“అసమర్ధుని వద్ద ధనము, సుఖము, కీర్తి, ధర్మము ఏవీ నిలచి ఉండవు"

5, అక్టోబర్ 2015, సోమవారం

Chehre Pe Giri Zulfein - Mohammad Rafi


Youtube Link
https://www.youtube.com/watch?v=UPlKxRIazGM

చెహ్రే పె గిరీ జుల్ఫే కెహ్ దో కే హటాదూ మే...గుస్తాఖీ మాఫ్ .....గుస్తాఖీ మాఫ్
అంటూ మహమ్మద్ రఫీ మధురస్వరంలో నుంచి జాలువారిన ఈ గీతం 1966 నాటి 'సూరజ్' అనే చిత్రం లోనిది. కానీ ఈనాటికీ ఇది హృదయాలను వెంటాడే మధురగీతమే.దానికి కారణం జీవంతో కూడిన మోహనరాగంలో ఈ పాటను స్వరపరచడమే.

ఈ పాటను వింటుంటే కొన్ని తెలుగు పాటలు తెరలు తెరలుగా గుర్తురాక మానవు.

నయనాలు కలిసే తొలిసారి హృదయాలు కరిగె మలిసారి(చైర్మన్ చలమయ్య),నీకోసం యవ్వనమంతా దాచాను మల్లెలలో నీకోసం జీవితమంతా వేచాను సందెలలో(మూడు ముళ్ళు),ఇది కలయని నేననుకోనా(సింహాసనం),మధురమీ సుధారాగం మనకిదే మరోప్రాణం (బృందావనం) - ఇలా చాలాపాటలు ఇదే రాగచ్చాయలలో ఉన్నాయి.అవన్నీ హిట్ సాంగ్సే.దానికి కారణం రాగప్రభావం.ఒక క్లాసికల్ రాగంలో ఒక పాటను స్వరపరిస్తే నూరేళ్ళు అయినాకూడా అది సజీవంగానే నిలిచి ఉంటుంది.ఆ రాగాలకున్నటువంటి శక్తి అలాంటిది.

ఈ పాట 50 ఏళ్ళ నాటిది.కానీ ఈరోజున విన్నా కూడా మళ్ళీ మళ్ళీ వినాలని అనిపిస్తుంది. అదే ఈ పాటలోని మహత్యం.

హిందూస్తానీ రాగాలకు మంచి సమ్మోహన శక్తి ఉంటుంది.అందులోనూ మోహనరాగం శ్రోతలను సమ్మోహనపరచడంలో పెట్టిందిపేరు.ఇక మహమ్మద్ రఫీ స్వరం గురించి చెప్పడానికేమీ లేదు.అది గంధర్వగానం.దానిని వినాలి,ఆస్వాదించాలి,మంత్రముగ్దులమై పోవాలి.అంతే...ఈ పాటకు నేను ఎంతవరకు న్యాయం చేశానో శ్రోతలే చెప్పాలి.

ఈ పాటలో 'గుస్తాఖీ మాఫ్' అనే పదం చాలా సార్లు వస్తుంది. 'గుస్తాఖీ' అంటే తిరుగుబాటుదారుడు, అపరాధి,పొగరుమోతు అనే అర్ధాలున్నాయి.'గుస్తాఖీ మాఫ్' అంటే 'అపరాధాన్ని మన్నించు' అని అడగడం.ఈ పదాన్ని చాలా చిలిపిగా రకరకాలుగా పలుకుతాడు రఫీ.అదే ఈ పాటకు ప్రాణం.

ఈ సినిమాలో రాజేంద్రకుమార్ వైజయంతి మాలా నటించారు. రాజేంద్రకుమార్ ఈ పాటలో చాలా హృద్యంగా నటించాడు.చాలా మటుకు మధురగీతాలు వింటేనే బాగుంటాయి.చూస్తే బాగుండవు.ఎందుకంటే పాట భావాన్ని చిత్రీకరణలోకి తేవడంలో చాలామంది ఘోరంగా ఫెయిల్ అవుతూ ఉంటారు.కానీ ఈపాటను చూచినా చాలా బాగుంటుంది.రాజేంద్ర కుమార్ బాడీ లాంగ్వేజ్ ఈ పాటకు చాలా చక్కగా కుదిరింది.ఇది మన తెలుగు వాళ్ళు తీసిన సినిమానే. సాఫ్ట్ టీజర్ అయినాకూడా అసభ్యత ఎక్కడా లేకుండా తీసిన పాట.ఈ పాట చివరిలో నీళ్ళలో పడిన శబ్దం వస్తుంది.అదేంటంటే - వెంటపడి ఏడిపిస్తున్న రాజేంద్రను నదిఒడ్డుకు తీసుకెళ్ళి  నీళ్ళలోకి తోసేస్తుంది వైజయంతి.అదే ఆ శబ్దం.

Movie:-- Suraj (1966)
Lyrics:--Hasrat Jaipuri
Music:--Shankar Jaikishan
Singer:--Mohammad Rafi
Karaoke Singer:--Satya Narayana Sarma
Enjoy
----------------------------------
chehare pe giri zulfe - keh do to hata dun mai
gustakhi maaf, gustakhi maaf
ik phooltere jude me - keh do to laga dun mai
gustakhi maaf, gustakhi maaf

[ye rup, hasi dhup, bahut khub hai lekin
ulfat ke - bina phikaa - chehara tera rangin]-2
ik deep muhabbat ka, keh do to jala dun mai
gustakhi- maaf, gustakhi maaf
chehare pe giri zulfe - keh do to hata dun mai
gustakhi maaf, gustakhi maaf

[ik aag - lagee hai - mere zakhme-jigar me
ye kaisa karishma hai - teri shokh nazar me]-2
jo baat ruki lab par - keh do to bata dun mai
gustakhi maaf, gustakhi maaf
chehare pe giri zulfe keh do to hata dun mai
gustakhi maaf, gustakhi maaf

[sarkar, hua pyaar, khata hammmse hui hai
ab dilme tumhi tumho, ye jaan bhi teri hai]-2
ab cheer ke is dil ko - kah do to dikha dun mai
gustakhi- maaf, gustakhi maaf
chehare pe giri zulfe keh do to hata dun mai
gustakhi- maaf, gustakhi maaf
ik phool tere jude me - keh do to laga dun mai
gustakhi maaf, gustakhi maaf....

Meaning:--

The tresses on your face, I will adjust if you permit,
Pardon my arrogance
Pardon my arrogance
I want to place a flower in your hair.if you permit,
Pardon my arrogance
Pardon my arrogance

No doubt,your beauty is bright like sunlight
But, without love,your colorful face looks very pale,
A lamp of love I will light,if you agree
Pardon my arrogance
Pardon my arrogance

A fire has caught my wounded heart
What is this magic in your enchanting eyes?
The words that could not cross my lips
I will speak if you permit me
Pardon my arrogance
Pardon my arrogance

Madam, I fell in love with you
I know that I have erred
Only you live in my heart now
my life is yours
I will rip open my heart and show you the proof
If you permit me to do so
Pardon my arrogance
Pardon my arrogance

తెలుగు స్వేచ్చానువాదం

నీవు ఒప్పుకుంటే
నీ ముఖంపైన దోగాడే ముంగురులను సవరిస్తాను 
అతిగా మాట్లాడితే మన్నించు
నీవు ఒప్పుకుంటే
నీ జడలో ఒక పువ్వును ఉంచుతాను
అతిగా మాట్లాడితే మన్నించు

నీ అందం సూర్యుని వెలుగులా మెరుస్తోంది
కానీ ప్రేమ అనేది ప్రతిఫలించని నీ ముఖం
వెలవెలా బోతోంది
నీవు ఒప్పుకుంటే ఒక ప్రేమదీపాన్ని వెలిగిస్తాను
అతిగా మాట్లాడితే మన్నించు
అతిగా మాట్లాడితే మన్నించు

నా హృదయం గాయపడింది
ఆ పైన దానికి ఒక జ్వాల సోకింది
అది నీ కన్నుల లోని మాయా సౌందర్యమేనా?
నా పెదవులను దాటలేని మాటను
నీవు ఒప్పుకుంటే చెబుతాను
అతిగా మాట్లాడితే మన్నించు
అతిగా మాట్లాడితే మన్నించు

ఓ మహారాణి ! నీతో ప్రేమలో పడ్డాను
తప్పంతా నాదే
కానీ ఇప్పుడు నా హృదయం నిండా నువ్వే ఉన్నావు
నా జీవితమంతా నిండిపోయావు
ఋజువు కావాలంటే నా గుండెను చీల్చి చూపిస్తాను
అతిగా మాట్లాడితే మన్నించు
అతిగా మాట్లాడితే మన్నించు...

నీవు ఒప్పుకుంటే
నీ ముఖంపైన దోగాడే ముంగురులను సవరిస్తాను 
అతిగా మాట్లాడితే మన్నించు
నీవు ఒప్పుకుంటే
నీ జడలో ఒక పువ్వును ఉంచుతాను
అతిగా మాట్లాడితే మన్నించు