Spiritual ignorance is harder to break than ordinary ignorance

3, ఫిబ్రవరి 2015, మంగళవారం

రెమెడీ ప్లీజ్...

ఈ మధ్యన హైదరాబాద్ లో జరిగిన " స్పోర్ట్స్ మరియు కల్చరల్ మీట్ -2015" సందర్భంగా మూడురోజుల పాటు అక్కడ ఉన్నాను.ఆ కార్యక్రమంలో భాగంగా 'రెమెడీ ప్లీజ్' అనే హాస్య నాటికను ప్రదర్శించాము.దీనిని నేనే వ్రాసి,దర్శకత్వం వహించడమేగాక అందులో ఒక వేషం కూడా వేశాను.


నేడు ఏ టీవీ చానల్లో ఎక్కడ చూచినా కనిపిస్తున్న జ్యోతిష్కులూ, వారు చెబుతున్న రెమెడీలను దృష్టిలో ఉంచుకుని ఈ హాస్యనాటికను వ్రాశాను.


ఇందులో నాలుగు పాత్రలుంటాయి.

జ్యోతిష్కుడు,ఒక ఆఫీస్ లో సూపర్నెంటు,ఒక తండ్రి,కుమారుడు - ఇవీ పాత్రలు. జ్యోతిష్కుని వద్దకు మిగతా ముగ్గురూ వారివారి సమస్యల పరిష్కారం కోసం రెమెడీ అడుగుతూ వస్తారు.వారి మధ్యన జరిగే హాస్య సంభాషణలతో కూడిన ఒక చిన్న నాటిక ఇది.

నటీనటులు అందరూ బాగా నటించారు.నాటిక ఆద్యంతమూ బాగా రక్తి కట్టించింది.హాల్లో నవ్వులు విరబూశాయి.చప్పట్లు వినిపించాయి.

ఆ సందర్భంగా తీసిన ఫోటోలు ఇవి.