగ్నారూడం అయిన కన్యలో రాహువు ఉండుట వల్ల వంశానికి శాపం ఉందని తెలుస్తూంది. రవిసంబంధం వల్ల తండ్రి వైపు నుంచి అని తెలుస్తూంది. గుళిక మకర లగ్నంలో రవి నక్షత్రమైన ఉత్తరాషాడలో ఉండుట వల్లకూడా ఇదే ఊహకు బలం ఏర్పడుతున్నది. ఆరింట శని మరియు గురు గ్రహముల కలయిక వల్ల మార్షల్ ఆర్ట్స్ లోగొప్ప ఓర్పుతో సాధన చేసి గురువు అవుతాడని సూచన.

దశాంసలో లగ్న రవులు వర్గోత్తమాంశ తో ఉండుట వల్ల మార్షల్ ఆర్ట్స్ తో లోక ప్రసిద్ది కెక్కుట ద్వారా సంపాదనసూచింపబడుతున్నది. లగ్నాదిపతి యగు కుజుడు ద్వాదశస్థానస్థితి మంచిదికాదు. శుక్రునితో మరియు ఆత్మకారకుడగు బుధునితో కలయిక వల్ల ప్రేమ వ్యవహారాలలో చిక్కుకొని తన అధోగతికి తానే కారకుడై నాడు. కుజబుధశుక్రుల కలయికవల్ల మల్లయుద్ధ ప్రావీణ్యం ఏర్పడుతుంది అని పరాశరమహర్షి, జైమిని మహర్షులు చెప్పిన మాటఅక్షరాలా నిజంకావటం ఈ జాతకంలో చూడ వచ్చు.

సహజ పంచమాదిపతి అయిన రవి లగ్నంలో మిత్ర క్షేత్రంలో ఉండి ఎక్కువ వర్గ చక్రములో లగ్నం లో ఉండటంతో రంగ స్థల నటుడుగా, నృత్యంలో ప్రావీణ్యత కలిగింది. బ్రూస్లీ హాంగ్ కాంగ్ లో చాచా డాన్స్ చాంపియన్ అని చాలామందికి తెలియదు.విక్రమస్థానంపైన కుజ శనుల దృష్టితో ధైర్యం పౌరుషం కలిగాయి.దశమస్థానం పైన గురుదృష్టితో అమెరికాలో కుంగ్ ఫూ స్కూల్ స్థాపించి అనేక మందికి గురువుగా కుంగ్ ఫూ నేర్పించాడు.

కాని ద్వాదశంలో ఉన్న కుజుని మీద శని ద్రుష్టి రహస్య శత్రువులను ఇవ్వటమే కాక ఇప్పటికీ మిస్టరీ గా మిగిలినమరణాన్ని ఇచ్చింది.ద్వాదశంలో చంద్ర, కుజ, బుధ శుక్రుల కలయిక వల్ల ఈయన మీద అనేక స్కూల్స్ ప్రభావంఉన్నది. పని చేసేవి ఫలితం చూపించేవి అయితే ఏ స్టైల్ నుంచి అయినా టెక్నిక్స్ తీసుకో వచ్చు అంటూ "జీత్ కునే డో" అని ఒక కొత్త స్టైల్ మొదలు పెట్టాడు. దీన్ని "The way of intercepting fist" అంటూ కొన్నాళ్ళు పిలిచి తరువాత ఈపేరును తొలగించాడు.

జీవితంలో ఎటువంటి బంధాలూ ఉండకూడదు అని నమ్మేవాడు. అలాగే మార్షల్ ఆర్ట్స్ కూడా గిరి గీసుకొని ఇది నా స్టైల్ అంటూ ఉండటం తప్పు అని చెప్పే వాడు. ఈ ధోరణి వల్లనే నేడు అమెరికాలో M.M.A - Mixed Martial Arts అనే ట్రెండ్ వచ్చింది. తాను బతికి ఉన్నప్పుడు ఎంతో మందికి తనదైన స్టైల్ నేర్పించినా ముగ్గురికి మాత్రమె తన స్టైల్ లో బోధించటానికి సర్టిఫికేట్ ఇచ్చాడు. ఓపెన్ మైండ్ తో ఉండటం ముఖ్యం అని చెప్పేవాడు. ఈయన భావాలు జెన్ సిద్ధాంతాలకు దగ్గరిగా ఉంటాయి. సాంప్రదాయం గా వస్తున్న అనేక అభ్యాసాలను నిరసించాడు. ఉదాహరణకు కరాటేలో కటా ప్రాక్టీస్ లేదా కుంగ్ ఫూ లో ఫాం ప్రాక్టీస్ అనవసరం అని తేల్చి చెప్పాడు. ఎందుకంటే అది వీధి పోరాటం లో పనికిరాదు అని చెప్పాడు. ఇది చాలా వరకు నిజం కూడా.

ఈయన పుట్టినపుడు రాహు దశ రెండు ఏళ్ళ రెండు నెలలు మిగిలి ఉంది. ఈయన జీవితంలో ముఖ్య సంఘటనలుదశల వారీగా తరువాతి పోస్ట్ లో చూద్దాం.