Love the country you live in OR Live in the country you love

28, జనవరి 2009, బుధవారం

అసలు మనకు తెలిసిన దెంత?

ఆర్ట్ ఇస్ లాంగ్ లైఫ్ ఇస్ షార్ట్. ఎవరు అన్నది? లాంగ్ ఫెలో అనుకుంటా. అక్షరాలా నిజం. ఏ విద్య అయినా అనంతం. జీవితం స్వల్పం. అటువంటప్పుడు ఆయా విద్యలకు ఆద్యులైన వాళ్ళను కోట్ చెయ్యడమే వారి ఋణం మనం తీర్చుకోవడం. ధర్మ రాజు అంప శయ్య మీదున్న భీష్ముని అనేక విషయాలు అడుగుతాడు. దానికి ఆయన ఇంతకూ ముందు ఫలానా వారు ఫలానా వారితో ఇట్లా అన్నారు, ఇలా జరిగింది, ప్రాచీన కాలంలో ఇలా జరిగింది అంటూ ఇంతకూ ముందు చెప్పిన వారిని కోట్ చేస్తూ చెబుతాడు గాని ఎక్కడా నేను చెబుతున్నాను అనడు. అంతటి మహా నీయునికే లేని అహం మనకెందుకు. ఇప్పుడు కొందరు నా రీసెర్చిలో ఇట్లా కనబడింది, నేను కనుక్కున్నాను అంటున్నారు. జ్యోతిష్యాది విద్యలలో కొత్తగా కనుక్కునేది ఏమీ లేదు. ఉన్న దాన్ని సరిగా అర్థం చేసుకో గలిగితే చాలు. కాబట్టి విద్వాంసులకు నాదొక సూచన. ఏదైనా రాసేటప్పుడు గ్రంధాలను గ్రంధ కర్త లను స్మరించండి. వారిని కోట్ చెయ్యండి. వీలయితే శ్లోకాలను కోట్ చెయ్యండి. ఇదే మనం ఋషి ఋణం తీర్చుకోడానికి ఒక మార్గం. అంతే గాక గ్రంథ పరిశీలనా కూడా దీనివల్ల పెరుగుతుంది. దాని వల్ల విజ్ఞానం పెరుగుతుంది. అహం తగ్గుతుంది. ఋషి ఋణం తీరుతుంది.