“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

14, అక్టోబర్ 2015, బుధవారం

Tu Pyar Ka Sagar Hai-Manna Dey



Balaraj Sahani

Manna Dey












Shailendra
Shankar Jaikishan













తూ ప్యార్ కా సాగర్ హై
తేరీ ఏక్ బూద్ కే ప్యాసే హమ్

అంటూ మన్నాడే మధుర స్వరంలోనుంచి జాలువారిన ఈ గీతం సీమా (1955) అనే సినిమాలోనిది.ఇందులో బలరాజ్ సహానీ, నూతన్ లు నటించారు.ఈ పాట చాలా హృద్యంగా చిత్రీకరింపబడింది.జాగ్రత్తగా వింటే కళ్ళలో నీళ్ళు రప్పించే పాట.ఇది 'దర్బారీ కానడ' రాగచ్చాయలో స్వరపరచబడిన పాట.

Movie:--Seema (1955)
Lyrics:--Shailendra 'the great'
Music:--Shankar Jaikishan
Singer:--Manna Dey
Karaoke Singer:--Satya Narayana Sarma
Enjoy
--------------------------------------
Tu Pyar Ka saagar hai -2
Teree ek boond ke pyase hum-2
Lauta Jo diya tumne-2
chale jayenge jahaa se hum-2
Chorus

Ghaayl man ka - paagal panchee
Udneko beqaraar-2
Pankh hai komal - Aankh hai dhundhlee - Jaanaa hai saagar paar
Jaanaa hai saagar paar
Ab tuhee ise samjhaa
Ab tuhee ise - samjhaa
raaha bhoole the kahaa se hum
raaha - bhoole the kahaa se hum
Chorus

Idhar jhoomke gaaye jindagee - Udhar hai mout khadee
Udhar hai mout khadee
koyee kya jaane kahaa hai seeme - Uljhan aan padee
Uljhan aan padee
Kaano me jaraa kehde
Kaano me jaraa - kehde
ki aaye koun disha se hum
ki aaye - koun disha se hum

tu pyar ka sagar hai
teree ek boond se pyase hum-2
tu pyar ka sagar hai-2

Meaning:--

O Mother you are an ocean of love
and we are thirsty for a single drop of that ocean
if you turn us away
if you turn us away
we will go away from this world
we will go away from this world

The wounded and mad bird of my heart is restless to fly
its wings delicate,its eyes foggy
but it has to cross an ocean
it has to cross an ocean
now you alone can explain to my soul
where did I miss my path?
where did I miss my path?

O Mother you are an ocean of love
and we are thirsty for a single drop of that ocean

On this side (of life) we have song and dance
On the other side death is standing and watching
who can know where is the border (of life and death)
my mind is confused
my mind is confused
whisper gently in my ears
whisper gently in my ears
In which direction we are going?
In which direction we are going?

O Mother you are an ocean of love
and we are thirsty for a single drop of that ocean
O Mother you are an ocean of love

you are an ocean of love....

తెలుగు స్వేచ్చానువాదం

అమ్మా నువ్వు ప్రేమ సముద్రానివి
నీలోనుంచి ఒక్క బిందువును మాకివ్వు
దానితో మా దాహం తీరుతుంది
నువ్వే మమ్మల్ని పోపొమ్మంటే
ఇక మాకు దిక్కెవ్వరు?

అమ్మా నా హృదయం ఒక పిచ్చి పక్షి
అది తీవ్రంగా గాయపడింది
కానీ ఎగరాలని ఆశిస్తోంది
దాని రెక్కలేమో లేతవి
కళ్ళేమో మసకబారి ఉన్నాయి
కానీ అది సముద్రాన్ని దాటాలి
అది సముద్రాన్ని దాటాలి
అమ్మా ఇప్పుడు నువ్వే నాకు దారి చూపాలి
నేనెక్కడ దారితప్పానో నీవే నాకు చెప్పాలి

అమ్మా నువ్వు ప్రేమ సముద్రానివి
నీలోనుంచి ఒక్క బిందువును మాకివ్వు

ఇక్కడేమో ప్రపంచం అంతా  నాట్యం గానం సాగుతోంది
అక్కడేమో మరణం మాకోసం ఎదురుచూస్తోంది
ఈ రెంటి మధ్యనున్న సరిహద్దు ఏదో ఎవరికి తెలుసు?
నా మనస్సు అయోమయంలో ఉన్నది
నా చెవిలో నీవే చెప్పు
నా చెవిలో నీవే చెప్పు
ఏ దిక్కునుంచి మేము వచ్చామో నీవే చెప్పు
ఏ దిక్కునుంచి మేము వచ్చామో నీవే చెప్పు

అమ్మా నువ్వు ప్రేమ సముద్రానివి
నీలోనుంచి ఒక్క బిందువును మాకివ్వు
దానితో మా దాహం తీరుతుంది
నువ్వే మమ్మల్ని పోపొమ్మంటే
ఇక మాకు దిక్కెవ్వరు?
-------------------------------

చాలామంది నన్నడుగుతూ ఉంటారు.మీరేం సాధన చేస్తారు? నవరాత్రులలో ఏ జపాలు పూజలు ధ్యానాలు చేస్తారు అని? నేనేమీ చెయ్యను.మామూలుగా చేసే పూజకూడా ఇప్పుడు చెయ్యను.ఇలాంటి పాటలు కొన్ని పాడుకుంటాను. అంతే.అదే నా సాధన."మనసు నిర్మలమైన మంత్రతంత్రములేల?"- అన్నాడు త్యాగయ్య. మనస్సు నిర్మలంగా ఉంటే హృదయం శుద్ధంగా ఉంటే - ' అమ్మా ' అని ఆర్తితో ఒక్కసారి పిలిస్తే చాలదా? అమ్మ ఎదురుగా కనిపించదా? తప్పక కనిపిస్తుంది.కావలసింది హృదయపూర్వకమైన ఆర్తి.అంతేగాని తంతులూ పటాటోపాలూ కాదు.

ఈ నవరాత్రులకు ఈ పాటే నా సాధనామార్గం.నాది రసహీనమార్గం కాదు.నాది పూజలతో కూడిన జడమార్గం కాదు.ఇది చైతన్యపు బాట.ఇది వెలుగుదారి. ఇది హృదయమార్గం.ఇందులో ఎటువంటి పూజలుండవు. తంతులుండవు. ఇది సూటిబాట.హృదయశుద్ధికే ఇక్కడ ప్రాధాన్యతగాని తంతులకు కాదు. మనం పిలిస్తే దైవం పలకాలి ఎదురుగా కనిపించాలి.అంతే !


నాకు వేదాలు తెలుసు.ఉపనిషత్తులు తెలుసు.తంత్రం తెలుసు.మంత్రం తెలుసు.యోగం తెలుసు.అన్నీ తెలుసు.కానీ ఇప్పుడవేవీ నాకు గుర్తులేవు. అవన్నీ ఒదిలేశాను.ఇప్పుడు నాది శుద్ధ ప్రేమమార్గం.

నేనున్నాను.నాకొక అమ్మ ఉన్నది.పిల్లవాడేం చేస్తాడు?అమ్మ దగ్గర ఏడుస్తాడు.ప్రస్తుతం నాకింతే తెలుసు.ఇంకేమీ తెలియదు.'పరిశుద్ధ హృదయంలో భగవంతుడు తానై ప్రత్యక్షమౌతాడు' అని శ్రీరామకృష్ణులు అనలేదా? అది నిజం కాకుండా ఎలా పోతుంది?