“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

3, జూన్ 2018, ఆదివారం

Lakhon Hai Nigah Mein - Mohammad Rafi


Lakhon Hai Nigah Mein - Zindagi Ki Raah Mein
Sanam Haseen Jawa

అంటూ మహమ్మద్ రఫీ మధురంగా ఆలపించిన ఈ గీతం 1963 లో వచ్చిన Phir Vohi Dil Laya Hu అనే సినిమాలోది. అప్పట్లో ఇదొక ఫాస్ట్ బీట్ సాంగ్. ఈ పాటకు మంచి రాగం కలసిన ఫాస్ట్ బీట్ స్వరాన్ని ఓ.పీ. నయ్యర్ సమకూర్చాడు. అంతేకాదు ఈ పాటలో మంచి ఫిలాసఫీ కూడా ఉంది.

జీవితంలో అందమే ముఖ్యమైనదని చాలామంది, ముఖ్యంగా ఆడవాళ్ళు అనుకుంటూ ఉంటారు. కానీ అసలు విషయమేమంటే, అందం అంత ముఖ్యం కాదు. మంచి మనసు అంతకంటే ముఖ్యమైనది. అది లేకుంటే ఎంత అందమైనా వెగటు పుట్టిస్తుందిగాని మనస్సుకు సంతోషాన్ని కలిగించదు. ఈ విషయాన్నే ఈ పాటలో మజ్రూ సుల్తాన్ పురి చెబుతాడు.

రవీంద్రనాథ్ టాగోర్ ఒక కవితలో - 'అనేకీర్ ఆంఖే పరే సౌందర్యో జ్వలిత్ కోరె, అపనీ ఆంఖే పర్, ప్రేమ్' అంటాడు. అంటే - 'అనేకుల కన్నులలో సౌందర్యం జ్వలించడం చూచాను, కానీ నీ కళ్ళలో మాత్రమే చూచాను...ప్రేమను' అంటాడు.

చలం వంటి వారు దీన్నే 'ఆత్మ' అని అన్నారు. ఆత్మ లేనప్పుడు ఎంత అందం ఉన్నా ఉపయోగం లేదు. ఈ ఆత్మ అంటే ఏంటి? అదెలా ఉంటుంది? ఎక్కడుంటుంది? అంటే చెప్పలేం. చాలా కొద్దిమందిలో అది కనిపిస్తుంది. కానీ మనం చూచే చాలామందిలో అది ఉండదు. కాస్మెటిక్స్ తోనూ, మేకప్ లతోనూ అది రాదు. స్వచ్చమైన అంతరంగం ఉన్నప్పుడే అది ఉంటుంది. అది లేనప్పుడు, ఎంత అందం ఉన్నా, ఎంత మేకప్ వేసుకున్నా, అదంతా కృత్రిమంగా, కృతకంగా ఉంటుందిగాని నిజమైన సౌందర్యం అనిపించుకోదు.

ఆ ఆత్మనూ ఆ ప్రేమనూ ఈ పాటలో వెదుకుతాడు కవి. నా స్వరంలో కూడా ఈ మధురగీతాన్ని వినండి మరి !


Movie:--Phir Vohi Dil Laya Hu (1963)
Lyrics:-- Majrooh Sultanpuri
Music:--O.P.Nayyar
Singer:--Mohammad Rafi
Karaoke Singer:-- Satya Narayana Sarma
Enjoy
----------------------------------------------
[Lakhon hai nigah me – Zindgi ki raah me
Sanam haseen jawa
Hoton me gulab hai – Aakhon me sharab hai
Lekin vo baat kahaa] – 2

[Lat hai kisi ki – Jaadu ka jaal

Rang dale dilpe – Kisika jamal] – 2
[Tauba ye nihagen – Ke rokti hai raahe] – 2
Le leke teer kamaan haai
Lakhon hai nigah me – Zindgi ki raah me
Sanam haseen jawa
Hoton me gulab hai – Aakhon me sharab hai
Lekin vo baat kahaa

[Jaanu na diwana main dilka – Kaun hai khayalon ki malika] – 2
[Bheegi bheegi rutki chaav tale – Maanlo kahi vo aan mile] – 2
Kaise pehchanu Ke naam nahi janu
Kaise pehchanu Ke naam nahi janu kise
Doonde mere armaan – haai
Lakhon hai nigah me – Zindgi ki raah me
Sanam haseen jawa
Hoton me gulab hai – Aakhon me sharab hai
Lekin vo baat kahaa

[Kabhi kabhi vo ik maahajabeen – dolti hai dil ke paas kahee] – 2

Haijo yahee baate – tho hongi mulakaate
Haijo yahee baate – tho hongi mulakaate kabhi
Yaha nahi tho vahaa – hai
Lakhon hai nigah me – Zindgi ki raah me
Sanam haseen jawa
Hoton me gulab hai – Aakhon me sharab hai
Lekin vo baat kahaa – haai
Lekin vo baat kaha
Lekin vo baat kahaa - haai
Lekin vo baat kahaa

Meaning

A million faces I see in my life's path
Young and beautiful sweethearts
with rosy lips and intoxicating eyes
but still lacking some unknown thing

Someone's pigtail is a magical spell
Someone's beauty fills my heart with color
Oh ! their glances !
they obstruct my path
like arrows released from a bow

I am a crazy fellow with a crazy heart
Who could be the queen of my fantasies?
In the shades of rainy weather
She will come to meet me one fine morning
How would I recognize her?
Because I don't know her name whom my passions seek

Sometimes, someone as beautiful as the Moon
Swings very near to my heart
If that is so, then someday
we will certainly meet each other
If not here, It will be somewhere

A million faces I see in my life's path
Young and beautiful sweethearts
with rosy lips and intoxicating eyes
but still lacking some unknown thing...

తెలుగు స్వేచ్చానువాదం

నా జీవిత పధంలో ఎన్నో ముఖాలను చూస్తున్నాను
అందరూ అందమైన సుందరాంగులే
గులాబీ పెదవులు, మత్తు కళ్ళు వారికున్నాయి
కానీ ఇంకేదో వారిలో లోపించింది
నేను కోరుకునేది వారిలో లేదు

కొందరి శిరోజాలు నన్ను మంత్రముగ్దుణ్ణి చేస్తున్నాయి
కొందరి అందం నా హృదయంలో రంగులను నింపుతోంది
అమ్మో వారి చూపులు !
తూపులుగా మారి నన్ను ముందుకు పోనివ్వడం లేదు

నేనొక పిచ్చివాడిని, నాదొక పిచ్చి హృదయం !
నా కలల రాణి ఎవరో?
ఏదో ఒక వర్షాకాలపు ఉదయం పూట
తను నన్ను కలవడానికి తప్పకుండా వస్తుంది
కానీ తనను నేనెలా గుర్తించాలి?
తన పేరైనా నాకు తెలీదు కదా?

కొన్నిసార్లు జాబిల్లి వంటి ఓ ముగ్ధమనోహరి
నా హృదయానికి దగ్గరగా ఉయ్యాల ఊగుతుంది
ఏదో ఒక రోజున మేం తప్పకుండా కలుసుకుంటాం
ఇక్కడ కాకపోతే, ఏదో మరొక చోట
ఈలోకంలో కాకుంటే, వేరే ఏదో ఒక లోకంలో...

నా జీవిత పధంలో ఎన్నో ముఖాలను చూస్తున్నాను
అందరూ అందమైన సుందరాంగులే
గులాబీ పెదవులు, మత్తు కళ్ళు వారికున్నాయి
కానీ ఇంకేదో వారిలో లోపించింది
నేను కోరుకునేది వారిలో లేదు