26, జులై 2026, ఆదివారం

తెలివిలేని సంత

మొన్న పనుండి ప్రక్కఊరికెళ్ళాను.

మైకులో సాయిబాబా భజన వినవచ్చింది.

కావలసిన వస్తువులు కొంటూ ఉండగా, తెలిసిన ఒకతను కనిపించి, 'సాయిబాబా సప్తాహం జరుగుతోంది. గుడికి రండి' అని పిలిచాడు.

'ఎందుకది?' అన్నాను.

' నాలుగురోజులలో గురుపౌర్ణిమ కదా ! అందుకని చేస్తున్నాం' అన్నాడు.

జాలికలిగింది.

'గురుపూర్ణిమ అయితే, సాయిబాబాకి భజనెందుకు? అసలు సాయిబాబాకి భజనేంటి? మీరు చేయడమేంటి?' అన్నాను.

ఈ పల్లెటూరి జనానికి ఏమి చెప్పినా ఎక్కదు.

'భజన బాగుంటుంది. వచ్చి చూడండి' అన్నాడు నా మాట వినిపించుకోకుండా.

'తెలివిలేని సంతలోకి తెలివితో ఉన్నవారు రావడమెందుకు?' అని, నాకు కావలసిన వస్తువులను తీసుకొని ఆశ్రమానికి బయలుదేరాను.