17, జులై 2016, ఆదివారం

మా అమెరికా యాత్ర - 29 ( గాంగెస్ ఆశ్రమం - శ్రీ యంత్రం )























ఆదివారం ఉదయం గాంగెస్ శ్రీరామకృష్ణ యూనివర్సల్ టెంపుల్ లో 'శ్రీవిద్య' మీద ప్రసంగం ఇచ్చాను.దానికి పంచవటి మెంబర్స్ మాత్రమేగాక అక్కడి అమెరికన్స్ కూడా హాజరయ్యారు.ఆ వివరం అంతా ఇదే సీరీస్ 12 పార్ట్ లో వ్రాశాను.

మేమక్కడకు వెళ్ళేసరికే, ఆ హాల్లో అమెరికన్స్ చాలామంది ఉండి, ప్రేయర్ చేస్తున్నారు.వాళ్ళలో కొందరికి చిన్న చిన్న పిల్లలున్నారు.ఆ పిల్లలచేత ప్రేయర్ చేయిస్తున్నారు.ఆ ప్రేయర్ కూడా అన్ని మతాల ప్రేయర్స్ నూ కలగలిపిన యూనివర్సల్ ప్రేయర్ గా ఉన్నది. అందులో మనదైన - అసతోమా సద్గమయ, తమసోమా జ్యోతిర్గమయ, మృత్యోర్మా అమృతంగమయ' అనే భావాన్ని ఇంగ్లీషులో అంటూ, ఆ పిల్లలచేత అనిపిస్తూ ప్రేయర్ చేశారు. చాలా ముచ్చటగా అనిపించింది.

ఒక మధ్యవయసు అమెరికన్ స్త్రీ,  వాళ్ళ చేత ప్రేయర్ చేయిస్తూ, అక్కడ కనిపించింది. ఆ తర్వాత తెలిసింది చాలా ఏళ్ళ క్రితమే ఆమె హిందూ సాంప్రదాయం ప్రకారం సన్యాసం స్వీకరించిందనీ ఆమె పేరు - శక్తివ్రత మా  - అనీ.

మనవాళ్ళతో బాటు అమెరికన్స్ కూడా శ్రద్ధగా కూచుని 'శ్రీయంత్రం' గురించిన వివరణ వినడం చాలా ఆశ్చర్యంతో బాటు ఆనందమూ కలిగించింది.ఆ తర్వాత తెలిసింది ఏమంటే - వాళ్ళలో చాలామందికి శ్రీ యంత్రం గురించి చాలా అవగాహన ఉన్నదనీ, దానిగురించి వాళ్ళు చాలా రీసెర్చి చేస్తున్నారనీ తెలిసింది.

ఇదే సమయంలోనే మైకేల్, జూలియా అనే ఇద్దరు నా వద్దకు వచ్చి పరిచయం చేసుకుని మాట్లాడారు.మరుసటి రోజున దీక్షాస్వీకారం చేసి వాళ్ళు నా శిష్యులయ్యారు.

ఉపన్యాసం అయ్యాక, టెంపుల్ వెనుకగా ఉన్న హాల్లో బఫే విందు జరిగింది.

ఆ సమయంలో అక్కడ ఉన్న ఇద్దరు అమెరికన్స్, వారు శ్రీయంత్రం మీద చేసిన రేఖా గణిత రీసేర్చిని నాకు వివరించారు. వారిలో ఒకరి పేరు రివర్.తనను తాను సరదాగా 'రివరానంద' అని పిలుచుకుంటూ ఉంటాడు. ఇంకొకాయన పేరు ఏదో ఉంది కాని ఆయన్ను అందరూ 'ప్రేమ్' అని పిలుస్తారు. అందరూ చాలా మంచివాళ్ళలా కనిపించారు.

ఈ ప్రేమ్ అనే అమెరికన్ అతని భార్యా కలసి కొన్ని ప్రయోగాలు చేశారట. ధ్వని అనేది ఇసుక లేదా నీటిలో ఎలాంటి షేప్స్ తీసుకువస్తుంది? అనేదే ఆ ప్రయోగాల సారాంశం.ఈ సైన్సును Cymatics అంటారు. Cymascope అని ఒక యంత్రం ఉంటుంది.దానిలో ఉన్న ప్లేట్ లో ఇసుక గాని, నీరు గాని పోసి, ఏదైనా ఒక సౌండ్ వైబ్రేషన్ తో దానిని వైబ్రేట్ చేస్తే, ఆ ఇసుకలోగాని, నీటిలో గాని రకరకాలైన ముగ్గులు లేదా యంత్రాల  వంటి షేప్స్ వస్తాయి.క్లుప్తంగా ఇదే ఈ సైన్స్.

ప్రేమ్ అతని భార్యా కలసి 'ఓమ్' అనే సౌండ్ ను వైబ్రేట్ చేసి చూస్తే, అది శ్రీచక్రం లాంటి ఒక షేప్ ను ఇసుకలోనూ నీటిలోనూ తెచ్చిందని వాళ్ళు చెప్పారు.వాళ్ళు చేసిన ప్రయోగాల ఫోటోలను కూడా నాకు చూపించారు. ప్రణవనాదానికీ శ్రీయంత్రానికీ భేదం ఏమీ లేదని మనం శ్రీవిద్యా సాంప్రదాయంలో విశ్వసిస్తాం.దానినే వీరు సైన్స్ యంత్రాల పరంగా నిరూపిద్దామని ప్రయత్నిస్తున్నారా? అనిపించింది.

వాళ్ళతో ఇంకొక విషయం కూడా చెప్పాను.

1990 లో అమెరికాలోని  ఒరెగాన్ స్టేట్ లోని ఒక ఎండిపోయిన నీటి మడుగు బెడ్ మీద రాత్రికి రాత్రి హటాత్తుగా ఒక బ్రహ్మాండమైన శ్రీయంత్రం ప్రత్యక్షమైంది.ఇది చిన్నా చితకా చిత్రం కాదు.దాదాపు 13 మైళ్ళ విస్తీర్ణంలో ఈ యంత్రం హటాత్తుగా ఆ లేక్ బెడ్ లో ప్రత్యక్షమైంది.ఆ గీతలన్నీ చాలా స్పష్టంగా చాలా ఖచ్చితంగా ఎవరో మిషన్ తో కొలిచి గీచినట్లుగా ఉన్నాయి. ఇదెలా జరిగిందో, అంత సంక్లిష్టమైన శ్రీయంత్రాన్ని 13 మైళ్ళ విస్తీర్ణంలో అంత స్పష్టంగా రాత్రికి రాత్రి ఎవరు గీచారో,ఎవరికైనా సరే ఇదెలా సాధ్యమో,ఇప్పటి వరకూ ఎవరికీ తెలియదు.ఇది గ్రహాంతర వాసుల పనే అని చాలామంది ఇప్పటికీ నమ్ముతున్నారు.ఎందుకంటే దీనిని ఈ రకంగా గియ్యడం మానవ మాత్రుల వల్ల జరిగే పని కాదు.

ఆ లింక్ ఇక్కడ చూడండి.

http://www.labyrinthina.com/sriyantra.html

దానిగురించి వాళ్ళతో మాట్లాడాను. ఈ అద్భుతం గురించి వాళ్లకు తెలుసు. కానీ వాళ్ళు కూడా దీని గురించి ఏమీ చెప్పలేక పోయారు.అది ఒక మిరకిల్ అని వాళ్ళు కూడా నాతో అన్నారు.

వాళ్ళ లోని ఓపన్ మైండ్, ఏదైనా ఒకదాన్ని పట్టుకుంటే దాని చివర వరకూ అర్ధం చేసుకోవాలన్న తపనా, రీసెర్చి చేసే గుణమూ,నమ్మితే పూర్తిగా నమ్మే తత్వమూ, నాకు బాగా నచ్చేశాయి.

అందరూ మాకు కనిపించారు గాని 'గౌరీమా' మాత్రం కనిపించలేదు. ఆమె తన ఇంట్లోనే ఉంటారుగాని సాధారణంగా బయటకు రారని తెలిసింది.

దేవాలయంలో 'గౌరీమా' (శ్రీ రామకృష్ణుల ప్రత్యక్ష శిష్యురాలు) ఫోటో చూచినప్పుడే నాకు ఆశ్చర్యం కలిగింది. ఈమె కూడా ఆ పేరే ఎందుకు పెట్టుకుందో?దీని వెనుక ఏమైనా కధ ఉన్నదా అని నాకు సందేహం వచ్చింది. సమయం వచ్చినపుడు తెలుస్తుందిలే అని మౌనంగా ఊరుకున్నాను.

ప్రస్తుతం ఈ ఆశ్రమానికి ఇన్ చార్జ్ గా ఉన్న అమెరికన్ వనిత ' స్వామిని గౌరీవ్రత పురీ దేవి' (ఈమెనే సంక్షిప్తంగా గౌరీమా అని పిలుస్తారు) జీవితం నిజంగా చాలా అద్భుతమైనది. ఆమె గురించి తెలుసుకోబోయే ముందు, శ్రీ రామకృష్ణుల ప్రత్యక్షశిష్యురాలైన 'గౌరీమా' గురించి వచ్చే పోస్ట్ లో తెలుసుకుందాం.ఎందుకంటే ఆమె యొక్క తపోప్రభావమే నేడు గాంగెస్ లో ఈ ఆశ్రమం రావడానికి వెనుక గల బలమైన శక్తి గనుక.

(ఇంకా ఉంది)
read more " మా అమెరికా యాత్ర - 29 ( గాంగెస్ ఆశ్రమం - శ్రీ యంత్రం ) "

16, జులై 2016, శనివారం

జూలై 2016 పౌర్ణమి ప్రభావం - బాస్టిల్ డే విషాదం

ఫ్రాన్స్ లోని నీస్ నగరంలో ఇంకో విషాదం.

జూలై పద్నాలుగున జాతీయ దినోత్సవ సంబరాలలోకి ఒక ఇస్లామిక్ ఉగ్రవాద మృగం ఒక ట్రక్కును విచక్షణా రహితంగా నడిపి కాల్పులు జరిపి దాదాపు 90 మందిని చంపేశాడు.ఇంకా ఎంతోమంది గాయపడ్డారు.

ఖగోళంలో రాహు గురువుల సంయోగం చాలా దగ్గరగా కొనసాగుతూ ఉండటం దీనికిగల ముఖ్య కారణమైతే వృశ్చికరాశిలో కుజ చంద్ర శనుల సంయోగమూ, చంద్రునికి ఇది నీచస్థితి కావడమూ ఈ సంఘటనకు వెనుక ఉన్న కర్మకారణాలు.ప్రస్తుతం మనం పౌర్ణమికి దగ్గరగా వెళుతున్నాం.

ఖగోళ జ్యోతిష్య శాస్త్రాన్ని అలా ఉంచి చూస్తే మరికొన్ని విషయాలు కనిపిస్తాయి.

ఇలాంటి ఉగ్రవాద దాడులు జరిగినప్పుడు, ఇండియాలోని ముస్లిమ్స్ ఎవ్వరూ 'అయ్యో పాపం' అనగా ఇప్పటిదాకా నేను వినలేదు కనలేదు. ఈ ధోరణే, ఇస్లామిక్ ఉగ్రవాదం పట్ల వాళ్ళ సానుభూతిని తేటతెల్లం చేస్తోంది.

మరోవైపు ఇండియాకు రావడానికి జాకీర్ నాయక్ నిరాకరించాడు.పైగా, తమది ఇస్లామిక్ టీవీ కావడం వల్లనే తమపైన వివక్ష చూపిస్తున్నారంటూ భారత ప్రభుత్వాన్ని నిందించాడు. నిజంగా ముస్లిమ్స్ మీద మనం వివక్ష చూపిస్తే భారతదేశంలో వాళ్ళు ఇంత జనాభాగా ఎదిగేవారేనా?ఇక్కడి తిండి తింటూ,ఇక్కడ నీళ్ళు త్రాగుతూ, ఇక్కడి గాలి పీలుస్తూ ఇక్కడి మతాలను దూషించేవారేనా?

అతని జ్ఞాపకశక్తి గట్టిదే కావచ్చు, భగవద్గీత నుంచీ, పురాణాల నుంచీ అతను అనేక శ్లోకాలను కోట్ చెయ్యవచ్చు.అది పెద్ద గొప్ప పనేమీ కాదు.ఒక రెండేళ్ళు గనక ఖురాన్ బట్టీ పడితే అంతకంటే అద్భుతంగా ఆ శ్లోకాలను మనమూ వప్ప జెప్పవచ్చు.అసలు విషయం అది కాదు.

అతను చెప్పే లాజిక్ అంతా లోపభూయిష్టమే. అతను ఒక పిడివాదిలాగా మాట్లాడతాడు.ఎదుటి మనిషికి ఏమీ జవాబు చెప్పలేక తన లాజిక్ లో కార్నర్ అయిపోయినప్పుడు 'మా ఖురాన్ ఇలా చెబుతోంది గనుక మేం అదే నమ్ముతాం.దానికి వ్యతిరేకంగా ఉన్న మంచినీ, తార్కిక సత్యాలనూ కూడా మేం నమ్మం' అని తేల్చేస్తాడు.ఇక అలాంటప్పుడు చర్చ ఎందుకు? వాదన ఎందుకు? ఎవరి నమ్మకం వారిది కదా?

నాకొక ముస్లిం శిష్యురాలు గతంలో ఉండేది.ఆ అమ్మాయి వాళ్ళ బావ ఒకరోజున ఆమెతో ఇలా అన్నాడట.

'మీ గురువుగారిని పీస్ టీవీలో జాకీర్ నాయక్ ఉపన్యాసాలు వినమను.ఒక్కసారి విన్నాడంటే ఆయన ముస్లింగా మారడం తధ్యం.'

ఆమెతో నా మాటగా ఇలా అన్నాను.

'జాకీర్ నాయక్ నాతో ఒక గంట సేపు మాట్లాడితే, తనే ఇస్లాం వదిలేసి అసలైన హిందూమతం స్వీకరిస్తాడని మీ బావతో చెప్పు.అతను రాకపోతే కనీసం మీ బావనైనా వచ్చి నాతో మాట్లాడమను.'

అటువైపునుంచి ఏమీ జవాబు రాలేదు.

అతనేకాదు - 'అదే కారణమైనా కానీ, కనిపించని దేవుడి కోసం కనిపించే సాటి మనిషిని చంపడం అసలు న్యాయమేనా?' - అన్న ప్రశ్నకు ప్రపంచంలోని ఏమాత్రం మానవత్వం ఉన్న ఏ మనిషీ జవాబు చెప్పలేడు.

అంతేకాదు, ఇస్లాంలోని మౌలిక విషయాల మీద ప్రశ్నలు సంధిస్తే వాటికి ఎలాంటి జవాబులూ రావు.ఎంతటి జాకీర్ నాయక్ కూడా వాటికి జవాబు చెప్పలేడు. జవాబులు చెప్పలేనప్పుడు మూర్ఖంగా మాట్లాడతారు. అంతే.

ఉదాహరణకు ఒక చిన్న ప్రశ్న.

'మీలోనే కొందరు ఇస్లాం అంటే శాంతి అంటారు. మరికొందరేమో- అదే ఇస్లాం చెప్పింది కాఫిర్లను చంపమని - అని అంటారు? మీలో అసలెవరు కరెక్ట్? అసలు ఇస్లాం ఏం చెప్పింది? పక్కమనిషిని చంపమని చెప్పిందా లేదా? అది చెప్పడమే తప్పా? లేక మీరు అర్ధం చేసుకోవడం తప్పా? రెండిట్లో ఏదైనా, మానవత్వ కోణంలో చూస్తే, రెండూ తప్పులేగా? అలాంటప్పుడు ఆ బోధలు అనుసరించి మీరు చేస్తున్నదీ తప్పేగా? కాదని ఎలా సమర్దిస్తారు?' - అన్న ప్రశ్నకు ఎంతటి మొనగాడైనా ఎలాంటి సమంజసమైన తార్కికమైన జవాబునూ చెప్పలేడు.

ఇంకో ప్రశ్న.

'ఇస్లాం ప్రకారం 'శాంతి' అంటే ఏమిటి? ముస్లిములు కానివారిని అందర్నీ చంపేసి, ఆ తర్వాత మిగిలేదానినే మీరు శాంతి అంటున్నారా? అది శాంతి ఎలా అవుతుంది?'

ఇంకో ప్రశ్న.

'ఇస్లాంలో ఉన్న బోధలు మానవత్వానికి విరుద్ధంగా ఉంటే వాటిని మార్చాలా? లేక గుడ్డిగా అనుసరించాలా? ఒకవేళ గుడ్డిగా అనుసరించాలి అన్నప్పుడు, ఆ వ్రాసినవారు మానవతా వాదులు కానట్లే కదా? మరి వారిని శాంతి దూతలని ప్రవక్తలని ఎలా అంటారు? హింసను ప్రేరేపించేవాడు ప్రవక్త ఎలా అవుతాడు? దీనిని మీరు ఎలా సమర్ధిస్తారు?'

ఈ ప్రశ్నలలో వేటికీ ఏ విధమైన తర్కబద్ధమైన జవాబూ రాదు. ఇవ్వడం వారివల్ల కాదు.

ఏమీ తెలియని అజ్ఞానులు జాకీర్ నాయక్ లాంటివాళ్ళ ప్రసంగాలు విని అదేదో గొప్ప అనుకుంటారు.ఇలాంటి అరబుర్ర గాళ్ళను చూచి నేను నవ్వుకుంటాను.

'తినగ తినగ వేము తియ్యనుండు' అన్నట్లు - వినగా వినగా విషం కూడా అమృతంలాగా తోస్తుంది.విషపు భావజాలాన్ని నూరిపొయ్యగా నూరిపొయ్యగా మామూలు మనుషులే టెర్రరిస్ట్ లు గా మారతారు.ప్రస్తుతం ఫ్రాన్స్ లో జరిగింది ఇదే.

ఫ్రాన్స్ లోనే కాదు. ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం ఒక విచిత్ర ధోరణి కనిపిస్తున్నది. అదేమంటే - భవిష్యత్తులో ప్రపంచం మొత్తం - ఇస్లామిక్, నాన్ ఇస్లామిక్ దేశాలు- అనే రెండు కూటములుగా విడిపోతుంది.అప్పుడు జరిగేదే మూడో ప్రపంచ యుద్ధం.అప్పుడు ప్రపంచవ్యాప్తంగా జరిగే వినాశనం చాలా దారుణాతి దారుణంగా ఉంటుంది.ఈ భవిష్యవాణి ఖచ్చితంగా జరుగుతుంది.ఏమీ అనుమానం లేదు.అయితే అది దేశాలమధ్య జరగదు.మతాలమధ్య జరుగుతుంది.మతాల ప్రాతిపదికన రెండుగా చీలిన ప్రపంచపు దేశాలమధ్యన జరుగుతుంది.

అప్పుడు జరిగే వినాశనాన్నే వీరబ్రహ్మం గారూ, నోస్త్రాడేమస్ మొదలైన కాలజ్ఞానులు వర్ణించారు.అది భవిష్యత్తులో జరిగే మాట నిజమే.దానిని ఆపటం ఎవరికీ సాధ్యం కాదనే నాకనిపిస్తున్నది.

ఇస్లాం మతం వల్ల ప్రపంచంలో చాలా రక్తపాతమూ నాశనమూ జరిగాయి ఇప్పటికీ జరుగుతున్నాయి. అంతెందుకు? మన దేశంనుంచి బౌద్ధమతం కనుమరుగు కావడానికి ప్రధాన కారణం ఇస్లాం సృష్టించిన రక్తపాతమే.బౌద్ధ సన్యాసులనూ గురువులనూ నరకడమూ, సజీవంగా దహనం చెయ్యడమూ - ఇలాంటి పనులు చేసి భయోత్పాతం సృష్టించడం వల్లనే మిగిలినవాళ్ళు టిబెట్ మొదలైన ఇతర దేశాలకు పారిపోయారు.కానీ ఆ నిందను మాత్రం దివ్యమూర్తి అయిన ఆదిశంకరుల మీద మోపారు.హిందూమతం అంటే ద్వేషం ఉన్న మిగతావాళ్ళు ఆ మాటను పట్టుకుని గుడ్డిగా ప్రచారం చేశారు.ఇప్పుడు అదే నిజమని అందరూ నమ్ముతున్నారు.

వాళ్ళు ఎప్పుడూ చేసేది అదే. చెయ్యాల్సిన ఘోరాలన్నీ వాళ్ళు చేస్తారు.నిందమాత్రం ఎదుటివారిమీద మోపుతారు. మొదటి నుంచీ వాళ్ళ స్ట్రాటజీ అదే. 

అదలా ఉంచితే, చాపక్రింద నీరులా హింసావిషాన్ని వ్యాపింపజేస్తున్న ఇలాంటి ఉగ్రవాద శాంతి మూకలను శాంతిగా భరిస్తున్న మనమా శాంతి దూతలం?లేక, సాటి మనుషులను చంపమని ప్రోత్సహిస్తున్న ఇస్లామిక్ ఉగ్రవాదులా శాంతిదూతలు?

మన ప్రభుత్వం గట్టిగా ఉండకపోతే, ముందు ముందు, మన దేశంలో కూడా ఇలాంటి సంఘటనలు ఎన్నో జరుగుతాయనేది, ఎంతోమంది అమాయక పౌరులు బలౌతారనేది, ఖచ్చితంగా ఊహించవచ్చు.

పోనీలే అలాగైనా మన జనాభా కాస్త తగ్గుతుందిలే అనుకుంటే, ఆ ఆలోచనా ధోరణికి ఇక ఎవ్వరూ ఏమీ చెయ్యలేరు.

వినాశకాలే విపరీత బుద్ధి:
read more " జూలై 2016 పౌర్ణమి ప్రభావం - బాస్టిల్ డే విషాదం "

7, జులై 2016, గురువారం

మా అమెరికా యాత్ర - 28 (గాంగెస్ ఆశ్రమంలో మరపురాని రోజులు)

స్వామీజీ వెళ్ళిపోయాక గుర్తొచ్చింది,భోజన సమయం అయింది కదా, ఆయన్ను భోజనానికి ఉండమని చెబితే బాగుండేది కదా అని. ఈ విషయం మనవాళ్ళను అడిగితే, ' మేమాయన్ను అడిగాము. ఆయన లంచ్ వండుకొని వచ్చారట.ఇంకోసారి వస్తానన్నారు.' అని చెప్పారు.

ఈ అయిదురోజులూ ఆడవాళ్ళందరూ కిచెన్ లో మాట్లాడుకుంటూ తలా ఒక పని చేసుకుంటూ చకచకా వంటలు చేసేశారు.అందరూ కలసిమెలసి పనులు చేసినా, ముఖ్యంగా శకుంతలగారు,రజితగారు,సుమతిగారు కిచెన్ లో బాగా కష్టపడ్డారు. వారికి నా ప్రత్యేకాభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.

లంచ్ అయ్యాక కొద్ది సేపు రెస్ట్ తీసుకుని ఆశ్రమం వెనుక ఉన్న అడవిలోకి షికారుకు బయలుదేరాము.ముందుగా దేవాలయానికి వెళ్లి కాసేపు కూచుని, ఆ తర్వాత వెనుకగా ఉన్న అడవిలోకి వాకింగ్ కు వెళ్లి చాలాసేపు తిరిగి రిట్రీట్ హోం కు తిరిగి వచ్చాము.దారిలో మాటలన్నీ జోకులతో కూడిన ఆధ్యాత్మికమే.

ఆ ఫోటోలు ఇక్కడ చూడవచ్చు.

 ///
























 

















read more " మా అమెరికా యాత్ర - 28 (గాంగెస్ ఆశ్రమంలో మరపురాని రోజులు) "