“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

14, జూన్ 2021, సోమవారం

శని కుజుల ప్రభావం - 5 - వీకెండ్ లో అమెరికా ఎలా ప్రభావితమైంది?

10-6-2021 గురువారం అమావాస్య సూర్యగ్రహణమైంది. శుక్రవారం నుండి ఆదివారం వరకు మూడురోజులలో అమెరికాలోని మూడురాష్ట్రాలలో చెదురుమదురు కాల్పుల సంఘటనలు జరిగాయి. అనేకమంది చనిపోయారు, అనేకమంది గాయపడ్డారు. అమెరికాలో ఎప్పుడూ ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది అనకండి ! ఎప్పుడూ జరగవు. ఎప్పుడో మాత్రమే జరుగుతాయి. ఆ ఎప్పుడో జరగడం వెనుక ఏమున్నదనేదే నేను చెబుతున్నాను. వినండి.

10-6-2021 గురువారం

డెట్రాయిట్ మిషిగన్ లో జరిగిన కాల్పులలో ఒకరు చనిపోయారు. ముగ్గురు గాయాలపాలయ్యారు.

  • అమావాస్య, సూర్యగ్రహణం
  • బుధుని తీవ్ర అస్తంగత్వం
  • మిధునరాశికి పాపార్గళం
  • మిధునమంటే అమెరికా అని గతంలో ఎన్నో సార్లు నిరూపితమైంది. మళ్ళీ ఇప్పుడు రుజువైంది.



11-6-2021 శుక్రవారం

చికాగోలో సాయంత్రం ఏడు నుంచి రాత్రి పన్నెండు మధ్యలో నాలుగు కాల్పుల సంఘటనలు జరిగాయి. ఆరుగురు గన్ షాట్ గాయాలకు గురయ్యారు.

సవన్నా జార్జియాలో జరిగిన కాల్పుల సంఘటనలో ఒకరు చనిపోయారు. ఏడుగురు గాయపడ్డారు.

  • మిధునరాశికి పాపార్గళం
  • చంద్రశుక్రుల డిగ్రీ సంయోగం


12-6-2021 శనివారం

చికాగోలో అర్ధరాత్రి పన్నెండు నుంచీ సాయంత్రం లోపు ఏడు కాల్పుల సంఘటనలు జరిగాయి. వీటిల్లో ఏడుగురు గాయపడ్డారు.

ఆస్టిన్ టెక్సాస్ లో ఉదయం జరిగిన కాల్పులలో ఒకరు చనిపోయారు. 14 మంది గాయపడ్డారు.

న్యూబర్గ్, లూయిస్ విల్, కెంటకీ లో జరిగిన కాల్పులలో ఒకరు చనిపోయారు. ముగ్గురు గాయపడ్డారు.

  • మిధునరాశికి పాపార్గళం
  • మేష యురేనస్ కూ, మిధునశుక్రునికి ఖచ్చితమైన డిగ్రీ దృష్టి.

గత రెండురోజులకంటే శనివారం నాడు గ్రహయోగాలు బలంగా ఉన్నాయి. యురేనస్ దృష్టి విపరీతమైన దూకుడునూ, ఆలోచనలేని చర్యలనూ ప్రేరేపిస్తుంది. కనుక ఆ రోజున ఎక్కువ కాల్పుల సంఘటనలు జరిగాయి.


13-6-2021 ఆదివారం

ఆస్టిన్ టెక్సాస్ లో జరిగిన మూడు కాల్పుల సంఘటనలలో నలుగురు గాయపడ్డారు.

  • మిధునరాశికి పాపార్గళం
  • చంద్రకుజుల డిగ్రీసంయోగం. గురువుతో వీరికి ఖచ్చితమైన 6/8 దృష్టి.

మొత్తం అన్ని సంఘటనలనూ వ్రాయడం అనవసరం గాని, ఈ వీకెండ్ లో జరిగిన కాల్పుల సంఘటనలలో మొత్తం 6 గురు చనిపోగా 40 మంది గాయాలపాలయ్యారు. వీరిలో కొందరికి తీవ్రమైన గాయాలైతే, మరికొందరికి ఒకమోస్తరు గాయాలయ్యాయి. అన్నీ గన్ షాట్ గాయాలే.

ఇవన్నీ ఉన్నట్టుండి ఈ వీకెండ్ లోనే, అదీ అమెరికాలోనే, ఎందుకు జరిగాయో అర్థమైందా మరి? మిధునరాశి ఇంతగా దెబ్బతిన్నప్పుడు అమెరికాలో ఇలా జరగక ఇంకెలా జరుగుతుంది?

అయినా నా పిచ్చిగాని, పడ్డాక లబోదిబో అనడమేగాని ముందుగా చెబితే ఈ లోకంలో ఎవడు వింటాడు గనుక?