“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

10, జనవరి 2009, శనివారం

కలారి పయట్


వీర విద్యలకు జన్మ స్థానం మన దేశమేనని అంటారు. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఉన్నా అనేకవిద్యలు ఉదా: కరాటే, కుంగ్ఫూ,ఐకిదో,నింజుత్సు,జూడో,తేక్వొందో,జుజుత్సు మొదలగు వాటికిమూల విద్య మన దేశం లోని కలారి పయట్.

ఇది కేరళలో చాలా మంది నేర్చుకునే విద్య. దీనిని కొన్ని సినిమాలలో కూడా మర్మ విద్య అనే పేరుతొ చూపించారు. కొన్నివేల సంవత్సరాలకు పూర్వం కేరళ సముద్రంలో మునిగి ఉన్నప్పుడు పరశురాముడు దీనిని ఉద్ధరించి నివాస స్థలంగామార్చినట్లు కేరళ లో నమ్మకం. ఆయన పద్దెనిమిది మంది శిష్యులకు తాను పరమ శివుని వద్ద నేర్చుకున్న వీర విద్యనునేర్పించి దానితో శత్రువులనుంచి రక్షించుకుంటూ కేరళను పరిపాలించమని చెప్పినట్లు చెబుతారు. ఈ విద్యయే కలారిపయట్.

ఇతర దేశాలకు వీర విద్యల గురించి ఏమీ తెలియని రోజులలోనే ఇది అత్యంత ప్రమాదకర విద్యగా తయారుచెయ్యబడినది. తరువాత అనేక శతాబ్దాలు గడచినై, బోధిధర్మ అనే బౌద్ధ గురువు మదురై నుంచి చైనా కు
వెళ్లి జెన్ నుబోధిస్తాడు. అక్కడ షావోలిన్ ఆలయంలో ఉంటూ ఉన్నప్పుడు అక్కడి భిక్షువులు బలహీనులుగా ఉండి ఎక్కువ గంటలుధ్యానం చెయ్యలేక పోవడం చూసి వారికి కొన్ని వ్యాయామాలు నేర్పుతాడు. అవే తరువాత కుంగ్ ఫూ విద్యగా మారిఅక్కడి నుంచి జపాన్ చేరి కొన్ని మార్పులతో కరాటే గా రూపాంతరం చెందింది. తరువాత అనేక దేశాలలో అనేకమార్పులకు లోనై వివిధ విద్యలుగా మారింది.


కాని వీటన్నిటికీ మూలం మన ప్రాచీన విద్య ఐన కలారిపయట్ అనీ, దానికి మూల గురువు మన పరశు రాముడనీ, ఆయన నేర్చుకుంది పరమ శివుని వద్ద అనీ తెలిస్తే ప్రతి భారతీయుని హృదయం గర్వంతో ఉప్పొన్గదా మరి. ఈ కలారి అనేవిద్య నేటికీ కేరళలో త్రివేండ్రం, పాలక్కాడ్, తెల్లిచేరీ, శోరనుర్ ప్రాంతాలలో ఉంది. త్రివేండ్రం పద్మనాభ స్వామి ఆలయప్రాంగణంలోనే గోవింద కుట్టి నాయర్ గురుక్కళ్ నడిపే సీవీ ఎన్ కలారి సంగం ఉంది.

నేను అక్కడికి అనేక సార్లు వెళ్లి ఉన్నాను. వారి పుత్రుడే సత్యనారాయణన్, ది మిత్ సినిమాలో జాకీ చాన్ తో ఫైట్ సీన్ లో కత్తి యుద్ధం చేసాడు. జాకీ చాన్ ఈ విద్యను తిలకించి ఎంతో మెచ్చుకున్నాడు. కలారిని నేర్పుతున్న ఇంకొక గురువు మాస్టర్ బాలకృష్ణన్. కాని ఈ విద్యలో ఎంతో భాగం లుప్తమై పోయింది. మిగిలి ఉన్న కొంత భాగమే చాలా ప్రమాద కరం. ఈవిద్యను గురించి వివరంగా ఇంకొక సారి చెప్పుకుందాం.