“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

21, జూన్ 2021, సోమవారం

అలబామా తుఫాను - భయంకర కారు ప్రమాదం

గత మూడురోజులనుంచీ క్లాడెట్ అనే తుఫాను బలాన్ని పుంజుకుంటూ అలబామా రాష్ట్రాన్ని వర్షాలతో ముంచెత్తుతోంది. శనివారం మధ్యాహ్నం ఇంటర్ స్టేట్ 65 రోడ్డు మీద బట్లర్ కౌంటీలో జరిగిన వరుస కారుప్రమాదంలో తొమ్మిదిమంది హరీమన్నారు. అందులో ఎనిమిదిమంది చిన్నచిన్నపిల్లలు. గతంలో ఇలాంటి భయంకరమైన యాక్సిడెంట్ ను ఎప్పుడూ చూడలేదని అక్కడివాళ్లు అంటున్నారు. యాక్సిడెంట్ జరిగిన సమయంలో కుండపోత వర్షమేమీ పడటం లేదుగాని, రోడ్లన్నీ జలమయంగా ఉన్నాయి.

అమెరికా లగ్నమైన మిధునం నుంచి చూద్దాం. మిధునరాశి వాయుతత్వరాశని మనకు తెలుసు. జలగ్రహమైన శుక్రుడు ప్రస్తుతం అక్కడే ఉన్నాడు. మిధునరాశికి ప్రస్తుతం భయంకరమైన అర్గలదోషం పట్టి ఉన్నది. శుక్రుడు 26 వ డిగ్రీమీదున్నాడు. బహుశా ఇదే డిగ్రీ అలబామా రాష్ట్రాన్ని సూచించవచ్చు. ఈ డిగ్రీ ఉన్న భాగం ఆగ్నేయదిక్కును సూచిస్తుంది. ఈ అన్నింటినీ కలుపుకుని చూడండి - అమెరికాదేశం, సుడిగాలులు, తీవ్రవర్షాలు, ఆగ్నేయదిక్కు. సరిపోయిందా లెక్క?

మరి వరుస కారు ప్రమాదాలెందుకు జరిగాయి?

తృతీయాధిపతిగా దగ్గర ప్రయాణాలకు కారకుడైన సూర్యుడు లగ్నంలో ఉన్నాడు. మరణాలకు కారకుడైన ప్లుటోతో అతి దగ్గరి షష్టాష్టకదృష్టిలో ఉన్నాడు. యాక్సిడెంట్లకు, చావులకు మరో కారకుడైన శని ధనుస్సునుంచి సూర్యుని సూటిగా చూస్తున్నాడు.

ఇలాంటి భయంకరమైన యాక్సిడెంట్ జరగడానికి ఇంతకంటే ఇంకేం కావాలి?