అన్తః శాక్తః బహిః శైవః లోకే వైష్ణవః అయమేవాచారః

29, జూన్ 2014, ఆదివారం

బ్లాక్ సాటర్ డే

నిన్న శనివారాన్ని బ్లాక్ సాటర్ డే అని అనుకోవచ్చు. ఎందుకంటే నిన్న ఒకే రోజున ఎన్నో ప్రమాదాలు జరిగాయి. ఉదయం డిల్లీలో భవనం ఒకటి కూలిపోయి జనం చనిపోయారు. సాయంత్రం చెన్నైలో భవనం కూలిపోయి 11 మంది చనిపోయారు.కనీసం ఇంకా 20 మంది శిధిలాలక్రింద చిక్కుకుని ఉన్నారంటున్నారు. ఇందులో విచిత్రం ఏమంటే,ఉదయం డిల్లీ సంఘటనకూ సాయంత్రం చెన్నై సంఘటనకూ నవాంశ చక్రం ఒకటే.నవాంశ లగ్నం రెంటికీ మీనమే అయింది.చతుర్దాతిపతి...
read more " బ్లాక్ సాటర్ డే "

28, జూన్ 2014, శనివారం

డిల్లీలో కూలిపోయిన నాలుగంతస్తుల భవనం-శపితయోగానికి మరో తిరుగులేని తార్కాణం

ఈరోజు ఉదయం 8.55 ప్రాంతంలో నాలుగంతస్తుల భవనం ఒకటి డిల్లీలో కూలిపోయింది.పదకొండు మంది చనిపోయారని అంటున్నారు. ఎంతమంది కూలిపోయిన సిమెంట్ స్లాబుల క్రిందా,రాళ్ళక్రిందా చిక్కుకుని ఉన్నారో తెలియదు.నిదానంగా ఆ లెక్క తెలుస్తుంది. రాహువు కుజుడు అమావాస్య కలసిన ప్రభావాలకు ఇది ఇంకొక తిరుగులేని నిదర్శనం.శపితయోగపు నిరాఘాటమైన పదఘట్టనకు ఇది మరొక ఋజువు.జ్యోతిష్యపరమైన కోణాలు ఇందులో ఏమున్నాయో ఒక్కసారి పరికిద్దాం. లగ్నం...
read more " డిల్లీలో కూలిపోయిన నాలుగంతస్తుల భవనం-శపితయోగానికి మరో తిరుగులేని తార్కాణం "

27, జూన్ 2014, శుక్రవారం

గెయిల్ గ్యాస్ పైప్ లైన్ అగ్నిప్రమాదం - అమావాస్య ప్రభావానికీ రాహుప్రభావానికీ మరో ఋజువు

ఈరోజు నిండు అమావాస్య. ఈరోజు తెల్లవారు ఝామున తూర్పుగోదావరి జిల్లా 'నగరం'లో గెయిల్ పైప్ లైన్ బద్దలై అగ్నిప్రమాదం జరిగింది.11 మంది సజీవదహనం అయ్యి నిలువునా కాలిపోయారు.ఇంకొక 15 మందికి తీవ్రంగా ఒళ్ళు కాలిపోతే వారిని ఆస్పత్రికి తరలించారు. 'నగరం' అక్షాంశ రేఖాంశాలు Longitude: 81E54 Latitude:16N29 గ్యాస్,పెట్రోల్,కెమికల్స్,తదితర ఇంధనాలూ,పేలుడు పదార్ధాలూ మొదలైనవి రాహువు కారకత్వాలని చాలాసార్లు...
read more " గెయిల్ గ్యాస్ పైప్ లైన్ అగ్నిప్రమాదం - అమావాస్య ప్రభావానికీ రాహుప్రభావానికీ మరో ఋజువు "

26, జూన్ 2014, గురువారం

రాజధాని ఎక్స్ ప్రెస్ ప్రమాదం-ఒక పరిశీలన

రాహు ప్రభావానికి ఇంకొక తార్కాణం నిన్న జరిగింది. నిన్న ఉదయం 2.15 కి బీహార్ లోని చాప్రా దగ్గర రాజధాని ఎక్స్ ప్రెస్ పట్టాలు తప్పింది.12 బోగీలు పట్టాలు తప్పాయి.కొన్నైతే విసిరేసినట్లు చాలా దూరంగా పడిపోయాయి.ఆ విషయాలన్నీ టీవీలలో చూచి ఉంటారు. ఈ సంఘటనను ఒక్కసారి విశ్లేషిద్దాం. లగ్నడిగ్రీ మేషం 26.భరణీనక్షత్రంలో నిలిచి ఉన్నది.భరణికి అధిష్టానదేవత యమధర్మరాజు అని మనకు తెలుసు.మృత్యుకారక...
read more " రాజధాని ఎక్స్ ప్రెస్ ప్రమాదం-ఒక పరిశీలన "

25, జూన్ 2014, బుధవారం

రాహుప్రభావాలు -- నిత్యజీవితంలో నుంచి కొన్ని ఉదాహరణలు

ప్రస్తుతం రాహుశనుల మీద గురువుగారి కంట్రోల్ పోయింది గనుక రాహువు ప్రజలమీద రకరకాలుగా బాగా విజృంభిస్తున్నాడు.ఈ విషయం మొన్ననే హెచ్చరించాను. కాని రాహువుయొక్క ఆయాచర్యలు మామూలుగా కేజువల్ దృష్టితో చూస్తే అర్ధంకావు.వాటిని అర్ధం చేసుకోవాలంటే లోతైన మార్మికదృష్టి ఉండాలి. ప్రస్తుతం ఎన్ని రకాలుగా రాహువు యొక్క చర్యలు జరుగుతున్నాయో అర్ధం చేసుకునే దిశగా కొన్ని ఉదాహరణలు మాత్రం గమనిద్దాం. ఒకటి మొదటగా గుంటూరు...
read more " రాహుప్రభావాలు -- నిత్యజీవితంలో నుంచి కొన్ని ఉదాహరణలు "

23, జూన్ 2014, సోమవారం

ఆనంద నాట్యం

ప్రకృతి మొత్తం  ఆనందనాట్యం చేస్తోంది  తన హృదిలో ఉన్న ప్రియునిమోమును  తదేకంగా చూస్తోంది  యుగయుగాల ఆటల్లో   చిలిపి దాగుడుమూతల్లో  చిప్పిల్లిన ఆనందం  లోకంగా మారింది  ప్రియునిగా ఉన్న తాను  ప్రేయసిగా మారింది  తిరిగి ప్రియుని వెదుకుతోంది  వింతైన ఆటలలో వినోదాన్ని పొందుతోంది  ఆటకోసం ఈ జాలం  సమస్తం సృష్టించింది  ఆట...
read more " ఆనంద నాట్యం "

22, జూన్ 2014, ఆదివారం

వింతలోకం

1. తే||పెట్టి పుట్టుదురిచ్చట పెద్దలగుచు గోసుమీరగ లోకులు గొప్పలంది పుట్టి పెట్టకపోయిన ఫలము లేదు పుట్టగతులను గాంచరు పుడమిలోన పూర్వపుణ్య బలం వల్ల ఈ జన్మలో అన్నీ అమరిన జన్మ కలుగుతుంది.కానీ అంతటితో గర్వాన్ని పెంచుకొని,ఇప్పుడు దాతృత్వాన్ని కలిగి ఉండక, ఆపదలో ఉన్నవారికి సహాయం చెయ్యక,విలాసాలలో కాలం గడిపితే, ముందు జన్మలలో పుణ్యబలం తగ్గి ఘోరమైన పరిస్థితులలో పుట్టడం జరుగుతుంది.  2. కం||పుట్టిన చాలదు భువిలో పుట్టిన దానికి పరులకు...
read more " వింతలోకం "

20, జూన్ 2014, శుక్రవారం

శపితయోగపు ఆఖరి ఘట్టం

ప్రస్తుతం శపితయోగం తన చివరిఘట్టంలోకి వస్తున్నది.త్వరలో రాహువు శనీశ్వరుని చెలిమిని వదలి వెనక్కు మరలి కన్యారాశిలోకి అడుగుపెట్ట బోతున్నాడు.ఏడాదిన్నర నుంచీ ప్రజలను పీడిస్తున్న రాహుప్రభావం త్వరలో మాయం కాబోతున్నది. కానీ ఏడాదినుంచీ బలీయమైన శపిత యోగాన్నించి జనులను ఒక శక్తి రక్షిస్తున్నది.అదే దేవగురువు బృహస్పతి యొక్క దృష్టి.మిధునరాశినుంచి తన కరుణాపూరితమైన పంచమదృష్టితో శనిరాహువులను వీక్షిస్తున్న గురువువల్ల అనేకమంది అనేక ప్రమాదాలనుంచి...
read more " శపితయోగపు ఆఖరి ఘట్టం "

19, జూన్ 2014, గురువారం

గురువుగారి కర్కాటకరాశి ప్రవేశం -- ఫలితములు

కొద్దిగా పరిశీలనాశక్తి ఉన్నవారికి ఈరోజునించి కొన్ని మార్పులు వారివారి జీవితాలలో ఖచ్చితంగా కనిపిస్తాయి.దానికి కారణం ఈరోజునుంచి ఖగోళంలో జరుగుతున్న గురుగ్రహ ఉచ్చస్తితి. ఆ మార్పులు భౌతికంగా కొందరికి వెంటనే కనిపించవచ్చు.కొందరికి కనిపించకపోవచ్చు.కానీ మానసికంగా మాత్రం మార్పులు ఉంటాయి. జీవనవిధానంలో మార్పులు ఉంటాయి.మానసిక స్థాయిలో మార్పులు గోచరిస్తాయి.Confidence levels పెరుగుతాయి.దీనిని స్పష్టంగా ఈరోజునుంచే గమనించవచ్చు. ఈరోజున గురుగ్రహం...
read more " గురువుగారి కర్కాటకరాశి ప్రవేశం -- ఫలితములు "

18, జూన్ 2014, బుధవారం

దక్షిణేశ్వర వైభవం

డిసెంబర్ 2012 లో నేను దక్షిణేశ్వర క్షేత్రం దర్శించినప్పుడు ఆశువుగా వెలువడిన 112 పద్యములూ 'పంచవటి' గ్రూప్ సభ్యులకు సుపరిచితములే. ఆ పద్యములు కావాలని పంచవటి గ్రూప్ సభ్యులు కాని కొందరు బ్లాగు చదువరులు అడిగినారు.ఈ పద్యములను అందరికీ చూపాలని ముందుగా అనుకోలేదు.దానికి కారణం అందులో కొన్ని వ్యక్తిగతములైన మహావిద్యా సాధనా రహస్యములు దాగి ఉండటమే. కాని మిత్రులైన చదువరులు కొందరు మళ్ళీమళ్ళీ అడుగుతున్నందున ఈ పోస్ట్ లో ఆ పద్య సుమములను ప్రకటిస్తున్నాను. పంచవటీ...
read more " దక్షిణేశ్వర వైభవం "