నరేంద్రమోదీగారి ప్రయత్నం వల్ల జూన్ 21 International Yoga Day గా నిర్ణయించబడింది. యోగా అనేది ప్రపంచానికి భారతదేశం ఇచ్చిన బహుమతి అనిన విషయం అధికారికంగా నిర్ధారణ అయింది. లేకపోతే, యోగాను కూడా "ఇది మాదే" అనడానికి ఇతర దేశాలు మతాలు గతంలో ప్రయత్నాలను చేశాయి. కొన్నిదేశాలలో అయితే కొన్ని ఆసనాలకు కాపీరైట్ ను కూడా కొంతమంది తీసుకున్నారు.
అయితే, నిన్న యోగా చేసినవాళ్లు, ఫోటోలకు పోజిచ్చినవాళ్లు ప్రతిరోజూ చేస్తున్నారా అంటే, సందేహమే. వాళ్ళ దేహాలను, అవి వంగలేక అవస్థపడుతున్న తీరులను చూస్తుంటే వాళ్ళు యోగాను ఎంత రెగ్యులర్ గా చేస్తున్నారో ఎవరికైనా అర్థమౌతోంది.
కాకపోతే ఒకటి ! పూర్తిగా మర్చిపోవడం కంటే, ఎప్పుడో కాసేపైనా చెయ్యడం కొంతలో కొంత మంచిది కదా ! ఇదొక్కటి తప్ప ఈ మొక్కుబడి యోగాకు విలువేమీ లేదు.
మోదీగారికి మాత్రం ప్రణామమే ! నెహ్రూలాంటి ప్రధానమంత్రులు మన దేశపు సంస్కృతిని, మతాన్ని, పక్కనపెట్టే ప్రయత్నము, ఇంకా చెప్పాలంటే నాశనం చెయ్యాలనే ప్రయత్నమూ చేస్తే, మోదీగారు స్వయంగా కలకత్తావీధులలో కొచ్చి, యోగా చేస్తున్న వారి మధ్య తిరుగుతూ, వారిని ప్రోత్సాహపరిచారు. ఇదెంత గొప్పవిషయం ! అంతేగాక, రామకృష్ణులు, వివేకానందస్వామి, అరవిందులు, లాహిరీమహాశయులను తన మెసేజిలో ప్రస్తావించారు. ఈ దేశపు ప్రధానమంత్రి అంటే ఇలా ఉండాలి ! నెహ్రూలాగా, ఇందిరాగాంధీలాగా ఉండకూడదు.
ఇప్పుడు కూడా యోగా చేయనివాళ్ళు, ఈ పండుగలో పాలుపంచుకోనివాళ్ళు ఉన్నారు. కాంగ్రెస్, కమ్యూనిస్టులు, ముస్లిములు, ప్రతిపక్షాలు దీనికి దూరంగా ఉన్నారు. ఎక్కడో కొద్దిమంది చేసి ఉండవచ్చు. కానీ అందరూ చేయలేదు. వాళ్ళుంటున్న దేశసంస్కృతి గురించి ఏమైనా కనీసగౌరవం అంటూ వీరికి ఉందా అని సందేహం కలుగుతోంది. వాళ్ళ భావజాలం ఎంత లోలెవల్లో ఉందో అర్థమౌతోంది.
మంచి అలవాట్లు తేలికగా రావు. అప్పుడప్పుడూ చెయ్యగానైనా కొన్నాళ్ళకో కొన్నేళ్లకో అలవాటౌతాయి. ఈలోపల మనల్ని పట్టుకుని ఉన్న బద్దకం అనే రాక్షసిని వదిలించుకోవాలి. కనీసం ప్రయత్నం చేయాలి. అప్పుడే ఆరోగ్యమైనా, ఏదైనా మనకు దక్కుతుంది.
జిమ్ములు చేసి హార్ట్ ఎటాక్స్ తెచ్చుకుని కుప్పకూలి పోకండి. ఇంట్లోనే యోగాభ్యాసం చేసి నూరేళ్లు ఆరోగ్యంగా జీవించండి.
ప్రస్తుతానికి ఇంతే చెప్పగలం !
